సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

30, మే 2018, బుధవారం

శిష్యులందు ఉత్తమ శిష్యులు వేరయా…

బ్రహ్మవిద్యయైన శ్రీవిద్యను నేర్చుకోవాలంటే ఎంతో పుణ్యఫలం ఉండాలి. ఇక్కడ నేర్చుకోవడం అని అనడం కన్నా ఉపాసించడం అనడం సరియైనదని నా అభిప్రాయం. అయినా నా అభిప్రాయాలతో చాలా మందికి అవసరం లేదులెండి.

నేనేదో గొప్ప ఉపాసకుడని కొంతమంది నా దగ్గరకు శ్రీవిద్యను నేర్చుకోవడానికి అప్పుడప్పుడు వస్తుంటారు. అలా వచ్చిన వారిని నేనడిగే ప్రశ్న ఒక్కటే. మీరు ఎందుకు శ్రీవిద్యను నేర్చుకోవాలనుకుంటున్నారని అడుగుతాను. చాలామంది ఇచ్చే సమాధానాలు ఇలా ఉంటాయి. అమ్మవారంటే చాలా ఇష్టమని, అమ్మవారంటే తమకు గొప్పభక్తిఅని, లలితాసహస్రనామాలు చాలా రోజులనుండి చదువుతున్నాము ఇప్పుడు ఇంకా బాగా కొత్తగా అమ్మవారి సేవ చేయాలనిపిస్తోందని, ఏమో ఎందుకో తెలీదుకాని మాకు ఈ విద్య నేర్చుకోవాలని చాలా బలంగా కోరికగా ఉందని, తమ భౌతికమైన/లౌకికమైన కోరికలు తీర్చుకోవడానికి ఈవిద్య ఒక రాజమార్గమని ఇలా రకరకాల సమాధానాలు ఇస్తుంటారు. ఇలాంటి సమాధానాలు విన్న, అలా చెప్పినవారిని చూసిన నాక్కొంచెం జాలిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇవేవీ శ్రీవిద్యను ఉపాసించడానికి అర్హతను కలిగించవు.

సరే, అమ్మవారంటే భక్తి అని అంటున్నారు గనుక, వారిని నిరుత్సాహపరచడం ఇష్టం ఉండక వారికి శ్రీవిద్య అంటే ఏమిటో ప్రాధమిక (బేసిక్స్) అంశాలను వివరిస్తాను. వారంతా చాలా శ్రద్ధగా వింటున్నట్టు కనిపిస్తారు (నటిస్తారు). వారి దృష్టిమాత్రం ఈయన ఎప్పుడెప్పుడు మాకు మంత్రాలు ఇచ్చెస్తారా, మనం ఎప్పుడప్పుడు గొప్ప మంత్రవేత్తలమైపోతామా అని రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. ఇలాంటి వారు ఎక్కువ కాలం ఉపాసన చేయలేరని నాకనిపిస్తూనే ఉంటుంది. చాలా సందర్భాలలో అది నిజమైంది కూడా. నా సోది అంతా విన్న తర్వాత వారు ఈ విద్యకు పాటించవలసిన నియమాలేంటని అడుగుతారు. నీతి కలిగి ఉండాలి, సత్యమార్గాన్ని విడువకూడదు, నియమిత సురతమును మాత్రమే చేయాలి, ప్రతిరోజూ మంత్రసాధన చేయాలి, అమ్మవారికి పూజాదికాలు ప్రతిరోజూ చేయాలి, భోజనాదులకు సంబంధించిన నియమాలు పాటించాలి, మద్యము, మాంసము ముట్టకూడదు, స్త్రీల బహిష్టు నియమాలు పాటించాలి, ఆసమయమందు వారికి దూరంగా ఉండాలి, వారి చేతి వంట తినరాదు, త్రికాల సంధ్యావందనాదులు చెయ్యాలి, అతిముఖ్యంగా గురుభక్తి కలిగి ఉండాలి, గురుమాట జవదాటరాదు, గురువును తరచూ సంప్రదించి విద్యకు సంబంధించిన విషయాలను అడగి తెలుసుకుంటూ ఉండాలి, సాధనా సమయంలో ఏర్పడే కష్టనష్టాలకు గురువును గాని, దేవతను గాని బాధ్యులుగా చూడరాదు ఇలా మరికొన్ని నియమాలను చెప్పి అవి మీరు పాటించగలరా? అని అడగ్గానే వారు వెంటనే అన్నీ పాటించేస్తామని మరే ఆలోచనా లేకుండానే సమాధానమిచ్చేస్తారు. నేను ఊహించిన ఆ సమాధానం విన్న వెంటనే నాకు నవ్వువస్తుంది. ఎందుకంటే నేను చెప్పిన ప్రాధమిక నియమాలను వారు పూర్తిగా అవగతం చేసుకోకుండానే వారు సమాధానం చెబుతారు కనుక.

సరే, నేను నా గుర్వాజ్ఞను అనుసరించి, వారికి విద్యను ఉపదేశించడానికి అంగీకరించి ఫలానా రోజున, ఫలానా టైంకు రమ్మని చెబితే వారు ఠంచనుగా చెప్పిన టైంకు ముందే వచ్చేస్తారు. దానికి కారణం వారి ఆతృత మాత్రమే. అది నేను గ్రహించినా వారు గ్రహించరు. ఆతృత అన్నడానికి కారణమేమిటంటే ఈ విద్యార్ధులను తర్వాత్తర్వాత ఎప్పుడైనా నవావరణ పూజకో లేకా మరియేదైనా పూజకో రమ్మని పిలిస్తే వారు తమకు తీరికలేదనో, లేదా పూజకు ఎప్పుడో ఒకప్పుడు వచ్చి ఓ పది నిముషాలో, అరగంటో కూర్చొని మరిక టైం లేనట్టు వెళ్ళిపోతారు. ముందు రోజుల్లో ఉన్న ఆతృత తర్వాత రోజుల్లో ఉండదన్నది తిరుగులేని సత్యము. మంత్రోపదేశం తీసుకోవడానికి పది నిముషాలు పడుతుంది. అదే చక్రోపాసన నేర్చుకోవడానికి కొన్ని నెలలు పడుతుంది. ముందు బీరాలు పలికినట్టుగా వారు అంత సమయము వెచ్చించడానికి తయారుగా ఉండరు. కనుక చక్రపూజ నేర్చుకోవడమన్నది నత్త నడక నడుస్తుంది. ఇక వీరి మంత్రోపాసన ప్రహసనం చూద్దాం. మననాన్ త్రాయతి ఇతి మంత్రః అనునది శాస్త్రవచనం కదా. అనగా మననం చేయగా చేయగా అది ఆ సాధకుని రక్షిస్తుందని అర్ధము. మంత్రసాధన చేయగా చేయగా అది సిద్ధిస్తుంది. అది సిద్ధించాలంటే నిరంతరం మంత్రసాధన చెయ్యాలి. ఇక్కడే పెద్ద చిక్కు ఉంది. మంత్రోపదేశం పొందగానే వారు గురువుగారూ ఈ మంత్రాన్ని ఎన్ని సార్లు చదవాలి? అని అడుగుతారు. మంత్రాన్ని చదవడంకాదు, ఉపాసించాలని చెప్పి, శాస్త్రప్రకారం కనీసం 1008 సార్లు లేక, 300సార్లు లేక 108సార్లు చేయాలని చెబుతాను. ఒకవేళ ఎప్పుడైనా ఏదైనా నిజమైన కారణంచేత 108సార్లు కూడా కుదరకపోతే కనీసం పదిసార్లైనా ఉపాసించండి అని చెబుతుంటాను. వారు ముందువన్నీ ఒదలిపెట్టి చివరదైన పదిసార్లు పట్టుకొని రోజూ ఒక నిముషంపాటు ఏదో తూతూ మంత్రంగా ఆ మంత్రాన్ని అప్పచెప్పినట్టుగా చదివేసి హమ్మయ్య నేను సూపర్ సాధన చేసేస్తున్నానని గొప్పగా ఫీలైపోయి వెళ్ళి టి.వి. ముందో పనికిరాని వార్తాపత్రికముందో కూర్చొని కాలం వెళ్ళబుచ్చుతారు. నిజానికి ఒక మంత్రము సిద్ధించాలంటే ఆ మంత్ర సాధనా పద్ధతి తెలుసుకోవాలి. ప్రాధమిక స్థాయిలో ఏ విద్యార్ధికీ ఆ రహస్యాలు చెప్పబడవు. ఎందుకంటే వారు నిజంగానే పూర్తి నమ్మకంతో, గురుభక్తితో, గురువాక్యమందు విశ్వాసం ఉంచి మంత్రోపాసన చేస్తే కొన్నాళ్ళకి వారికి ఆ మంత్రరహస్యాలు తెలుసుకోవాలని మనసులో బలంగా అనిపిస్తుంది. అప్పుడు వారు గురువుదగ్గరకు పరిగెడుతారు. అప్పుడు మాత్రమే వారికి రహస్యాలు చెప్పబడుతాయి. అప్పటి నుండి వారి ఉపాసన ఫలించడానికి బీజం పడుతుంది. ఇలాంటి శిష్యులు ఎంతమంది ఉన్నారు?

కొంతమంది శిష్యులకు గురువుతో మాట్లాడడనికే తీరిక దొరకదు. ఇక ఆయన దర్శనానికి వారికి టైం ఎక్కడ ఉంటుంది. మరికొందరు గురువుతో విద్యకు సంబంధించిన విషయాలు తప్ప మిగిలినవన్నీ మాట్లాడుతుంటారు. విద్యారహస్యాలను తెలుసుకోవడానికి మాత్రం ఆసక్తి చూపరు. మరికొందరు గురువు చెప్పిన ప్రాధమిక నియమాలను ఆచరణలో పెట్టలేక గురువుకు దూరమవుతారు. మరికొందరు గురువును ఊరకే పొగడుతూ అలాచేస్తే తమకేదో గురువు ఒరగపెట్టెస్తారన్న భ్రమలో కాలం వెళ్ళబుచ్చుతూ ఉంటారు. మరికొందరు గురువును కలవాలి కలవాలి అని అనుకుంటూనే ఉంటారు కాని వారికి అలా చేయడానికి సమయము, ధనము అందుబాటులో ఉండవు. మరికొందరు గురువుగారు ఇప్పుడు బిజీగా ఉంటారేమో, ఫోన్ చేస్తే ఏమైనా అనుకుంటారేమో… పోనీ ఇంకెప్పుడైనా మాట్లాడుదాములే అని వారంతటవారే గురువుగురించి ఊహించేసుకొని సమాధానపడిపోయి మాట్లాడుదామనే కార్యక్రమాన్ని వాయిదా వేసేస్తూ ఉంటారు. మరికొంతమంది ఘనులు గురువు ఫోన్ చేస్తే ఎంతసేపైనా మాట్లాడుతుంటారు కాని వారు మాత్రం తమంత తాము ఆయనికి అస్సలు ఫోన్ చేసి మాట్లాడరు. ఎందుకంటే ఫోన్ బిల్లు ఎక్కువైపోతుందని వారి భయం. తమ ఇటువంటి హిపోక్రటిక్ ప్రవర్తన ద్వారా వారు ఏమి సాధిస్తారు? ఇలా కొన్నాళ్ళు మంత్రాలను చదివి ఛట్…మంత్రాలకి చింతకాయలు రాలవు…ఇదంతా ఉత్త టైంవేస్ట్ పని అన్న భావనకు వచ్చేస్తారు.

డామిట్…ఉపాసన అడ్డం తిరిగింది…..

అందుకే శిష్యులందు ఉత్తమ శిష్యులు వేరయా…

శ్రీవిద్యోపాసన – 3

చక్రసంకేతంః

శక్తిదేవతలయొక్క సమూహమే చక్రము. వారికి సంబంధించిన సమాచారమే సంకేతము. శ్రీచక్రములో ఉండే దేవతలు ఎవరు? వారు ఎలా ఉద్భవించారు? ఇలాంటి విషయాలకు సంబంధించిన రహస్యములే చక్రసంకేతము. బహుస్యాం ప్రజాయేయ అని బ్రహ్మము తలచి ఏకంగా ఉన్న తను బహుత్వంగా మారి అనగా సృష్టిని చేసి దానిని పాలించి, తిరిగి తనలోనే లీనం చేసుకుంటుంది. ఇక్కడ జాగ్రత్తగా గమనించవలసిన విషయం ఏమిటంటే, సృష్టి, స్ఠితి, లయ అంతా ఆ పరబ్రహ్మములోనే జరుగుతుంది. మళ్ళీ కొంతకాలం తర్వాత సృష్టి జరుగుతుంది. లయనుండి తిరిగి సృష్టి జరగడానికి మధ్యన తిరోధాన, అనుగ్రహ అను రెండు కృత్యములు కూడా ఉంటాయి. ఏ జీవులకైతో కర్మ పరిపక్వమవదో వారి కర్మ పరిపూర్ణతకై అమ్మ దయతలచి వారికి మరియొక అవకాశము ఇవ్వదలస్తుంది. అదే అనుగ్రహము. తిరిగి సృష్టి జరగడానికి జరగవలసిన కాలమంతా జీవులన్ని అమ్మకుక్షిలోనే ఉంటాయి. అదే తిరోధానము. ఇదంతా బాహ్యంగా కనిపించేది. సూక్ష్మంగా చూస్తే ఇదే స్వరూపమును (ఆత్మస్ఫురణ) తెలుసుకోవడము. బయటవేరొకటి ఉన్నాది అన్న జ్ఞానము అంతఃకరణ జ్ఞానము ఉన్నప్పుడు మాత్రమే తెలుస్తుంది కదా. ఈ అంతఃకరణ జ్ఞానము లేనంతవరకు అంతా వేరుగానే కనిపిస్తుంది.

ఆత్మస్ఫురణ కలిగిన పరమేశ్వరుడు, జగత్తును, జీవులను సృష్టిస్తాడు. అలా సృష్టించబడిన వాటియందు అతడు సూక్ష్మరూపంలో ఉంటాడు. జగత్తు భోగప్రదాత. జీవులు స్థూల, సూక్ష్మ, కారణదేహాలను కలిగి ఉంటాయి. జీవులు జగత్తునందు ఎప్పుడైతే తమ దృష్టిని మరల్చుతారో వారు మాయా ఆధీనులవుతారు. జీవులకు ఈ భోగప్రదాత అయిన జగత్తే భోగస్థానము. జీవులు మాయలో కొట్టుమిట్టాడుతూ భోగములకొరకై అర్రులుచాచుతూ తమలోనే ఉన్న పరమేశ్వరుడును తెలుసుకొనలేక మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తుతూ ఉంటారు. ఇదంతా ఆయా జీవులయొక్క పూర్వకర్మముననుసరించి జరుగుతూ ఉంటుంది.

నిజానికి కనిపించే జగత్తంతా పరమేశ్వరుని ఇచ్ఛామాత్రమున ఏర్పడిన ఒకానొక చిహ్నము. ఈ చిహ్నమే చక్రము. ఇది ఆ పరమేశ్వరుని మనోమయ జగత్తు. అలా తెలుసుకున్న వారికి ఇది మోక్షస్థానము. తెలియకున్న వారికి ఇది భోగస్థానము. మొదటివారు మోక్షగాములు రెండవవారు భోగకాములు.

ఈ విధంగా చూస్తే చక్రము బ్రహ్మాండముగాను, పిండాడముగాను తెలుస్తున్నది. ఇదంతా బాహ్యదృష్టికి మాత్రమే. అంతర్ దృష్టికి మాత్రము మనస్సే శ్రీచక్రము. ఇదే పరమరహస్యము.

ప్రకాశ, విమర్శాత్మకములైన కామేశ్వరీ, కామేశ్వరుల సామరస్యఫలితమే అపరబిందువు. ఈ అపరబిందువునుండి శ్రీచక్రము ఉద్భవిస్తున్నది. బిందువు, త్రికోణము, అష్టకోణములు, అంతర్దశారము, బహిర్ధశారము, చతుర్దశారము, అశ్టదళములు, షోడశదళములు, చతురస్రముల సమూహమే శ్రీచక్రము.

శాస్త్రములందు సృష్టి గురించి రెండురకముల సిద్ధాంతములు చెప్పబడినవి. అవి సృష్టి-దృష్టివాదము మరియు దృష్టి-సృష్టివాదము. సృష్టి-దృష్టి వాదముననుసరించి ఈ చరాచర జగత్తు అంతా ఈశ్వరుని యొక్క జడశక్తి వలన జరిగినది అని చెప్పబడుచున్నది. ఇక దృష్టి-సృష్టివాదముననుసరించి, జీవుడు ఎప్పుడైతే తనలో ఉన్న కుండలినీ శక్తిని చలింపచేస్తాడో అప్పుడు సృష్టిజరుగుతుంది అని తెలియబడుచున్నది. అద్వైతసిద్ధాంతము అంతా ఈ దృష్టి-సృష్టివాదముననుసరించియే చెప్పబడుచున్నది.

ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి…శ్రీచక్రము బ్రహ్మాండరూపమైనా పిండాండరూపమైనా అది అంతా మనస్సుయొక్క చిత్రీకరణ మాత్రమే. అందుకే మనఃమూలమిదంజగత్ అని పెద్దలు చెబుతారు. మనస్సు పనిచేయునప్పుడు జగత్తు, భోగము, రాగము, శోకము మొదలగు అన్ని వికారములు తెలుస్తుంటాయి. జాగ్రత్ మరియు స్వప్నావస్థలందు జీవుని మనస్సు పనిచేస్తూ ఉండడం వలన అన్ని రకాల వికారములు గమనించవచ్చు. కాని, సుషుప్తి (గాఢనిద్ర)దశయందు మనస్సు పని చేయదు. అప్పుడు జగత్తు, మరి ఏ వికారములు ఉండవు.

శుద్దబ్రహ్మమునకు ఎటువంటి చిత్తవృత్తులు ఉండవు. అది ఎప్పుడూ చలించక స్వరూపస్థితియందు రమించుతూ ఉంటుంది. అది సర్వానందమయము. బిందురూపము. ఈ బిందువు శ్రీచక్రములోని అంతర్ త్రికోణములో ఉన్న బిందువుకాదు. ఇది శ్రీచక్రములోని చంద్రమండలములో ఉన్న బిందువు.

ఇక శ్రీచక్రములోని అంతర్ త్రికోణములో ఉన్న బిందువు కామేశ్వరీ, కామేశ్వరుల సామరస్య రూపము. ఇది పరబ్రహ్మచక్రము. ఈ బిందువే సృష్టికి మూలము. అనగా ఈ బిందువునుండే శ్రీచక్రము ఆవిర్భవిస్తున్నది. నిజానికి ఈ బిందువు అవ్యక్తము. అంతర్ త్రికోణములో బిందువును ఉంచి పూజించడం అవైదికము. నిజమైన దక్షిణ, సమయాచారపరులు చంద్రమండలములోని బిందువునే పూజిస్తారు. అదే వైదికము.    

మిగతా రహస్యములు గురుముఖతః తెలుసుకోవాలి.

ఇప్పుడు పూజాసంకేతం తెలుసుకుందాము.

(ఇంకాఉంది)

ఋగ్వేద సాయం సంధ్యావందనమ్

ఓం ణానాం”త్వా ణప’తిగ్ం హవామహే వింక’వీణాం ము’మశ్ర’వస్తమం|
జ్యేష్ఠరాజం బ్రహ్మ’ణాం బ్రహ్మణస్ప ఆన’శ్శృణ్వన్నూతిభిః’స్సీసాద’నం||
శ్రీమహాగణాధిపతయే నమః|

ఓం అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాం గతోపివా, యఃస్మరేత్పుండరీకాక్షం సబాహ్యాభ్యన్తరశ్శుచిః.

పుండరీకాక్ష, పుండరీకాక్ష, పుండరీకాక్షాయనమః

ఆచమనంః

ఓం ఆచమ్య…
ఓం కేశవా’యస్వాహా, ఓం నారాయణా’యస్వాహా, ఓం మాధవా’యస్వాహా, ఓం గోవిందాయనమః,
ఓం విష్ణవేనమః, ఓం మధుసూదనాయనమః, ఓం త్రివిక్రమాయనమః, ఓం వామనాయనమః, ఓం శ్రీధరాయనమః, ఓం హృషీకేశాయనమః, ఓం పద్మనాభాయనమః, ఓం దామోదరాయనమః, ఓం సంకర్షణాయనమః, ఓం వాసుదేవాయనమః, ఓం ప్రద్యుమ్నాయనమః, ఓం అనిరుద్ధాయనమః, ఓం పురుషోత్తమాయనమః, ఓం అధోక్షజాయనమః, ఓం నారసింహాయనమః, ఓం అచ్యుతాయనమః, ఓం జనార్ధనాయనమః, ఓం ఉపేంద్రాయనమః, ఓం హరయేనమః, ఓం శ్రీకృష్ణాయనమః, ఓం శ్రీకృష్ణపరబ్రహ్మణేనమః

ఆసన స్వీకారముః

ఓం పృథివ్యాః। పృధ్వీతిమంత్రస్య। మేరుపృష్ఠఋషిః। కూర్మోదేవతా। సుతలం ఛందః। ఆసనేవినియోగః॥
ఓం పృధ్వీత్వయాధృతాలోకా దేవీత్వం విష్ణునాధృతా। త్వంచధారయమాం దేవి పవిత్రం కురుచాసనం॥  ఓం అనంతాసనాయనమః।

(కుడిచేతి అంగుష్ఠ, అనామికలతో భూమిని స్పృశించవలెను)

ప్రాణాయామము

1)    ప్రణవస్య। పరబ్రహ్మఋషిః। పరమాత్మా దేవతా। దైవీగాయత్రీఛందః।
2)    శ్రీగాయత్రీ పూర్వాంగ సప్తవ్యాహృతి మంత్రాణాం, విశ్వామిత్ర, జమదగ్ని, భరద్వాజ, గౌతమ, అత్రి, వసిష్ఠ, కశ్యపా ఋషయః, అగ్ని, వాయు, సూర్య, వాగీశ, వరుణ, ఇంద్ర, విశ్వేదేవా దేవతాః, గాయత్రి, ఉష్ణి, గనుష్టుప్, బృహతి, పంక్తి, త్రిష్టుప్ జగతి, ఛందాంసి.
3)    గాయత్య్రా॥ విశ్వామిత్ర ఋషిః। సవితా దేవతా। గాయత్రీ ఛందః॥

ప్రాణాయామే వినియోగః

ఓం భూః। ఓం భువః। ఓం స్వః। ఓం మహః। ఓం జనః। ఓం తపః। ఓం సత్యం।

ఓం తత్స’వితుర్వరే’’ణ్యం। భర్గో’’దేవస్య’ధీమహి| ధియోయోనః’ ప్రచోదయా’’త్|

ఓమాపోజ్యోతీసోఽమృతం బ్రహ్మ భూర్భువఃస్వరోం|

దేశకాలసంకీర్తనం

మమోపాత్త దురితక్షయద్వారా శ్రీపరమేశ్వరప్రీత్యర్ధం, శుభాభ్యాం శుభే శోభనముహూర్తే శ్రీమహావిష్ణోరాజ్ఞయా, ప్రవర్తమానస్య, అద్య బ్రహ్మణః, ద్వితీయపరార్ధే, శ్వేతవరాహకల్పే, వైవస్వతమన్వంతరే, కలియుగే, పథమపాదే, జంబూద్వీపే, భరతవర్షే, భరతఖండే, అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన…………..
సంవత్సరే, ……………ఆయనే, ……………….ఋతౌ, ………మాసే,…………పక్షే, …………..తిథౌ,………….
……………..వాసరే, శుభనక్షత్రే, శుభయోగే, శుభకరణే, ఏవంగుణ విశేషణ విశిష్టాయాం, శుభతిధౌ,
శ్రీమాన్ ……………….గోత్రః ……………………నామధేయః (ధర్మపత్నీ సమేతోహం), శ్రీమతః ……………….. గోత్రస్య…………………………శర్మణః, (ధర్మపత్నీ సమేతస్య) మమోపాత్త దురితక్షయద్వారా శ్రీపరమేశ్వరప్రీత్యర్ధం సాయం సంధ్యాముపాశిష్యే.

మార్జనంః

ఆపోహిష్టేతి తిస్రూణాం” మంత్రాణాం| అంబరీష సింధుద్వీ’ప ఋషిః| ఆపోదేవతా| గాయత్రీ ఛందః,
మార్జనే వి’నియోగః|

ఓం 1) ఆపోహిష్ఠామ’యోభువః’|    2) తాన’ ర్జే ద’ధాతన|  3) హేరణా’’ చక్ష’సే|                  
4) యోవ’శ్శివత’మోసః|    5)  తస్య’ భాజయతే హనః’|   6) తీరివ’ మాతరః’|   7) తస్మా
అరం’’గమామవో |    8) యస్యక్షయా’’జిన్వథ|    9) ఆపో’’నయ’థాచనః|

మంత్రాచమనం

అగ్నిశ్చేత్యశ్య మంత్రస్య| యాజ్ఞవల్క్యోపనిషద ఋషిః| సూర్య మన్యు మన్యు పతయో హర్దేవతాః| ప్రకృతిశ్ఛందః| మంత్రాచమనే వినియోగః|
ఓం అగ్నిశ్చమామన్యుశ్చ మన్యుపతయశ్చ మన్యు’ కృతేభ్యః| పాపేభ్యో’ రక్షంతాం| యదహ్నా
పాప’మకార్షం| మనసా వాచా’ హస్తాభ్యాం| పద్భ్యాముదరే’ణ శిశ్న్ఞా| అహస్తద’వలుమ్పతు|
యత్కించ’దురితంమయి’| ఇదమహం మామమృ’తయోనౌ| సత్యేజ్యోతిషి జుహో’మి స్వాహా.

ఆచమనంః

ఓం ఆచమ్య…
ఓం కేశవా’యస్వాహా, ఓం నారాయణా’యస్వాహా, ఓం మాధవా’యస్వాహా, ఓం గోవిందాయనమః,
ఓం విష్ణవేనమః, ఓం మధుసూదనాయనమః, ఓం త్రివిక్రమాయనమః, ఓం వామనాయనమః, ఓం శ్రీధరాయనమః, ఓం హృషీకేశాయనమః, ఓం పద్మనాభాయనమః, ఓం దామోదరాయనమః, ఓం సంకర్షణాయనమః, ఓం వాసుదేవాయనమః, ఓం ప్రద్యుమ్నాయనమః, ఓం అనిరుద్ధాయనమః, ఓం పురుషోత్తమాయనమః, ఓం అధోక్షజాయనమః, ఓం నారసింహాయనమః, ఓం అచ్యుతాయనమః, ఓం జనార్ధనాయనమః, ఓం ఉపేంద్రాయనమః, ఓం హరయేనమః, ఓం శ్రీకృష్ణాయనమః,  ఓం శ్రీకృష్ణపరబ్రహ్మణేనమః

పునర్మార్జనం

ఆపోహిష్ఠేతి నవర్చస్య సూక్తస్య| అమ్బరీషపుత్రః సింధుద్వీప ఋషిః| పంచమీ వర్ధమాన| సప్తమీ ప్రతిష్ఠా| అంతేద్వే అనుష్టుభౌ| ఆపో దేవతా| పునర్మార్జనే వినియోగః||
ఓం
1)     పోహిష్ఠామ’యో భుస్తాన’ ర్జేద’ధాతన| మహేరణా” చక్షసే|
2)    యోవ’ శ్శివత’మో రస స్తస్య’భాజయతే హనః’| తీరి’వ మాతరః’|
3)    స్మా అరం’’గమామవోస్యక్షయా’’ జిన్వ’థ| ఆపో’’ నయ’థాచనః|
4)    శంనో” దేవీరభిష్ట’ ఆపో” భవన్తు పీతయే’’| శంయో భిస్ర’వంతునః|
5)    ఈశా’’నా వార్యా’’ణాం క్షయం’’తీశ్చర్షణీనాం| అపోయా’’చామి భేజం|
6)    ప్సుమే సోమో” అబ్రవీదంతర్విశా”ని భేజా| గ్నించ’ విశ్వశం’’భువం|
7)    ఆపః’ పృణీత భే’’జం వరూ’థం న్వే” 3 మమ’| జ్యోక్చసూర్యం”దృశే|
8)    ఇదమా”పః ప్రవ’హ యత్కించ’ దురితం మయి’| యద్వాహమభిదుద్రో యద్వాశే
తానృతం|
9)    ఆపో” ద్యాన్వ’చారిషం రసే” సమ’గస్మహి| పయ’స్వానగ్న ఆగ’హితం మాసం
సృ’జవ’ర్చసా|
10)  సస్రు’షీస్త’దప’సోది’వాన’క్తంచ సస్రు”షీః| వరే”ణ్యక్రతుపోదేవీ రుప’హ్వయే|

అఘమర్షణమంత్రము

ఋతంచ సత్యంచేత్యస్య సూక్తస్య| అఘమర్షణ ఋషిః| భావవృత్తో దేవతా| అనుష్ఠుప్చంధః| పాపపురుష జల విసర్జనే వినియోగః||
1)    తంచ’ త్యంచాభీ”ద్ధాత్తసోఽధ్య’జాయత| తతో రాత్ర్య’జాయ తతః’ సముద్రో అ”ర్ణవః||
2)    సముద్రాద”ర్ణవాదధి’ సంవత్సరో అ’జాయత| అహోరాత్రాణి’ విద్విశ్వ’స్య మితో వశీ||
3)    సూర్యాచంద్రమసౌ” ధాతా య’థాపూర్వమ’ల్పయతు| దివం”చ పృథివీం
చాన్తరి’క్షధోస్వః’|

అర్ఘ్యప్రదానముః

కాలాతిక్రమణమైనచో…

ఉద్ఘేదభీత్యస్య మంత్రస్య| సుకక్ష ఋషిః| ఇంద్రోదేవతా| గాయత్రీ ఛందః| సాయంసంధ్యాంగ ముఖ్య కాలాతిక్రమణ ప్రాయశ్చిత్త అర్ఘ్యప్రధానే వినియోగః||
ఓం ఉద్ఘేభి శృతామ’ఘం వృభం నర్యా’’పసం। అస్తా’’రమేషి సూర్య।

సాయమర్ఘ్యప్రధానము.

ఓం తత్సువితురిత్యస్య మంత్రస్య| గాధిపుత్రో విశ్వామిత్ర ఋషిః| సవితా దేవతా| గాయత్రీ ఛందః| సాయమర్ఘ్యప్రధానేవినియోగః||

ఓం భూర్భువస్వః’| ఓం తత్స’వితుర్వరే’’ణ్యం। భర్గో’’దేవస్య’ధీమహి| ధియోయోనః’ ప్రచోదయా’’త్|  (మూడు సార్లు)

ఆత్మప్రదక్షిణముః

సావా’దిత్యోబ్రహ్మ|

తర్పణాలుః

సంధ్యాం తర్పయామి, సరస్వతీం తర్పయామి, వైష్ణవీం తర్పయామి, నిమృజీం తర్పయామి

గాయత్రి ఉపాసనముః

ఓం ఆచమ్య…
ఓం కేశవా’యస్వాహా, ఓం నారాయణా’యస్వాహా, ఓం మాధవా’యస్వాహా, ఓం గోవిందాయనమః,
ఓం విష్ణవేనమః, ఓం మధుసూదనాయనమః, ఓం త్రివిక్రమాయనమః, ఓం వామనాయనమః, ఓం శ్రీధరాయనమః, ఓం హృషీకేశాయనమః, ఓం పద్మనాభాయనమః, ఓం దామోదరాయనమః, ఓం సంకర్షణాయనమః, ఓం వాసుదేవాయనమః, ఓం ప్రద్యుమ్నాయనమః, ఓం అనిరుద్ధాయనమః, ఓం పురుషోత్తమాయనమః, ఓం అధోక్షజాయనమః, ఓం నారసింహాయనమః, ఓం అచ్యుతాయనమః, ఓం జనార్ధనాయనమః, ఓం ఉపేంద్రాయనమః, ఓం హరయేనమః, ఓం శ్రీకృష్ణాయనమః, ఓం శ్రీకృష్ణపరబ్రహ్మణేనమః

ఓమిత్యేకాక్ష’రం బ్రహ్మ| అగ్నిర్దేవతా బ్రహ్మ’ఇత్యార్షం| గాయత్రం ఛందం పరమాత్మం’ సరూపం|
సాయుజ్యం వి’నియోగం|

ఆయా’తువర’దా దేవీ క్షరం’ బ్రహ్మసంమి’తమ్| గాయత్రీం” ఛన్ద’సాం మాతేదం బ్ర’హ్మజుషస్వ’మే| యదహ్నా”త్కురు’తేపాపం తదహ్నా”త్ప్రతిముచ్య’తే| యద్రాత్రియా”త్కురు’తేపాపం తద్రాత్రియా”త్ప్రతి ముచ్య’తే| సర్వ’ర్ణేమ’హాదేవీ సంధ్యావి’ద్యే రస్వ’తి|

ఓజో’ఽసి సహో’ఽసి బల’మసి భ్రాజో’ఽసి దేవానాం ధానామా’ఽసి విశ్వ’మసి విశ్వాయు స్సర్వమసి ర్వాయు రభిభూరోం గాయత్రీ మావా’హయామి, సావిత్రీ మావా’హయామి, సరస్వతీ మావా’హయామి, ఛన్దర్షీ నావా’హయామి, శ్రియమావా’హయామి, బలమావా’హయామి, గాయత్రియా గాయత్రీ ఛన్దో విశ్వామిత్ర ఋషి స్సవితా దేవతాఽగ్నిర్ముఖం బ్రహ్మశిరో విష్ణుర్హృదయం రుద్రశిఖా పృథివీయోనిః ప్రాణాపాన వ్యానోదాన సమానా సప్రాణా శ్వేతవర్ణా సాఙ్ఖ్యాయనసగోత్రా గాయత్రీ చతుర్వింశత్యక్షరా త్రిపదా’ షట్కుక్షిః పఞశీర్షోపనయనే వి’నియోగః ఓం భూః, ఓం భువః, ఓం స్వః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం త్యం, ఓం తత్స’వితుర్వరే’’ణ్యం। భర్గో’’దేవస్య’ధీమహి| ధియోయోనః’ ప్రచోదయా’’త్|  ఓమాపోజ్యోతీసోఽమృతం బ్రహ్మ భూర్భువఃస్వరోం|

మమోపాత్త దురితక్షయద్వారా శ్రీపరమేశ్వరప్రీత్యర్ధం సాయం సంధ్యాంగ యధాశక్తి గాయత్రీ మహా మంత్రజపం కరిష్యే| ఇతి ఋగ్వేద బ్రహ్మకర్మ సముచ్చయం|

(ఇప్పుడు పంచపాత్రలోని ఉదకమును స్పృశించవలెను)

అంగన్యాస కరన్యాసములు
ఓం తత్సవితుః బ్రహ్మాత్మనే                 -           అంగుష్ఠాభ్యాం నమః     -   హృదయాయ నమః
వరేణ్యం విష్ణ్వాత్మనే                            -           తర్జనీభ్యాం నమః        - శిరసే స్వాహా
భర్గోదేవస్య రుద్రాత్మనే                       -           మధ్యమాభ్యాం నమః   - శిఖాయై వషట్
ధీమహి సత్యాత్మనే                              -           అనామికాభ్యాం నమః  - కవచాయహుం
ధియోయోనః జ్ఞానాత్మనే                      -           కనిష్ఠికాభ్యాం నమః      - నేత్రత్రయాయ వౌషట్
ప్రచోదయాత్ సర్వాత్మనే                    -           కరతలకరపృష్ఠాభ్యాం నమః - అస్త్రాయఫట్              
 బూర్భువస్సువరోమితి దిగ్బంధః

ధ్యానంః

ముక్తావిద్రుమ హేమనీల ధవళచ్ఛాయై ర్ముఖై స్త్రీక్షణైర్యుక్తామిందు నిబద్ధరత్న మకుటాం తత్త్వార్థ వర్ణాత్మికాం. గాయత్రీం వరదాభయాంకుశకశాశుభ్రం కపాలం గదాం శంఖం చక్ర మథారవిందయుగళం హస్తైర్వహంతీం భజే.

ముద్రలుః

సుముఖం సంపుటంచైవ వితతం విశ్రుతం తథా| ద్విముఖం త్రిముఖం చైవా చతుఃపంచ ముఖం తథా| షణ్ముఖోధోమకంచైవ వ్యాపికాంజలికంతథా| షకటం యమపాశంచ గ్రథితం చోల్ముఖోల్ముఖం| ప్రళంబం ముష్టికంచైవ, మత్స్య, కూర్మ, వరాహకం| సింహాక్రాంతం, మహాక్రాంతం, పల్లవం ముద్గరం తథా|
ఇతిముద్రావై చతుర్వింశతి గాయత్రీ సుప్రతిష్ఠితాః| ఏతే ముద్రానజానాతి గాయత్రీ నిష్ఫలాభవేత్|

మంత్రజపం

ఓం భూర్భువస్వః’| ఓం తత్స’వితుర్వరే”ణ్యం| భర్గో”దేవస్య’ధీమహి| ధియోయోనః’ ప్రచో”దయాత్||

వస్సువర్భుభూరోం దిగ్విమోకః

వరుణోపస్థానంః

యచ్చిద్దిత ఇతి పంచర్చస్య సూక్తస్య| శునశ్శేప ఋషిః| వరుణోదేవతా| గాయత్రీ ఛందః| వరుణోపస్థానే వినియోగః||
ఓం
1)    చ్చిద్ధితే విశో’’ యథా ప్రదే”వ వరుణవ్రతం| మినీసి ద్యవి’ద్యవి|
2)    మానో” థాయ’ త్నవే” జిహిళానస్య’ రీరధః| మాహృ’ణానస్య’ మన్యవే”|
3)    విమృ’ళీకాయ’తే మనో” థీరశ్వం న సంది’తం| గీర్భిర్వ’రుణసీమహి|
4)    రాహిమే విమ’న్యవః పత”న్తి వస్య’ఇష్టయే| వయోనవ’స తీరుప’|
5)    దాక్ష’త్రశ్రియంమా వరు’ణం కరామహే| మృళీకాయో” రుచక్ష’సం|

సాయం సంధ్యోపస్థానంః

జాతవేదస ఇత్యస్య మంత్రస్య| మరీచిపుత్రః కశ్యప ఋషిః| జాతవేదాగ్నిర్దేవతా| త్రిష్టుప్ఛందః||
సంధ్యోపస్థానే వినియోగః।
జాతవే”దసే సునవా సోమ’మరాతీయ తోనిద’హాతివేదః’| సనః’ పర్షదతి’ దుర్గాణివిశ్వా”
నావేసింధుం” దురితాత్యగ్నిః।|

శాన్తిమంత్రముః

తచ్ఛంయోః। శంయుర్ ఋషిః। విశ్వేదేవే దేవతాః। శక్వరీచ్ఛందః। శాంత్యర్ధే జపేవినియోగః।
ఓం తచ్చంయోరావృ’ణీమహే। గాతుం జ్ఞాయ’। గాతుం జ్ఞప’తయే। దైవీ”స్వస్తిర’స్తునః।
స్వస్తిర్మాను’షేభ్యః। ర్ధ్వంజి’గాతుభేజం। శంనో’అస్తుద్విపదే”। శంచతు’ష్పదే।
ఓం శాన్తి, శ్శాన్తి, శ్శాన్తిః

దిఙ్మున్యాద్యభివందనం

ఓం నమః ప్రాచ్యై’దిశే యాశ్చ’ దేవతా’ స్యాం ప్రతి’వసన్త్యేభ్య’శ్చమోనమో దక్షి’ణాయై దిశే యాశ్చ’ దేవతా’ స్యాం ప్రతి’వసన్త్యేభ్య’శ్చమోనమః ప్రతీ”చ్యైదిశే యాశ్చ’ దేవతా’ స్యాం ప్రతి’వసన్త్యేభ్య’శ్చమో ఉదీ”చ్యైదిశే యాశ్చ’ దేవతా’ స్యాం ప్రతి’వసన్త్యేభ్య’శ్చమోనమ’ ర్ద్వాయై’ దిశే యాశ్చ’ దేవతా’ స్యాం ప్రతి’వసన్త్యేభ్య’శ్చమోనమోఽధ’రాయైదిశే యాశ్చ’ దేవతా’ స్యాం ప్రతి’వసన్త్యేభ్య’శ్చమోనమో’ఽ వాంరాయై’ దిశే యాశ్చ’ దేవతా’ స్యాం ప్రతి’వసన్త్యేభ్య’శ్చనమోనమో గంగాయమునయోర్మధ్యే యే’వసన్తి, తేమేప్రసన్నాత్మానశ్చిరంజీవితం
వ’ర్ధయంతి నమో గంగాయమునయోర్ముని’భ్యశ్చ నమో నమో గంగాయమునయోర్ముని’భ్యశ్చ నమః।

సంధ్యా’యై నమః’। సావి’త్య్రైనమః’। గాయ’త్య్రైనమః’।సర’స్వత్యైనమః’। సర్వాభ్యోదేవతా”భ్యోనమః। దేవే’భ్యోనమః’। ఋషి’భ్యోనమః’। ముని’భ్యోనమః’। గురు’భ్యోనమః’।పితృ’భ్యోనమః’।

కామోకార్షీ”న్నమోనమః’| మన్యుర్కార్షీ”న్నమోనమః’||
పృథివ్యాపస్తేజోవాయురాకాశాత్। ఓన్నమోభగవతేవాసుదేవాయ। యాంసదా సర్వభూతాని చరాణి స్థావరాణిచ। సాయం ప్రాతర్నమస్యన్తి సామా సంధ్యా అభిరక్షతు॥

శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే। శివస్య హృదయం విష్ణుర్విష్ణోశ్చ హృదయం శివః।
యథాశివమయో విష్ణురేవం విష్ణుమయః శివః।యథాంతరం నపశ్యామి తథామే స్వస్తిరాయుషి।
నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయచ। జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః॥

గాయత్రిఉపస్థానముః

త్తమే’ శిఖ’రే జాతే భూమ్యాం ప’ర్వత మూర్ధ’ని। బ్రాహ్మణే”భ్యోఽభ్య’నుజ్ఞాతా చ్ఛదే’వి థాసు’ఖం।
స్తుతోమయా వరదా వే’దమాతా ప్రచోదయన్తి పవనే” ద్విజాతా। ఆయుః పృథివ్యాం ద్రవిణం
బ్ర’హ్మవర్చసం మహ్యం దత్వా ప్రజాతుం బ్ర’హ్మలోకం।

విరాట్పురుషవందనం

నమోఽస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే। సహస్రనామ్నే పురుషాయ
శాశ్వతే సహస్రకోటియుగధారిణే నమః॥

ఆకాశాత్పతితం తోయం యథా గచ్ఛతి సాగరం। సర్వదేవనమస్కారః కేశవం ప్రతిగచ్ఛతి।
శ్రీకేశవంప్రతిగచ్ఛత్యోన్నమఇతి॥

వాసనాద్వాసుదేవస్య వాసితన్తే జగత్రయం। సర్వభూతనివాసోసి శ్రీవాసుదేవ నమోస్తుతే॥
దం ద్యా”వా పృథివీ త్యమ’స్తు పిర్మాతర్య దిహోప’బ్రువేవా”మ్। భూతం దేవానా”మమే
అవో”భిర్విద్యా మేషం వృజనం” జీరదా”నమ్।
సర్వవేదేషు యత్పుణ్యం సర్వతీర్ధేషు యత్ఫలం। తత్ఫలం పురుష ఆప్నోతి స్తుత్వాదేవం జనార్థనం।।
శ్రీ స్తుత్వాదేవం జనార్ధనం ఓం నమ ఇతి॥

శుభచింతనముః

ప్రవర చెప్పుకోవలెను.

ఓం ఆచమ్య…
ఓం కేశవా’యస్వాహా, ఓం నారాయణా’యస్వాహా, ఓం మాధవా’యస్వాహా, ఓం గోవిందాయనమః,
ఓం విష్ణవేనమః, ఓం మధుసూదనాయనమః, ఓం త్రివిక్రమాయనమః, ఓం వామనాయనమః, ఓం శ్రీధరాయనమః, ఓం హృషీకేశాయనమః, ఓం పద్మనాభాయనమః, ఓం దామోదరాయనమః, ఓం సంకర్షణాయనమః, ఓం వాసుదేవాయనమః, ఓం ప్రద్యుమ్నాయనమః, ఓం అనిరుద్ధాయనమః, ఓం పురుషోత్తమాయనమః, ఓం అధోక్షజాయనమః, ఓం నారసింహాయనమః, ఓం అచ్యుతాయనమః, ఓం జనార్ధనాయనమః, ఓం ఉపేంద్రాయనమః, ఓం హరయేనమః, ఓం శ్రీకృష్ణాయనమః, ఓం శ్రీకృష్ణపరబ్రహ్మణేనమః

ఆబ్రహ్మలోకాదాశేషాదా లోకాలోకపర్వతాత్ । యేసంతి బ్రాహ్మణాదేవాస్తేభ్యోనిత్యం నమోనమః॥
ఓం తత్సద్బ్రహ్మార్పణమస్తు (జపఫలమును ఈశ్వరునికి అర్పణబుద్ధితో జలమును హరివేణములోనికి విడువవలెను)

ఇతి శివం

24, మే 2018, గురువారం

శ్రీవిద్యా ప్రకాశిక - శ్రీయాగ కర దీపిక

SriVidya Prakashika (Telugu Edition) 

A Detailed Description on SRIVIDYA MANTRA,YANTRA,TANTRA and SriYaga Procedure which deals the detailed Ritualistic procedure of SriChakra Navavarana. This book is composed based on Dakshinachara Sampradaya

Description of "SRIVIDYA PRAKASHIKA"
శ్రీవిద్య మంత్ర,యంత్ర,తంత్రములను గూర్చి శ్రీచక్ర నవావరణ పూజయైన శ్రీచక్రయాగమును గూర్చిసవివరముగా కూర్చబడిన గ్రంథం ఈ శ్రీవిద్యా ప్రకాశిక. దక్షణాచార సంప్రదాయంలో శ్రీయాగక్రమం, పాత్రాసాధన, ముద్రలు, హోమవిధానంతో పాటుగా విశ్లేషణాత్మకంగా వివరించడమైనది. దక్షణాచార సాధకులకు ఈ కల్పం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందనే సంకల్పంతో పుస్తకం ముద్రించబడుతుంది.

ఈ పుస్తకం కొరకు ఈ క్రింది వారిని సంప్రదించండి

devullu.com

19, మే 2018, శనివారం

శ్రీవిద్యోపాసన - 2

మంత్రసంకేతంః

శ్రీవిద్యోపాసనకు ప్రధానమైన అంగం మంత్రము. ఇదే పంచదశాక్షరి మంత్రం. ఈ మంత్రము వేదములో పరోక్షంగా చెప్పబడింది. వేదంలో చెప్పబడిన ఎన్నో మంత్రాలలో గాయత్రి మరియు పంచదశాక్షరి చాలా ముఖ్యమైనవి. గాయత్రిని ప్రకటగాయత్రి అని, పంచదశాక్షరిని అప్రకటితి గాయత్రి అని అంటారు. ప్రకట గాయత్రి మూడు వర్ణాలవారికి అందులోను మగవారికి మాత్రమే తండ్రిద్వారా ఇవ్వబడుతుంది. అదే అప్రకట గాయత్రి గురువుద్వారా అర్హులైన వారికి కుల, లింగ భేదములు లేకుండా ఇవ్వబడుతుంది. అయితే ప్రకటగాయత్రిని వేదమంత్ర రూపంగా ఉపదేశపడగా, అప్రకటగాయిత్రి మాత్రం సంకేత పదాల రూపంలో ఉపదేశపడుతుంది. ఈ సంకేత పదాలనే బీజాక్షరాలని అంటారు. ఈ మంత్రం రహస్యంగా గురుపరంపరగా ఉపదేశపడుతుంది. ఈ కారణాలవలననే ఈ మంత్రాన్ని అప్రకటిత గాయత్రి అని, రహస్యం అని అంటారు.

మంత్రంయొక్క అర్ధం, ఉపాసనాదేవత, మంత్రఉచ్ఛారణాకాలం, పద్ధతి మొదలైన సాంకేతక విషయాలను వివరించేదే మంత్ర సంకేతం. ఈ వివరణలన్నీ శ్రీభాస్కరరాయలువారు తమ వరివస్యారహస్యం అన్నగ్రంధంలో చాలా విస్తారంగా వివరించడం జరిగింది. అయితే ఇక్కడ మంత్రం గురించి చాలా క్లుప్తంగా మాత్రం చర్చించుదాము.

ఇక్కడ మంత్రము అంటే పంచదశాక్షరి మంత్రము. ఈ మంత్రమందు పదిహేను బీజాక్షరములుండడం వలెనే ఈ మంత్రాన్ని పంచదశాక్షరి అని అంటారు. ఈ మంత్రమందు దేవతా పేరు ఉండదు. ఈ పంచదశాక్షరి మూడు కూటములుగా ఉంటుంది. శ్రీలలితారహస్యనామములందు చెప్పబడిన “శ్రీమద్వాగ్భవకూటైకాస్వరూపముఖపంకజా“, “కంఠాధఃకటిపర్యంతామధ్యకూటస్వరూపిణీ“, “శక్తికూటైకతాపన్నాకట్యదోభాగధారిణీ “ అన్న మూడునామములందు ఈ పంచదశాక్షరి మంత్రమును చెప్పబడినది. మూలమంత్రములో ఉన్న మొదటి కూటమి అమ్మవారి ముఖపంకజముగా, రెండవకూటమి అమ్మవారి కంఠమునుండి కటివరకుగా, మూడవకూటమి కటినుండి పాదములవరకుగా భావించాలి.
సూక్ష్మంగా చూస్తే, మొదటికూటమి అర్ధం ఇలా ఉంటుంది. “చిఛ్చక్తిరూపమైన అమ్మా (ఏ) అవిద్యవలన పుడుతున్న(క) బ్రహ్మకు భిన్నుడను భేదభావమును (హ్రీం) తొలగించు (ఈల)“. జాగ్రత్తగా గమనిస్తే జీవభావాన్ని తొలగించమని అమ్మని ప్రార్ధించడం ఇక్కడ కనిపిస్తోంది. ఈ జీవభావమే మహావాక్యంలో చెప్పబడిన “త్వం”.

ఇప్పుడు రెండవ కూటమిని అర్ధంచేసుకుందాము. అంతా పరివ్యాప్తమైఉన్న (హల) బ్రహ్మము(క) అన్న స్థితికి నన్ను (హస) చేర్చుము (హ్రీం). “నేను బ్రహ్మముఅని తెలియజేయుము” అని అర్ధం. మొదటి కూటమి ద్వారా అవిద్య తొలగబడగా ఇప్పుడు సాధకుడు తనే బ్రహ్మమని తెలుసుకుంటాడు. ఇక్కడ అలా తెలుసుకోబడిన ఆ బ్రహ్మమే మహావాక్యంలో చెప్పబడిన “తత్“.

ఇక మూడవకూటార్ధము చూడగా, ఆ విధంగా తెలుసుకోబడిన నా స్వరూపమందు ఎల్లప్పుడూ ఉండునట్టుగా చేయుము (సకలహ్రీం) అని అర్ధం. అనగా అది నేనే అయ్యి ఉన్నాను. ఈ భావమే మహావాక్యంలో చెప్పబడిన “అసి”. మొత్తంగా చూస్తే తత్త్వమసియే పంచదశాక్షరి అని అర్ధం అవుతోందికదా.

ఈ మంత్రమునకు వైదిక మంత్రములలాగే స్వరయుక్తముగా జపవిధానం కూడా కలదు. ఇలా ఎన్నో రహస్యాలు కలవు. అవి గురుముఖతః తెలుసుకోదగినవే. ఇలా ఏ సాధకుడు రహస్యాలను తెలుసుకొని సాధన చేస్తాడో అతడు సాక్షాత్తు పరబ్రహ్మమే అవుతాడు.

అయితే చాలామంది మంత్రమును తెలుసుకొని (అంటే ఒక పుస్తకంచూసో, అంతర్జాలంలో చూసో, ఎవరి దగ్గరైనా ఫోన్లో తెలుసుకొనో) మంత్రం జపం చేస్తుంటారు. సశాస్త్రీయంగా గురువుదగ్గర ఉపదేశం తీసుకొని మంత్రానుష్టానం చేసేవారు చాలా తక్కువ. వారిలో కూడా చాలామంది ఉపదేశం తీసుకొని రహస్యాలు తెలుసుకోకుండా ఏదో గొప్ప సాధన చేస్తున్నట్టుగా ఫీల్ అయిపోతుంటారు. అవన్నీ తమని గురువే పిలిచి తమకు చెప్పాలని అనుకుంటుంటారు. ఇదంతా సాధన అన్న ముసుగులో అహంకారపూరితమైన ప్రవర్తనే తప్ప మరేమీ కాదు. నిజానికి మన సాధన, నడవడిక అహంకారరహితమై ఉండాలి. అప్పుడే రహస్యాలు తెలుసుకోవాలన్న జిజ్ఞాస కలుగుతుంది. అప్పుడు గురువును సమీపించి అత్యంత వినమ్రతతో సాధనా రహస్యాలు తెలుసుకోవాలి.

ఇప్పుడు చక్రసంకేతం తెలుసుకుందాము.

