సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

27, నవంబర్ 2021, శనివారం

త్రికాల ఋగ్వేద సంధ్యావందనం

 త్రికాల ఋగ్వేద సంధ్యావందనం

మంత్రాలలో గాయత్రిని మించిన మంత్రము దేవతల్లో తల్లిని మించిన దైవము లేదని నానుడి. గాయత్రీ మంత్రోపాసన సంధ్యావందనంలో భాగము. కానీ మారుతున్న జనుల మనోచిత్తముల కారణంగా (దీనికి కాలమార్పు అని చెబుతున్నారు) సంధ్యోపాసన బాగా తగ్గింది. బుద్ధి వికసనమే ఈ మంత్ర ముఖ్య ఫలితం. మానవుని బుద్ధి సరైన దారిలో ప్రసరిస్తే అన్ని చోట్లా శాంతి పరిఢవిల్లుతుంది. తప్పుదారి పట్టిన మానవ బుద్ధి ఎప్పటికీ వినాశకమే అని అందరికీ తెలుసు. ఈ మంత్రోపాసకులకు మానసిక శాంతి, ధీరత్వం, జ్ఞానం, సుబుద్ధి మొదలగునవి ఎందువల్ల కలుగుతాయో అనుబంధంలో వివరించడం జరిగింది. కొన్ని పాత గ్రంథాల ఆధారంగా ఇందులో విషయాలను నేను సంకలనం చెయ్యడం జరిగింది. సంధ్యావందనము అన్ని వేదశాఖలూ మరియు తైత్తిరీయ ఉపనిషద్ ప్రకారం ఉన్నాయి. అయితే ఈ పుస్తకంలో ఋగ్వేద సంధ్యావందనం ఇవ్వబడినది. ఈ మధ్య అక్కడక్కడ దొరుకుతున్న పుస్తకాలలో గాయత్రీ మంత్ర స్వరం అన్ని శాఖలకూ ఒకటిగానే ఇవ్వబడుచున్నది. నిజానికి ఋగ్వేద గాయత్రీ మంత్ర స్వరంలో కించిత్ భేదం ఉంటుంది. ఈ పుస్తకంలో గాయత్రీ మంత్రస్వరమును ఋగ్వేద ప్రకారంగా ఇవ్వబడినది.శ్రీభువనేశ్వరీ ఆవరణార్చణా కల్పము

శ్రీభువనేశ్వరీ ఆవరణార్చణా కల్పము

          

భువనములకు అధిపతి భువనేశ్వరి హకారము, రేఫ, మాయ (ఈంకారము)లతో కూడి ఉన్నదే శక్తిప్రణవము అదే హ్రీంఇదియే భువనేశ్వరి సూక్ష్మ రూపము హ ఒక ధ్వని దీని నుండియే సమస్త జగత్తు ఉత్పన్నమవుతున్నది అందువలననే ఈమె భువనములకు అధిపతి అయినది ఈ తల్లి ఆరాధన వలన జ్ఞానము, మోక్షము కలుగుతాయి శ్రీవిద్యోపాసకులకు ఈమెను ఆరాధించడం ఎంతో ముఖ్యము ఇంతటి ఉత్కృష్టమైన ఈమె ఆరాధన అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి “శ్రీభువనేశ్వరీ ఆవరణార్చన కల్పము” అను ఈ పుస్తకమును నా శిష్యుడు భువనానందనాథుడు అయలసోమయాజుల ఉమామహేశ్వర రవి పూర్తిగా దక్షిణాచార సంప్రదాయంలో సంకలనం చేసి భక్తజనులకు, సాధకులకు అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేశాడు అతని ఈ ప్రయత్నాన్ని మంత్రవేత్తలు, సాధకులు అభినందింతురుగాక  

 

19, నవంబర్ 2021, శుక్రవారం

గురుపూజా పద్ధతి

 

శ్రీ మహాగణాధిపతయే నమః

శ్రీ లలితా మహా త్రిపురసుందర్యై నమః

శ్రీగురుస్సర్వకారణ భూతాశ్శక్తిః

 

సూచన – దేవికి ఎడమ వైపున సరళ రేఖాక్రమంలో మూడు కలశములను ఉంచి వాటికి పసుపు రాసి కుంకుమ అద్దిన మూడు కొబ్బరికాయలను ఉంచాలి. కొబ్బరి కాయల పీచు వెనుక వైపు ఉండునట్లుగా కొబ్బరికాయలను అమర్చాలి. ఆ కలశములందు ఎడమ నుండి కుడివైపుకు వరుసగా పరమేష్ఠిగురు, పరమగురు, స్వగురులను గురుత్రయ పాదుకా మంత్రములతో ఆవాహన చేయాలి. బ్రహ్మవిద్యా సంప్రదాయ గురుస్తోత్రమును పఠించాలి.

శ్రీదక్షిణామూర్తి సంహిత - 19

 

పశ్చిమామ్నాయ సింహాసనేశ్వరీవిద్యా విధివివరణం

ఈ మంత్ర స్వరూపము:

ఐంహ్రీంశ్రీం ఘోరే హ్స్ఖ్ఫ్రేమ్ హ్సౌం నమో భగవతి ఓం హ్స్ఖ్ఫ్రేమ్ కుబ్జికాయై క్షాం హూం అఘోరేఘోరే అఘోరముఖి ఛిం ఛిం కిణి కిణి విచ్చేఐం హ్రీం శ్రీం హ్స్ఖ్ఫ్రేమ్ హ్సౌం|

ఈ మంత్ర దేవత పరా శాంభవి కుబ్జిక. ఈ పశ్చిమామ్నాయ దేవేశ్వరీ భోగ-మోక్షములను రెండింటినీ ప్రసాదించును. ఈ విద్యతో గౌరి ఎల్లప్పుడూ సన్మానించబడుతుంది. ఈ విద్యను పశ్చిమామ్నాయ మహాసింహాసనేశ్వరీ విద్య అని అంటారు.

ఇది శ్రీదక్షిణామూర్తి సంహితకు విశాఖ వాస్తవ్యులు, కౌండిన్యస గోత్రికులు, శ్రీఅయలసోమయాజుల పాలబాబు (సుబ్బారావు) గారు మరియు శ్రీమతి సాయిలీల దంపతుల ద్వితీయపుత్రుడు మరియు హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ ప్రకాశానందనాథ (శ్రీశ్రీశ్రీ శ్రీపాద జగన్నాధస్వామి) గారి శిష్యుడు భువనానందనాథ అను దీక్షానామము కలిగిన అయలసోమయాజుల ఉమామహేశ్వరరవి తెలుగులోకి స్వేచ్ఛానువాదము చేసిన పశ్చిమామ్నాయ సింహాసనేశ్వరీవిద్యా విధి వివరణం అను పంతొమ్మిదవ భాగము సమాప్తము.

13, నవంబర్ 2021, శనివారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - ఏడవశ్వాస - 07

 

53. పంచసింహాసన విద్య

త్రిపురావిద్య మూడు ప్రకారములని జ్ఞానార్ణవము నందు చెప్పబడినది. ఇందు ముందు బాలా మంత్రము చెప్పబడుచున్నది.