సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

6, నవంబర్ 2020, శుక్రవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - నాల్గవశ్వాస - 01

 

రశ్ముల లక్షణము - వాటి ప్రమాణము

అన్నిమంత్రములలో గోప్యమైన మాతృకా వైభవము యొక్క వర్ణన ఇక్కడ చెయ్యబడుచున్నది. వీటిని తెలుసుకోవడం వలన సంప్రదాయానుసార సాధకుల సంశయము నాశనము అవుతుంది. మాతృకారశ్మి బోధన ద్వారా మంత్రోద్ధారము స్వయంగా చెయ్యాలి. మొదట మాతృకా రశ్ముల క్రమము తెలుసుకోదగినది.


రశ్మీక్రమము తెలుసుకొని ఎవరైతే మంత్రోద్ధారము చేస్తారో వారికి అంధకారస్థితియందు కూడా వస్తువులు ప్రత్యక్షంగా దృష్టిగోచరమవుతాయి. అందువలన గురువుద్వారా లేదా శాస్త్రముల ద్వారా సాధకుల శంకలూ నిర్మూలితమవుతాయి. సిద్ధిప్రాప్తమునకు మంత్రస్వరూపము మరియు మంత్రజ్ఞానము పరమ ఆవశ్యకము. మంత్రవీర్యుని ప్రబోధము వలన అనాయాసముగా సిద్ధి లభిస్తుంది. మంత్రవీర్యుని నుండి కాకుండా మంత్రమును వేరొక విధముగా గ్రహించి జపము చేస్తే కోటి కల్పములకు కూడా సిద్ధి కలగదు. వర్ణముల యొక్క రశ్ముల నిశ్చితరూపము నుండి శ్వాసరూపమును అర్ధం చేసుకోవాలి. ఆ శ్వాస పూర్ణరూపము, ఆరువందల కన్నా అధికము. సూర్య-చంద్ర భేదము నుండి, క్రూర-సౌమ్య ప్రభేదము నుండి, పింగళ-ఇడా విభేదమునుండి ఈ శ్వాస అర్ధరూపము అవుతుంది. మూలాధార, నాభిపద్మ, స్వాధిష్ఠాన, అనాహతా, విశుద్ధి, ఆజ్ఞా - ఈ ఆరుచక్రములందు ఇది ఉంటుంది. ప్రతీచక్రము మూడువేల ఆరువందలకన్న అధికము. మూలాధారమునందు భూమిరూపముగాను, స్వాధిష్ఠానమందు తేజస్సురూపంగాను, మణిపూరమందు జలరూపంగాను, అనాహతనందు  వాయురూపంగాను, విశుద్ధినందు ఆకాశతత్త్వ రూపంగాను, ఆజ్ఞాచక్రమునందు మానస రూపముగాను దీని స్థితి ఉంటుంది. మూలాధార నాలుగు దళములందు క్రమంగా వం, షం, శం, సం వర్ణములుండును.  ఒకొక్క వర్ణమునందు తొమ్మిదివందల శక్తులు ఉంటాయి. వీటిలో ఒకొక్క దళమునందు 14 పార్థివ (భూమి) రశ్ములుండును మొత్తం 56. మణిపూర దళమునందు డ నుండి ఫ వరకు జలవర్ణములుంటాయి. ఒకొక్క వర్ణమునందు 52 రశ్ములుండును. స్వాధిష్ఠాన ఆరుదళములందు బ నుండి ల వరకు వర్ణములుంటాయి. ఒకొక్క వర్ణములందు 62 రశ్ములుంటాయి. అనాహత ద్వాదశ దళములందు క నుండి ఠ వరకు వర్ణములుంటాయి. ఒకొక్క వర్ణమునందు 54 రశ్ములుంటాయి. ఈ రశ్ములు వాయు తత్త్వములు. విశుద్ధి షోడశదళమునందు 16 స్వరములుంటాయి. ఒకొక్క వర్ణమునందు 72 రశ్ములుంటాయి. ఆజ్ఞా చక్ర రెండు దళములందు హ-క్ష అను వర్ణములుంటాయి. ఒకొక్క వర్ణమునందు 64 రశ్ములుంటాయి. ఈ షట్చక్రములందు 360 రశ్ములుంటాయి. ఒకొక్క వర్ణమునుండి సమాశ్రితమయి ఈ 360 రశ్ములుంటాయి. ఈ రశ్ములను పార్థివాదులంటారు.