(ఇంకాఉంది)

14, మే 2018, సోమవారం

శ్రీవిద్యోపాసన - 1

శ్రీచక్రపూజా లేదా పరాపరపూజ అత్యంత ఉన్నతమైన పూజావిధానము. జీవాత్మ పరమాత్మతో నిరంతరంగా ఏకీభూతమైనట్టుగా భావించుకుంటూ ఉండడమే శ్రీవిద్యోపాసన. పూజ అనునది మూడు రకములు. 1) పరాపూజ 2) అపరాపూజ 3) పరాపరపూజ.

రెండవదిలేదు అనగా ప్రతీమాట, ప్రతీ ఆలోచన అంతా అద్వైతభావనతోనే చేసే పూజనే పరాపూజ అంటారు. ఇది ఎంతో ఉన్నతమైనది.

తనకు భిన్నంగా ఇంకొకటి ఉన్నాది అని తలచి అనగా ద్వైతభావనతో తన ఎదురుగా శ్రీచక్రమునో లేక మరియొక విగ్రహాన్నో పెట్టుకొని చేసే పూజనే అపరాపూజ అని అంటారు. ఇది సాధారణ పూజ.

ద్వైతంతో మొదలుపెట్టి అద్వైతంతో ముగించేపూజ పరాపరపూజ. ఇది మధ్యస్తమైన పూజ.

ఏ సాధకుడి ఆలోచనలు, హృదయం అతడి బాహ్యస్మృతినివీడి ఎల్లప్పుడూ పరబ్రహ్మమందు నిలచిఉంటుందో అదే పరాపూజ. దీనినే ఋతంభరప్రజ్ఞ అని అంటారు. ఈ పూజ అంతా మానసికంగానే జరుగుతుంది. ఇది అందరికీ సాధ్యంకాదు. అలా సాధ్యం చేసుకున్నవారినే ఉత్తమాధికారులు అని అంటారు. వీరు ఎల్లప్పుడూ సచ్చిదానందరూపులై ఉంటారు.

మనసులో గూడుకట్టుకున్న ద్వైతభావనలను నిరంతర సాధనద్వారా అద్వైతభావనలోకి తీసుకు వెళ్ళగలగడమే పరాపరపూజ. ఈ సాధకులను మధ్యమాధికారులని అంటారు. కొంచెం అర్ధమైన రీతిలో చెప్పాలంటే బాహ్యపూజనుండి అంతఃపూజలోకి ప్రయాణంచేయడమే పరాపరపూజ.

తను బ్రహ్మమునకు భిన్నుడని భావించి తన ఎదురుగా ఒకఛాయను అనగా శ్రీచక్రాన్నో, విగ్రహాన్నో ఏదైనా పెట్టుకొని పూజా సామాగ్రి సమకూర్చుకొని కల్పసూత్ర ప్రకారంగా మంత్రములను చదువుతూ చేసెడి బాహ్యపూజను అపరాపూజ అని అంటారు. ఈపూజను, సాధన ప్రారంభదశలో ఉన్నవారుగాని, మధ్యమాధికారులు గాని పాటిస్తారు.

నిజానికి సాధారణ సాధకులకు పరాపూజ వెంటనే అబ్బదు. దానికి ఎంతో పూర్వజన్మ సాధనాపుణ్యఫలం ఉండి తీరాలి. ఉదాహరణకు భగవాన్ శ్రీరమణ మహర్షి. ఆయన పూర్వజన్మల పుణ్యఫలంవల్లనే ఈ జన్మలో పరాపూజా తత్పరులు అయ్యారు. అందరూ ఆయనవంటి వారు కాలేరు. కాని ప్రయత్నిస్తే తప్పకుండా ఆ స్థాయికి చేరగలరు.

కాని పరాపూజాధికారం రావాలంటే అపరాపూజలో నిష్ణాతులు కావాలి. ఏ సాధకుడైతే నిరంతర తపన, పట్టుదల, దీక్ష, గురుభక్తి, సాధన కలిగిఉంటాడో అతడు తప్పక ఆధ్యాత్మికంగా ఎదుగగలడు. ఇది తధ్యం.

పూజయే యజ్ఞము. అయితే శ్రీచక్రోపాసన ఏదో మనకు ఇష్టం వచ్చినప్పుడు, ఏదో కాళీగా ఉన్నాముకదా అని అప్పుడప్పుడు చేసేది కాదు. అది నిరంతర ఉపాసన. శ్వాసతో పాటుగా జరగవలసిన ఉపాసన. జీవాత్మను పరమాత్మగా తెలుసుకోవడమే శ్రీవిద్యోపాసన లక్ష్యం. శ్రీవిద్యోపాసనకు మూడు అంగాలున్నాయి. వాటినే సంకేతాలంటారు. అవి మంత్రసంకేతం, చక్రసంకేతం, పూజా(తంత్ర)సంకేతం. ఇప్పుడు మనం ఈ సంకేతాలని క్లుప్తంగా అర్ధం చేసుకుందాం.

(ఇంకాఉంది)

10, మే 2018, గురువారం

ఋగ్వేద మాధ్యాహ్నిక సంధ్యావందనమ్

ఋగ్వేద మాధ్యాహ్నిక సంధ్యావందనమ్

ఓం ణానాం”త్వా ణప’తిగ్ం హవామహే వింక’వీణాం ము’మశ్ర’వస్తమం|
జ్యేష్ఠరాజం బ్రహ్మ’ణాం బ్రహ్మణస్ప ఆన’శ్శృణ్వన్నూతిభిః’స్సీసాద’నం||
శ్రీమహాగణాధిపతయే నమః|

ఓం అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాం గతోపివా,
యఃస్మరేత్పుండరీకాక్షం సబాహ్యాభ్యన్తరశ్శుచిః.

పుండరీకాక్ష, పుండరీకాక్ష, పుండరీకాక్షాయనమః

ఆచమనంః

ఓం ఆచమ్య…
ఓం కేశవా’యస్వాహా, ఓం నారాయణా’యస్వాహా, ఓం మాధవా’యస్వాహా, ఓం గోవిందాయనమః,
ఓం విష్ణవేనమః, ఓం మధుసూదనాయనమః, ఓం త్రివిక్రమాయనమః, ఓం వామనాయనమః, ఓం శ్రీధరాయనమః, ఓం హృషీకేశాయనమః, ఓం పద్మనాభాయనమః, ఓం దామోదరాయనమః, ఓం సంకర్షణాయనమః, ఓం వాసుదేవాయనమః, ఓం ప్రద్యుమ్నాయనమః, ఓం అనిరుద్ధాయనమః, ఓం పురుషోత్తమాయనమః, ఓం అధోక్షజాయనమః, ఓం నారసింహాయనమః, ఓం అచ్యుతాయనమః, ఓం జనార్ధనాయనమః, ఓం ఉపేంద్రాయనమః, ఓం హరయేనమః, ఓం శ్రీకృష్ణాయనమః,                      ఓం శ్రీకృష్ణపరబ్రహ్మణేనమః

ఆసన స్వీకారముః

ఓం పృథివ్యాః। పృధ్వీతిమంత్రస్య। మేరుపృష్ఠఋషిః। కూర్మోదేవతా। సుతలం ఛందః। ఆసనేవినియోగః॥
ఓం పృధ్వీత్వయాధృతాలోకా దేవీత్వం విష్ణునాధృతా। త్వంచధారయమాం దేవి పవిత్రం కురుచాసనం॥  ఓం అనంతాసనాయనమః।

(కుడిచేతి అంగుష్ఠ, అనామికలతో భూమిని స్పృశించవలెను)

ప్రాణాయామము

1)    ప్రణవస్య। పరబ్రహ్మఋషిః। పరమాత్మా దేవతా। దైవీగాయత్రీఛందః।
2)    శ్రీగాయత్రీ పూర్వాంగ సప్తవ్యాహృతి మంత్రాణాం, విశ్వామిత్ర, జమదగ్ని, భరద్వాజ, గౌతమ, అత్రి, వసిష్ఠ, కశ్యపా ఋషయః, అగ్ని, వాయు, సూర్య, వాగీశ, వరుణ, ఇంద్ర, విశ్వేదేవా దేవతాః, గాయత్రి, ఉష్ణి, గనుష్టుప్, బృహతి, పంక్తి, త్రిష్టుప్ జగతి, ఛందాంసి.
3)    గాయత్య్రా॥ విశ్వామిత్ర ఋషిః। సవితా దేవతా। గాయత్రీ ఛందః॥

ప్రాణాయామే వినియోగః

ఓం భూః। ఓం భువః। ఓం స్వః। ఓం మహః। ఓం జనః। ఓం తపః। ఓం సత్యం।

ఓం తత్స’వితుర్వరే’’ణ్యం। భర్గో’’దేవస్య’ధీమహి| ధియోయోనః’ ప్రచోదయా’’త్|

ఓమాపోజ్యోతీసోఽమృతం బ్రహ్మ భూర్భువఃస్వరోం|

దేశకాలసంకీర్తనం
మమోపాత్త దురితక్షయద్వారా శ్రీపరమేశ్వరప్రీత్యర్ధం, శుభాభ్యాం శుభే శోభనముహూర్తే శ్రీమహావిష్ణోరాజ్ఞయా, ప్రవర్తమానస్య, అద్య బ్రహ్మణః, ద్వితీయపరార్ధే, శ్వేతవరాహకల్పే, వైవస్వతమన్వంతరే, కలియుగే, పథమపాదే, జంబూద్వీపే, భరతవర్షే, భరతఖండే, అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన…………..
సంవత్సరే, ……………ఆయనే, ……………….ఋతౌ, ………మాసే,…………పక్షే, …………..తిథౌ,………….
……………..వాసరే, శుభనక్షత్రే, శుభయోగే, శుభకరణే, ఏవంగుణ విశేషణ విశిష్టాయాం, శుభతిధౌ,
శ్రీమాన్ ……………….గోత్రః ……………………నామధేయః (ధర్మపత్నీ సమేతోహం), శ్రీమతః ……………….. గోత్రస్య…………………………శర్మణః, (ధర్మపత్నీ సమేతస్య) మమోపాత్త దురితక్షయద్వారా శ్రీపరమేశ్వరప్రీత్యర్ధం మాధ్యాహ్నిక సంధ్యాముపాశిష్యే.

మార్జనంః

ఆపోహిష్టేతి తిస్రూణాం” మంత్రాణాం| అంబరీష సింధుద్వీ’ప ఋషిః| ఆపోదేవతా| గాయత్రీ ఛందః,
మార్జనే వి’నియోగః|

ఓం 1) ఆపోహిష్ఠామ’యోభువః’|    2) తాన’ ర్జే ద’ధాతన|  3) హేరణా’’ చక్ష’సే|                        
4) యోవ’శ్శివత’మోసః|    5)  తస్య’ భాజయతే హనః’|   6) తీరివ’ మాతరః’|   7) తస్మా
అరం’’గమామవో |    8) యస్యక్షయా’’జిన్వథ|    9) ఆపో’’నయ’థాచనః|

మంత్రాచమనం

ఆపఃపునంతి ఇత్యస్య మంత్రస్య। పూర ఋషిః। ఆపోదేవతా। అనుష్టుప్ ఛందః। మన్త్రాచమనే వినియోగః।

ఓం ఆపః’ పునన్తు పృథివీం పృ’థివీ పూతా పు’నాతుమాం। పున్తు బ్రహ్మ’స్పతిర్బహ్మ’ పూతా పు’నాతుమాం।
యదుచ్ఛి’ష్టమభో’’జ్యం యద్వా’’ దుశ్చరి’తం మమ’। సర్వం” పునన్తు మామాపో’’ఽ తాంచ’ ప్రతిగ్రగ్గ్ స్వాహా”।

ఆచమనంః

ఓం ఆచమ్య…
ఓం కేశవా’యస్వాహా, ఓం నారాయణా’యస్వాహా, ఓం మాధవా’యస్వాహా, ఓం గోవిందాయనమః,
ఓం విష్ణవేనమః, ఓం మధుసూదనాయనమః, ఓం త్రివిక్రమాయనమః, ఓం వామనాయనమః, ఓం శ్రీధరాయనమః, ఓం హృషీకేశాయనమః, ఓం పద్మనాభాయనమః, ఓం దామోదరాయనమః, ఓం సంకర్షణాయనమః, ఓం వాసుదేవాయనమః, ఓం ప్రద్యుమ్నాయనమః, ఓం అనిరుద్ధాయనమః, ఓం పురుషోత్తమాయనమః, ఓం అధోక్షజాయనమః, ఓం నారసింహాయనమః, ఓం అచ్యుతాయనమః, ఓం జనార్ధనాయనమః, ఓం ఉపేంద్రాయనమః, ఓం హరయేనమః, ఓం శ్రీకృష్ణాయనమః,                      ఓం శ్రీకృష్ణపరబ్రహ్మణేనమః

పునర్మార్జనం
ఆపోహిష్ఠేతి నవర్చస్య సూక్తస్య| అమ్బరీషపుత్రః సింధుద్వీప ఋషిః| పంచమీ వర్ధమాన| సప్తమీ ప్రతిష్ఠా| అంతేద్వే అనుష్టుభౌ| ఆపో దేవతా| పునర్మార్జనే వినియోగః||
ఓం
1)     పోహిష్ఠామ’యో భుస్తాన’ ర్జేద’ధాతన| మహేరణా” చక్షసే|
2)    యోవ’ శ్శివత’మో రస స్తస్య’భాజయతే హనః’| తీరి’వ మాతరః’|
3)    స్మా అరం’’గమామవోస్యక్షయా’’ జిన్వ’థ| ఆపో’’ నయ’థాచనః|
4)    శంనో” దేవీరభిష్ట’ ఆపో” భవన్తు పీతయే’’| శంయో భిస్ర’వంతునః|
5)    ఈశా’’నా వార్యా’’ణాం క్షయం’’తీశ్చర్షణీనాం| అపోయా’’చామి భేజం|
6)    ప్సుమే సోమో” అబ్రవీదంతర్విశా”ని భేజా| గ్నించ’ విశ్వశం’’భువం|
7)    ఆపః’ పృణీత భే’’జం వరూ’థం న్వే” 3 మమ’| జ్యోక్చసూర్యం”దృశే|
8)    ఇదమా”పః ప్రవ’హ యత్కించ’ దురితం మయి’| యద్వాహమభిదుద్రో యద్వాశే
తానృతం|
9)    ఆపో” ద్యాన్వ’చారిషం రసే” సమ’గస్మహి| పయ’స్వానగ్న ఆగ’హితం మాసం
సృ’జవ’ర్చసా|
10)  సస్రు’షీస్త’దప’సోది’వాన’క్తంచ సస్రు”షీః| వరే”ణ్యక్రతుపోదేవీ రుప’హ్వయే|

అఘమర్షణమంత్రము
ఋతంచ సత్యంచేత్యస్య సూక్తస్య| అఘమర్షణ ఋషిః| భావవృత్తో దేవతా| అనుష్ఠుప్చంధః| పాపపురుష జల విసర్జనే వినియోగః||
1)    తంచ’ త్యంచాభీ”ద్ధాత్తసోఽధ్య’జాయత| తతో రాత్ర్య’జాయ తతః’ సముద్రో అ”ర్ణవః||
2)    సముద్రాద”ర్ణవాదధి’ సంవత్సరో అ’జాయత| అహోరాత్రాణి’ విద్విశ్వ’స్య మితో వశీ||
3)    సూర్యాచంద్రమసౌ” ధాతా య’థాపూర్వమ’ల్పయతు| దివం”చ పృథివీం
చాన్తరి’క్షధోస్వః’|

అర్ఘ్యప్రదానముః

ఓం ఆచమ్య…
ఓం కేశవా’యస్వాహా, ఓం నారాయణా’యస్వాహా, ఓం మాధవా’యస్వాహా, ఓం గోవిందాయనమః,
ఓం విష్ణవేనమః, ఓం మధుసూదనాయనమః, ఓం త్రివిక్రమాయనమః, ఓం వామనాయనమః, ఓం శ్రీధరాయనమః, ఓం హృషీకేశాయనమః, ఓం పద్మనాభాయనమః, ఓం దామోదరాయనమః, ఓం సంకర్షణాయనమః, ఓం వాసుదేవాయనమః, ఓం ప్రద్యుమ్నాయనమః, ఓం అనిరుద్ధాయనమః, ఓం పురుషోత్తమాయనమః, ఓం అధోక్షజాయనమః, ఓం నారసింహాయనమః, ఓం అచ్యుతాయనమః, ఓం జనార్ధనాయనమః, ఓం ఉపేంద్రాయనమః, ఓం హరయేనమః, ఓం శ్రీకృష్ణాయనమః,                      ఓం శ్రీకృష్ణపరబ్రహ్మణేనమః

కాలాతిక్రమణమైనచో…
ప్రాతర్దేవీ మిత్రస్య మంత్రస్య। ఉరుచక్రిర్నామాత్రేయ ఋషిః। మిత్రావరుణౌ దేవతా। త్రిష్టుప్ ఛందః। మాధ్యాహ్నిక సంధ్యాంగ ముఖ్య కాలాతిక్రమణ ప్రాయశ్చిత్త అర్ఘ్యప్రదానే వినియోగః।
ఓం ప్రార్దేవీ మది’తిం జోహవీమి ధ్యంది’ ఉది’తా సూర్య’స్య। రాయే మిత్రావరుణా ర్వతాతే”ళే తోకా తన’యా శంయోః।  (ఒకసారి మాత్రమే)

మాధ్యాహ్నిక అర్ఘ్యప్రధానము.
1)    హంసశ్శుచిషదిత్యస్య మంత్రస్య। గౌతమపుత్రో వామదేవ ఋషిః। సూర్యో దేవతా। జగతీ ఛందః। మాధ్యాహ్నిక సంధ్యాంగ అర్ఘ్యప్రదానే వినియోగః।

ఓం హంసః శు’చిషద్వసు’రన్తరిక్ష సద్ధోతా’’ వేదిషదతి’థిర్ధురోసత్।  నృషద్వ’సదృ’ సద్వ్యో’’బ్జా గోజా ఋ’జా అ’ద్రిజా తం బ్రుహత్।

2)    ఆకృష్ణేనేత్యస్య మంత్రస్య। హిరణ్యస్తూప ఋషిః। సవితా దేవతా। త్రిష్టుప్ ఛందః। మాధ్యాహ్నిక సంధ్యాంగ అర్ఘ్యప్రదానే వినియోగః।

ఓం ఆకృష్ణే రజ’సా వర్త’మానో నివేశయ’’న్నమృతం మర్త్యం’’చ। హిరణ్యయే’’న సవితా రథేనాదేవో యా’’తి భువ’నాని పశ్యన్’ ।
3) ఓం తత్సువితురిత్యస్య మంత్రస్య| గాధిపుత్రో విశ్వామిత్ర ఋషిః| సూర్యో దేవతా| గాయత్రీ ఛందః| మాధ్యాహ్నిక సంధ్యాంగ అర్ఘ్యప్రధానేవినియోగః||
ఓం భూర్భువస్వః’| ఓం తత్స’వితుర్వరే’’ణ్యం। భర్గో’’దేవస్య’ధీమహి| ధియోయోనః’ ప్రచోదయా’’త్|

ఆత్మప్రదక్షిణముః
సావా’దిత్యోబ్రహ్మ|

తర్పణాలుః

సంధ్యాం తర్పయామి, సావిత్రీం తర్పయామి, రౌద్రీం తర్పయామి, నిమృజీం తర్పయామి

గాయత్రి ఉపాసనముః

ఓం ఆచమ్య…
ఓం కేశవా’యస్వాహా, ఓం నారాయణా’యస్వాహా, ఓం మాధవా’యస్వాహా, ఓం గోవిందాయనమః,
ఓం విష్ణవేనమః, ఓం మధుసూదనాయనమః, ఓం త్రివిక్రమాయనమః, ఓం వామనాయనమః, ఓం శ్రీధరాయనమః, ఓం హృషీకేశాయనమః, ఓం పద్మనాభాయనమః, ఓం దామోదరాయనమః, ఓం సంకర్షణాయనమః, ఓం వాసుదేవాయనమః, ఓం ప్రద్యుమ్నాయనమః, ఓం అనిరుద్ధాయనమః, ఓం పురుషోత్తమాయనమః, ఓం అధోక్షజాయనమః, ఓం నారసింహాయనమః, ఓం అచ్యుతాయనమః, ఓం జనార్ధనాయనమః, ఓం ఉపేంద్రాయనమః, ఓం హరయేనమః, ఓం శ్రీకృష్ణాయనమః,                      ఓం శ్రీకృష్ణపరబ్రహ్మణేనమః

