సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

19, మార్చి 2021, శుక్రవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - ఆరవశ్వాస - 2

 సృష్టిమాతృకా న్యాసము:

బ్రహ్మచారి కేవలము మాతృకాన్యాసము చెయ్యాలి. విద్వాంసుడు విసర్గయుక్త సృష్టిన్యాసము చెయ్యాలి.

స్థితిమాతృకా న్యాసము:

గృహస్థుడు కేవలము మాతృకా న్యాసము చెయ్యాలి. విసర్గ-బిందుసహిత డకారము నుండి ప్రారంభించి స్థితి న్యాసము చెయ్యాలి.

ధ్యానం:

సిందూరకాంతిమమితాభరణాం త్రినేత్రాం విద్యాక్షసూత్రమృగపోతవరాన్దధానామ్||

పార్శ్వస్థితాంభగవతీమపి కాంచనాభాం ధ్యాయేత్ కరాబ్జధృతపుస్తకవర్ణమాలామ్||

డం నమః - ఈవిధంగా బిందు విసర్గసహిత ఠం నమః వరకు అనేక స్థానములందు న్యాసము సృష్టిన్యాసము అవుతుంది.

సంహారమాతృకా న్యాసము

వానప్రస్థులు మరియు యతులు కేవలము మాతృకలతో న్యాసము చెయ్యాలి. బిందుయుక్త వర్ణములతో విలోమక్రమములో సంహార మాతృకా న్యాసము చెయ్యాలి.

ధ్యానం:

అక్షస్రజం హరిణపోతముదగ్రటంకంవిద్యాంకరైరవిరతందధతీం త్రినేత్రాం|

అర్ధేందుమౌళిమరుణామరవిందవాసాం వర్ణేశ్వరీం ప్రణమత్ స్తనభారనమ్రామ్||

క్షం నమః నుండి అం నమః వరకు సంహారన్యాసము.

కళామాతృకా న్యాసము

తారోపాసకులు కేవలము మాతృకలతో న్యాసము చెయ్యాలి. విద్వాంసులు ప్రణవాంశ కలాయుక్త వర్ణములతో న్యాసము చెయ్యాలి.

ఋషి - ప్రజాపిత| ఛందస్సు - గాయత్రి| దేవత - కళాసరస్వతి| ఓం - బీజం| నమః - శక్తిః| కళా - కీలకం| నాలుగు నపుంసక వర్ణములను వదలి ఓం తర్వాత రెండు దీర్ఘ స్వరముల మధ్యన అంగముల న్యాసము చెయ్యాలి.

ఉదా: అం హృదయాయనమః ఆం నమః| ఇం శిరసే స్వాహా ఈం నమః|...

ధ్యానం:

హస్తైః పద్మం రథాంగం గుణమథ హరిణం పుస్తకం వర్ణమాలాం టంకం శుభ్రం కపాలం దరమమృతలసద్ధేమకుంభం వహంతీం|

ముక్తావిద్యుప్త యోదస్ఫటిక నవజపాబంధురైః పంచవక్త్రై స్త్ర్యక్షైర్వక్షోజనమ్రాం సకలశశినిభాం శారదాంతాం నమామి||

ఈ ప్రకారముగా ధ్యానము చేసిన తర్వాత, ఓం నం నివృత్తికళాయై నమః మొదలుగా మాతృయకా స్థానములందు న్యాసము చెయ్యాలి.

శ్రీకంఠాది మాతృకా న్యాసము

శివభక్తులు కేవలము మాతృకలతో న్యాసము చెయ్యాలి. శ్రీకంఠాది శక్తియుక్తములతో న్యాసం చెయ్యాలి.

ఋషి - దక్షిణామూర్తి| ఛందస్సు - గాయత్రి| దేవత - అర్థనారీశ్వరుడు| హ్సౌః - బీజం| నమః - శక్తిః| శివశక్తి - కీలకం| హ్సాం, హ్సీం, హ్సూం, హ్సైం, హ్సౌం, హ్సః ఈ బీజములతో షడంగన్యాసము చెయ్యాలి.

ధ్యానం:

బన్ధూకకాంచననిభం రుచిరాక్షరమాలాం పాశాంకుశౌచవరదం నిజబాహుదండైః|

బిభ్రాణమిందుశకలాభరణంత్రినేత్రమర్ధాంబికేశమనిశం వపురాక్షయామః||

హ్సౌం అం శ్రీకంఠాయపూర్ణోదర్యై నమః| ఈ విధంగా న్యాసము చెయ్యాలి.

ఇంకాఉంది...

కామెంట్‌లు లేవు: