సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

25, మార్చి 2022, శుక్రవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - ఎనిమిదవశ్వాస - 2

 8.       చతుః సమయవిద్య

1.       కామేశ్వరి:

ఐం క్లీం సౌః ఓం నమః కామేశ్వరీ ఇచ్ఛాకామఫలప్రదే సర్వ సత్త్వవశంకరి సర్వజగత్ క్షోభకరీ హూం హూం ద్రాంద్రీంక్లీంబ్లూంసః సౌఃక్లీంఐం|

18, మార్చి 2022, శుక్రవారం

శ్రీదక్షిణామూర్తి సంహిత - 29

 

పంచకామేశ్వరీపూజనవిధివివరణం

ఇప్పుడు పంచకాముల నాయిక విశ్వమాతా వర్ణన చెయ్యబడుచున్నది. ముందు చెప్పబడిన పంచకాముల ద్వారా పంచకామేశ్వరీ తెలుపబడుతుంది. ఈ విద్యా ఋషి - సమ్మోహన| ఛందస్సు - గాయత్రి| బీజం - క్లీం| హ్రీం - శక్తిః| ఐం - కీలకం| దేవత - పంచకామేశ్వరి| కామబాణ విధిలో చెప్పిన విధంగా న్యాసములు చెయ్యాలి.

శ్రీశుభకృత్ నామ సంవత్సరములో (2022-23) శక్తి పర్వదినములు

 

శ్రీశుభకృత్ నామ సంవత్సరములో (2022-23) శక్తి పర్వదినములు

12, మార్చి 2022, శనివారం

తత్త్వములు

తత్త్వములు

వేదాంతము ప్రకారము తత్త్వములు 24. కానీ కాశ్మీరీ శైవిజం ప్రకారము తత్త్వములు 36. శివుని గురించి తెలుసుకోవడానికి ఈ 36 తత్త్వములు ఎంతో ముఖ్యమని కాశ్మీరీ శైవిజం చెబుతోంది. ఈ 36 తత్త్వములను ఆరోహణాక్రమములో ఇక్కడ చర్చించబడుతున్నది. భూమి నుండి పరమశివమునకు ఎదగడమే ఈ ఆరోహణాక్రమ ఉద్దేశ్యము. స్థూలమైన భూమి నుండి సూక్ష్మ, సూక్ష్మతర మూల ప్రకృతులను (తత్త్వములు/Elements) అర్థం చేసుకొంటూ సూక్ష్మాతిసూక్ష్మమైన పరమశివుని చేరడమే లక్ష్యము.

11, మార్చి 2022, శుక్రవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - ఎనిమిదవశ్వాస - 1

     1.       ఆయతన విద్యలు

ఈ విద్యలు అయిదు విధములు. అవి బ్రాహ్మ్య, వైష్ణవ, సౌర, బౌద్ధ, శైవ. తూర్పు, దక్షిణ, పడమర, ఉత్తర, ఊర్ధ్వక్రమములో ఈ విద్యలుండును. ఇవికాక, ఆరవ ఆయతన విద్య, శాక్తం పీఠము నందు ఉండును.

9, మార్చి 2022, బుధవారం

శ్రీదక్షిణామూర్తి సంహిత - 28

 

పంచబాణేశ్వరీయజనవిధివివరణం

ఈశ్వరుడు చెబుచున్నాడు - హే మహేశ్వరీ! త్రిపురేశ్వరీ తంత్రములో పంచబాణములను తెలుపబడినవి. ఆ పంచబానములనుండి ఈ పంచాక్షరీ విద్య జనించింది. ఈ మంత్ర ఋషి - మదన| ఛందస్సు - గాయత్రి| బీజము - ఆది కామేశ్వరి| దేవత - ఈశ్వరి| వ్యస్త మరియు సమస్త పంచ కాములతో అంగ దేవతలను పూజించాలి. పంచబాణముల న్యాసము చెయ్యాలి. (ఈ న్యాసము కొరకు తొమ్మిదవ భాగము చూడగలరు).