సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

22, ఏప్రిల్ 2022, శుక్రవారం

శ్రీదక్షిణామూర్తి సంహిత - 31

 

అన్నపూర్ణావిధివివరణం

దేవి అడుగుచున్నది - హే దేవేశ! మీరు ఐదు పంచ మహావిద్యలను సూచనప్రాయంగా చెప్పారు. కానీ వాటి ప్రకాశ వివరణ చేయలేదు. నామీద దయ ఉంచి అది తెలుపవలసిందిగా కోరుచున్నాను.

19, ఏప్రిల్ 2022, మంగళవారం

షడధ్వములు

షడధ్వములు

శైవిజం ప్రకారము ఈ జగత్తు అంతా మూడు విధములు. ఇది మూడు మార్గములలో (=అధ్వము) కల్పించబడినది. స్థూల, సూక్ష్మ, పరా అనేవి ఈ మూడు మార్గములు. స్థూల మార్గమును భువనాధ్వ, సూక్ష్మ మార్గమును తత్త్వాధ్వ, పరా మార్గమును కళాధ్వ అని పిలుస్తారు. ఇక్కడ మార్గమునకు రెండు రకముల అర్ధములు కలవు. ఒకటి ఆ మార్గములో నడుచుట లేదా ఆ మార్గమును వదలివేయుట. మార్గమును వదలివేయుట అన్నది పరమాత్మ కరుణ వల్ల మాత్రమే సాధ్యము. ఎప్పుడైతే ఆ కరుణను సాధించి మార్గమును జయిస్తామో (వదలివేస్తామో) అప్పుడు పరమశివ స్థితికి చేరుకుంటాము.

12, ఏప్రిల్ 2022, మంగళవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - ఎనిమిదవశ్వాస - 3

 

15.     అష్టాత్రింశత్కళాన్యాసం

ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌంహాం – ఈశానాయ నమః అంగుష్ఠయోః|

ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌంహైం – తత్పురుషాయ నమః తర్జన్యోః|

ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌంహూం – అఘోరాయ నమః మధ్యమయోః|

ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌంహీం – వామదేవాయ నమః అనామికయోః|

ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌంహం – సద్యోజాతాయ నమః కనిష్ఠికయోః|

2, ఏప్రిల్ 2022, శనివారం

శ్రీదక్షిణామూర్తి సంహిత - 30

 

కామేశ్వరీయజనవిధివివరణం

ఈశ్వరుడు చెప్పుచున్నాడు - హే మహేశానీ! ఇప్పుడు నీకు నేను విశ్వమాత, త్రైలోకములనూ ఆకర్షించునది, కుమారి భగవతి కామేశ్వరీ గురించి చెబుతాను.