18, మే 2022, బుధవారం

శ్రీదక్షిణామూర్తి సంహిత - 32

 

ముఫైరెండవ భాగము

మాతంగేశ్వరీరత్నవిద్యావిధివివరణం

ఈశ్వరుడు చెప్పుచున్నాడు –

మంత్ర స్వరూపం: ఐం క్లీం సః జూం హ్రీం శ్రీం ఓం నమో భగవతి మాతంగేశ్వరి సర్వజనమనోహరి సర్వరాజవశంకరి సర్వముఖరంజని సర్వస్త్రీపురుషవశంకరి సర్వదుష్టమృగవశంకరి సర్వలోకకార్యాది వశంకరి హ్రీం శ్రీం క్లీం|

శ్రీవిద్యార్ణవ తంత్రము - ఎనిమిదవశ్వాస - 5

 19.       భువనన్యాసం

అతల: ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం అంఆంఇం అతలలోకనిలయ శతకోటిగుహ్యాద్యయోగినీ దేవతాయుతాధార పరాంబాయై నమః – పాదయోః|

5, మే 2022, గురువారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - ఎనిమిదవశ్వాస - 4

 

16. పరాప్రాసాద మంత్రము

అనంత చంద్రుడు = నాద బిందువు, భువన = ఓంకారము, బిందువు = హకారము, బిందుయుగము = సకారము. వీటి సంయోగముతో హ్సౌం బీజము పుట్టును. దీనిని విలోమం చేయగా అది స్హౌం అవుతుంది. ఈ రెండు బీజములతోనూ “హ్సౌంస్హౌం” అను మంత్రము జనిస్తుంది.

22, ఏప్రిల్ 2022, శుక్రవారం

శ్రీదక్షిణామూర్తి సంహిత - 31

 

అన్నపూర్ణావిధివివరణం

దేవి అడుగుచున్నది - హే దేవేశ! మీరు ఐదు పంచ మహావిద్యలను సూచనప్రాయంగా చెప్పారు. కానీ వాటి ప్రకాశ వివరణ చేయలేదు. నామీద దయ ఉంచి అది తెలుపవలసిందిగా కోరుచున్నాను.

19, ఏప్రిల్ 2022, మంగళవారం

షడధ్వములు

షడధ్వములు

శైవిజం ప్రకారము ఈ జగత్తు అంతా మూడు విధములు. ఇది మూడు మార్గములలో (=అధ్వము) కల్పించబడినది. స్థూల, సూక్ష్మ, పరా అనేవి ఈ మూడు మార్గములు. స్థూల మార్గమును భువనాధ్వ, సూక్ష్మ మార్గమును తత్త్వాధ్వ, పరా మార్గమును కళాధ్వ అని పిలుస్తారు. ఇక్కడ మార్గమునకు రెండు రకముల అర్ధములు కలవు. ఒకటి ఆ మార్గములో నడుచుట లేదా ఆ మార్గమును వదలివేయుట. మార్గమును వదలివేయుట అన్నది పరమాత్మ కరుణ వల్ల మాత్రమే సాధ్యము. ఎప్పుడైతే ఆ కరుణను సాధించి మార్గమును జయిస్తామో (వదలివేస్తామో) అప్పుడు పరమశివ స్థితికి చేరుకుంటాము.

12, ఏప్రిల్ 2022, మంగళవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - ఎనిమిదవశ్వాస - 3

 

15.     అష్టాత్రింశత్కళాన్యాసం

ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌంహాం – ఈశానాయ నమః అంగుష్ఠయోః|

ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌంహైం – తత్పురుషాయ నమః తర్జన్యోః|

ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌంహూం – అఘోరాయ నమః మధ్యమయోః|

ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌంహీం – వామదేవాయ నమః అనామికయోః|

ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌంహం – సద్యోజాతాయ నమః కనిష్ఠికయోః|

2, ఏప్రిల్ 2022, శనివారం

శ్రీదక్షిణామూర్తి సంహిత - 30

 

కామేశ్వరీయజనవిధివివరణం

ఈశ్వరుడు చెప్పుచున్నాడు - హే మహేశానీ! ఇప్పుడు నీకు నేను విశ్వమాత, త్రైలోకములనూ ఆకర్షించునది, కుమారి భగవతి కామేశ్వరీ గురించి చెబుతాను.

25, మార్చి 2022, శుక్రవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - ఎనిమిదవశ్వాస - 2

 8.       చతుః సమయవిద్య

1.       కామేశ్వరి:

ఐం క్లీం సౌః ఓం నమః కామేశ్వరీ ఇచ్ఛాకామఫలప్రదే సర్వ సత్త్వవశంకరి సర్వజగత్ క్షోభకరీ హూం హూం ద్రాంద్రీంక్లీంబ్లూంసః సౌఃక్లీంఐం|

18, మార్చి 2022, శుక్రవారం

శ్రీదక్షిణామూర్తి సంహిత - 29

 

పంచకామేశ్వరీపూజనవిధివివరణం

ఇప్పుడు పంచకాముల నాయిక విశ్వమాతా వర్ణన చెయ్యబడుచున్నది. ముందు చెప్పబడిన పంచకాముల ద్వారా పంచకామేశ్వరీ తెలుపబడుతుంది. ఈ విద్యా ఋషి - సమ్మోహన| ఛందస్సు - గాయత్రి| బీజం - క్లీం| హ్రీం - శక్తిః| ఐం - కీలకం| దేవత - పంచకామేశ్వరి| కామబాణ విధిలో చెప్పిన విధంగా న్యాసములు చెయ్యాలి.

శ్రీశుభకృత్ నామ సంవత్సరములో (2022-23) శక్తి పర్వదినములు

 

శ్రీశుభకృత్ నామ సంవత్సరములో (2022-23) శక్తి పర్వదినములు

12, మార్చి 2022, శనివారం

తత్త్వములు

తత్త్వములు

వేదాంతము ప్రకారము తత్త్వములు 24. కానీ కాశ్మీరీ శైవిజం ప్రకారము తత్త్వములు 36. శివుని గురించి తెలుసుకోవడానికి ఈ 36 తత్త్వములు ఎంతో ముఖ్యమని కాశ్మీరీ శైవిజం చెబుతోంది. ఈ 36 తత్త్వములను ఆరోహణాక్రమములో ఇక్కడ చర్చించబడుతున్నది. భూమి నుండి పరమశివమునకు ఎదగడమే ఈ ఆరోహణాక్రమ ఉద్దేశ్యము. స్థూలమైన భూమి నుండి సూక్ష్మ, సూక్ష్మతర మూల ప్రకృతులను (తత్త్వములు/Elements) అర్థం చేసుకొంటూ సూక్ష్మాతిసూక్ష్మమైన పరమశివుని చేరడమే లక్ష్యము.

11, మార్చి 2022, శుక్రవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - ఎనిమిదవశ్వాస - 1

     1.       ఆయతన విద్యలు

ఈ విద్యలు అయిదు విధములు. అవి బ్రాహ్మ్య, వైష్ణవ, సౌర, బౌద్ధ, శైవ. తూర్పు, దక్షిణ, పడమర, ఉత్తర, ఊర్ధ్వక్రమములో ఈ విద్యలుండును. ఇవికాక, ఆరవ ఆయతన విద్య, శాక్తం పీఠము నందు ఉండును.

9, మార్చి 2022, బుధవారం

శ్రీదక్షిణామూర్తి సంహిత - 28

 

పంచబాణేశ్వరీయజనవిధివివరణం

ఈశ్వరుడు చెబుచున్నాడు - హే మహేశ్వరీ! త్రిపురేశ్వరీ తంత్రములో పంచబాణములను తెలుపబడినవి. ఆ పంచబానములనుండి ఈ పంచాక్షరీ విద్య జనించింది. ఈ మంత్ర ఋషి - మదన| ఛందస్సు - గాయత్రి| బీజము - ఆది కామేశ్వరి| దేవత - ఈశ్వరి| వ్యస్త మరియు సమస్త పంచ కాములతో అంగ దేవతలను పూజించాలి. పంచబాణముల న్యాసము చెయ్యాలి. (ఈ న్యాసము కొరకు తొమ్మిదవ భాగము చూడగలరు).

28, ఫిబ్రవరి 2022, సోమవారం

శ్రీదక్షిణామూర్తి సంహిత - 27

 

పారిజాతేశ్వరీవాణీవిద్యావిధివివరణం

ఈశ్వరుడు చెప్పుచున్నాడు - హే దేవీ! ఇప్పుడు కల్పలతా విద్యా వర్ణన చెబుతాను. దీనిని తెలుసుకున్నంతనే ఆపత్తులు పారిపోవును. శ్రీవిద్యా, పారిజాతేశ్వరీ, పంచకామేశ్వరీ, పంచబాణేశ్వరీ, కుమారి దేవి - ఈ పంచవిద్యలను కల్పలతా విద్యలని అంటారు.

21, ఫిబ్రవరి 2022, సోమవారం

శ్రీదక్షిణామూర్తి సంహిత - 26

 

పంచసుందరీవిద్యావిధివివరణం

ఈశ్వరుడు చెప్పుచున్నాడు - ఈనాటికీ నా ముఖము ద్వారా ఈ మంత్ర జపము జరుగుచున్నది. హే దేవీ! ఈ పంచవిద్య మూడులోకములందునూ దుర్లభము. ఇందులో మొదటి విద్య ఈవిధంగా ఉంటుంది -

18, ఫిబ్రవరి 2022, శుక్రవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - ఏడవశ్వాస - 15

 

62. కామేశ్వరీ నిత్య

ఐం క్లీం సౌః ఓం నమః కామేశ్వరి ఇచ్ఛాకామఫలప్రదే సర్వసత్త్వ వశంకరి సర్వజగత్శోభకరి హూంహూం ద్రాంద్రీంక్లీంబ్లూంసః సౌః క్లీం ఐం|

7, ఫిబ్రవరి 2022, సోమవారం

శ్రీదక్షిణామూర్తి సంహిత - 25

 

సంపత్ప్రదాభైరవీవిధివివరణం

ఈ దేవత పూజాదులు చతుఃసింహాసన దేవీ పూజా క్రమంలో చెయ్యాలి.

మంత్రము: రం భయవిధ్వంసినీ రం

ఈమె 64కోట్ల మహాయోగినిలనూ శాసించగలిగేది.

ధ్యానం:

ఆతామ్రార్కసహస్రాభా త్రినేత్రా చంద్రసమ్ముఖీ|

చంద్రఖండస్ఫురద్రత్నముకుటా క్షామమధ్యమా||

నితంబినీ స్ఫురద్రత్నరశనా చంద్రభూషణా|

ఉన్మత్తయౌవనాప్రౌఢా పీనోన్నతఘనస్తనీ||

అమృతంకామముండస్రంగ్మండితాంగీ సుశోభనామ్|

పుస్తకం చాభయం వామే దక్షిణే త్వక్షమాలికామ్||

వరంచ దధతీం పూజ్యా త్రిపురేశీవ నాన్యథా|

ఇది శ్రీదక్షిణామూర్తి సంహితకు విశాఖ వాస్తవ్యులు, కౌండిన్యస గోత్రికులు, శ్రీఅయలసోమయాజుల పాలబాబు (సుబ్బారావు) గారు మరియు శ్రీమతి సాయిలీల దంపతుల ద్వితీయపుత్రుడు మరియు హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ ప్రకాశానందనాథ (శ్రీశ్రీశ్రీ శ్రీపాద జగన్నాధస్వామి) గారి శిష్యుడు భువనానందనాథ అను దీక్షానామము కలిగిన అయలసోమయాజుల ఉమామహేశ్వరరవి తెలుగులోకి స్వేచ్ఛానువాదము చేసిన సంపత్ప్రదాభైరవీవిధి వివరణం అను ఇరవైఅయిదవ భాగము సమాప్తము.

4, ఫిబ్రవరి 2022, శుక్రవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - ఏడవశ్వాస - 13

 ఇ) పంచకోశవిద్యా

 

1.       శ్రీవిద్యా కోశేశ్వరి

ఓం ఐం హ్రీం శ్రీం కఏఈలహ్రీం హసకహలహ్రీం సకలహ్రీం మహా కోశేశ్వరీ బృందమండితాసన సంస్థితా సర్వసౌభాగ్యజననీ పాదుకాం పూజయామి.

31, జనవరి 2022, సోమవారం

శ్రీదక్షిణామూర్తి సంహిత - 24

 

భయవిధ్వంసినీభైరవీవిధివివరణం

మంత్రము: సహకర భయవిధ్వంసినీ భైరవీ|

ధ్యానం:

అఘోరభైరవీ దేవీ శ్యామా ముండస్రజాకులా|

దక్షిణోత్తరయా ప్రౌఢా పంచముండాధివాసినీ||

పుస్తకం చాక్షమాలాంచ పాశాశ్చైవాంకుశంతథా|

ఖట్వాంగమ్ డమరుమ్ చైవ కపాలం శూలమేవచ||

ఈమె పూజాదులు షట్కూట భైరవీ క్రమంలో చెయ్యాలి.

ఈవిద్య భోగ మోక్షదాయిని.

ఇది శ్రీదక్షిణామూర్తి సంహితకు విశాఖ వాస్తవ్యులు, కౌండిన్యస గోత్రికులు, శ్రీఅయలసోమయాజుల పాలబాబు (సుబ్బారావు) గారు మరియు శ్రీమతి సాయిలీల దంపతుల ద్వితీయపుత్రుడు మరియు హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ ప్రకాశానందనాథ (శ్రీశ్రీశ్రీ శ్రీపాద జగన్నాధస్వామి) గారి శిష్యుడు భువనానందనాథ అను దీక్షానామము కలిగిన అయలసోమయాజుల ఉమామహేశ్వరరవి తెలుగులోకి స్వేచ్ఛానువాదము చేసిన భయవిధ్వంసినీభైరవీవిధి వివరణం అను ఇరవైనాల్గవ భాగము సమాప్తము.

28, జనవరి 2022, శుక్రవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - ఏడవశ్వాస - 12

 61. ఊర్థ్వసింహాసన దేవతా

     అ) పంచ సుందరీ: మూడులోకములలో దుర్లభమైన ఈ విద్యలను నేను ఇప్పటికీ ఈశాన్య ముఖంతో జపము చేస్తానని శివుడు స్వయంగా పార్వతితో చెప్పెను.

17, జనవరి 2022, సోమవారం

శ్రీదక్షిణామూర్తి సంహిత - 23

 

నిత్యాభైరవీవిధివివరణం

షట్కూట భైరవీ వర్ణములను సంహారక్రమంలో లిఖించాలి. ఈ విధంగా సంయోజించడం వలన అది భయహారిణీ నిత్యాభైరవీ విద్య అవుతుంది.

7, జనవరి 2022, శుక్రవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - ఏడవశ్వాస - 11

 60. ఉత్తర సింహాసన దేవతా

     అ) భువనేశీ భైరవి

హ్స్రైం హసకలహ్రీం హ్స్రౌం| కుమారీ విద్యలాగే ఈ విద్యా ఋష్యాదులు చెయ్యాలి. హ్స్రాం – హ్స్రీం – హ్స్రూం – హ్స్రైం – హ్స్రౌం – హ్స్రః| ఈ బీజములతో షడంగ న్యాసం చెయ్యాలి.