సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

9, డిసెంబర్ 2023, శనివారం

భస్మధారణ విధి

 

భస్మధారణ విధి

(అగ్నిహోత్రము లేదా వివాహాగ్ని నుండి ఉత్నన్నమైన భస్మము లేదా ఆవు పిడకలను కాల్చగా వచ్చిన భస్మమును తీసుకొని శుభ్రమైన వస్త్రముతో జల్లెడపట్టించి కర్పూరాది సువాసితములు కలిపి ఆ భస్మముతో త్రిపుండ్రములను ధరించాలి. ఆ విధి ఈ క్రింది విధముగా ఉండును.)

14, నవంబర్ 2023, మంగళవారం

శ్రీమహాగణపతి చతురావృత్తి తర్పణ విధి

 

శ్రీ మాత్రే నమ:

శ్రీ మహాగణపతయే నమ:

శ్రీ గురుస్సర్వకారణ భూతాశక్తి:

సాధకుడు బ్రహ్మ ముహూర్తముననే నిద్రలేచి శ్రీగురుపాదుకలను స్మరించి ఇష్టదేవతను తన హృదమమునందు భావించి, స్మరించాలి. నిత్యకాలకృత్యములను పూర్తిచేసుకొని ధౌతవస్త్రములను ధరించి, సంధ్యావందనాది నిత్యకర్మలను ఆచరించాలి.

30, ఆగస్టు 2023, బుధవారం

శ్రీదుర్గా అష్టాక్షరీ అవరణ పూజా కల్పం

 

శ్రీదుర్గా అష్టాక్షరీ అవరణ పూజా కల్పం



మహాప్రకృతి స్వరూపమైన శ్రీదుర్గా దేవి సమస్త దేవీ దేవతాశక్తులు, తేజస్సులను కలిగి ఉంటుంది. దుర్గాదేవి సిద్ది కొరకు ఆమె యొక్క అయిదు శక్తులను పూజించాలని చెప్పబడినది. దుర్గాయాః పరమం తత్త్వం పంచరత్నేశ్వరీ మయం అని నానుడి. ఒక మంచి రోజున దుర్గా పంచరత్నేశ్వరీలను జపించాలి. శ్రీదుర్గా, సరస్వతి, శారికా, మాతంగి మరియు బగళాముఖి వీరిని దుర్గా పంచరత్నేశ్వరులని అంటారు. వీరి సమగ్ర సాధన వలన పురశ్చరణ ఫలము లభిస్తుంది. దుర్గాదేవి మంత్రములు ఏకాక్షరి, అష్టాక్షరి, ద్వాదశాక్షరి, జయదుర్గా, శూలినీ దుర్గా, వనదుర్గా ఇలా పలువిధములు. ఈమె ఆరాధన వలన శత్రుపీడ తొలిగి విజయం కలుగుతుంది. సకల గ్రహబాధలూ తొలగిపోతాయి. ఈమె ఆరాధన వలన అన్ని దుర్గతులూ నశిస్తాయి. ఈ పుస్తకములో శ్రీదుర్గాదేవి అష్టాక్షరీమంత్రానికి సంబంధించి సంపూర్ణ ఆవరణార్చన విస్తారంగా తెలుపబడినది. ఈ క్రమము శ్రీవిద్యా క్రమమునకు దగ్గరగా ఉంటుంది. పాతగ్రంథములను పరిశీలించి ఈ పుస్తకమును సంకలనం చేశాను. ఈ పూజా విధానములో కూడా పలు భేదములు కనబడుతున్నాయి. 


Get this book from visit this link devullu.com




21, ఆగస్టు 2023, సోమవారం

శ్రీబాలా మంత్ర సిద్ధి స్తవం

 

శ్రీబాలా మంత్ర సిద్ధి స్తవం

 

శ్రీమహాకాళ సంహితలో చెప్పబడిన శ్రీబాలా మంత్ర సిద్ధి స్తవం ఎంతో మహిమాన్వితమైనది. ఈ స్తవ పారాయణ వలన సాధకుని కామము నిర్మూలించబడి బాలా మంత్రం త్వరగా సిద్ధిస్తుందని ప్రతీతి. 

3, జులై 2023, సోమవారం

మాతృకాచక్రము

 మాతృకాచక్రము

       అక్షరముల సిద్ధాంతమే మాతృకాచక్రము. ఈ చరాచర జగత్తు అంతా భగవంతుడు అయిన శివుని ద్వారా సృష్టించబడినది అని సిద్ధాంతము ద్వారా నిరూపించబడుతుంది. అతడు తన ఇచ్ఛామాత్రముననే ఈ విశ్వాన్ని సృష్టించాడు. ఈ విశ్వమంతా అతని ప్రతిబింబము మాత్రమే.

31, మే 2023, బుధవారం

శ్రీదక్షిణామూర్తి సంహిత 65 (ముగింపు)

 

అరవైఅయిదవ భాగము

దమనకారోపణవిధివివరణం

 ఈశ్వరుడు చెప్పుచున్నాడు – ఈ క్రియను కూడా పవిత్రారోపణ క్రమంలోనే చెయ్యాలి. ఈ క్రియను ఆచరించుటకు చైత్రాది మూడు మాసములు మరియు శుక్లపక్షము ఉత్తమము. చైత్రము ఉత్తమం, వైశాఖం మధ్యమం, జ్యేష్ఠం అధమం. అష్టమీ, చతుర్దశీ, పౌర్ణమి తిథులలో అర్ధరాత్రి సమయంలో ముందుగా అధివాసము చెయ్యాలి. నాలుగు కల్పలతాదులతో బాటుగా ప్రథమ దమనమును ఆమంత్రితము చేసి “శివాప్రసాదసంభూత అన్న సన్నిహితో భవ| శివకార్యం సముద్దిశ్య ఛేత్తవ్యోసి శివాజ్ఞయా|” ఈ విధంగా ఆమంత్రణ చేసి రతి, కాములను పూజించాలి. ఆ తర్వాత సాధకుడు తనకు తానుగా గానీ, ఇతర మౌనుల ద్వారా గానీ పల్లవములు, మూలము సహితంగా తీసుకువచ్చిన దమనమును సర్వతోభద్ర కమలములో ఎడమవైపున స్థాపించాలి. ఆ తర్వాత ఎనిమిది అంగుళముల పొడవు, నాలుగు అంగుళముల వెడల్పు గల యంత్రమును స్థాపించి పూజించాలి. “ఓం హ్రీం రత్యై నమః” అను రతిమంత్రము మరియు “ఓం క్లీం కామాయ నమః” అను కామదేవ మంత్రముతో రతి, కామదేవులను పూజించాలి. దమనమును ఒక పవిత్ర పాత్రలో పెట్టి పూజించాలి.

18, మే 2023, గురువారం

శ్రీదక్షిణామూర్తి సంహిత 64

 పవిత్రారోపణవిధివివరణం

ఈశ్వరుడు చెప్పుచున్నాడు – పవిత్రారోపణ అనగా అనుష్ఠాన విధి. పవిత్రారోపణమును చేసినచో అన్ని కార్యములు ఫలించును (సత్యమవును) లేనిచో నిష్ఫలమవుతాయి. అన్యవిధులు చేసిన తర్వాత ఏ సాధకుడు ఈ కర్మను ఒక సంవత్సర కాలంలో చెయ్యడో అతడి పూర్వకర్మల ఫలమును దుష్ట గణములు బలవంతంగా అపహరించును. ఈ పవిత్రారోపణ కర్మకు ఆషాఢ మాసము ఉత్తమము. శ్రావణం మధ్యమం, భాద్రపదం హీనము. శుక్ల పక్షము ప్రశస్తము. కృష్ణ పక్షము లాభరహితము అవుతుంది. చతుర్దశీ, అష్టమి, పూర్ణిమ తిథులలో ఈ కర్మ చెయ్యాలి. రేశ్మీ సూత్రము (దారము) విశిష్టము. నూలు దారమును కూడా ఉపయోగించవచ్చును. ఈ సూత్రముకు తొమ్మిది రెట్లు గంగాజలముతో పశ్చిమాస్య మంత్రములతో సూత్రమును శుద్ధి చేసి ఆరబెట్టాలి. మంత్రోచ్చారణ చేస్తూ సుందరమైన పవిత్రమును తయారు చెయ్యాలి. 108అంగుళముల పవిత్రము శ్రేష్ఠము. 54అంగుళముల పవిత్రము మధ్యమము. 27అంగుళముల పవిత్రము కనిష్ఠము.

