సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

27, నవంబర్ 2020, శుక్రవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - నాల్గవశ్వాస - 05

వర్ణవిభాగము - సృష్ట్యాది మాతృకా న్యాసములు

ఉత్తరతంత్రము ప్రకారము -

కామ్య కర్మములందు సంహారక్రమములో సానుస్వార మాతృకా న్యాసము చెయ్యాలి. పూర్వము చెప్పిన విధముగా ఋష్యాది షడంగ న్యాసములు చెయ్యాలి. సృష్ట్యాది మాతృకా న్యాసము విసర్గయుక్త మాతృకా న్యాసములతో చెయ్యాలి. బిందు, విసర్గ యుక్త స్థితి మాతృకా న్యాసము డ నుండి ప్రారంభము చేసి ఠ వరకు చెయ్యాలి.

20, నవంబర్ 2020, శుక్రవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - నాల్గవశ్వాస - 04

 

మాతృకా విధానము      

దక్షిణామూర్తి సంహిత ప్రకారము, ఇప్పుడు లోకమాత మాతృకలను చెబుతాను. అ నుండి క్ష వరకు ఉన్న మాతృకలు వర్ణదేవతయొక్క అవయములు.

19, నవంబర్ 2020, గురువారం

మహామనుస్తవం - 10

 

10.   గురుచరణైః సంక్రమితాం వర్ణమయీమంబికామనుధ్యాయన్|

       గురువరసంపదమలభే యదహం సా త్రిపురసుందరీకరుణా||

త్రిపురసుందరిని వర్ణమయీ రూపములో నిత్యమూ ధ్యానించగా నాకు ఆమె నిజమైన కరుణ వలన మహాగురురువులు అనే సంపద లభ్యమయినది.

17, నవంబర్ 2020, మంగళవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - నాల్గవశ్వాస - 03

 

(శివుడు చెప్పుచున్నాడు) - హే దేవీ! వీటి వైభవ వర్ణమును చెప్పెదను సావధానముగా వినుము. ఇవి తిర్యక్-పైన-క్రింద స్థానములందు ఆరోహణ, అవరోహణ క్రమములో ఉంటాయి. సమస్త-వ్యస్త, ప్రతిలోమ-అనులోమ, అవస్థాత్రయరూపములో వ్యాప్య-వ్యాప్యభేదములో ఉంటాయి. వర్ణగుంఫిత యోగమువలన ఇవి తైజసమూర్తులవుతున్నాయి. ఇది సూత్రప్రాయముగా కుండలినీ రూపములో ఉంటుంది. 16 స్వరములూ 16 చంద్రునికలలు. మకారమును వదలి మిగిలిన 24 స్పర్శవర్ణములూ సూర్యకలలు. దశవ్యాపకములు దశ కళలు. ఆరోహణ క్రమములో వీటి సంఖ్య సగము అవుతాయి మరియు అవరోహణమునందు కూడా అంతే అవుతాయి. ప్రకృతిస్థ సూర్యకలలు వాటి రెండింటికీ సమానమవుతాయి. సోమ-వహ్ని కళలు అప్రాకృతములు. రెండింటియందు మకారము యొక్క కళలు 76. ఆరోహణ-అవరోహణ క్రమమునందు 28 కళలు. వీటి నిజకళలను పూర్ణమండలము అని అంటారు.

13, నవంబర్ 2020, శుక్రవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - నాల్గవశ్వాస - 02

 

అవరోహణ క్రమము

లోపాముద్ర పదిహేనువర్ణముల మంత్రమునందు మిధునము ఉన్నది. నవవర్ణములందు 16 స్వరముల యోగము వలన 9x16 = 144 యుగ్మములు అవుతాయి. పంచబ్రహ్మత్రిమూర్తి రశ్ములకు తారోత్థ కళలు రెండేసి ఉంటాయి. నవాత్మేశ్వర వర్ణముల కలలనుండి అన్యకలలు వేరు.

6, నవంబర్ 2020, శుక్రవారం

శ్రీవిద్య చర్చా వేదికకు ఆహ్వానం

 శ్రీవిద్య చర్చా వేదిక శ్రీవిద్య సాధక మార్గపు అనుభవైక సుమమాలిక

శ్రీవిద్య బ్రహ్మ విద్య, శ్రీ విద్యోపాసన ఒక తంత్ర శాస్త్రము. తంత్రములు వేదానుకూల విషములనే బోధించుచున్నాయి, కావున వేదములు, తంత్రములు కలిపి ఆగమములందురు.

శ్రీవిద్యను గూర్చి త్రిపురోపనిషత్తు, భావనోపనిషత్తు - అధర్వణ వేదీయ సౌభాగ్య ఖండమునఅరుణోపనిషత్తును - యజుర్వేదములోజీవ బ్రహ్మైక్యమునకును గూర్చి మహావాక్యములను - ఋగ్వేదమునకు చెందిన బహ్వృచోపనిషత్తులో శ్రీవిద్యా వేదప్రమణాన్ని రూఢీ చేస్తున్నాయి.

ఇట్టి అనంతమైన అనుభవేద్యమైన శ్రీవిద్య ఉపాసన ఫలితాలను అనుభవంలోకి రావడానికి ప్రయత్నిస్తున్న సాధక లోకానికి తమ అనుభవాలను అందరికీ పంచడానికి, ఉపాసనా మార్గంలో ముందుకు సాగడానికి, వివిధ అనుమానముల నివృత్తికి ఈ చర్చా వేదిక సాదరంగా అహ్వానిస్తోంది.    

శ్రీవిద్యార్ణవ తంత్రము - నాల్గవశ్వాస - 01

 

రశ్ముల లక్షణము - వాటి ప్రమాణము

అన్నిమంత్రములలో గోప్యమైన మాతృకా వైభవము యొక్క వర్ణన ఇక్కడ చెయ్యబడుచున్నది. వీటిని తెలుసుకోవడం వలన సంప్రదాయానుసార సాధకుల సంశయము నాశనము అవుతుంది. మాతృకారశ్మి బోధన ద్వారా మంత్రోద్ధారము స్వయంగా చెయ్యాలి. మొదట మాతృకా రశ్ముల క్రమము తెలుసుకోదగినది.

5, నవంబర్ 2020, గురువారం

మహామనుస్తవం - 9

 

9.    పారితోమాంవిసరన్తీ మూర్ధ్వమూర్ధ్నోవతీర్య విలసంతీమ్|

       నిధ్యాయన్నధ్యాత్మం భాసం పదయోః స్మరామిసుందర్యాః||

ఆధ్యాత్మిక ద్యుతి సహస్రారమునుండి ప్రసరించి మొత్తం శరీరమంతా ప్రసరిల్లుచూ తడుపుచూ ఉన్నప్పుడు ఆ ద్యుతి శ్రీమహాత్రిపురసుందరీ పాద ద్యుతియే అని స్మరించుచున్నాను.

2, నవంబర్ 2020, సోమవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - నాల్గవశ్వాస - విషయసూచిక

 

విన్నపము: ఈ శ్వాసనుండి క్రియావిధానములు తెలుపబడును. అర్ధం చేసుకోవడానికి కొన్ని సులభతరంగాను, కొన్ని క్లిష్ఠంగాను ఉండును. ఈ శ్వాసలలో చెప్పబడు సమయ, దక్షిణ, వామ, కౌళ క్రియా విధానములు, మంత్రములు పాఠకుల అవగాహనకొరకు మాత్రమే ఇవ్వబడుచున్నవి. నేటి సామాజిక పరిస్థితుల దృష్ట్యా కొన్ని సాధనలు ఆచరణయోగ్యము కావు. కానీ వీటిని ఆచరించదలచినచో సరైన గురువు యొక్క మార్గదర్శకత్వంలో మాత్రమే వీటిని సాధనచెయ్యగలరు. అన్యథా చేసినచో కొన్ని చిక్కులు కలగవచ్చును. ఇందు సాధనా రహస్యములు మూలగ్రంథమును అనువదించి ఇవ్వబడుచున్నవి. ఆయా రహస్యములను అనువాదకుని అభిప్రాయముగా, సాధనాక్రమములుగా భావింపరాదు.