సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

30, ఆగస్టు 2023, బుధవారం

శ్రీదుర్గా అష్టాక్షరీ అవరణ పూజా కల్పం

 

శ్రీదుర్గా అష్టాక్షరీ అవరణ పూజా కల్పంమహాప్రకృతి స్వరూపమైన శ్రీదుర్గా దేవి సమస్త దేవీ దేవతాశక్తులు, తేజస్సులను కలిగి ఉంటుంది. దుర్గాదేవి సిద్ది కొరకు ఆమె యొక్క అయిదు శక్తులను పూజించాలని చెప్పబడినది. దుర్గాయాః పరమం తత్త్వం పంచరత్నేశ్వరీ మయం అని నానుడి. ఒక మంచి రోజున దుర్గా పంచరత్నేశ్వరీలను జపించాలి. శ్రీదుర్గా, సరస్వతి, శారికా, మాతంగి మరియు బగళాముఖి వీరిని దుర్గా పంచరత్నేశ్వరులని అంటారు. వీరి సమగ్ర సాధన వలన పురశ్చరణ ఫలము లభిస్తుంది. దుర్గాదేవి మంత్రములు ఏకాక్షరి, అష్టాక్షరి, ద్వాదశాక్షరి, జయదుర్గా, శూలినీ దుర్గా, వనదుర్గా ఇలా పలువిధములు. ఈమె ఆరాధన వలన శత్రుపీడ తొలిగి విజయం కలుగుతుంది. సకల గ్రహబాధలూ తొలగిపోతాయి. ఈమె ఆరాధన వలన అన్ని దుర్గతులూ నశిస్తాయి. ఈ పుస్తకములో శ్రీదుర్గాదేవి అష్టాక్షరీమంత్రానికి సంబంధించి సంపూర్ణ ఆవరణార్చన విస్తారంగా తెలుపబడినది. ఈ క్రమము శ్రీవిద్యా క్రమమునకు దగ్గరగా ఉంటుంది. పాతగ్రంథములను పరిశీలించి ఈ పుస్తకమును సంకలనం చేశాను. ఈ పూజా విధానములో కూడా పలు భేదములు కనబడుతున్నాయి. 


Get this book from visit this link devullu.com
21, ఆగస్టు 2023, సోమవారం

శ్రీబాలా మంత్ర సిద్ధి స్తవం

 

శ్రీబాలా మంత్ర సిద్ధి స్తవం

 

శ్రీమహాకాళ సంహితలో చెప్పబడిన శ్రీబాలా మంత్ర సిద్ధి స్తవం ఎంతో మహిమాన్వితమైనది. ఈ స్తవ పారాయణ వలన సాధకుని కామము నిర్మూలించబడి బాలా మంత్రం త్వరగా సిద్ధిస్తుందని ప్రతీతి.