సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

13, మార్చి 2021, శనివారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - ఆరవశ్వాస - 1

 మాతృకా న్యాసము

సమస్త దేహమునందు యుక్తముగా న్యాసము చెయ్యాలి. లోపల-బయట కళాయుక్త శ్రీకంఠ విష్ణు మొదలగు వానిచే సమన్వితమైన లజ్జా-రమా-కామ (హ్రీం-శ్రీం-క్లీం) సమ్మోహన ప్రపంచయాగ దశ మాతృకాన్యాసము చెయ్యాలి. గుదమునకు రెండు అంగుళముల పైన ఉన్న సుషుమ్నా మార్గమున సూక్ష్మ రంధ్రమున వ-శ-ష-స అను నాలుగు దళముల స్వర్ణప్రభ పద్మము కలదు. అందు విద్యుల్లతాకార తేజోరుప కులకుండలినీ శక్తిని ఆరు చక్రములను భేదించుచూ ద్వాదశాంత చంద్రమధ్యమున కలపాలి. వెన్న వంటి వర్ణములో ఉండు కుండలినిని ధ్యానము చేసి ఆ తేజమును అంజలిలోకి తెచ్చి మాతృకాన్యాసము చెయ్యాలి.

అ-ఆ-ఇ-ఈ-ఉ-ఊ (6) కరతలపృష్ఠ, వ్యాపకము చెయ్యాలి.

ఋ-ఋ(2)-ఌ-ఌ(2)-ఏ-ఐ-ఓ-ఔ-అం-అః (10) అంగుళములందు న్యాసము చెయ్యాలి.

అ++++క్ష మాతృకలను ఉచ్ఛరించి కరశుద్ధి చెయ్యాలి. ప్రకోష్ఠ (ముంజేయి) - మణిబంధ - కూర్పర - కరతల - కరపృష్ఠ - కరాగ్రములను స్పర్శించడం ద్వారా కరశుద్ధి కలుగుతుంది.

అంతర్మాతృకాన్యాసము

స్వరములతో శ్వాసను పూరించి స్పర్శవర్ణములతో కుంభకము చేసి వ్యాపక వర్ణములైన య నుండి క్ష వరకు వర్ణములతో రేచకము చెయ్యాలి. ఈ విధంగా మూడుసార్లు ప్రాణాయామము చెయ్యాలి.

అస్య అంతర్మాతృకాన్యాసస్య బ్రహ్మా ఋషిః| గాయత్రీ ఛన్దః| శ్రీమాతృకా సరస్వతీ దేవతా| హలో బీజాని| స్వరాః శక్తయః| జాతావ్యక్తి కీలకం| మమశరీర శుద్యర్ధం న్యాసే వినియోగః|

అంకంఖంగంఘంఙo ఆం హృదయాయనమః| ఈ విధంగా అంగన్యాసము చెయ్యాలి.

అ నుండి క్ష వరకు వర్ణములు దేవతా అవయములు. అనిర్వాచ్య హల వర్ణము వ్యక్తము అయినప్పుడు అది శక్తి అవుతుంది. శక్తిలేకుండా శివుడు సూక్ష్మము అవుతాడు. నామము, ధామము ఏమీ ఉండవు. స్ఫురణ కలిగి ఉచ్ఛారణ చేసినంత మాత్రముననే ఈ వ్యక్తవర్ణములు సమ్ముఖములవుతాయి. ఋ-ఋ(2)-ఌ-ఌ(2) వర్ణములను వదలి స్వరముల మధ్యన ఆరువర్గముల వర్ణములతో క్రమంగా న్యాసము చెయ్యాలి. సప్తమ క్రోధసంయుక్తమును అంతమున నిక్షిప్తము చెయ్యాలి. ఈ విధంగా షడంగ న్యాసము చెయ్యాలి. షోడశదళ విశుద్ధి చక్రమునందు స్వరముల న్యాసము చెయ్యాలి. అనాహత యందు క నుండి ఠ వరకు, మణిపూరము నందు డ నుండి ఫ వరకు, స్వాధిష్ఠానమునందు బ నుండి ల వరకు, మూలాధారము నందు వ నుండి స వరకు, ఆజ్ఞా చక్రమునందు హక్ష వర్ణములను న్యాసము చెయ్యాలి. ఇది సంహితయందు చెప్పబడినది.

తంత్రసారము ప్రకారము -

మూలాధార, స్వాధిష్ఠాన, మణిపూర, అనాహత, విశుద్ధి, ఆజ్ఞా, ద్విపత్ర, షోడశార, ద్వాదశదళ, దశదళ, షడ్దళ, చతుర్దళములందు వ నుండి స వరకు, బ నుండి ల వరకు, డ నుండి ఫ వరకు, క నుండి ఠ వరకు, స్వరములు, హంక్షం లను న్యాసము చెయ్యాలి.

బహిర్మాతృకాన్యాసము

ఇంతకు మునుపు చెప్పిన విధంగానే ఋష్యాది న్యాసము చెయ్యాలి.

ధ్యానము:

ధ్యాయేద్వర్ణసరూపాఢ్యాం స్వరవక్త్రం క్రమేణహి|

కచవర్గకరాం రమ్యాం టతవర్గపదాంబుజామ్||

చవర్గచారుపాశాంగలసచ్ఛాతోదరీం పరాం|

యశవర్గాంగ శుభగాపీనోన్నతఘనస్తనీం||

నితంబినీంచగహనాం శుక్లాక్షీంక్షమమధ్యమామ్|

శుక్లమాల్యాంగ రాగాంగీం శుక్లాంశుకసుశోభితాం||

చింతాలిఖితసప్తాణీం సమగ్రవరదాయినీం|

న్యాసము:

అం నమః - బ్రహ్మరంధ్రే| ఆం నమః - ముఖమండలే| ఇం నమః - దక్షనేత్రే| ఈం నమః - వామనేత్రే| ఉం నమః - దక్షశ్రోత్రే| ఊం నమః - వామశ్రోత్రే|o నమః - దక్షనాసాపుటే| ఋ(2)o నమః - వామనాసాపుటే|o నమః - దక్షకపోలే|o(2) నమః - వామకపోలే| ఏం నమః - ఊర్ధ్వదంతపంక్తౌ| ఐం నమః - అధోదంతపంక్తౌ| ఓం నమః ఊర్ధ్వోష్ఠే| ఔం నమః - అధరోష్ఠే| అం నమః - చిబుకే| అః నమః - కంఠే|

రెండు హస్తముల కరాఙ్గులి మూలములు, కరాగ్రాములు, రెండు పార్శ్వలు, పీఠము, నాభి, ఉదరము, త్వచము, రక్త, మాంస, మేధ, అస్థి, మజ్జా, వీర్య, ధాతు, ప్రాణ, జీవులందు యకారాదులు న్యాసము చెయ్యాలి. హృదయమూలము, గళము, కుక్షిద్వయము, హృదయాదిపాదములు, హృదయాదికరముల నందు న్యాసము చెయ్యాలి. జఠరము నుండి యోనివరకు న్యాసము చెయ్యాలి.

ఈవిధమైన న్యాసము వలన సాధకుడు స్వయముగా వర్ణ స్వరూపుడవుతాడు.

[సూచన: ఏ ఏ మాతృకలతో న్యాసము చెయ్యాలో వివరించబడలేదు]

ఇంకాఉంది...

కామెంట్‌లు లేవు: