సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

16, డిసెంబర్ 2021, గురువారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - ఏడవశ్వాస - 10

 59. పశ్చిమసింహాసన దేవత

     అ) షట్కూటభైరవి

హసకలరడైం, హసకలరడీం, హసకలరడౌః|

ఋష్యాది న్యాసములు ఇంతకు ముందు చెప్పిన విధంగా చెయ్యాలి. మంత్రమును రెండు ఆవృతములతో షడంగన్యాసం చెయ్యాలి.

శ్రీదక్షిణామూర్తి సంహిత - 21

 

చైతన్యభైరవీ విద్యా విధివివరణం

ఈశ్వరుడు చెప్పుచున్నాడు -

నాలుగు సింహాసనముల వద్ద పరమేశ్వరి ఆద్యా భైరవీని పూజించాలి.

మంత్రము: ఐం సర్వసామ్రాజ్యదాయిని దక్షిణామ్నాయ చైతన్యభైరవి నమః ఫట్ స్వాహా|

10, డిసెంబర్ 2021, శుక్రవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - ఏడవశ్వాస - 09

 58. దక్షిణ సింహాసన దేవత

     అ) అఘోరభైరవి

అఘోరే ఐం ఘోరే హ్రీం సర్వతః సర్వ సర్వేభ్యో ఘోరఘోరతరే శ్రీం నమస్తేస్తు రుద్రరూపేభ్యః|

6, డిసెంబర్ 2021, సోమవారం

శ్రీదక్షిణామూర్తి సంహిత - 20

 

మహాసింహాసనేశ్వరీ భైరవీ విధివివరణం

ఈశ్వరుడు చెప్పుచున్నాడు. హే దేవీ! నేను నా ఉత్తర ముఖము నుండి మహాసింహాసన స్థిత డామరేశ్వరీ భైరవీ జపము చేస్తాను. ఈ విద్య భోగ, మోక్ష ఫలదాయకము.

2, డిసెంబర్ 2021, గురువారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - ఏడవశ్వాస - 08

 54. సంపత్ప్రదా భైరవి

హ్స్రైం హసకలరీం హ్స్రౌం| త్రిపురబాలా ఏవిధముగానో ఆవిధంగానే సంపత్ప్రదాదేవి కూడా. ఈ మంత్రమునకు సమానమైన విద్య ముల్లోకములలో లేదు. మూలమంత్రమును రెండు ఆవృత్తములతో షడంగన్యాసం చెయ్యాలి. ఆ తర్వాత ధ్యానం చెయ్యాలి.

27, నవంబర్ 2021, శనివారం

త్రికాల ఋగ్వేద సంధ్యావందనం

 త్రికాల ఋగ్వేద సంధ్యావందనం

మంత్రాలలో గాయత్రిని మించిన మంత్రము దేవతల్లో తల్లిని మించిన దైవము లేదని నానుడి. గాయత్రీ మంత్రోపాసన సంధ్యావందనంలో భాగము. కానీ మారుతున్న జనుల మనోచిత్తముల కారణంగా (దీనికి కాలమార్పు అని చెబుతున్నారు) సంధ్యోపాసన బాగా తగ్గింది. బుద్ధి వికసనమే ఈ మంత్ర ముఖ్య ఫలితం. మానవుని బుద్ధి సరైన దారిలో ప్రసరిస్తే అన్ని చోట్లా శాంతి పరిఢవిల్లుతుంది. తప్పుదారి పట్టిన మానవ బుద్ధి ఎప్పటికీ వినాశకమే అని అందరికీ తెలుసు. ఈ మంత్రోపాసకులకు మానసిక శాంతి, ధీరత్వం, జ్ఞానం, సుబుద్ధి మొదలగునవి ఎందువల్ల కలుగుతాయో అనుబంధంలో వివరించడం జరిగింది. కొన్ని పాత గ్రంథాల ఆధారంగా ఇందులో విషయాలను నేను సంకలనం చెయ్యడం జరిగింది. సంధ్యావందనము అన్ని వేదశాఖలూ మరియు తైత్తిరీయ ఉపనిషద్ ప్రకారం ఉన్నాయి. అయితే ఈ పుస్తకంలో ఋగ్వేద సంధ్యావందనం ఇవ్వబడినది. ఈ మధ్య అక్కడక్కడ దొరుకుతున్న పుస్తకాలలో గాయత్రీ మంత్ర స్వరం అన్ని శాఖలకూ ఒకటిగానే ఇవ్వబడుచున్నది. నిజానికి ఋగ్వేద గాయత్రీ మంత్ర స్వరంలో కించిత్ భేదం ఉంటుంది. ఈ పుస్తకంలో గాయత్రీ మంత్రస్వరమును ఋగ్వేద ప్రకారంగా ఇవ్వబడినది.శ్రీభువనేశ్వరీ ఆవరణార్చణా కల్పము

శ్రీభువనేశ్వరీ ఆవరణార్చణా కల్పము

          

భువనములకు అధిపతి భువనేశ్వరి హకారము, రేఫ, మాయ (ఈంకారము)లతో కూడి ఉన్నదే శక్తిప్రణవము అదే హ్రీంఇదియే భువనేశ్వరి సూక్ష్మ రూపము హ ఒక ధ్వని దీని నుండియే సమస్త జగత్తు ఉత్పన్నమవుతున్నది అందువలననే ఈమె భువనములకు అధిపతి అయినది ఈ తల్లి ఆరాధన వలన జ్ఞానము, మోక్షము కలుగుతాయి శ్రీవిద్యోపాసకులకు ఈమెను ఆరాధించడం ఎంతో ముఖ్యము ఇంతటి ఉత్కృష్టమైన ఈమె ఆరాధన అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి “శ్రీభువనేశ్వరీ ఆవరణార్చన కల్పము” అను ఈ పుస్తకమును నా శిష్యుడు భువనానందనాథుడు అయలసోమయాజుల ఉమామహేశ్వర రవి పూర్తిగా దక్షిణాచార సంప్రదాయంలో సంకలనం చేసి భక్తజనులకు, సాధకులకు అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేశాడు అతని ఈ ప్రయత్నాన్ని మంత్రవేత్తలు, సాధకులు అభినందింతురుగాక  

 

19, నవంబర్ 2021, శుక్రవారం

గురుపూజా పద్ధతి

 

శ్రీ మహాగణాధిపతయే నమః

శ్రీ లలితా మహా త్రిపురసుందర్యై నమః

శ్రీగురుస్సర్వకారణ భూతాశ్శక్తిః

 

సూచన – దేవికి ఎడమ వైపున సరళ రేఖాక్రమంలో మూడు కలశములను ఉంచి వాటికి పసుపు రాసి కుంకుమ అద్దిన మూడు కొబ్బరికాయలను ఉంచాలి. కొబ్బరి కాయల పీచు వెనుక వైపు ఉండునట్లుగా కొబ్బరికాయలను అమర్చాలి. ఆ కలశములందు ఎడమ నుండి కుడివైపుకు వరుసగా పరమేష్ఠిగురు, పరమగురు, స్వగురులను గురుత్రయ పాదుకా మంత్రములతో ఆవాహన చేయాలి. బ్రహ్మవిద్యా సంప్రదాయ గురుస్తోత్రమును పఠించాలి.

శ్రీదక్షిణామూర్తి సంహిత - 19

 

పశ్చిమామ్నాయ సింహాసనేశ్వరీవిద్యా విధివివరణం

ఈ మంత్ర స్వరూపము:

ఐంహ్రీంశ్రీం ఘోరే హ్స్ఖ్ఫ్రేమ్ హ్సౌం నమో భగవతి ఓం హ్స్ఖ్ఫ్రేమ్ కుబ్జికాయై క్షాం హూం అఘోరేఘోరే అఘోరముఖి ఛిం ఛిం కిణి కిణి విచ్చేఐం హ్రీం శ్రీం హ్స్ఖ్ఫ్రేమ్ హ్సౌం|

ఈ మంత్ర దేవత పరా శాంభవి కుబ్జిక. ఈ పశ్చిమామ్నాయ దేవేశ్వరీ భోగ-మోక్షములను రెండింటినీ ప్రసాదించును. ఈ విద్యతో గౌరి ఎల్లప్పుడూ సన్మానించబడుతుంది. ఈ విద్యను పశ్చిమామ్నాయ మహాసింహాసనేశ్వరీ విద్య అని అంటారు.

ఇది శ్రీదక్షిణామూర్తి సంహితకు విశాఖ వాస్తవ్యులు, కౌండిన్యస గోత్రికులు, శ్రీఅయలసోమయాజుల పాలబాబు (సుబ్బారావు) గారు మరియు శ్రీమతి సాయిలీల దంపతుల ద్వితీయపుత్రుడు మరియు హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ ప్రకాశానందనాథ (శ్రీశ్రీశ్రీ శ్రీపాద జగన్నాధస్వామి) గారి శిష్యుడు భువనానందనాథ అను దీక్షానామము కలిగిన అయలసోమయాజుల ఉమామహేశ్వరరవి తెలుగులోకి స్వేచ్ఛానువాదము చేసిన పశ్చిమామ్నాయ సింహాసనేశ్వరీవిద్యా విధి వివరణం అను పంతొమ్మిదవ భాగము సమాప్తము.

13, నవంబర్ 2021, శనివారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - ఏడవశ్వాస - 07

 

53. పంచసింహాసన విద్య

త్రిపురావిద్య మూడు ప్రకారములని జ్ఞానార్ణవము నందు చెప్పబడినది. ఇందు ముందు బాలా మంత్రము చెప్పబడుచున్నది.

28, అక్టోబర్ 2021, గురువారం

శ్రీ దక్షిణామూర్తి తంత్రం

 

శ్రీ దక్షిణామూర్తి తంత్రంక్తిఉపాసనను తెలుపుటకు చాలా తంత్ర గ్రంథములు కలవు. వాటిలో శ్రీదక్షిణామూర్తి సంహిత ఒకటి. భగవంతుడు శివుని మరొక రూపమైన దక్షిణామూర్తి మరియు పార్వతి సంవాదములో ఈ తంత్రము సాగుతుంది. తాంత్రిక వాఙ్మయము అత్యంత విశాలము. దక్షిణామూర్తి సంహిత ఆ విశాల వాఙ్మయమునకు ఒక చిన్న కొమ్మ. అరవైఅయిదు భాగములున్న ఈ తంత్రమునందు  శివపార్వతులు, విభన్నమైన, నిగూఢమైన ఆధ్యాత్మిక శక్తులను, వారి స్వరూపములను, వారి ఉపాసనా పద్ధతులను చర్చించారు. ఈ వాఙ్మయము తెలుగులో ....

23, అక్టోబర్ 2021, శనివారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - ఏడవశ్వాస - 06

 

41. పంచమీ విద్య విశేషము

శ్రీంహ్రీంహం వాగ్భవ కూటమునకు ముందు, శక్తి కూటము తర్వాత హంహ్రీంశ్రీం, కామరాజ త్రయము నందు కలఈం, ప్రథమకూటమునకు ముందు శ్రీం జోడించాలి. కామరాజ కూటమునకు ముందు హ్రీం ను జోడించాలి. ఈ బీజము జ్వలించు అగ్నికి మరియు శుద్ధ బంగారమునకు సమానము. ఇది కుల-అకులమయము. ఈ విధంగా నిర్మితమైన మధుమతీ విద్య యొక్క జపము సర్వకామఫలప్రదాయకము.

20, అక్టోబర్ 2021, బుధవారం

30, సెప్టెంబర్ 2021, గురువారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - ఏడవశ్వాస - 05

 31. కామరాజలోపాముద్రయోర్విశేషః

కుళోఙ్గీశము నందు కామరాజ లోపాముద్ర విషయము గురించి విశేష కథనము చెప్పబడినది. కామరాజ లోపాముద్రకు ముందు క్లీంహ్రీంశ్రీం, హ్రీంశ్రీంక్లీం, శ్రీంహ్రీంక్లీం జోడించగా మూడు ప్రకారముల అష్టదశాక్షరి విద్య అవుతుంది. క్లీంఐంశ్రీం బీజములు శ్రీభగవదాచార్య ద్వారా ప్రతిపాదించబడినవి.

29, సెప్టెంబర్ 2021, బుధవారం

శ్రీదక్షిణామూర్తి సంహిత - 17

 

పదిహేడవ భాగము

వజ్రేశ్వరీ పూజా విధివివరణం

మంత్రము - హ్రీం క్లిన్నే ఐం క్రోం నిత్యమదద్రవే హ్రీం

ఋషి - బ్రహ్మ| ఛందస్సు - విరాట్| దేవతా - వజ్రేశ్వరి| క్రోం - బీజం| ఐం - శక్తిః| నే - కీలకం|

షడంగన్యాసం: హ్రీం| క్లిన్నే| ఐం| క్రోం| నిత్యమదద్రవే| హ్రీం| ఈ బీజముల ద్వారా షడంగన్యాసం చెయ్యాలి.

24, సెప్టెంబర్ 2021, శుక్రవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - ఏడవశ్వాస - 04

 25. సంపుట లక్షణము

నవరత్నేశ్వర ప్రకారము మంత్రమునకు ముందు బీజములను మంత్రమునకు తర్వాత విపరీత క్రమములో జోడించగా మంత్రము సంపుటితమవుతుంది. ఈ సంపుటిత లక్షణము సమస్త శాస్త్రములందు వేరువేరుగా ఉన్నది.

21, సెప్టెంబర్ 2021, మంగళవారం

శ్రీదక్షిణామూర్తి సంహిత - 16

 

సంజీవనీయజన విధివివరణం

ఈశ్వరుడు చెప్పుచున్నాడు - హే మహేశానీ! ఇప్పుడు పరాత్పర మృత్యుంజయ వర్ణన వినుము. ఈ మంత్ర స్వరూపము ఈ విధంగా ఉండును -

17, సెప్టెంబర్ 2021, శుక్రవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - ఏడవశ్వాస - 03

 11. కామదేవ ఉపాసిత శ్రీవిద్య

భగవాన్ శివుడు శ్రీదేవితో ఇలా పలికెను- (జ్ఞానార్ణవముప్రకారము)

పంచాక్షర వాగ్భవ కూటము - కఏఈలహ్రీం| షడాక్షర కామరాజ కూటము - హసకహలహ్రీం| చతురక్షర శక్తి కూటము - సకలహ్రీం| శ్రీదేవి సర్వతీర్థమాయీ, సర్వదేవ స్వరూపిణి. సర్వసాక్షిమయి, నిత్యా, సర్వయోనిమయీ, సర్వజ్ఞానమయీ, సర్వప్రజ్ఞానరూపిణీ, సర్వదేవమయీ, సాక్షాత్ సర్వసౌభాగ్యసుందరీ అయిన ఆమె పరా| ఓ దేవీ! ఈ మంత్రమును ఉపాసించే కామదేవుడు సర్వాంగ సుందరుడైనాడు.

14, సెప్టెంబర్ 2021, మంగళవారం

శ్రీదక్షిణామూర్తి సంహిత - 15

 సంజీవనీవిద్యా వివరణం

ఈశ్వరుడు చెప్పుచున్నాడు - హే దేవీ! నేను ఇప్పటికీ నా పశ్చిమ ముఖము నుండి సాక్షాత్ అమృతానంద విగ్రహ విద్యాచతుష్టయమును జపిస్తాను. దీనినుండి మహాసింహాసనగత సంజీవనీ విద్యను వినుము.

27, ఆగస్టు 2021, శుక్రవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - ఏడవశ్వాస - 02

 9. షోడశవర్ణ ఉద్దారక్రమము

జ్ఞానార్ణవమునందు దీని వర్ణన ఈ విధంగా కలదు -

శ్రీదేవి ఈశ్వరుడిని ఈ విధంగా అడిగెను - హే స్వామీ! మీరు వివిధ ప్రకారములైన త్రిపురావిద్యలను ప్రకటించారు. ఇప్పుడు మీరు త్రివిధాను ప్రకటించవలసినదిగా కోరుచున్నాను. అప్పుడు ఈశ్వరుడు ఇలా బదులుయిచ్చెను.

26, ఆగస్టు 2021, గురువారం

వనదుర్గా మంత్ర సాధన

వనదుర్గా మంత్ర సాధన

ఆచార్య ఆదిశంకరుల వారు ప్రతిపాదించిన మంత్రము ఇది. ఎవరైనా వ్యకికి ఏదైనా సంకట పరిస్థితి ఎదురైన్నప్పుడు ఈ మంత్ర స్మరణ మాత్రము చేత అతడు రక్షింపబడతాడు. మంత్ర స్వరూపము ఈ క్రింది విధంగా ఉంటుంది.

25, ఆగస్టు 2021, బుధవారం

శ్రీబాలాత్రిపురసుందరి ఆవరణార్చన కల్పము

 శ్రీబాలాత్రిపురసుందరి ఆవరణార్చన కల్పము


త్రిపుర సుందరి అంటే మనలోని మూడు అవస్తలు జాగృత్, స్వప్న , సుషుప్తి. ఈమూడు అవస్థలు లేదా పురములకు బాల అధిష్ఠాన దేవత.

21, ఆగస్టు 2021, శనివారం

శ్రీదక్షిణకాళీ ఆవరణార్చన కల్పము

 

శ్రీదక్షిణకాళీ ఆవరణార్చన కల్పము

జీవుడే కాలుడు. ఆ కాలుని శక్తే కాళి. దశమహావిద్యలలో మొదటి విద్య. కొందరు ఈమెను శ్యామా అని కూడా పిలుస్తారు. ఈమె కాలస్వరూపిణి. ఈమెను ఆరాధించడం వలన సాధకుడు తనను కాలునిగా తెలుసుకుంటాడు.

 
                          శ్లో||  జయంతి మంగళాకాళీ భద్రకాళీ కపాలినీ|

                                దుర్గాక్షమా శివధాత్రి స్వాహాస్వధా నమోస్తుతే||


13, ఆగస్టు 2021, శుక్రవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - ఏడవశ్వాస - 01

 1. కూటన్యాసము మరియు అక్షరన్యాసము

స్థితి శ్రీచక్ర న్యాసమునకు విద్యా, చక్రము, చక్రేశ్వరి అంగములు. ముందుగా కరశుద్ధి న్యాసము, ఆత్మరక్షాన్యాసము చేసి శ్రీదేవికి మరియు సాధకునకు భేదము లేదని భావించాలి. తంత్రరాజము నందు ఈ క్రింది విధంగా ధ్యానము చెప్పబడినది.

2, ఆగస్టు 2021, సోమవారం

30, జులై 2021, శుక్రవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - ఆరవశ్వాస - 12

 శ్రీచక్రన్యాస కవచం (సంహార న్యాసం)

పై విధంగా షోఢాన్యాసము చేసిన తర్వాత కామరతి న్యాసము చెయ్యాలి. శివతా ప్రాప్తి గురించి శ్రీచక్ర న్యాసము చెయ్యాలి. ఈ న్యాసము శరీర శుద్ధి కారకము అవుతుంది.

26, జులై 2021, సోమవారం

శ్రీదక్షిణామూర్తి సంహిత - 12

 పన్నెండవ భాగము

కామేశ్వరీపూజా విధివివరణం

ఈశ్వరుడు చెప్పుచున్నాడు -

కేవలము కామబీజము "క" కామేశ్వరీ మంత్రము. ఈ మంత్ర దేవత - కామేశ్వరి| కం - బీజం| కం - శక్తిః| లం - కీలకం| ఈ విద్య పరమ వశీకారిణి.

23, జులై 2021, శుక్రవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - ఆరవశ్వాస - 11

కాకినీ న్యాసము

స్వాధిష్టాన స్థిత షడ్దళ కమలమునందు మేద ధాతురూపంగా కాకినీ దేవతను దళకర్ణికయందు ఈ క్రింది విధంగా ధ్యానించాలి.

19, జులై 2021, సోమవారం

శ్రీదక్షిణామూర్తి సంహిత - 11

 

పదకొండవ భాగము

లలితార్చన విధివివరణం

శివుడు చెప్పుచున్నాడు - హే దేవేశీ! నేను నా దక్షిణ ముఖము నుండి ఇప్పటికీ లలితా పరా రక్త నేత్రా త్రిపురా కామేశ్వరీ జపమును చేస్తున్నాను. శక్తిబీజము, వాగ్భవబీజము, కామబీజములను ఇంతకు ముందు చెప్పిన విధంగా లిఖించవలెను. చివర శివ బీజమును జోడించాలి. అది త్రిపురేశీ మంత్రము అవుతుంది. మంత్ర స్వరూపము ఈ విధంగా ఉండును

16, జులై 2021, శుక్రవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - ఆరవశ్వాస - 10

న్యాసక్రమము

వైశంపాయన సంహితయందు ఈ విధంగా చెప్పబడినది - ఉపాస్య మంత్ర న్యాసములో ఋష్యాది న్యాసములు చెయ్యాలి. సిద్ధిపొందగోరువారు ఏ మంత్రమును ఉపాసిస్తారో ఆ మంత్ర న్యాసము చెయ్యాలి. జపము, తర్పణము, హోమము, అర్చనల వలన సిద్ధి కలిగినా సరే అంగన్యాస కరన్యాసములతో చెయ్యని మంత్ర జపము ఫలమునివ్వదు. అన్ని న్యాసములను సాధకుడు తన దేహమునందు చేసినచో అతడు మూడులోకములను వశపరచుకోగలడు. అతడి అన్ని పాపములూ వెంటనే పోవును. అన్ని రాక్షస, సర్పాదులు అతడికి దూరంగా ఉండును. ముందు ఋష్యాది న్యాసము చెయ్యాలి. ఆ తర్వాత వరుసగా కరన్యాస, అంగన్యాసములు, మంత్రవర్ణన్యాసము, మంత్రపద న్యాసము, విశేషమైన మంత్ర కల్పోక్త న్యాసము, మంత్ర పుటితవర్ణములతో సానుస్వార మాతృకా న్యాసములు చెయ్యాలి. మంత్రవిదుడు యుక్తముగా శాస్త్ర నిర్ధిష్ట మార్గములో న్యాసము చేసి, అంగన్యాస, కరన్యాసములు చేసి, ముద్రలను ప్రదర్శించాలి.

9, జులై 2021, శుక్రవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - ఆరవశ్వాస - 9

యోగాభ్యాస క్రమము

పద్మాసనము మీద కూర్చోని రెండు కళ్ళూ మూసుకోవాలి. చిత్తవృత్తిని మూలాధారమునందు లగ్నము చెయ్యాలి. మూలమంత్రమును ఉచ్చరిస్తూ ఇడా నాడీ నుండి పదహారు మాత్రలలో వాయువును పూరించాలి. ఆ వాయువును మూలాధారమునకు తీసుకురావాలి. అంగుష్ఠ - కనిష్ఠిక - అనామికలను కలిపి నాసాపుటమును బంధించాలి. 64 మాత్రల కాలము బాటు ఆ వాయువును లోపల కుంభించాలి. 32 మాత్రల కాలంలో ఆ వాయువును పింగళ నాడి ద్వారా నెమ్మ నెమ్మదిగా రేచకము చెయ్యాలి. ఈ విధంగా ఇది ఒక ప్రాణాయామము అవుతుంది. ఆ తర్వాత పింగళ ద్వారా వాయువును పూరించి (పైన చెప్పిన విధంగా) కుంభకము, రేచకము చెయ్యాలి. ఈ విధంగా వ్యతిరేక క్రమంలో 16/12/6/3/2 సార్లు యథాశక్తి చెయ్యాలి. అప్పుడు సిద్ధి ప్రాప్తిస్తుంది. శారదాతిలక తంత్రము ప్రకారము మాత్రావృద్ధి క్రమంగా ప్రాణాయమము చెయ్యాలి. ఈ ప్రాణాయామమునందు ఎల్లప్పుడూ అందరికీ అధికారము కలదు. ప్రాణాయమము చేయకపోతే నింద కలుగుతుంది. పూజాకాలంలో భూతశుద్ధి కొరకు ఇది అవశ్యకమని అగస్త్య సంహిత యందు చెప్పబడినది. ఇది సాధారణ ప్రాణాయామ పద్ధతి.

6, జులై 2021, మంగళవారం

శ్రీమహాగణపతి ఆవరణార్చన కల్పము


శ్రీమహాగణపతి ఆవరణార్చన కల్పము


కలౌ వినాయకో చండీ అని నానుడి. విఘ్నాలు, ఆటంకాలు లేకుండా కొనసాగాలని తొలి పూజ గణనాధునికే నిర్వహిస్తారని సాధకులకు, భక్తులకు విదితమే. నేటి కాలంలో మహా గణపతి చతురావృత్త తర్పణాలు, హోమములు ఎంతో ప్రాచుర్యం పొందాయి. శ్రీచక్రమును ఆవరణదేవతా సహితంగా పూజించే పద్ధతి సాధకులకు విదితమే. ఆ విధంగానే మహా గణపతి ఆవరణ పూజా పద్ధతి కూడా ఉంది. కానీ ఈ మహా గణపతి ఆవరణ పూజా విధానము ఎందువలన మరుగున పడిపోయినదో తెలియదు. 

2, జులై 2021, శుక్రవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - ఆరవశ్వాస - 8

ప్రాణాయామ మాత్రా లక్షణం

నారదుని ప్రకారము, శ్వాస యొక్క మాత్ర ఈ ప్రకారము ఉంటుంది - ఎంత సమయంలో చెయ్యి జానుమండలమును స్పర్శిస్తుందో అంత సమయమును ఏక మాత్ర అంటారు. ఆ మాత్రాకాలంలో శ్వాసను లోపలికి తీసుకోవాలి.

30, జూన్ 2021, బుధవారం

శ్రీదక్షిణామూర్తి సంహిత - 9

 తొమ్మిదవ భాగము

త్రిపురేశ్వరీసమారాధన విధివివరణం

ఈశ్వరుడు చెప్పుచున్నాడు - పంచ సింహాసనము మీద విరాజమానమైన మహేశ్వరీ విద్యను జపించాలి. ఈ విద్యను ప్రముఖ (=పుణ్య?) పురుషుడు మాత్రమే జపించాలి. సామాన్య పురుషునకు ఈ విద్యయందు అధికారము ఉండదు. ఈ విద్యకు సమానమైన విద్య మూడు లోకములందునూ దుర్లభము. ఈ విద్య ఓంవం(=ఐం?)క్లీంసౌః అను బీజములతో ఉండును. ఈ విద్య యొక్క ఋషి = దక్షిణామూర్తి అనగా నేను. ఋషిని శిరస్సు నందు న్యాసము చెయ్యాలి. ఛందస్సు - పంక్తిః. దీనిని ముఖము నందు న్యాసము చెయ్యాలి. హృదయమున వాగ్భవ బీజమును న్యాసము చెయ్యాలి. హ్సౌః - శక్తిబీజము. కామరాజ బీజము క్లీం కీలకము.

25, జూన్ 2021, శుక్రవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - ఆరవశ్వాస - 7

 రేచక ప్రాణాయామ క్రమము

యోగశాస్త్రములందు రేచక క్రమమును ఈ విధముగా చెప్పబడినది -

రేచక, పూరక, కుంభక క్రమములో ప్రాణాయామము మూడుసార్లు చెయ్యాలి. సహిత మరియు కేవల మునందు కుంభకము రెండు విధములు. సహిత ప్రాణాయామము నందు రేచకము తర్వాత నెమ్మనెమ్మదిగా పూరకము చెయ్యాలి. ఆ తర్వాత కుంభకము చెయ్యాలి. సిద్ధి కలిగేంతవరకు సహిత ప్రాణాయామము అభ్యసించాలి.

21, జూన్ 2021, సోమవారం

శ్రీదక్షిణామూర్తి సంహిత - 8

 మాతృకాపూజాసాధన విధివివరణం

ఈశ్వరుడు చెప్పుచున్నాడు - ఇప్పుడు అ నుండి క్ష వరకు వర్ణరూపీ అవయవములుకల లోకమాత మాతృకను నీకు తెలుపుచున్నాను. ఈ మంత్ర ఋషి - బ్రహ్మ| ఛందస్సు - గాయత్రి| దేవత - మాతృక| హల (వ్యంజన) - బీజం| స్వరః - శక్తిః| వ్యక్తి - కీలకం| అనిర్వాచ్య హల వర్ణము శక్తి ద్వారా వ్యక్తమవుతుంది. శక్తి లేకుండా సూక్ష్మ శివ నామము మరియు ధామము లేవు. హల వర్ణము అసత్ రూపము మరియు పరాఙ్ముఖము. అది శక్తితో ఎప్పుడు సంసృష్ట (=బాగా కలుపబడ్డది)మవుతుందో అప్పుడు మంత్రములో చలనము కలుగుతుంది.

11, జూన్ 2021, శుక్రవారం

7, జూన్ 2021, సోమవారం

శ్రీదక్షిణామూర్తి సంహిత - 7

 అజపావిధాన వివరణం

ఈశ్వరుడు చెప్పుచున్నాడు - హే పాపరహిత దేవీ! ఇప్పుడు నీకు అజపా అను పవిత్ర ఆరాధనా విధానము చెప్పుచున్నాను. దీనిని తెలుసుకున్న సాధకుడు పరంబ్రహ్మ అవుతాడు. హే దేవీ! మనుజుడు ప్రతి రోజూ హంస పదమును జపము చేస్తుంటాడు. కానీ మోహవశమున అతడికి ఆ మంత్ర జ్ఞానము కలగదు. శ్రీగురు కృపవలన ఏ సాధకుడికి ఈ మంత్ర జ్ఞానము కలుగుతుందో మరియు ఉచ్ఛ్వాస, నిశ్వాస రూపంలో జపము తెలుసుకుంటాడో అతడికి బంధములనుండి మోక్షము లభిస్తుంది. హం - ఉచ్ఛ్వాసము, సః - నిశ్వాసము. అందువలననే హంసను ప్రాణము అని అంటారు. ఆ ప్రాణము ఆత్మ రూపంలో ఉండును. ఒకజీవి స్పంద, ఆనందమయీ పరాదేవిని ప్రతిదినమూ 21600 సార్లు జపించును. జపారంభము దీని ఉత్పత్తి. జపనివేదన దీని మృత్యువు. ప్రత్యేక జపము చేయకుండానే ఈ మంత్ర జపము జరుగుచుండును. అందువలననే ఈ మంత్రమును అజపా అని అంటారు. భవ అనగా జన్మ లేదా సంసార రూప బంధమును తొలగించే ఈ దేవీ గురు కృపవలననే లభించును. అన్యథా లభించదు.

1, జూన్ 2021, మంగళవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - ఆరవశ్వాస - 5

 శ్రీవిద్యామాతృకా న్యాసము

ఋషి - దక్షిణామూర్తి| ఛందస్సు - గాయత్రి| దేవత - మాతృకారూప మహాత్రిపుర సుందరి| కూటత్రయములను రెండు ఆవృత్తములతో షడంగ న్యాసము చెయ్యాలి.

16, ఏప్రిల్ 2021, శుక్రవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - ఆరవశ్వాస - 4

 

కామేశ్వరీ మాతృకా న్యాసము:

కామేశ్వరీ ఉపాసకులు కేవలము మాతృకలతో న్యాసము చెయ్యాలి. ఇతరులు క్లీంయుక్త మాతృకలతో న్యాసము చెయ్యాలి.

15, ఏప్రిల్ 2021, గురువారం

శ్రీదక్షిణామూర్తి సంహిత - 6

 పరనిష్కళదేవతాసమారాధన విధానం

ఈశ్వరుడు చెప్పుచున్నాడు - హే మహేశాని! ఇప్పుడు పరనిష్కల దేవతా వర్ణన చెబుతాను. ఈమెను స్మరించినంత మాత్రముననే శరీరము అత్యంత ఆనందదాయకము అవుతుంది.

10, ఏప్రిల్ 2021, శనివారం

7, ఏప్రిల్ 2021, బుధవారం

శ్రీదక్షిణామూర్తి సంహిత - 5

 

అయిదవ భాగము

అష్టాక్షరపరంజ్యోతిర్విద్యా పూజా విధానం

ఈశ్వరుడు చెప్పుచున్నాడు - ఇప్పుడు శ్రీకోశవిద్య యొక్క నాలుగు భేదములను చెబుతాను. దీనిని తెలుసుకోవడం వలన పునర్జన్మ ఉండదు. కోశవిద్యలు 1. శ్రీవిద్యా 2. పరంజ్యోతి 3. పరనిష్కలదేవత 4. అజపా 5. మాతృకా.

2, ఏప్రిల్ 2021, శుక్రవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - ఆరవశ్వాస - 3

 కేశవాది శక్తి మాతృకా న్యాసము

విష్ణు భక్తులు కేవలము మాతృకా న్యాసము చెయ్యాలి. విద్వాంసులు కేశవాది శక్తియుక్త మాతృకలతో న్యాసము చెయ్యాలి.

19, మార్చి 2021, శుక్రవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - ఆరవశ్వాస - 2

 సృష్టిమాతృకా న్యాసము:

బ్రహ్మచారి కేవలము మాతృకాన్యాసము చెయ్యాలి. విద్వాంసుడు విసర్గయుక్త సృష్టిన్యాసము చెయ్యాలి.

17, మార్చి 2021, బుధవారం

శ్రీదక్షిణామూర్తి సంహిత - 4

 సర్వసామ్రాజ్యలక్ష్మి పూజా విధానం

ఈశ్వరుడు చెప్పుచున్నాడు -

సర్వసామ్రాజ్య దేవతా ఆరాధన వలన సాధకుడు స్వయం విష్ణు లక్ష్మీపతి అవుతాడు. చంద్రబీజము - స, మదన బీజం - క, క్ష్మ - ల, ఈశ - హ, వహ్ని - ర, దీర్ఘశ్రీ - ఈ, బిందు - అం| ఈ బీజములతో కూడిన మంత్ర స్వరూపము సకలహ్రీంహూం హ్రీం. ఈ మంత్రమునకు శ్రీ బీజమును జోడించినచో సర్వసామ్రాజ్యదాయినీ విద్య అవుతుంది (సకలహ్రీంహూంహ్రీంశ్రీం). ఈ మంత్రమునకు

13, మార్చి 2021, శనివారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - ఆరవశ్వాస - 1

 మాతృకా న్యాసము

సమస్త దేహమునందు యుక్తముగా న్యాసము చెయ్యాలి. లోపల-బయట కళాయుక్త శ్రీకంఠ విష్ణు మొదలగు వానిచే సమన్వితమైన లజ్జా-రమా-కామ (హ్రీం-శ్రీం-క్లీం) సమ్మోహన ప్రపంచయాగ దశ మాతృకాన్యాసము చెయ్యాలి. గుదమునకు రెండు అంగుళముల పైన ఉన్న సుషుమ్నా మార్గమున సూక్ష్మ రంధ్రమున వ-శ-ష-స అను నాలుగు దళముల స్వర్ణప్రభ పద్మము కలదు. అందు విద్యుల్లతాకార తేజోరుప కులకుండలినీ శక్తిని ఆరు చక్రములను భేదించుచూ ద్వాదశాంత చంద్రమధ్యమున కలపాలి. వెన్న వంటి వర్ణములో ఉండు కుండలినిని ధ్యానము చేసి ఆ తేజమును అంజలిలోకి తెచ్చి మాతృకాన్యాసము చెయ్యాలి.

5, మార్చి 2021, శుక్రవారం

మహామనుస్తవం - 15, 16

 

15.   హ్రీమతి మాతుశ్రీజగత్ సంకోచవికాసతంత్రదీక్షాయాః|

       అక్షరమేక ధ్యాయన్ జగదజ్ఞానస్య జయతి నా జేతా||

4, మార్చి 2021, గురువారం

శ్రీదక్షిణామూర్తి సంహిత - 3

 త్రిశక్తి మహాలక్ష్మి పూజా విధానం

ఈశ్వరుడు చెప్పుచున్నాడు -

హే దేవీ! ఇప్పుడు మనుష్యులకు సమస్త సిద్ధులను ప్రసాదించునదైన త్రిశక్తి యజనమును చెప్పుచున్నాను.

12, ఫిబ్రవరి 2021, శుక్రవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - అయిదవవశ్వాస - 09

పాపపురుష చింతనము

పాపపురుషుడు వామకుక్షిలో కాటుక రంగులో ఉంటాడు. బ్రహ్మ హత్య వలన శిరస్సు, స్వర్ణమును దొంగలించడం వలన రెండు చేతులనూ, సురాపానము వలన హృదయము, గురుతల్పగమనము వలన కటిద్వయము పాపయుక్తములు. అతడి రోమములు ఉపపాతకములు. అతడి గెడ్డము మరియు కళ్ళు ఎర్రగా ఉండును. ఖడ్గము, డాలు ధరించి ఉండును.

5, ఫిబ్రవరి 2021, శుక్రవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - అయిదవవశ్వాస - 08

భూతశుద్ధి

పంచభూతములతో నిర్మితమైన ఈ శరీరమునందు ఆ పంచభూతముల శోధనము అవ్యక్తమైన బ్రహ్మ యొక్క సంపర్కముతో అవుతుందని అభిప్రాయము.

3, ఫిబ్రవరి 2021, బుధవారం

శ్రీదక్షిణామూర్తి సంహిత - 2

 

రెండవ భాగము

మహాలక్ష్మీ పూజా విధి

ఈశ్వరుడు చెబుచున్నాడు -

హే మహేశానీ! ఇప్పుడు నేను ఉత్తమ లక్ష్మీ హృదయము తెలుపుతాను. దీనిని తెలుసుకున్నంతనే ఆపత్తులు పారిపోతాయి. ప్రణవము, హర ఈం ఆత్మకం (హ్రీం), శ్రీపుటము (శ్రీం), కమలేకమలాలయే, రుద్రస్థానము అనగా పదకొండవ స్థానమున భూమి బీజం లం ను, మళ్ళీ ప్రసీద తర్వతా ముందు చెప్పబడిన బీజములను సంపుట రూపంలో జోడించాలి. మహాలక్ష్మీ హృత్ నమః అని చివర జోడించాలి. మంత్ర స్వరూపము ఈ క్రింది విధంగా ఉంటుంది -

29, జనవరి 2021, శుక్రవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - అయిదవవశ్వాస - 07

 

యాగపూజారంభం

మండలం మధ్యన - ఓం బ్రహ్మణే నమః| గృహేశాయ నమః|

నైరుతిదిక్కున - వాస్తుపురుషాయ నమః| అని పూజించాలి

ఓం రక్షరక్ష హుంఫట్ స్వాహా| ఇతి భూమి మభ్యుక్ష (భూమి మీద నీళ్ళు జల్లాలి)

ఓం పవిత్రవజ్రభూమే రక్షరక్షహుం ఫట్ స్వాహా| - ఇతి భూమిం అభిమన్త్ర్య

ఆఃసురేఖే వజ్రరేఖేహుంఫట్ స్వాహా| - ఇతి భూమౌ విలిఖ్య (ఈ మంత్రమును భూమి మీద లిఖించాలి)

28, జనవరి 2021, గురువారం

శ్రీదక్షిణామూర్తి సంహిత - 1

 

ఓం శ్రీగురుస్సర్వకారణభూతాశక్తిః

శ్రీ లలితామహాత్రిపురసుందర్యై నమః

శ్రీ మహాగణపతయే నమః

[విజ్ఞప్తి: ఇందు ప్రకటించబడుచున్న మంత్రములు, ఆయా సాధనలూ సద్గురువు ద్వారా నేర్చుకొని ఆ తర్వాత మాత్రమే సాధన చేయవలెనని పాఠకులందరికీ వినయపూర్వక విజ్ఞప్తి. "విషయము ఇది" అని తెలుపుటకు మాత్రమే ఈ గ్రంథమును ఇచట ప్రచురించడం జరుగుతున్నది. గమనించ ప్రార్థన.]

25, జనవరి 2021, సోమవారం

శ్రీదక్షిణామూర్తి సంహిత - పరిచయం

 

శ్రీదక్షిణామూర్తి సంహిత

      క్తిఉపాసనను తెలుపుటకు చాలా తంత్ర గ్రంథములు కలవు. వాటిలో శ్రీదక్షిణామూర్తి సంహిత ఒకటి. భగవంతుడు శివుని మరొక రూపమైన దక్షిణామూర్తి మరియు పార్వతి సంవాదములో ఈ తంత్రము సాగుతుంది. తాంత్రిక వాఙ్మయము అత్యంత విశాలము. దక్షిణామూర్తి సంహిత ఆ విశాల వాఙ్మయమునకు ఒక చిన్న కొమ్మ. అరవైఅయిదు భాగములున్న ఈ తంత్రమునందు  శివపార్వతులు విభన్నమైన, నిగూఢమైన ఆధ్యాత్మిక శక్తులను, వారి స్వరూపములను, వారి ఉపాసనా పద్ధతులను చర్చించారు. ఏకాక్షర లక్ష్మి, మహాలక్ష్మి, త్రిశక్తి, సామ్రాజ్యప్రదావిద్యా, అష్టాక్షరపరంజ్యోతివిద్యా, మాతృకా, త్రిపురేశ్వరి, పంచకోశ, లలితా, భైరవి, కల్పలతా, మహావిద్యా, నిత్యాదుల మంత్రములు వారి ఋషి, ఛందస్సు, దేవత, బీజము, శక్తి, కీలకము వినియోగములతో బాటుగా న్యాసవిధి, యంత్ర రచన, ధ్యాన, జప, హోమద్రవ్యములు, హోమవిధి మొదలగునవి శాస్త్రోక్తముగా విశదీకరించబడినవి.

18, జనవరి 2021, సోమవారం

మహామనుస్తవం - 13, 14

 

13.   ఈశ్వరి మాయికమఖిలం ప్రావరణం చక్షుశోపహర మాతః|

       యేనామాయికమఖిలం ప్రేక్షేయతవేతి యాచతే విద్వాన్||

15, జనవరి 2021, శుక్రవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - అయిదవవశ్వాస - 06

 ద్వారదేవతా ధ్యానం

పశ్చిమద్వారస్థ దేవతా ధ్యానం:

1. పద్మద్వయవరాభీతిభాస్వత్పాణిచతుష్టయం|

పద్మవర్ణాం భజేత్పద్మాం పద్మాక్షీం పద్మవాసినీం||

8, జనవరి 2021, శుక్రవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - అయిదవవశ్వాస - 05

 మండపధ్యానం

అమృతాబ్దౌమణిద్వీపేచింతయేన్నందనవనం| చంపకాశోకపున్నాగపాటలైరుపశోభితం||

లవంగమూలతీబిళ్వదేవదారునమేరుభిఃమందారపారిజాతాద్యౌఃకల్పవృక్షైఃసుపిష్పితైః||

 చందనైఃకర్ణికారైశ్చమాతులుఙ్గైశ్చవంజులైఃదాడిమీలకుచ్చాఙ్కోలైఃపూగైఃకురుబకైరపి|| 

1, జనవరి 2021, శుక్రవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - అయిదవవశ్వాస - 04

యాగమండప నిర్మాణ విధానము

జ్ఞానార్ణవమునందు ఈ విధంగా చెప్పబడినది -

బాగుగా అలంకరించుకొని కర్పూర, కేసర (కుంకుమ పువ్వు), కుంకుమ శరీరమునకు లేపనము చేసి నవరత్నములను, ఎర్రని వస్త్రములను ధరించి తాంబూలపూరిత ముఖముతో (= నోటితో), ప్రసన్నవదనముతో సాధకుడు యాగమందిర ప్రవేశము చెయ్యాలి. యాగమండపమును గోమయముచేత లేపనము చేసి లాక్షారసమును (పారాణి) చిత్రించి, ధూపములు వెలిగించి అనేక పుష్పములతో అలంకరించాలి.