సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

9, జులై 2022, శనివారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - ఎనిమిదవశ్వాస - 7

 

23. మాతృకాన్యాసం

ఓం ఐం హ్రీం శ్రీం హ్సౌం (4) కంఖంగంఘంఙo అనంతకోటి భూచరి కులసహితాయై ఆంక్షాం మంగళాదేవ్యై ఆంక్షాం బ్రహ్మణ్యంబాదేవ్యై అనంతకోటి భూతలకులసహితాయై అంక్షం మంగళనాథాయ అంక్షం అసితాంగభైరవనాథాయ నమః – మూలాధారే|

4 చంఛంజంఝంఞo అనంతకోటి ఖేచరీ కులసహితాయై ఈంలాం చర్చికాంబాదేవ్యై ఈంలాం మహేశ్వర్యంబాదేవ్యై అనంతకోటిబేతాళకుల సహితాయై ఇంలం చర్చికనాథాయ ఇంలం రురుభైరవనాథాయ నమః – లింగే|

4 టంఠండంఢంణం అనంతకోటి పాతాళఖేచరీ కులసహితాయై ఊంహాం యోగేశ్వర్యంబాదేవ్యై ఊంహాం కౌమార్యంబాదేవ్యై అనంతకోటి పిశాచకుల సహితాయై ఉంహం యోగేశనాథాయ  ఉంహం చండభైరవనాథాయ నమః – నాభౌ|

4 తంథందంధంనం అనంతకోటి దిక్చరికుల సహితాయై రూంసాం హరసిద్ధాంబాదేవ్యై నమః రూంసాం వైష్ణవ్యంబాదేవ్యై అనంతకోటి అపస్మార సహితాయై రుంసం హరసిద్ధనాథాయ రుంసం క్రోధభైరవనాథాయ నమః – హృదయే|

4 పంఫంబంభంమం అనంతకోటి సహచరికుల సహితాయై ళూంషాం భట్టిన్యాంబాదేవ్యై ళూంషాం వారాహ్యంబాదేవ్యై అనంతకోటి బ్రహ్మరాక్షసకుల సహితాయై ళుoషం భట్టినాధాయ ళుoషం ఉన్మత్త భైరవనాధాయ నమః – కంఠే|

4 యంరంలంవం అనంతకోటిగిరిచరీకుల సహితాయై ఏంశాం కిలికిలాంబాదేవ్యై ఏంశాం ఇంద్రాణ్యంబాదేవ్యై అనంతకోటి చేటకకులసహితాయై ఎంశం కిలికిలినాధాయ ఎంశం కాపాలీభైరవనాధాయ నమః – ఆజ్ఞాయాం|

4 శంషంసంహం అనాటకోటివనచరీ కులసహితాయై ఔంవాం కాలరాత్ర్యంబాయదేవ్యై ఔంవాం చాముండాంబాదేవ్యై అనతకోటి ప్రేతకుల సహితాయై ఓంవం కాళరాత్రినాధాయ ఓంవం భీషణభైరవనాధాయ నమః – శిరసి|

4 ళంక్షం అనంతకోటి జలచరీ కులసహితాయియా అఃలాం భీషణామ్బాదేవ్యై అఃలాం మహాలక్ష్మ్యంబాదేవ్యై అనతకోటి కూష్మాండ కులసహితాయై అంలం భీషణనాధాయ అంలం సంహారభైరవనాధాయ నమః – బ్రహ్మరంధ్రే|

4 హ్సౌం అం ఆం ఇం ఈం +++హం ళం మాతృభైరవాధిపాయై పరాంబాదేవ్యై నమః – సర్వాంగే వ్యాపకన్యాసం|

2.       అర్థనారీశ్వర ధ్యానం

పై విధంగా తమ శరీరమున షోఢా న్యాసము చేసిన తర్వాత సమాహిత చిత్తముతో అర్ధనారీశ్వరుని ధ్యానించాలి.

అమృత సముద్రము మధ్యన, మనోరమ స్వర్ణద్వీపమున, కల్పవృక్షముల మధ్యన, మాణిక్యమండపమున, రత్నములతో నిర్మితమైన సింహాసనము మీద ఉన్న కమలముయొక్క త్రికోణమున ఆశీనులై చంద్ర సూర్యులకు సమానమైన ప్రభాలు కలిగి శరీర సగభాగమును అంబికకు ఇచ్చి (తనలో కలిపి), వివిధ భూషణములతో విరాజిల్లు అర్ధనారీశ్వరుడిని ధ్యానించుచున్నాను. అతని కాంతి కోటికామదేవుల కాంతికి సమానము మరియు సదా షోడశ వర్షముల వయస్సు కలిగి ఉండును. అతని పెదవుల మీద మందహాసము, త్రినేత్రములు, నుదుటున చంద్రుడు, దివ్యా అంబరము, మాలా, వివిధ ఆభరణములు కలిగి ఉండును. అతని చేతులందు పానపాత్ర, చిన్ముద్ర, త్రిశూలము, పుస్తకము ఉండును. అతని ముఖములో ఎల్లప్పుడూ ఆనందము మిక్కిలి ప్రకాశించును. మహాషోఢా ద్వారా ఉదితమైన అసంఖ్యాక దేవతలచేత సేవించబడుచూ ఉండును”.

పై విధంగా అర్ధనారీశ్వరుని తమ హృదయ కమలములో స్త్రీ రూపంగా గాని పురుషరూపంగా గానీ నిష్కల సచ్చిదానంద సచరాచర సంపూర్ణ తేజముతో సమన్వితమైన రూపముగా ధ్యానించాలి. ఆ తర్వాత యోని, లింగ, సురభి, కపాల, జ్ఞాన, శూల, పుస్తక, వనమాల, నభోముద్ర, మహాముద్రలను ప్రదర్శించాలి. ఆ తర్వాత తమ శిరస్సు నందు ఈ క్రింది విధంగా గురువును ధ్యానించాలి.

సహస్రదళపంకజే సకలశీతరశిమప్రభం వరాభయకరాంబుజం విమలగంధ పుష్పాంబరం|

ప్రసన్నవదనేక్షణం సకలదేవతారూపిణం స్మరేచ్చిరసి హంసగం తదభిధాన పూర్వం గురుం|

ఇంకాఉంది...

కామెంట్‌లు లేవు: