సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

17, నవంబర్ 2020, మంగళవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - నాల్గవశ్వాస - 03

 

(శివుడు చెప్పుచున్నాడు) - హే దేవీ! వీటి వైభవ వర్ణమును చెప్పెదను సావధానముగా వినుము. ఇవి తిర్యక్-పైన-క్రింద స్థానములందు ఆరోహణ, అవరోహణ క్రమములో ఉంటాయి. సమస్త-వ్యస్త, ప్రతిలోమ-అనులోమ, అవస్థాత్రయరూపములో వ్యాప్య-వ్యాప్యభేదములో ఉంటాయి. వర్ణగుంఫిత యోగమువలన ఇవి తైజసమూర్తులవుతున్నాయి. ఇది సూత్రప్రాయముగా కుండలినీ రూపములో ఉంటుంది. 16 స్వరములూ 16 చంద్రునికలలు. మకారమును వదలి మిగిలిన 24 స్పర్శవర్ణములూ సూర్యకలలు. దశవ్యాపకములు దశ కళలు. ఆరోహణ క్రమములో వీటి సంఖ్య సగము అవుతాయి మరియు అవరోహణమునందు కూడా అంతే అవుతాయి. ప్రకృతిస్థ సూర్యకలలు వాటి రెండింటికీ సమానమవుతాయి. సోమ-వహ్ని కళలు అప్రాకృతములు. రెండింటియందు మకారము యొక్క కళలు 76. ఆరోహణ-అవరోహణ క్రమమునందు 28 కళలు. వీటి నిజకళలను పూర్ణమండలము అని అంటారు.


వీటి సంపూర్ణ యోగము చేత స్వరూపానుసాధన సిద్ధికలిగిస్తుంది. వీటి జపము 1008 లేక 108 లేక 28 సార్లు సావధానముగా చెయ్యాలి. వీటి జపము వలన మంత్రవీర్యులయి అనాయాసముగా సిద్ధిపొందుతారు. ఈ ప్రకారముగా నిజ కలల వర్ణన చెయ్యబడినది. ఇప్పుడు సంకీర్ణకలల గురించి చెప్పబడుతున్నది. 28 వర్ణములందు ప్రత్యేక సంకీర్ణ కళాసంఖ్య 28-28. క నుండి ఠ వరకు మైయు బ నుండి ఢ వరకు 12 వర్ణములూ సూర్య కళలు. 16 స్వరములూ చంద్ర కళలు. య నుండి క్ష వరకు అగ్నికళలు 10. సోమ, సూర్య, అగ్ని సంకీర్ణ కలల సంఖ్య 1444. అసంకీర్ణ కలల పూర్ణ మండల సంఖ్య కూడా ఇదే అవుతుంది. అన్ని కలలూ 1220 ఉంటాయి.

మకారము యొక్క సంకీర్ణ కల 1440. నిశ్శేష కళలు 44. హ్రస్వ స్వరములు పుంరూపములు. దీర్ఘ స్వరములు స్త్రీ రూపములు. కొన్ని నపుంసకములు మరియు కొన్ని ఉభయులు. కేవలము మకారము సదాశివ పురుష రూపము. అది బిందు రూపములో సర్వాత్మా, సర్వత్రసాక్షీ అయ్యి సర్వమునూ చేయుచున్నది.

ఓ పార్వతీ! ఇప్పుడు వ్యోమవర్ణముల స్వరూపమును విను. హకారము పరమ వ్యోమము. అది నిర్గుణ, నిర్మలా, శుద్ధ, నిత్య, నిరంజన పురుష గుణాతీతము. మకారము సగుణ పురుషము. సకారము జలాత్మకము, వ్యోమశబ్దాతీతము మరియు నిరంజనము. నకారము శూన్యరూపీ, వాయ్వాత్మకము. ణకారము ధరణీయుక్తము. ఞకూడా ధరణీయుక్తము. ఙ మరుదాత్మకము. అళు-అళూకారములు వ్యోమవర్ణ, పృద్ధ్వీ, అగ్ని పంచభూతములు.

ఇప్పుడు వాయువర్ణముల స్వరూపమును విను. యకారము  నిర్గుణ వాయురూప ప్రణామయశివరూపము. ఫకారము జీవభూత జీవన ఆత్మా సమీరము. పకారము అగ్నిరూపవాయుస్పర్శాత్మకము. తాకారము వ్యోమరూప వాయు సర్వార్ధ తత్త్వము. టకారము స్తంభరూప వాయుక్షిత్యాత్మకము. చకారము అగ్న్యాత్మక వాయుసౌమ్యరూప మహేశ్వర రూపము. కకారము ఖాత్మకవాయు సర్వలోకవిమోహక రూపము. ఐకారము రుద్రరూప వాయు వ్యోమాత్మకము. ఆకారము శబ్దరూపీ వాయు అగ్న్యాత్మకము. అకారము సగుణ వాయుతేజసఅవ్యయనిధి రూపము.

ఓ పార్వతీ! ఇప్పుడు అగ్నివర్ణముల స్వరూపము చెబుతాను విను. ఆగ్నేయ మకారము శుద్ధ నిర్మలాకారము. క్షకారము మరుద్వాపీ సగుణ వాయువర్ణము. ఫకారము అగ్న్యాత్మకవర్ణము, వ్యోమరూపీ మరియు పరాత్పరము. ధకారము వ్యోమరూపము, ఆగ్నేయవ్యక్త విగ్రహము. ఠకారము అగ్ని-చంద్ర రూప సలిలాత్మక అక్షరము. ఛకారము సలిలాత్మక అగ్నిసర్వస్తంభనకారకము. ఖకారము వాయువ్యాపి, తేజవర్ణపరాత్పరము. ఏకారము అగ్ని-వాయురూపము మరియు అన్ని మంత్రార్ధముల జీవనము. తేజత్రయాత్మక వహ్నిఇకారము శాక్త అక్షరము. ఈకారము అగ్ని-వాయురూప సర్వబీజాత్మకము.

ఓ ప్రియా! ఇప్పుడు భూమి వర్ణము యొక్క స్వరూపమును సావధానముగా వినుము. లకారము పృద్ధ్వీవర్ణ, నిర్గుణ, పరమ అవ్యయము. లకారము సగుణ భూమి వర్ణ వాయ్వాత్మకము. వకారము అమృతరూపి, క్షితివర్ణ అవ్యయము. దకారము అగ్న్యాత్మక శంభు భూమివర్ణ మహా ప్రభువు. డకారము క్షితివర్ణము. జకారము అమృతాత్మక భూమి వర్ణ అమృత ప్రదాయకము. గకారము వాయురూప క్షితివర్ణ నిరోధకము. ఓకారము వ్యోమరూప పృద్ధ్వీవర్ణ పరాత్పరము. ఊకారము ఆగ్నేయాత్మక శంభు విశ్వరూప భూమి వర్ణము. ఉకారము అనిలరూప పృద్ధ్వీవర్ణ వ్యాపకము.

ఓ మహేశ్వరీ! ఇప్పుడు జలవర్ణ స్వరూపమును వినుము. వకారము అమృతబీజనిర్గుణ పరమశివ రూపము. సకారము చంద్రరూప శాక్త వర్ణ జలరూపము. భకారము ధరాత్మక సలిలవర్ణ పరమశివ రూపము. ధకారము వ్యోమాత్మకము, పాథస (జల, సూర్య, అగ్ని, ఆకాశ, వాయు, అన్నము) మహేశ్వర రూపము. ఢకారము జలవర్ణ విశ్వవ్యాపీ భౌమాత్మకము. ఝకారము వాయ్వాత్మక సలిలవర్ణ అవ్యయ పురుష రూపము. ఘకారము వాయురూపీ సలిలవర్ణ మహాప్రభువు. ఔకారము వ్యోమరూపీ, వ్యోమవ్యాపీ జలార్ణవము. ఋ-ఋ(2) అగ్న్యాత్మక సలిలవర్ణ విశ్వరూపము.

హే పరమేశ్వరీ! ఈప్రకారము మాతృకావర్ణ వైభవము తెలుపబడినది. తేజసత్రయ విధానముగా వీటి రూపవర్ణన చెయ్యబడినది. మంత్రములందు ఈ రూపముల భావన అహర్నిశలు చేయవలెను. ఈ వీర్యప్రకాశనము అన్ని మంత్రములందు గోప్యము. ఈ మంత్రవీర్యుని స్మరించి సాధకుడు ప్రశాంత చిత్తముతో జపము చెయ్యాలి. ఈ విధమైన సాధన వలన అల్పకాలములో సాధకునికి మంత్రసిద్ధి ప్రాప్తిస్తుంది.

మంత్రవీర్యక్రమము - సప్రకారాంతము

తంత్రరాజమునందు ఈ విధంగా చెప్పబడినది -

ఓ ప్రాజ్ఞీ! విప్పుడు సుఖాస్పద మంత్రము చెబుతాను సావధానముగా వినుము. ఈ మంత్ర జ్ఞానము వలన మనుష్యుడు జీవన్ముక్తుడవుతాడు. సమస్త ప్రపంచమునకు శక్తిమూర్తి యొక్క తేజము కారణము. యుక్తమైన తత్త్వరూప అనుసంధానము చేత సిద్ధి కలుగుతుంది. మంత్రములందు మంత్రవీర్యము జీవము. మంత్రమునందు అయోగ్య వచనము వలన అసమ్యక్త్వము (=అపూర్ణము) కలుగుతుంది. భజన కాలమునందు సంశయము వలన మంత్రము అసమ్యక్త్వము అవుతుంది. గురువును అవమానించడం వలన, పాపము వలన, నిషిద్ధ ఆచారము వలన కూడా అసమ్యక్త్వము అవుతుంది. దేవతా ద్రోహము మరియు నిందవలన కూడా ఆ విధంగా అవుతుంది. అసంప్రదాయము వలన, అజ్ఞానము వలన, అనేక భజనలవలన కూడా అసమ్యక్త్వము అవుతుంది. సంయక్త్వము వలన ఎవరు మంత్రవీర్యుడవుతాడో వాని వర్ణన ముందే చెప్పబడినది.

ఉత్తరతంత్రము ప్రకారము - మంత్రవీర్య వర్ణన తెలియకపోతే మంత్రము నిశ్చేతనము అవుతుంది. శ్రేష్ఠసాధకుడు మూలాధారము నుండి బ్రహ్మరంధ్రము వరకు కోటిసూర్యుల ప్రభకు, కోటి విద్యుల్లతలకు, కోటి చంద్రప్రభలకు  సమానమైన, జగత్తు యొక్క ఉత్పత్తి, రక్షా మరియు అంతము చేసే జ్ఞాన చిత్కళ, 38 కలల సర్వమన్త్రమయీ పరాదేవీ, సర్వతేజోమయీ, దివ్యా, పరమామృత జృంభిణీ, షట్చక్రమార్గనిలయా, వ్యోమషట్క అవలంబినిని దీర్ఘకాలము ధ్యానమునందు భావించాలి. దాని లోపల 38 దళములు కమలమును భావించి ఆ దలములందు వర్ణముల కుండలీ సూత్రమును తేజత్రయాత్మకముగా ధ్యానము

చేసి సోమసూర్యాగ్ని కళలను స్మరించాలి. గమాగమ విభేదము చేత, తిర్యక్-ఊర్ధ్వ విభేదము చేత, పంచ అవస్థల చేత, పైనా-క్రింద భేదము చేత, సమస్త- వ్యస్త రూపము చేత, సర్వావస్థల క్రమము చేత, షట్కర్మములందు విశేషంగా తేజస్త్రయాత్మక వర్ణములతో మూలమంత్రమును జోడించి జపము చెయ్యాలి. సాధకుని వర్ణానుసారము చక్రముల భావన చెయ్యాలి. తర్వాత బ్రహ్మకంకాళమున చక్రమును ధ్యానం చెయ్యాలి. మొదట ఆధారచక్రము, తర్వాత కులదీపము, ఆ తర్వాత వజ్రచక్రము, ఆ తర్వాత స్వాధిష్ఠాన చక్రము, ఆ తర్వాత రౌద్రకరాళ చక్రము, గహ్వరాత్మక విద్యాపద, త్రిముఖ త్రిపద కాలదండ ఝంకార చక్రము, ఆ తర్వాత కాలఅంగారకారక దీపక క్షోభక ఝంభకానంద కలికాత్మక మణిపూర చక్రలాకుల కాలభేదన మహోత్సాహ పరమపదమును ధ్యానం చెయ్యాలి. అనాహత తర్వాత ఛన్దఃసంఖ్యా చక్రముంటుంది. దాని తర్వాత వైష్ణవ చక్రము, ఆ తర్వాత షణ్ముఖ, షట్పద చక్రములుంటాయి. ఆ తర్వాత లంబికా, లంబికాస్థాన, ఇందుచక్రము, బిందు చక్రము, నాద చక్రము, నాదాంత చక్రము, శక్తి చక్రము, సహస్రారము ఉంటాయి. ఈ చక్రక్రమము 38 కలల యొక్క స్థానము. మూలాధారము నుండి 10 చక్రములు వహ్నిస్థానములు. ఆ తర్వాత ఉన్న 12 చక్రములు సూర్యస్థానములు. దానిపైన ఉన్న 16 చక్రములూ చంద్ర స్థానములు.

కుండలినీ మహాశక్తి అన్నిఅవస్థలందునూ సోమ, సూర్య, అగ్ని భావము చేత ఉంటుంది. అగ్ని-సూర్య-చంద్ర, చంద్ర-సూర్య-అగ్ని, సూర్య-సోమ-అగ్ని, అగ్ని-చంద్ర-సూర్య, సూర్య-చంద్ర-అగ్ని, అగ్ని-సూర్య-చంద్ర ఈ 18 ప్రభేద ప్రతిలోమ- అనులోమ క్రమము నుండి సాంకర్య భేదములో అవుతాయి. ఈ ప్రకారముగా కులభేదము 48 విధములుగా ఉంటుంది. ఈ విధములయిన నియమముల చేత మూల మంత్రము గ్రంథస్థము చెయ్యబడినది. అన్ని మంత్రములూ ఉచ్ఛారణ మాత్రముచేత వీర్యమంతమవుతాయి. ఇది సత్యము. ఇందు సంశయము లేదు.

ఇప్పుడు మరియొక ప్రకారముగా మంత్రవీర్యమును చెప్పబడుచున్నది. 38 కళల నామమాల సర్వార్ధ సాధిని అవుతుంది. ఇందు మకారము మేరు రూపము. దీని ఒకొక్క అక్షరము మంత్రజపము చేయడం వలన మంత్రసిద్ధి కలుగుతుంది. ఇంకొక ప్రకారము, వాగ్భవ, బ్రహ్మబీజ, శ్రీబీజ, విష్ణుబీజ, మాయాబీజ, రుద్రబీజముల నుండి తేజత్రయామిక, గుణత్రయాత్మక, త్రిమూర్తికలల మూడు బీజములను వేరువేరుగా జోడించి ముందు చెప్పిన విధముగా జపము చెయ్యాలి. దీనివలన మంత్రము వీర్యవంతమవుతుంది. ఇది సత్యము. ఇందు సంశయము లేదు.

ఇప్పుడు మరొకవిధానము చెప్పబడుచున్నది - హకారమును సూర్య అంటారు. సూర్యుడు వహ్న్యాత్మకము. సకారము చంద్రుడు. ఔకారము సోమరూపము. బిందువు ఆకాశము. ప్రాణదూతీ నామాది బీజములను వేరువేరుగా ఒక వెయ్యిసార్లు జపము చేస్తే అప్పుడు అన్ని మంత్రదోషములూ నాశనమయ్యి మంత్రము వీర్యమంతమవుతుంది. ఓ పార్వతీ! ఈ నాలుగు మంత్రవీర్యముల ప్రకాశనములు సాధకులు వాని యోనిసమానముగా గుప్తముగా ఉంచాలి.

ఓ ప్రాజ్ఞీ! ఇప్పుడు ప్రకారాంతరమునుండి మంత్రవీర్యమును వినుము. దీక్షాకాలమునందు గురువు మంత్రమును ఏ రూపంగా ఇస్తారో ఆ రూపమును సావధానముగా ధ్యానించాలి. ఆ రూప భావనను వ్యోమచక్రమునందు పరమామృత రూపముగా చెయ్యాలి. మాతృకాక్షరమాలను వెయ్యిసార్లు జపము చెయ్యాలి. తదనంతరము గురుకృపచేత మంత్రము వీర్యవంతమవుతుంది. ఈ మంత్రవీర్య సుగమము మూడులోకములందునూ దుర్లభము.

ఇంకాఉంది...

కామెంట్‌లు లేవు: