సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

26, ఆగస్టు 2022, శుక్రవారం

20, ఆగస్టు 2022, శనివారం

పరాషోడశీ శ్రీచక్ర పూజా విధి

 

పరాషోడశీ శ్రీచక్ర పూజా విధి

షోడశీ మంత్రములు ముఖ్యముగా అయిదు విధములు. అవి రమా షోడశీ, పరా షోడశీ, కామాది షోడశీ, వామాది షోడశీ, శక్త్యాది షోడశీ. ఈ షోడశీ మంత్రముల ఆవరణ దేవతలు వేరువేరుగా ఉంటారు. ఆయా దేవతల పూజ శ్రీచక్రము లోనే నవావరణ పూజగా చెయ్యాలని కులాగమములో చెప్పబడినది. ఈ రోజుల్లో శ్రీచక్ర పూజ అంటే ఖడ్గమాల స్తోత్రంలో స్తుతించబడిన దేవతల ఆరాధన గానే చాలా మందికి తెలుసు. కానీ అదే శ్రీచక్రం లో షోడశీ మంత్ర భేదమును బట్టి ఆవరణ దేవతలు మారుతారు. 

షోడశీ ఉపాసకులకు మరియు ఔత్సాహికులకు ఈ పూజా విధానము అందుబాటులోకి ఉండాలనే సంకల్పంతో ఈ పుస్తకంలో పరా షోడశీ నవావరణ పూజా విధానం ఇవ్వడం జరిగింది. ఈ పూజా విధానం సంప్రదాయ శ్రీచక్ర పూజా విధంగానే ఉంటుంది. ఉపాసకుల సౌకర్యార్థం మిగతా షోడశీ ఆవరణ దేవతల వివరాలు ఈ పుస్తకం చివర్లో ఇవ్వబడ్డాయి. ఆయా మంత్రాలతో పూజ చేసుకోదలచిన వారు ఆయా దేవతలను మార్చుకోవాలి.

ఈ పుస్తకం కొరకు ఇక్కడ క్లిక్ చెయండి devullu.com  

16, ఆగస్టు 2022, మంగళవారం

శ్రీదక్షిణామూర్తి సంహిత - 36

 

ఘటార్గళయంత్రసాధనవివరణం

ఈశ్వరుడు చెప్పుచున్నాడు – హే ప్రియే! బిందు నాద కళతో యుక్తమైన ముఖవృత్తము (ఆ) ను పాశము అని అంటారు. కామ (క), అగ్ని, (ర), తార (ఓం)లతో యుక్తమైన అంకుశమును క్రోం అంటారు. ఈ రెండింటి మధ్య హ్రీం ను చేర్చి సురేశ్వరిని పూజించాలి. మంత్ర స్వరూపము “ఆంహ్రీంక్రోం”. దీనినే ఘాటార్గలోద్దారము అని అంటారు. వృత్తము, రెండు భూపురముల సంయోగముతో అష్టకోణము నిర్మించాలి. ఆ అష్టకోణముల అగ్రభాగమున రేఖలను సాగదీయాలి. అప్పుడు రెండు రేఖలతో ఒక సుందరమైన అర్గళము (=ద్వారము, గడియ) ఏర్పడుతుంది. మొదటి అర్గళము ఎంత పరిమాణంలో ఏర్పడుతుందో మిగతావి కూడా అంతే పరిమాణంలో ఏర్పరచాలి. ఆ తర్వాత చంద్రబింబము వంటి సుందరమైన ఒక బింబమును (వృత్తమును) నిర్మించాలి. మళ్ళీ రేఖలను సాగదీసి ఉత్తమ వృత్తమును నిర్మించి క్రమంగా రెండు అష్టకోష్టములను నిర్మించాలి. ఇది ఎలా చేయాలంటే 16 కేసరములు స్పష్టంగా కనిపించాలి. దీని అగ్రభాగము ఎంత సుందరముగా ఏర్పరచగలమో అంత సుందరముగా దానిని ఏర్పరచాలి. ఇది త్రిలోకములను ఆకర్షించబడును.