సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

25, జులై 2022, సోమవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - ఎనిమిదవశ్వాస - 8

 

25. మహాషోఢాన్యాసఫలము

కులార్ణవమునందు భగవాన్ శంకరుడు మహాషోఢాన్యాసమును తెలిపెను. ఎవరైతే ఈ న్యాసములు చేస్తారో వారు సాక్షాత్ పరమశివుడవుతారు. ఎవరు ఈ న్యాసములను ప్రతిరోజూ చేస్తారో వారికి నిగ్రహానుగ్రహ సమర్థత కలుగుతుంది. ఇందు సందేహము లేదు. దేవతలందరూ అతడికి నమస్కారము చేస్తారు. ఏ స్థలములో ఈ న్యాసములు చేయబడునో ఆ స్థలము నాలుగు దిక్కులందునూ, పదియోజనముల వరకు దివ్యక్షేత్రము అవుతుంది. ఈ న్యాస సాధకుడు ఎక్కడకు వెళ్ళినా అతనికి విజయ లాభము, సన్మానము, గౌరవము లభించును. ఈ న్యాస సాధకుడు ఎవరికైనా వందనము చేస్తే అతడు ఆరు మాసములలో మృతిచెందుతాడు. ఈ న్యాసముకు వజ్ర పంజరన్యాసమని పేరు. ఈ న్యాస సాధకుడిని చూసిన, దివ్యలోకములు, అంతరిక్షము, భూమి, పర్వతము, జలము, వనములందు జీవించువారలకు, ప్రచండ భూత, భేతాళ, దేవ, రాక్షస, గ్రహాదులకు భయము కలుగును. ఈ న్యాస సాధకునకు బ్రహ్మ, విష్ణు, శివాది దేవతలు, ఋష్యాది మునులు నమస్కారము చేయుదురు. ఈ న్యాసమును అనధికారులకు చెప్పరాదు. ఈ న్యాసము వలన ఆజ్ఞాసిద్ధి లాభిస్తుంది. దేవతాభావ ప్రాప్తి కొరకు ఈ న్యాసమును మించిన మరియొక సాధనము లేదు. ఇది సత్యము. ఊర్ధ్వామ్నాయ ప్రవేశము, పరాప్రాసాదధ్యానము, మహాషోఢా న్యాసము/జ్ఞాన ఫలము దేనికీ సాటిరావు.

14, జులై 2022, గురువారం

శ్రీదక్షిణామూర్తి సంహిత - 35

 

భువనేశ్వరీద్వాదశగుణితోద్ధారవివరణం

ఈశ్వరుడు చెప్పుచున్నాడు – హే ప్రియే! ఇప్పుడు త్రిగుణిత యంత్రమునకు మూడురెట్లు ఫలమునిచ్చే యంత్రమును చెబుతాను. దీనిని తెలుసుకున్నంతనే సాధకుడు భువనములకు స్వామి అవుతాడు. ముందు షట్కోణము గీసి ఆ షట్కోణము సంధులను భేదించే విధంగా రెండవ షట్కోణమును గీసినచో ద్వాదశ కోణములు ఏర్పడును. ఆ యంత్ర మధ్యన శక్తిని లిఖించి ఠఃఠః లతో సంపుటీకరించి వాటి బయట విలోమ క్రమంలో వ్యాహృతీలతో వేష్టితము చెయ్యాలి. షట్కోణ సంధులలో ద్వాదశ స్థానములలో భువనేశ్వరీ బీజమును లిఖించాలి. బయట 12 సార్లు శక్తి బంధనము చెయ్యాలి. ద్వాదశకోణములలో హుం ను లిఖించాలి. దానిని పైన బయట కోణములలో సర్వకామసిద్ధి కొరకు బిందు సహిత తురీయ స్వరము ఈం ను లిఖించాలి.

9, జులై 2022, శనివారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - ఎనిమిదవశ్వాస - 7

 

23. మాతృకాన్యాసం

ఓం ఐం హ్రీం శ్రీం హ్సౌం (4) కంఖంగంఘంఙo అనంతకోటి భూచరి కులసహితాయై ఆంక్షాం మంగళాదేవ్యై ఆంక్షాం బ్రహ్మణ్యంబాదేవ్యై అనంతకోటి భూతలకులసహితాయై అంక్షం మంగళనాథాయ అంక్షం అసితాంగభైరవనాథాయ నమః – మూలాధారే|