సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

27, ఫిబ్రవరి 2023, సోమవారం

శ్రీదక్షిణామూర్తి సంహిత 52-53

 

యాభైరెండవ భాగము

జ్వాలామాలినీనిత్యావిధివివరణం

మంత్ర స్వరూపము:

ఓం నమో భగవతి జ్వాలామాలిని దేవి సర్వభూతాంతసంహారకారికే జాతవేదసి జ్వలంతి జ్వల జ్వల ప్రజ్వల ప్రజ్వల హుం హుం రం రం హూం ఫట్|

ఈ విద్య పురుషార్థ ప్రదాయిని. 48 వర్ణముల ఈ మంత్రమును స్వర్ణపటలము మీద లిఖించాలి. ఋషి – కశ్యప| ఛందస్సు – గాయత్రి| దేవత – జ్వాలామాలిని| ర – బీజం| ఫట్ – శక్తిః| హుం – కీలకం| రవి = 12, సూర్య =12, శరములు = 5, ఋషులు = 7, అష్టమాతృకలు = 8, వేదములు = 4 – వీనితో షడంగన్యాసం చెయ్యాలి.

యంత్రము: 44 పద్మపత్రము, దీనికి బయట అష్టదళము, దీనికి బయట భూపురము

కర్ణికలో మహావిద్యను, దళములలో క్రమంగా దుర్గా నవవర్ణములను లిఖించాలి. అష్టపత్రములలో రెండేసి స్వరములను లిఖించాలి. ఈ మండలమును అగ్నివర్ణముతో వేష్టితము చెయ్యాలి. భూపురములో విద్యా ప్రదక్షిణ క్రమంలో పూజ చెయ్యాలి. జాతవేదసే సునవామ సోమమరాతీయతోనిదహాతివేదః| సనఃపరుషదతిదుర్గాని విశ్వా నావేవసింధుమ్ దురితాత్యగ్నిః| అను మహామంత్రమును లిఖించాలి. ఈ దుర్గ అగ్నిస్వరూపిణి. ఈ యంత్రములో సమాసీన జ్వాలామాలను లిఖించాలి. ముందుగా పీఠమును అర్చించి, ఎనిమిది దిక్కులందు మరియు మధ్యన శక్తులతో బాటుగా జయా, విజయా, భద్రా, భద్రకాళీ, సుముఖీ, దుర్ముఖీ, వ్యాఘ్రముఖీ, సింహముఖీ, దుర్గలను పూజించాలి. మళ్ళీ దేవిని ఆవాహన చేసి పూజించాలి. ముందుగా అంగదేవతలను పూజించాలి. ఆ తర్వాత 44 దళములలో జాగతీ, తపనీ, వేదగర్భా, దహనరూపిణీ, సేందుఖండా, శుభాద్యా, హంత్రీ, నతముఖీ, వాగీశ్వరీ, మదరుహా, సోమరూపా, మనోజవా, మరుద్వేగా, రాత్రి, తీవ్రకోప, యశోవతీ, తోయాన్వితా, నిత్యా, దయావతీ, హారిణీ, తిరస్క్రియా, వేదమాతా, మదనప్రియా, నందినీ, పరా, రిపుమర్దినీ, షణ్ముఖీ, దండినీ, నిగ్మా, దుర్గా, గాయత్రీ, నిరవద్యా, విశాలాక్షీ, శ్వాసోద్వాహా, నందినీ, వేదనా, వహ్నిగర్భా, సింహవాహా, ధూమ్రా, దుర్వహా, రిరంసా, తాపహారిణీ, త్యక్తదోషా, సంపన్నా. వీరిని పూర్వాదిగా పూజించాలి.

      అష్టదళములో అష్టమాతృకలను, భూపురములో దిక్పాలకులను పూజించాలి. మళ్ళీ దేవిని పూజించాలి.

దేవీ స్వరూపము ఈ క్రింది విధంగా ఉంటుంది.

పునర్దేవీం సమభ్యర్చ స్వర్ణాభరణభూషితాం|

ఉద్యద్విద్యుల్లతాకాంతి స్వర్ణాంశుకవిరాజితాం||

మహాసింహాసనే ప్రౌఢాం జ్వాలామాలాకరాలినీ|

అరిశంఖ ఖడ్గఖేటే త్రిశూలం డమరుం తథా||

పానపాత్రం చ వరదం దధతీం సంస్మరన్ యజేత్|

ఈ జ్వాలామలినీ విద్య శత్రువులను నశింపచేయును. ఇందులో సంశయము లేదు.

ఇది శ్రీదక్షిణామూర్తి సంహితకు విశాఖ వాస్తవ్యులు, కౌండిన్యస గోత్రికులు, శ్రీఅయలసోమయాజుల పాలబాబు (సుబ్బారావు) గారు మరియు శ్రీమతి సాయిలీల దంపతుల ద్వితీయపుత్రుడు మరియు హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ ప్రకాశానందనాథ (శ్రీశ్రీశ్రీ శ్రీపాద జగన్నాధస్వామి) గారి శిష్యుడు భువనానందనాథ అను దీక్షానామము కలిగిన అయలసోమయాజుల ఉమామహేశ్వరరవి తెలుగులోకి స్వేచ్ఛానువాదము చేసిన జ్వాలామాలినీనిత్యావిధివివరణం అను యాభైరెండవ భాగము సమాప్తము.

యాభైమూడవ భాగము

విచిత్రానిత్యావిధివివరణం

ఇప్పుడు విశ్వమతా విచిత్రా మహాదేవీ వర్ణన చెయ్యబడుచున్నది. ఈ విద్యను స్మరించిన మాత్రముననే మహావిపత్తులు దూరమైపోతాయి.

మంత్రము: లౌం (?)

ఋషి – బ్రహ్మా| ఛందస్సు – గాయత్రి| దేవత – విచిత్ర| క – బీజం| చ – కీలకం| ఓం – శక్తిః| ఈ విద్య పురుషార్థములను ప్రసాదించును. ఆరు దీర్ఘ స్వరములతో షడంగన్యాసం చెయ్యాలి.

యంత్రము: అష్టదళము, భూపురము

యంత్రమధ్యలోకి దేవిని ఆహ్వానించి పూజించాలి. అష్టదళములో అష్టమాతృకలను, భూపురములో దిక్పాలకులను పూజించి మళ్ళీ దేవిని పూజించాలి. మంత్రమును 12 లక్షలు జపించి అందులో దశాంశము నెయ్యి, తిలలు, యవలు (=సజ్జలు)తో హోమము చెయ్యాలి. స్తంబన కార్యములో ఈ దేవి పసుపువర్ణములోను, వశీరణ కార్యములో బంధూక వర్ణములోను, మారణ కార్యములో కృష్ణ వర్ణములోను, ఉచ్చాటన కార్యములో ధూమ్ర వర్ణములోనూ ఉండును. జ్ఞానము ప్రసాదించు సమయంలో శ్వేతవర్ణములో నిత్య విచిత్ర వస్త్రములు ధరించి ఉండును. ఈమె తిలకము మరియు విచిత్ర పుష్పములతో దేదీప్యమానంగా ఉండును. వరద, అభయ ముద్రలు కలిగి అనేక శస్త్రములను ధరించి ఉండును.

ఇది శ్రీదక్షిణామూర్తి సంహితకు విశాఖ వాస్తవ్యులు, కౌండిన్యస గోత్రికులు, శ్రీఅయలసోమయాజుల పాలబాబు (సుబ్బారావు) గారు మరియు శ్రీమతి సాయిలీల దంపతుల ద్వితీయపుత్రుడు మరియు హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ ప్రకాశానందనాథ (శ్రీశ్రీశ్రీ శ్రీపాద జగన్నాధస్వామి) గారి శిష్యుడు భువనానందనాథ అను దీక్షానామము కలిగిన అయలసోమయాజుల ఉమామహేశ్వరరవి తెలుగులోకి స్వేచ్ఛానువాదము చేసిన విచిత్రానిత్యావిధివివరణం అను యాభైమూడవ భాగము సమాప్తము.

16, ఫిబ్రవరి 2023, గురువారం

శ్రీదక్షిణామూర్తి సంహిత 50-51

 

యాభైవ భాగము

విజయానిత్యావిధివివరణం

మంత్ర స్వరూపము: హ్స్ఖ్ఫ్రేం విజయాయై నమః

ఋషి – ఈశ్వర| ఛందస్సు – గాయత్రి| దేవత – విజయా| హ్రీం – బీజం| నమః – శక్తిః| క్లీం – కీలకం| హ్రాం, హ్రీం, హ్రూం, హ్రైం, హ్రౌం, హ్రః – షడంగన్యాసం|