దుర్గమమంతర్ధ్వాంత ప్రాకారం విహసితేన భిందంతీ|
ముఖమండలభా యస్యాః కురుతే స్వచ్ఛాంతరానిమానస్మాన్||
శ్రీమాత యొక్క అత్యద్భుతమైన చిరునగవు భేదింపశక్యము కాని గట్టి
కోటవంటి మన అంతర అంధకారమును ధ్వంసం చేసి, ప్రకాశవంతమైన ఆమె ముఖ బింబము మన హృదయమును పరిశుద్ధము గావించుచున్నది.