సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

31, జులై 2020, శుక్రవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - ద్వితీయశ్వాస - 12


మంత్రదోషముల శమన ఉపాయము

మంత్రదోషములను తెలుసుకొని ఆ దోషములను గురువు క్రమముగా పరిహారము చెయ్యాలి. అలా చేయకపోతే గురుశిష్యులిద్దరూ అల్పకాలంలోనే నాశనమవుతారని తంత్రరాజమునందు చెప్పబడినది. శివుడు చెప్పుచున్నాడు - కనుక, హేదేవీ! ఆ దోషములను నాశనము చేయు ఉపాయమును ధ్యానపూర్వకముగా వినుము. 

24, జులై 2020, శుక్రవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - ద్వితీయశ్వాస - 11


ఇపుడు ఈ సంస్కారములను విస్తారముగా వివరించబడుచున్నవి.

1. జనన: మారేడు లేదా చందనాదిపీఠము మీద కుంకుమాదులతో పాంచభౌతిక చక్రమును లిఖించి దానిమీద అ నుండి క్ష వరకు మాతృకలను లిఖించి వాటిలో మాతృకా సరస్వతిని ఆహ్వానించి, పూజించి, మాతృకలను 108 సార్లు జపము చేసి, వాటి మధ్యన సాధకుని అభీష్టమంత్రము యొక్క స్వర-వ్యంజన-బిందు-విసర్గ సంయుక్తాక్షరములను వేరువేరుగా ఉద్ధారము చేసి గురువు ఉపదేశించిన మంత్రమును జపము చేయుట జననము.

21, జులై 2020, మంగళవారం

మహామనుస్తవం 2



2.    యా శైశవాత్ ప్రభృతి నఃసంకటబహులేషు సంశయపదేషు|
       అవిదితమథవా విదితం పాతాత్ పాతి స్మ గంతుమిహ గమ్యమ్||

మనకు తెలిసినా, తెలియకున్నా మన చిన్నతనము నుండి మనకు కలిగే కష్ట, నష్ట, దుఃఖాలనుండి ఆమె మనలను క్రిందపడకుండా కాపాడుతూనే ఉండి మన గమ్యమునకు చేరుటకు సహకరిస్తూనే ఉన్నది.

17, జులై 2020, శుక్రవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - ద్వితీయశ్వాస - 10



మంత్రములను దోషరహితము చేయు విధానము

శారదాతిలకతంత్రము ప్రకారము, మంత్రముల దోషములను, మంత్రమును ఆత్మతో జోడించి కుంభకంలో యోనిముద్రను బంధించి శుద్ధము చెయ్యాలి.

యోనిముద్రాలక్షణం
రుద్రయామల భైరవీపటలమునందు ఈ విధంగా చెప్పబడినది-

10, జులై 2020, శుక్రవారం

మహామనుస్తవం 1



              ఆర్యా మాతరమాద్యాం త్రిభువనసంతానయోగసౌభాగ్యాం|
              ఆదిపురేశ్వరమాహిషీం లలితాం శ్రీత్రిపురసుందరీం వందే||

పార్వతి, మొట్టమొదటి తల్లి, మూడుపురముల వాస్తవ్యులు తన సంతానముగా సౌభాగ్యం గల ఆదిపురీశ్వర పట్టపురాణి అయిన శ్రీ లలితామహాత్రిపురసుందరికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.

ఇక్కడ ఆర్యా శబ్దంతో ఈ సూత్రాలను సాధకోత్తముడు ప్రారంభించెను. ఆర్యా అనగా పార్వతి, పదునారేండ్లప్రాయము కలది, పూజ్యస్త్రీ అని అర్ధము. అమ్మ నిత్య షోడశప్రాయయే కదా. అందుకే ఆమె మంత్రము కూడా షోడశివర్ణములు గలది.

ఆర్య అనునది వేద వాక్యము. ఈ పదమునకు, తీవ్రముగా, నిరంతరముగా పట్టుదలతో జ్ఞానమనే మార్గములో పయనిస్తూ అజ్ఞానమనే చీకట్లను నిర్దాక్షిణ్యంగా పాలద్రోలే శక్తియని అంతరార్ధము. శ్రీమహాత్రిపురసుందరియే ఆర్యా రూపంలో తన సాధకులను ప్రతికూలమైన సాధనా వ్యతిరేకతలనుండి రక్షించి అజ్ఞాన చీకట్లనుండి బయటకు తీసుకు వచ్చి జ్ఞానమనే కిరణములను ప్రసాదించును.