ఓమిత్యేకాక్ష’రం బ్రహ్మ| అగ్నిర్దేవతా బ్రహ్మ’ఇత్యార్షం| గాయత్రం ఛందం పరమాత్మం’ సరూపం|
సాయుజ్యం వి’నియోగం|
ఆయా’తువర’దా దేవీ క్షరం’ బ్రహ్మసంమి’తమ్| గాయత్రీం” ఛన్ద’సాం మాతేదం బ్ర’హ్మజుషస్వ’మే| యదహ్నా”త్కురు’తేపాపం తదహ్నా”త్ప్రతిముచ్య’తే| యద్రాత్రియా”త్కురు’తేపాపం తద్రాత్రియా”త్ప్రతి ముచ్య’తే| సర్వ’ర్ణేమ’హాదేవీ సంధ్యావి’ద్యే రస్వ’తి|
ఓజో’ఽసి సహో’ఽసి బల’మసి భ్రాజో’ఽసి దేవానాం ధానామా’ఽసి విశ్వ’మసి విశ్వాయు స్సర్వమసి ర్వాయు రభిభూరోం గాయత్రీ మావా’హయామి, సావిత్రీ మావా’హయామి, సరస్వతీ మావా’హయామి, ఛన్దర్షీ నావా’హయామి, శ్రియమావా’హయామి, బలమావా’హయామి, గాయత్రియా గాయత్రీ ఛన్దో విశ్వామిత్ర ఋషి స్సవితా దేవతాఽగ్నిర్ముఖం బ్రహ్మశిరో విష్ణుర్హృదయం రుద్రశిఖా పృథివీయోనిః ప్రాణాపాన వ్యానోదాన సమానా సప్రాణా శ్వేతవర్ణా సాఙ్ఖ్యాయనసగోత్రా గాయత్రీ చతుర్వింశత్యక్షరా త్రిపదా’ షట్కుక్షిః పఞశీర్షోపనయనే వి’నియోగః ఓం భూః, ఓం భువః, ఓం స్వః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం త్యం, ఓం తత్స’వితుర్వరే’’ణ్యం। భర్గో’’దేవస్య’ధీమహి| ధియోయోనః’ ప్రచోదయా’’త్|  ఓమాపోజ్యోతీసోఽమృతం బ్రహ్మ భూర్భువఃస్వరోం|
మమోపాత్త దురితక్షయద్వారా శ్రీపరమేశ్వరప్రీత్యర్ధం మాధ్యాహ్నిక సంధ్యాంగ యధాశక్తి గాయత్రీ మహా మంత్రజపం కరిష్యే| ఇతి ఋగ్వేద బ్రహ్మకర్మ సముచ్చయం|
(ఇప్పుడు పంచపాత్రలోని ఉదకమును స్పృశించవలెను)

అంగన్యాస కరన్యాసములు
ఓం తత్సవితుః బ్రహ్మాత్మనే                 -           అంగుష్ఠాభ్యాం నమః     -   హృదయాయ నమః
వరేణ్యం విష్ణ్వాత్మనే                            -           తర్జనీభ్యాం నమః        - శిరసే స్వాహా
భర్గోదేవస్య రుద్రాత్మనే                       -           మధ్యమాభ్యాం నమః   - శిఖాయై వషట్
ధీమహి సత్యాత్మనే                              -           అనామికాభ్యాం నమః  - కవచాయహుం
ధియోయోనః జ్ఞానాత్మనే                      -           కనిష్ఠికాభ్యాం నమః      - నేత్రత్రయాయ వౌషట్
ప్రచోదయాత్ సర్వాత్మనే                    -           కరతలకరపృష్ఠాభ్యాం నమః - అస్త్రాయఫట్              
బూర్భువస్సువరోమితి దిగ్బంధః
ధ్యానంః

ముక్తావిద్రుమ హేమనీల ధవళచ్ఛాయై ర్ముఖై స్త్రీక్షణైర్యుక్తామిందు నిబద్ధరత్న మకుటాం తత్త్వార్థ వర్ణాత్మికాం. గాయత్రీం వరదాభయాంకుశకశాశుభ్రం కపాలం గదాం శంఖం చక్ర మథారవిందయుగళం హస్తైర్వహంతీం భజే.
ముద్రలుః

సుముఖం సంపుటంచైవ వితతం విశ్రుతం తథా| ద్విముఖం త్రిముఖం చైవా చతుఃపంచ ముఖం తథా| షణ్ముఖోధోమకంచైవ వ్యాపికాంజలికంతథా| షకటం యమపాశంచ గ్రథితం చోల్ముఖోల్ముఖం| ప్రళంబం ముష్టికంచైవ, మత్స్య, కూర్మ, వరాహకం| సింహాక్రాంతం, మహాక్రాంతం, పల్లవం ముద్గరం తథా|
ఇతిముద్రావై చతుర్వింశతి గాయత్రీ సుప్రతిష్ఠితాః| ఏతే ముద్రానజానాతి గాయత్రీ నిష్ఫలాభవేత్|
మంత్రజపం

ఓం భూర్భువస్వః’| ఓం తత్స’వితుర్వరే”ణ్యం| భర్గో”దేవస్య’ధీమహి| ధియోయోనః’ ప్రచో”దయాత్||

అంగన్యాస కరన్యాసములు
ఓం తత్సవితుః బ్రహ్మాత్మనే                 -           అంగుష్ఠాభ్యాం నమః     -   హృదయాయ నమః
వరేణ్యం విష్ణ్వాత్మనే                            -           తర్జనీభ్యాం నమః        - శిరసే స్వాహా
భర్గోదేవస్య రుద్రాత్మనే                       -           మధ్యమాభ్యాం నమః   - శిఖాయై వషట్
ధీమహి సత్యాత్మనే                              -           అనామికాభ్యాం నమః  - కవచాయహుం
ధియోయోనః జ్ఞానాత్మనే                      -           కనిష్ఠికాభ్యాం నమః      - నేత్రత్రయాయ వౌషట్
ప్రచోదయాత్ సర్వాత్మనే                    -           కరతలకరపృష్ఠాభ్యాం నమః - అస్త్రాయఫట్              
వస్సువర్భుభూరోం దిగ్విమోకః

వరుణోపస్థానంః

యచ్చిద్దిత ఇతి పంచర్చస్య సూక్తస్య| శునశ్శేప ఋషిః| వరుణోదేవతా| గాయత్రీ ఛందః| వరుణోపస్థానే వినియోగః||

ఓం
1)    చ్చిద్ధితే విశో’’ యథా ప్రదే”వ వరుణవ్రతం| మినీసి ద్యవి’ద్యవి|
2)    మానో” థాయ’ త్నవే” జిహిళానస్య’ రీరధః| మాహృ’ణానస్య’ మన్యవే”|
3)    విమృ’ళీకాయ’తే మనో” థీరశ్వం న సంది’తం| గీర్భిర్వ’రుణసీమహి|
4)    రాహిమే విమ’న్యవః పత”న్తి వస్య’ఇష్టయే| వయోనవ’స తీరుప’|
5)    దాక్ష’త్రశ్రియంమా వరు’ణం కరామహే| మృళీకాయో” రుచక్ష’సం|

మాధ్యాహ్నిక సూర్యోస్థానంః

చితం దేవనా ముదగాదనీకమితిషళర్చస్య సూక్తస్య। ఆంగీరసః కుత్సఋషిః। సూర్యోదేవతా। త్రిష్టుప్ఛందః। సూర్యోపస్థానే వినియోగః।

1) ఉదుత్యం జాతవే”దసం దేవం వ’హన్తికేతవః’। దృశేవిశ్వా’’ సూర్యం’’।
2) అత్యేతాయవో”యథా నక్ష’త్రాయన్త్యక్తుభిః’। సూరా’’య విశ్వచ’క్షసే।
3) అదృ’శ్యస్యకేవో విశ్మయో తంజనాం అను’। భ్రాజ”న్తో గ్నయో” యధా।
4) రణి”ర్విశ్వద’’ర్శతో జ్యోతిష్కృద’సి సూర్య। విశ్వమాభా’’సి రోనం।
5) ప్రత్యంఙ దేవానాం విశః’ ప్రత్యంగ్ దే’షి మాను’షాన్। ప్రత్యంగ్ విశ్వం స్వ’ర్దృశే।
6)    యేనా’’పావా చక్షు’సాభుణ్యం తంనాం అను’। త్వం వ’రు పశ్య’సి।
7)    విద్యామే’’షి రజ’స్పృథ్వహామిమా’’నో క్తుభిః’। పశ్యంజన్మా’’ని సూర్య।
8)    ప్తత్వా’’ రితో థే వహ”న్తి దేవ సూర్య। శోచిష్కే’’శం విచక్షణ।
9)    అయు’క్త ప్త శున్థ్యువః సూరో రథ’స్య ప్త్యః’। తాభి’ర్యాతి స్వయు’క్తిభిః।
10)  ద్వయం తమ’స్పరి జ్యోతిష్పశ్యం’’ ఉత్త’రం। దేవం దే”త్రా సూర్యమగ’’న్మ జ్యోతి’రుత్తమమ్।
11)  ద్యన్నద్యమి’త్రమహః రో’న్నుత్త’రాం దివం’’। హృద్రోగం మమ’సూర్య। హరిమాణం”చనాశయ।
12)  శుకే”షుమే హరిమాణం” రోపణాకా’’సుధద్మసి। అధో’’హారిద్రవేషు’మే హరిమాణం నిద’ద్మసి।
13)  ఉద’గాయమా”దిత్యో విశ్వే’’ సహ’సాహ। ద్విషన్తం”న్ధన్మో హం ద్వి’తే ర’థం।
14)  చిత్రం దేవానాముద’ గాదనీ’’కం చక్షు’’ర్మిత్రస్య వరు’ణస్యాగ్నేః। ఆప్రాద్యావా’’పృథివీ న్తరి’క్షం సూర్య’త్మా జగ’తస్తస్థుష’శ్చ।
15)  సూర్యో”దేవీ ముసం రోచ’మానాంర్యోనయోషా”భ్యే”తి శ్చాత్। యత్రానరో’’దేయన్తో’’ యుగాని’ వితన్వతే ప్రతి’ ద్రాయ’ ద్రం।
16)  ద్రా అశ్వా”రితః సూర్య’స్య చిత్రా ఏత’గ్వా నుమాద్యా’’సః। నమస్యన్తో’’ దివ ఆపృష్ఠమ’స్థుఃరిద్యావా’’ పృథివీ య’న్తి ద్యః।
17)  తత్సూర్య’స్య దేత్వం తన్మ’హిత్వం ధ్యాకర్తోర్విత’తం సంజ’భార। దేదయు’క్త రితః’ స్థాదాద్రాత్రీ వాస’స్తనుతేసిమస్మై’’।
18)  న్మిత్రస్య వరు’ణస్యాభిక్షే సూర్యో’’రూపం కృ’ణుతే ద్యోరుపస్థే”। అనన్తన్య ద్రుశ’దస్యపాజః’ కృష్ణన్యద్దరితః సంభ’రన్తి।
19)  అద్యాదే”వా ఉది’తా సూర్య’స్య నిరంహసః’ పిపృతా ని’రద్యాత్। తన్నో” మిత్రో వరు’ణో మామహన్తా మది’తిః సిన్ధుః’పృథివీ తద్యౌః।

శాన్తిమంత్రము

ఓం నమో బ్రహ్మణే ఇత్యస్య మంత్రస్య। ప్రజాపతి ఋషిః। విశ్వేదేవా దేవతాః। జగతీచ్ఛందః। ఉపస్థానే వినియోగః।

ఓం నమో బ్రహ్మ’ణే నమో’’ అస్త్వగ్నయే నమః’ పృథివ్యై న ఓష’ధీభ్యః। నమో’’వాచే నమో’’ వాచస్పత’యేమో విష్ణ’వే బృతే క’రోమి। ఓం శాన్తిః శాన్తిః శాన్తిః’।