12, మే 2023, శుక్రవారం

శ్రీదక్షిణామూర్తి సంహిత 63

 

దీక్షాదూతీయజనవిధివివరణం

ఈశ్వరుడు చెప్పుచున్నాడు – ఇప్పుడు మూడులోకములలోనూ దుర్లభమైన దీక్షా విధానము తెలుపుచున్నాను. సావధానముగా వినుము.

9, మే 2023, మంగళవారం

శ్రీదక్షిణామూర్తి సంహిత 62

 

విద్యాప్రయోగబీజసాధనవిధివివరణం

ఈశ్వరుడు చెప్పుచున్నాడు – ఇప్పుడు చక్రరాజము యొక్క సాధన చెప్పబడుచున్నది. సిద్ధవిద్య వినియోగక్రమము ఈ విధంగా ఉండును.

5, మే 2023, శుక్రవారం

శ్రీదక్షిణామూర్తి సంహిత 61

జపహోమవివరణం

పార్వతి మహాదేవుడిని అడుగుచున్నాది – హే దేవ! మీరు హోమాదులను సంకేతమాత్రంగా సూచించారు. కానీ విస్తారంగా చెప్పలేదు. సాధకుల హితముకొరకు మరియు వారి సిద్ధి కొరకు హోమాదులను విస్తారంగా చెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నాను.

28, ఏప్రిల్ 2023, శుక్రవారం

శ్రీదక్షిణామూర్తి సంహిత 60

 

బలియజనవిధివివరణం

ఈశ్వరుడు చెప్పుచున్నాడు – ఆరు రుచుల యుక్త, కామధేను పాలు మొదలగు వాటితో పవిత్రించిన నైవేద్యమును పరశక్తికి అర్పించిన తర్వాత కర్పూర సహిత తాంబూలమును సమర్పించాలి. ఆ తర్వాత నిత్య హోమము చెయ్యాలి. ఆ తర్వాత యథాశక్తి జపము, స్తుతి చెయ్యాలి. సౌభాగ్య దేవతకు నమస్కరించి బంగారము-వెండి-కాంస్య పాత్రల్లో అష్టదళ పద్మము వెయ్యాలి. దానిమీద గంధముతో బాటు చారు లేదా ముద్రను ఉంచాలి. నేతితో చేసిన తొమ్మిది దీపములను రత్నమంత్రముతో గానీ మూల మంత్రముతో గానీ ఒకొక్క దీపమును మస్తకము మీద ఉంచి అష్టదళ పద్మము పైన ఉంచాలి. మోకాళ్లమీద నిలబడి రెండు చేతులతోనూ ఆ పాత్రను పట్టుకొని “సమస్త చక్రచక్రేశీయుతే దేవీ నవాత్మకే|  ఆరార్తికమిదం దివ్యం గృహాణ మమ సిద్ధయే|” అను మంత్రమును ఉచ్చరిస్తూ దేవి చుట్టూ ఆ దీపములను తిప్పాలి. చివర సమస్త విఘ్నముల శాంతి కొరకు ధ్యానము చెయ్యాలి. ఆ పాత్రను ఎడమవైపున ఉంచాలి.

20, ఏప్రిల్ 2023, గురువారం

శ్రీదక్షిణామూర్తి సంహిత 59

 