సంతానం అనగా విస్తరించడము, వ్యాపించడము మరియు సంతతి. శ్రీమాత మూడులోకములందునూ వ్యాపించిఉన్నది. ఆయా లోకములందున్న అన్ని జీవరాశులను ఆమె తన సంతానముగా కాపాడుచుండును. సంతానము లేకపోతే తల్లే ఉండదు. కనుక మూడులోకములందున్న జీవరాశులు ఆమె సంతానముగా ఉండడం ఆమె సౌభాగ్యం. ఇక్కడ మనం గమనించవలసిన విశేషం ఏమనగా, తల్లి తన సంతానాన్ని ఎల్లప్పుడూ కాపాడుతూనే ఉంటుంది. క్రమశిక్షణా మార్గంలో ప్రవర్తించడం సంతానం బాధ్యత. కనుక, అజ్ఞానంధకారంలో మునిగిపోయిన సంతానం, తన తల్లిని చేరుకోవడానికి ప్రయత్నించడమే సౌభాగ్యము. ఆ ప్రయత్నా సాధననే సౌభాగ్య విద్య అంటారు.

ఆదిపురము అనునది నేటి చెన్నై మహానగరమునకు దగ్గరలో ఉన్న తిరువొత్తియూర్ అను నగరమునకు పేరు. శ్రీకపిలశాస్త్రిగారు ఈ నగర వాస్తవ్యులు. ఈనగరములో ఉన్న దేవీ దేవతలు శ్రీ లలితా మహాత్రిపురసుందరి మరియు ఆమె విభుడు ఆదిపురేశ్వరుడు.

ఇక్కడ విశేష రహస్యము చూద్దాము. ఆది అనగా మూలము అని అర్ధము. అదియే మూలాధారము. అందు ఉండు శక్తి కుండలిని. ఈ కుండలినీ శక్తియే శ్రీ మహాత్రిపురసుందరి. మూలాధారమున హస్తిమీద స్వయంభూ శివలింగము, దానిని మూడున్నర చుట్లు చుట్టుకొని కుండలినీ శక్తి ఉంటుంది. ఆ పురమునకు ఆ లింగమే ఈశ్వరుడు. త్రిపురసుందరి పట్టపురాణి. ఇక్కడ ఈశ్వర శబ్దమును బ్రహ్మ సంకేతంగా అర్ధంచేసుకోవాలి. కనుకనే ఆదిపురేశ్వరమాహిషీం అని స్తుంతించారు. ఇక్కడ మూలాధార సాధన రహస్యమును ఉటంకించబడినది.

7, జులై 2020, మంగళవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - ద్వితీయశ్వాస - 9


రెండువేల వర్ణముల మంత్రము, నూరు-నూరు అక్షరముల మంత్రము ఖండస్తోత్రము అవుతుంది. ఈ మంత్రమును యథాస్థితముగా ఇవ్వవలసిఉంటుంది. ఈ ప్రకారముగా విద్యను, కామ్య కర్మములను తెలుసుకోవాలి. ఈ దోషములను తెలుసుకోకుండా ఏ మూర్ఖుడు జపము చేస్తాడో అతడికి నూరుకల్పముల దాకా సిద్ధి కలగదు.

శ్రీవిద్యారణ్యస్వామి చెబుచున్నారు - శ్రీమదారాధ్య ముఖమునుండి ప్రాప్తమైన శ్లోకములకు అర్ధమును ఇక్కడ పొందుపరస్తున్నాను.

3, జులై 2020, శుక్రవారం

మహామనుస్తవం - ఉపోద్ఘాతం



కస్మైదేవాయ హవిషా విధేమ - అనునది వేదవాక్యం. ఏ దేవునికి హవిస్సులు సమర్పించాలని పూర్వమున ఋషులు ప్రశ్నవేశారు. ఈ చరాచర జగత్తు అంతటినీ ఒక దైవ శక్తి ఆవరించి ఉందని విశ్వాసం కలిగిన భక్తునికి ఈ దేవుడు ఆ దేవుడని ఆలోచన గాని భేదభావం గాని ఉండదు. సూక్ష్మ ప్రపంచములో ఎన్నో శక్తులు సాధకుడిని అనుగ్రహించడానికై ఉన్నాయి. వాటిలో కొన్ని దిగువస్థాయి శక్తులు మరియు ఉన్నత స్థాయి శక్తులు ఉంటాయి. దిగువ స్థాయి శక్తులు సాధకుని చిన్న చిన్న కోరికలు తీరుస్తూ వారిని ఒక రకమైన మాయా ప్రపంచంలోకి తీసుకొని పోయి, ఏదో గొప్ప సాధనాభివృద్ధి కలిగినట్టు భ్రాంతిని కలగచేసి చివరికి అతడిని నాశనం చేస్తాయి. ధర్మగుణముగల, దయాళువులైన దేవతలు మాత్రము సాధకుడిని సాధనామార్గములో నిలకడగా అభివృద్ధి పరుస్తూ, భద్రముగా, సురక్షితముగా అతడికి నిజమైన బ్రహ్మతత్త్వమును తెలియపరచుతాయి. ఈ చరాచర ప్రపంచమంతా దేవుళ్ళు మరియు దేవతలతోనే సంపూర్ణముగా నిండి ఉంది. విశ్వమును ఒక పిరమిడాకృతిగా భావిస్తే ఆ ఆకృతిలో ఆయా దేవతలు ఒక వరస క్రమంలో ఉంటారు. ఆ ఆకృతికి పైన ముఖ్యమైన - సత్యమే ప్రధాన లక్షణమైన, ఉపనిషత్తులచే బ్రహ్మముగా తెలుపబడిన ప్రధాన దేవతలు ఉంటారు. ఏ  ఆధ్యాత్మిక శిక్షణలు/ ఉపదేశములు/ క్రమశిక్షణలు/ సాధనలు ఒక సాధకుడిని ఆ ప్రధాన దేవతల దగ్గరికి తీసుకొని వెడతాయో ఆ ఆధ్యాత్మిక సాధనలనే బ్రహ్మవిద్యలు అని అంటారు. ఈ విద్యలను మహావిద్యలని, సిద్ధవిద్యలని అంటారు.

       ఏ పరమ సర్వశ్రేష్ట దైవీ శక్తి కలదో ఆ శక్తిని తంత్రములు దశమహావిద్యలుగా వర్గీకరించాయి. ఈ దశమహావిద్యలలో మూడవదే శ్రీవిద్య. ఈ విద్యాధిష్టాన దేవతయే త్రిపురసుందరి. త్రిపురసుందరి అనగా మూడు పురములకు (లోకములకు) సాటిలేని అద్భుత సౌందర్యము కలదని అర్ధము. అయిదవ విద్య అయిన త్రిపురభైరవి మరియు పదవవిద్య అయిన శ్రీకమలాత్మిక విద్యలకు మరియు శ్రీవిద్యకు కొన్ని దగ్గర పోలికలు ఉండడం వలన ఆ విద్యలను కూడా శ్రీవిద్యలని అంటారు. ఈ వ్యాసములందు త్రిపురసుందరీ విద్య అయిన శ్రీవిద్యగురించి చర్చించబడుతోంది.

                                                                                                                                        ఇంకావుంది

2, జులై 2020, గురువారం

మహామనుస్తవం - పరిచయం


పరిచయం:

మహామనుస్తవం అను ఈ అద్భుత శ్రీవిద్యాసూత్రములు/స్తుతులను శ్రీ టి.వి.కపిలశాస్త్రి గారు రచించారు. దీనిని ఈ మహానుభావుడు తన అరవై ఏట రచించేను. ఇందు ఈయన శ్రీవిద్యయొక్క మహిమస్తోత్రమును ప్రకటించెను. ఈయన తన చిన్నతనముననే తన తండ్రిగారిచేత శ్రీవిద్యలోకి ప్రవేశింపబడెను. ఆతర్వాత ఈయన సిద్ధపురుషులైన శ్రీ భగవాన్ రమణమహర్షి  వారి శిష్యులైన మహాశక్తి ఉపాసకులు శ్రీ ఆయలసోమయాజుల గణపతిముని గారి దగ్గర శిష్యరికం చేసి శక్తి ఉపాసనలో మరింత ఆధ్యాత్మిక పురోగతి సాధించెను. ఆ తర్వాత ఈయన మరొక మహానుభావులైన శ్రీ అరబిందో వారి దగ్గర శిష్యరికం చేసి యోగవిద్యను కూడా అభ్యసించెను.

మహామనుస్తవం ఉత్త శ్రీవిద్యా స్తుతి మాత్రమే కాదు. ఇందు విశేషముగా శ్రీమహాత్రిపురసుందరిని అభివ్యక్తీకరించి ఆమెను చేరు మార్గమును విస్పస్టముగా విశదీకరించెను. ఈ సూత్రాలను సాహిత్యదృష్టితో చూస్తే రహస్యములు తెలుసుకోలేము. ఒక స్థాయి సాధకులు మాత్రమే ఈ సూత్రాలలో దాగున్న అద్భుత శ్రీవిద్యా రహస్యములను అవగతం చేసుకోగలరు.

నాకున్న మిడిమిడి జ్ఞానంతో ఈ సూత్రాలకు తెలుగులో అర్ధం చెప్పడానికి సాహసిస్తున్నాను. ఈ సూత్రాలకు ఆంగ్ల భాషలో నాకు లభ్యమైన భాష్యమును నేను ప్రామాణికంగ తీసుకొని వాటిని అనువదిస్తున్నాను. ఆంగ్లలో ఉన్న భాష్యమునకు నా సాధనానుభవముతో మరికొన్ని విషయములు జతపరచి ఔత్సాహికులకు అందించడానికి ప్రయత్నిస్తున్నాను. శ్రీమాత, సాధకులు, పండితులు నన్ను సహృదయంతో ఆదరించి ఆశ్వీరదిస్తారని భావిస్తున్నాను మరియు ప్రార్ధిస్తున్నాను. ఇందులో తప్పులకు నా పాండిత్య లోపమే గాని మరొక కారణం కాదని సవినయంగా విన్నవించుకొంటున్నాను. నా ఊపిరి అయిన పరమేశ్వరికి, పరమపూజ్యులైన నా తల్లిదండ్రులు మరియు నా శ్రీవిద్యా గురువులకు సాష్టాంగప్రణామములు సమర్పిస్తూ ఈ భాష్యమును ప్రారంభిస్తున్నాను.

                                          శ్రీమాత్రేనమః