బలియజనవిధివివరణం
ఈశ్వరుడు చెప్పుచున్నాడు – ఆరు రుచుల యుక్త, కామధేను పాలు మొదలగు వాటితో పవిత్రించిన నైవేద్యమును పరశక్తికి అర్పించిన తర్వాత కర్పూర సహిత తాంబూలమును సమర్పించాలి. ఆ తర్వాత నిత్య హోమము చెయ్యాలి. ఆ తర్వాత యథాశక్తి జపము, స్తుతి చెయ్యాలి. సౌభాగ్య దేవతకు నమస్కరించి బంగారము-వెండి-కాంస్య పాత్రల్లో అష్టదళ పద్మము వెయ్యాలి. దానిమీద గంధముతో బాటు చారు లేదా ముద్రను ఉంచాలి. నేతితో చేసిన తొమ్మిది దీపములను రత్నమంత్రముతో గానీ మూల మంత్రముతో గానీ ఒకొక్క దీపమును మస్తకము మీద ఉంచి అష్టదళ పద్మము పైన ఉంచాలి. మోకాళ్లమీద నిలబడి రెండు చేతులతోనూ ఆ పాత్రను పట్టుకొని “సమస్త చక్రచక్రేశీయుతే దేవీ నవాత్మకే| ఆరార్తికమిదం దివ్యం గృహాణ మమ సిద్ధయే|” అను మంత్రమును ఉచ్చరిస్తూ దేవి చుట్టూ ఆ దీపములను తిప్పాలి. చివర సమస్త విఘ్నముల శాంతి కొరకు ధ్యానము చెయ్యాలి. ఆ పాత్రను ఎడమవైపున ఉంచాలి.