శ్రీవిద్యాయజనవిధివివరణం

ఈశ్వరుడు చెప్పుచున్నాడు – అగ్ని, ఈశాన, నైరుతి, వాయవ్య, దిశలకు మధ్యన అంగదేవతలను పూజించాలి. సాధకుడు తన గురుక్రమానుసారంగా పూజ చెయ్యాలి. భూపురము, షోడశారము, అష్టదళము – ఈ క్రమము సృష్టిచక్రము. శ్రీ, పరిజ్యోతి, ఆద్యా క్రమంలో పూజచెయ్యాలి. చతుర్దశారము, బహిర్దశారము, అంతర్దశారము – ఈ క్రమము స్థితిచక్రము. అష్టకోణము, త్రికోణము, బిందువు – ఈ క్రమము సంహార క్రమము. దీని యందు తృతీయ సకలను పూజించాలి. అనాఖ్యను సకల అని కూడా అంటారు. సాధకుడు తురీయ సకల విద్యల క్రమంలో కూడా పూజ చెయ్యాలి. ఈ ప్రకారంగా సాధకుడు సంపూర్ణ విద్యాసమూహములతో పూజ చెయ్యాలి. సాధకుడు శ్రీకోశసింహాసనస్థ, కల్పలతాత్మక, రత్నాత్మక, చతురాయతనాత్మక, చతురన్వయగంభీర – వీరందరినీ కూడా పూజించాలి. యాభై వర్ణముల శరీర త్రైలోక్యచక్రమున ప్రకట యోగినులు అనబడు దశసిద్ధులను పూజించాలి. ఈ సిద్ధులు అప్పుడే కాల్చబడిన బంగారు వర్ణములో ఉంది పాశ, అంకుశములను ధరించి ఉంటారు. చేతుల్లో కమలములు ధరించి పెద్ద పెద్ద భండారములలో బంగారములను, నిధులను తమ భక్తులకు ఇస్తారు.

11, ఏప్రిల్ 2023, మంగళవారం

శ్రీదక్షిణామూర్తి సంహిత 58

 

ధ్యానాదియజనవిధివివరణం

ఈశ్వరుడు చెప్పుచున్నాడు –

చక్రమును చందనము లేదా రక్తచందనము లేదా కమల పత్రముల మీద ఉంచాలి. మరోవిధంగా ఉంచరాదు. ఇంతకు ముందు చెప్పిన విధంగా న్యాసములు చేసిన తర్వాత బ్రహ్మాండమండలమును ధ్యానం చెయ్యాలి. ఆ మండలము పృథ్వీ,జలము, అగ్ని, ఆకాశము మరియు చైతన్యముల ప్రకాశికము. అది చతురస్రము, ధనుషాకార త్రికోణము. అది మేరుమండల నిరాలంబముగా చెప్పబడినది. దానిమీద వాగ్బీజ రూపి, భ్రమరముతో యుక్తమైన వ్యాపక చక్రము ఉంది. శ్రీ శాంభవ జ్ఞానములో పరావాక్, వనస్పతి సంబంధించిన దానిలో మధ్యమా, సర్వ జంతువులందు పశ్యంతి, జ్ఞానయోగినులందు వైఖరీ - వాక్కులు. ఈ ప్రకారంగా సహస్రదళ కమలము వాక్పదముతో సంపన్నము. దీని మీద పరమపీయూష ఆశ్రయమున చక్రము కలదు. ఆ చక్రము చతురస్రము, షోడశదళము, 64 దళములు,100 దళములు, 1000 దళములు, లక్ష దళములు, కోటి దళములు, ఆకాశతలముల మీద శోభాయుక్తముగా, దేదీప్యమానముగా ఉంటుంది. దాని కర్ణికాపీఠ మధ్యమున చక్రేశ్వరీ ధ్యానము చెయ్యాలి. ఆ చక్రము మహా షడధ్వ జనకము మరియు విశ్వతోముఖము, దేదీప్యమానము.

31, మార్చి 2023, శుక్రవారం

శ్రీదక్షిణామూర్తి సంహిత 57

 యజన న్యాస ముద్రా వివరణం

ఈశ్వరుడు చెప్పుచున్నాడు –

సాధకుడు మనస్సులో శ్రీవిద్యా మంత్రమును ధ్యానిస్తూ తన వామభాగమున ఒక చతురస్ర మండలమును నిర్మించాలి. ఆ మండలమును గంధ, పుష్ప, అక్షింతలతో పూజ చెయ్యాలి. ఆ మండలము మీద కారణము (=మద్యము), నీళ్ళతో నింపిన శంఖమును స్థాపించాలి. ఆ శంఖమును బాగా పూజించి దానితోనే త్రిపురామండలమును పూజించాలి. ఒక చతురస్రమును నిర్మించి దానిమీద యంత్రమును స్థాపించాలి. త్రికోణ, వృత్త, షట్కోణములు క్రమంగా పూజించాలి. సాధకుడు త్రికోణములో సామూహికంగా మరియు వేరువేరుగా పూజ చెయ్యాలి. షట్కోణములో రెండుసార్లు షడంగపూజ చెయ్యాలి. ఆద్యబీజము (=క్రీం) ద్వారా వహ్నిని యంత్రాకార రూపంలో అర్చించాలి.

26, మార్చి 2023, ఆదివారం

శ్రీలలితాచతుషష్ఠ్యుపచార మానస పూజ

 

శ్రీలలితాచతుషష్ఠ్యుపచార మానస పూజ

ఓం హ్యున్మధ్యనిలయే దేవి లలితే పరదేవతే

చతుషష్ఠ్యుపచారాంస్తే భక్త్యా మాతః సమర్పయే

కామేశోస్తంగనిలయే పాధ్యాం గృహ్ణీత్వ సాదరమ్

భూషణాని సముత్తార్య గంధతైలం చ తేఽర్పయే

స్నానశాలాం ప్రవిశ్యాథ తత్రత్యమణిపీఠకే

ఉపవిశ్య సుఖేన త్వం దేహోద్వర్తనమాచర

ఉష్ణోదకేన లలితే స్నాపయామ్యథ భక్తితః

అభిషించామి పశ్చాత్త్వాం సౌవర్ణకలశోదకైత

ధౌతవస్త్రప్రోంఛనం చారక్తక్షౌమాంబరం తథా

కుచోత్తరీయమరుణమర్పయామి మహేశ్వరి

తతః ప్రవిశ్య చాలోపమండపం శ్రీమహేశ్వరి

ఉపవిశ్య చ సౌవర్ణపీఠే గంధాన్ విలేపయ

కాలాగరుజధూపైశ్ఛ ధూపయే కేశపాశకమ్

అర్పయామి చ మాల్ల్యాదిసర్వర్తృకుసుమశ్రజః

భూషామండపమావిశ్య స్థిత్త్వా సౌవర్ణపీఠకే

మాణిక్యముకుటం మూర్ధ్ని దయయా స్థాపయాంబికే

శరప్తార్వణచంద్రస్య శకలం తత్ర శోభతామ్

సింధూరేణ చ సీమంతమలంకురు దయానిధే

భాలో చ తిలకం న్యస్య నేత్రయోరంజనం శివే

బాలీయుగలమప్యంబ భక్త్యా తే వినివేదయే

మణికుండలమయ్యంబ నాసాభరణమేవ చ

తాటంకయుగలం దేవి యావకంచాధారేఽర్పయే

ఆధ్యాభూషణసౌవర్ణచింతాకపదకాని చ

మహాపదకముక్తావల్యోకావల్యాదిభూషణమ్

ఛన్నవీరం గుహాణాంబ కేయూరయుగలం తథా

వలయావలిమంగుల్యాభరణం లలితాంబికే

ఓఢ్యాణమయ కట్యంతే కటిసూత్రం చ సుందరి

సౌభాగ్యాభరణం పాదకటకం నూపురద్వయం

అర్పయామి జగన్మాతః పాదయోశ్చంగులీయకమ్

పాశ వామేర్ధ్వహస్తే చ దక్షహస్తే తథాంకుశమ్

అన్యస్మిన్ వామహస్తే చ తథా పుండ్రేక్షుచాపకమ్

పుష్పబాణాంశ్చ దక్షాంధః పాణౌ ధారయ సుందరి

అర్పయామి చ మాణిక్యపాదుకే పాదయోః శివే

ఆరోహావృతిదేవీభిశ్చక్రం పరశివే ముదా

సమానవేశభూషాభిః సాకం త్రిపురసుందరి

తత్ర కామేశావామాంకపర్యంకోపనివేశినీమ్

అమృతాసవపానేన ముదితాం త్వాం సదా భజే

శుద్ధేన గంగాతోయేన పునరాచమనం కురు

కర్పూరవీటికామాస్యే తతోఽ౦బ వినివేశయ

ఆనందోల్లాసహాసేన విలాసన్ముఖపంకజామ్

భక్తిమత్కల్పలతికాం కృతి స్యాం త్వాం స్మరన్ కదా

మంగలారార్తికం ఛత్రం చామరం దర్పణం తథా

తాలవృన్తం గంధపుష్పధూపదీపాంశ్చ తేఽర్పయే

శ్రీకామేశ్వరి తప్తహాటకకృతైః స్థాలీసహస్రైర్భుతం

దివ్యాన్నం ఘృతసూపశాకభరితం చిత్రాన్నభేదైర్యుతమ్

