సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

28, సెప్టెంబర్ 2022, బుధవారం

శ్రీ విద్యార్ణవ తంత్రం - శ్రీభువనానంద నాథ

                     శ్రీవిద్యార్ణవ తంత్రం
             
                     
                                                  

శ్రీలలితామహాత్రిపురసుందరిని బ్రహ్మ మయముగా భావించి ఆ బ్రహ్మ రూపముగా రూపాంతరము చెందడానికి చేసే సాధనయే శ్రీవిద్య. ఇక్కడ విద్య అనగా మంత్రము అని అర్ధము. శ్రీ అనగా శ్రీలలితామహాత్రిపురసుందరి. అనగా ఆమెకు సంబంధించిన మంత్ర, యంత్ర మరియు తంత్రశాస్త్ర విజ్ఞానమునే శ్రీవిద్య అని అంటారు. అనంతాయై వేదాః అను వేదవాక్యమును అనుసరించి, వేదరూపమైన శ్రీవిద్యకూడా అనంతము. నాకు శ్రీవిద్య తెలుసు అని చెప్పుకొనేవారు ఎవరికీ ఈ విద్య పూర్తిగా తెలియదనే చెప్పవచ్చు. 

23, సెప్టెంబర్ 2022, శుక్రవారం

శ్రీదక్షిణామూర్తి సంహిత - 38

 

పంచమీశకటయంత్రోద్దారప్రయోగసాధనవిధివివరణం

ఈశ్వరుడు చెప్పుచున్నాడు –

ఇప్పుడు తర్పణ విధిని తెలుపబడుచున్నది. తిలలు, మైరేయము (చెరకు రసం నుండి తీసిన కల్లు) మరియు బన్ధూక పుష్పములతో క్రమంగా తర్పణములు వదలాలి. ముఫైఏడవ భాగంలో చెప్పిన విధంగా పూజ చేసిన తర్వాత సువర్ణాది పాత్రల్లో తర్పణాలు వదలాలి. ఈ విధమైన సాధన వలన సాధకుడు తప్పకుండా దేవి కృపకు పాత్రుడవుతాడు.

17, సెప్టెంబర్ 2022, శనివారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - ఎనిమిదవశ్వాస - 10


      కాళరాత్రి

అస్య శ్రీ కాళరాత్రి మంత్రస్య| భైరవ ఋషిః| అనుష్టుప్ ఛందః| శ్రీకాళరాత్రి దేవతా| హ్రీం బీజం| స్వాహా శక్తిః| హుం కీలకం| శ్రీవిద్యాంగత్వేన వినియోగః|

6, సెప్టెంబర్ 2022, మంగళవారం

శ్రీదక్షిణామూర్తి సంహిత - 37

 

పంచమీక్రమార్చనవిధివివరణం

ఈశ్వరుడు చెప్పుచున్నాడు – పంచమీ దేవి రత్నేశ్వరీ వర్ణన ఇప్పుడు చెయ్యబడుచున్నది. ఈ దేవతా మంత్రస్వరూపం ఈ క్రింది విధంగా ఉండును.