దుగ్ధాన్నం మధశర్కరాదధియుతం మాణిక్యపాత్రార్పితం

మాషాపూపకపూరికాదిసహితం నైవేధ్యమంబార్పయే

సాగ్రవింశతిపాధ్యోక్తచతుషష్ఠ్యుపచారతః

హ్యున్మధ్యనిలయా మాతా లలితా పరితుప్యతు

ఇతి శ్రీమశ్చక్తియామలోక్తం మానసపూజనమ్

 

 

 

25, మార్చి 2023, శనివారం

శ్రీదక్షిణామూర్తి సంహిత 56

 

యాభైఆరవ భాగము

శ్రీవిద్యావివరణం

ఈశ్వరుడు చెప్పుచున్నాడు –

శివ (హ), చంద్ర (స), మన్మథ (క), ఉరస (య?), శక్తి (స), బిందుమాలినీ (క), క్షమా (ల), బిందు (హ), అర్ధమాత్రా (ఐం) – ఇవి నవవర్ణములు. శివశక్తిమయీ ఈ దేవి వ్యోమాకారములో ఉంటుంది. ఈ చిద్రూపి తనలో విశ్వమంతటినీ ఉంచుకొంటుంది. ఈమె అందరి లయ స్థానము. చంద్రుని ద్వారా ఈమె అందరినీ స్నానం చేయించ్చును. మూలాధారము నుండి బ్రహ్మరంధ్రము వరకు ఈమె స్థానము. ఈమె సంపూర్ణవిశ్వమును ఆప్లావితము చేసి విశ్వమాతలను సృజించును. మన్మథుని ద్వారా ఈమె మనోరూపి. అందువలన ఈమె తేజోమయి. సంపూర్ణ జగత్తును విస్తారము చెయ్యడం వలన ఈమెను విశ్వయోని అని అంటారు. అంతఃకరణ వృత్తిలో ఈమె విశ్వము యొక్క అంతర్మాతృకా అవుతున్నది. ఈమె నాదరూప పరాశక్తి మరియు పరబిందు రూప. ఈమె అంతర్మాయా రూపంలో ప్రసిద్ధము. విశ్వమును ధరించి ఉన్నది. అందువలననే ఈమె క్షమారూపము మరియు జగద్ధాత్రి అయినది. విచారము చేసినచో ఈమె నాదాతీతము, పరా అని తెలుస్తున్నది. ఈ ప్రకారం బ్రహ్మమయ వర్ణములతో త్రిపురామంత్రము జ్ఞాపితమవుచున్నది.

8, మార్చి 2023, బుధవారం

శ్రీదక్షిణామూర్తి సంహిత 54-55

 

యాభైనాల్గవ భాగము

త్రిపురసుందరీవిధివివరణం

ఒక సర్వాత్మక శక్తి జాగ్రత్ అవస్థలో ఉండి శక్తిరూపమై సంసారత్రయ సృష్టిని చేస్తుంది. ఉత్పత్తి, జాగరణ, బోధ, మనః వ్యావృత్తి అను నాలుగు కళలు జాగ్రత్ అవస్థలో ఎల్లప్పుడూ ఉంటాయి. ఈమెనే త్రిపురా అని కూడా అంటారు. ఈ త్రిపుర తమస్సుతో యుక్తమైతే అప్పుడు శివరూప అని అంటారు. మరణ, విస్మృతి, మూర్ఛ, నిద్రా ఇవి సుషుప్తి కళలు. సుషుప్తి శివ స్వరూపిణి. ఎప్పుడైతే ఈ దేవి ద్వంద్వాత్మిక అవుతుందో అప్పుడు రజోరూప ఉభయాత్మిక అవుతుంది. సత్త్వ, తమముల సంయోగమును రజస్సు అంటారు. సుషుప్తి అంతములో అనగా జాగ్రత్ ఆదికాలంలో రజోమయి స్వప్నావస్థ ఉంటుంది. ఇందులో అభిలాషా, భ్రమ, చింతా మరియు చిత్తము యొక్క స్ఫురణ ఉంటుంది.

27, ఫిబ్రవరి 2023, సోమవారం

శ్రీదక్షిణామూర్తి సంహిత 52-53

 

యాభైరెండవ భాగము

జ్వాలామాలినీనిత్యావిధివివరణం

మంత్ర స్వరూపము:

ఓం నమో భగవతి జ్వాలామాలిని దేవి సర్వభూతాంతసంహారకారికే జాతవేదసి జ్వలంతి జ్వల జ్వల ప్రజ్వల ప్రజ్వల హుం హుం రం రం హూం ఫట్|

ఈ విద్య పురుషార్థ ప్రదాయిని. 48 వర్ణముల ఈ మంత్రమును స్వర్ణపటలము మీద లిఖించాలి. ఋషి – కశ్యప| ఛందస్సు – గాయత్రి| దేవత – జ్వాలామాలిని| ర – బీజం| ఫట్ – శక్తిః| హుం – కీలకం| రవి = 12, సూర్య =12, శరములు = 5, ఋషులు = 7, అష్టమాతృకలు = 8, వేదములు = 4 – వీనితో షడంగన్యాసం చెయ్యాలి.

యంత్రము: 44 పద్మపత్రము, దీనికి బయట అష్టదళము, దీనికి బయట భూపురము

కర్ణికలో మహావిద్యను, దళములలో క్రమంగా దుర్గా నవవర్ణములను లిఖించాలి. అష్టపత్రములలో రెండేసి స్వరములను లిఖించాలి. ఈ మండలమును అగ్నివర్ణముతో వేష్టితము చెయ్యాలి. భూపురములో విద్యా ప్రదక్షిణ క్రమంలో పూజ చెయ్యాలి. జాతవేదసే సునవామ సోమమరాతీయతోనిదహాతివేదః| సనఃపరుషదతిదుర్గాని విశ్వా నావేవసింధుమ్ దురితాత్యగ్నిః| అను మహామంత్రమును లిఖించాలి. ఈ దుర్గ అగ్నిస్వరూపిణి. ఈ యంత్రములో సమాసీన జ్వాలామాలను లిఖించాలి. ముందుగా పీఠమును అర్చించి, ఎనిమిది దిక్కులందు మరియు మధ్యన శక్తులతో బాటుగా జయా, విజయా, భద్రా, భద్రకాళీ, సుముఖీ, దుర్ముఖీ, వ్యాఘ్రముఖీ, సింహముఖీ, దుర్గలను పూజించాలి. మళ్ళీ దేవిని ఆవాహన చేసి పూజించాలి. ముందుగా అంగదేవతలను పూజించాలి. ఆ తర్వాత 44 దళములలో జాగతీ, తపనీ, వేదగర్భా, దహనరూపిణీ, సేందుఖండా, శుభాద్యా, హంత్రీ, నతముఖీ, వాగీశ్వరీ, మదరుహా, సోమరూపా, మనోజవా, మరుద్వేగా, రాత్రి, తీవ్రకోప, యశోవతీ, తోయాన్వితా, నిత్యా, దయావతీ, హారిణీ, తిరస్క్రియా, వేదమాతా, మదనప్రియా, నందినీ, పరా, రిపుమర్దినీ, షణ్ముఖీ, దండినీ, నిగ్మా, దుర్గా, గాయత్రీ, నిరవద్యా, విశాలాక్షీ, శ్వాసోద్వాహా, నందినీ, వేదనా, వహ్నిగర్భా, సింహవాహా, ధూమ్రా, దుర్వహా, రిరంసా, తాపహారిణీ, త్యక్తదోషా, సంపన్నా. వీరిని పూర్వాదిగా పూజించాలి.

      అష్టదళములో అష్టమాతృకలను, భూపురములో దిక్పాలకులను పూజించాలి. మళ్ళీ దేవిని పూజించాలి.

దేవీ స్వరూపము ఈ క్రింది విధంగా ఉంటుంది.

పునర్దేవీం సమభ్యర్చ స్వర్ణాభరణభూషితాం|

ఉద్యద్విద్యుల్లతాకాంతి స్వర్ణాంశుకవిరాజితాం||

మహాసింహాసనే ప్రౌఢాం జ్వాలామాలాకరాలినీ|

అరిశంఖ ఖడ్గఖేటే త్రిశూలం డమరుం తథా||

పానపాత్రం చ వరదం దధతీం సంస్మరన్ యజేత్|

ఈ జ్వాలామలినీ విద్య శత్రువులను నశింపచేయును. ఇందులో సంశయము లేదు.

ఇది శ్రీదక్షిణామూర్తి సంహితకు విశాఖ వాస్తవ్యులు, కౌండిన్యస గోత్రికులు, శ్రీఅయలసోమయాజుల పాలబాబు (సుబ్బారావు) గారు మరియు శ్రీమతి సాయిలీల దంపతుల ద్వితీయపుత్రుడు మరియు హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ ప్రకాశానందనాథ (శ్రీశ్రీశ్రీ శ్రీపాద జగన్నాధస్వామి) గారి శిష్యుడు భువనానందనాథ అను దీక్షానామము కలిగిన అయలసోమయాజుల ఉమామహేశ్వరరవి తెలుగులోకి స్వేచ్ఛానువాదము చేసిన జ్వాలామాలినీనిత్యావిధివివరణం అను యాభైరెండవ భాగము సమాప్తము.

యాభైమూడవ భాగము

విచిత్రానిత్యావిధివివరణం

ఇప్పుడు విశ్వమతా విచిత్రా మహాదేవీ వర్ణన చెయ్యబడుచున్నది. ఈ విద్యను స్మరించిన మాత్రముననే మహావిపత్తులు దూరమైపోతాయి.

మంత్రము: లౌం (?)

ఋషి – బ్రహ్మా| ఛందస్సు – గాయత్రి| దేవత – విచిత్ర| క – బీజం| చ – కీలకం| ఓం – శక్తిః| ఈ విద్య పురుషార్థములను ప్రసాదించును. ఆరు దీర్ఘ స్వరములతో షడంగన్యాసం చెయ్యాలి.

యంత్రము: అష్టదళము, భూపురము

యంత్రమధ్యలోకి దేవిని ఆహ్వానించి పూజించాలి. అష్టదళములో అష్టమాతృకలను, భూపురములో దిక్పాలకులను పూజించి మళ్ళీ దేవిని పూజించాలి. మంత్రమును 12 లక్షలు జపించి అందులో దశాంశము నెయ్యి, తిలలు, యవలు (=సజ్జలు)తో హోమము చెయ్యాలి. స్తంబన కార్యములో ఈ దేవి పసుపువర్ణములోను, వశీరణ కార్యములో బంధూక వర్ణములోను, మారణ కార్యములో కృష్ణ వర్ణములోను, ఉచ్చాటన కార్యములో ధూమ్ర వర్ణములోనూ ఉండును. జ్ఞానము ప్రసాదించు సమయంలో శ్వేతవర్ణములో నిత్య విచిత్ర వస్త్రములు ధరించి ఉండును. ఈమె తిలకము మరియు విచిత్ర పుష్పములతో దేదీప్యమానంగా ఉండును. వరద, అభయ ముద్రలు కలిగి అనేక శస్త్రములను ధరించి ఉండును.

ఇది శ్రీదక్షిణామూర్తి సంహితకు విశాఖ వాస్తవ్యులు, కౌండిన్యస గోత్రికులు, శ్రీఅయలసోమయాజుల పాలబాబు (సుబ్బారావు) గారు మరియు శ్రీమతి సాయిలీల దంపతుల ద్వితీయపుత్రుడు మరియు హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ ప్రకాశానందనాథ (శ్రీశ్రీశ్రీ శ్రీపాద జగన్నాధస్వామి) గారి శిష్యుడు భువనానందనాథ అను దీక్షానామము కలిగిన అయలసోమయాజుల ఉమామహేశ్వరరవి తెలుగులోకి స్వేచ్ఛానువాదము చేసిన విచిత్రానిత్యావిధివివరణం అను యాభైమూడవ భాగము సమాప్తము.