వర్ణముల మూలసంకీర్ణ రశ్ములు

ఇప్పుడు సంకీర్ణ రశ్ముల పేర్లు చెప్పబడుచున్నవి. మూలాధార చక్రములో ఉన్న 56 రశ్ములను పార్ధివ రశ్ములు అని అంటారు. ఈ కిరణములు సుఖదాయినులు. ఇందులో సుందరీ త్రిపురాది - సుందర త్రిపురాది, హృదయదేవి - హృదయదేవ, శిరోదేవి - శిరోదేవ, కవచదేవి - కవచదేవ, నేత్రదేవి - నేత్రదేవ, అస్త్రదేవి - అస్త్రదేవ, కామేశ్వరి - కామేశ్వర, భగమాలిని - భగమాల, నిత్యక్లిన్నా - నిత్యక్లిన్న, భేరుండా - భేరుండ, వహ్నివాసిని - వహ్నివాసి, మహావజ్రేశ్వరీ - మహావజ్రేశ్వర, శివాదూతీ - శివాదూత, త్వరితా - త్వరిత, కులసుందరీ - కులసుందర, నిత్యా - నిత్య, నీలాపతాకా - నీలాపతాక, విజయా - విజయ, సర్వమంగళా - సర్వమంగళ, జ్వాలామాలినీ  - జ్వాలామాలి, చిత్రా - చిత్ర, మహానిత్యా - మహానిత్య, పరమేశీ - పరమేశ, మిత్రేశీ - మిత్రేశ, షష్ఠీశమయీ - షష్ఠీశ, ఉడ్డీశమయీ - ఉడ్డీశ, చర్యానాథమయీ - చర్యానాథ| ఈ పార్ధివ సమూహము సాధకుల అభీష్టదాయకులు.

జలరశ్ములు

మణిపూర చక్రమునందున్న 52 రశ్ముల నామములు-

లోపాముద్రామయీ - లోపాముద్రామయ, అగస్త్యమయీ - అగస్త్యమయ, కాలతాపన శబ్దాదిమయీ - కాలాదితాపనమయా, ధర్మాచార్యమయీ - ధర్మాచార్యమయ, ముక్తకేశ్వరాదిమయీ - ముక్తకేశ్వరాదిమయ, దీపకలానాధమయీ - దీపకలానాథమయా, విష్ణుదేవమయీ - విష్ణుదేవమయా, ప్రభాకరదేవమయీ - ప్రభాకరదేవమయా, తేజోదేవమయీ - తేజోదేవమయా, మనోదేవమయీ - మనోదేవమయ, కళ్యాణదేవమయీ - కళ్యాణదేవమయ, రత్నదేవమయీ - రత్నదేవమయ, వాసుదేవమయీ - వాసుదేవమయ, రామానందమయీ - రామానందమయ, అణిమాసిద్ధి - అణిమాసిద్ధ, లఘిమాసిద్ధి - లఘిమాసిద్ధ, మహిమాసిద్ధి - మహిమాసిద్ధ, ఈశిత్వసిద్ధి - ఈశిత్వసిద్ధ, వశిత్వసిద్ధి - వశిత్వసిద్ధ, ప్రాకామ్యసిద్ధి - ప్రాకామ్యసిద్ధ, భుక్తిసిద్ధి - భుక్తిసిద్ధ, ఇచ్చాసిద్ధి - ఇచ్చాసిద్ధ, ప్రాప్తిసిద్ధి - ప్రాప్తిసిద్ధ, సర్వకామసిద్ధి - సర్వకామసిద్ధ, బ్రాహ్మీ - బ్రహ్మ, మాహేశీ - మాహేశ|

తైజస రశ్ములు

స్వాధిష్ఠానమున ఉన్న 62 రశ్ములు-

కౌమారీ - కుమార, వైష్ణవి - విష్ణు, వారాహీ - వారాహ, మాహేన్ద్రీ - మహేంద్ర, సర్వాకర్షిణి - సర్వాకర్షణ, చాముండా - చాముండ, మహాలక్ష్మీ - మహాలక్ష్మి, సర్వసంక్షోభిణీ - సర్వసంక్షోభణ, సర్వవిద్రావిణీ - సర్వవిద్రావణ, సర్వవశంకరీ - సర్వవశంకర, సర్వోన్మాదినీ - సర్వోన్మాదన, సర్వమహాంకుశా - సర్వమహాంకుశ, సర్వఖేచరీ - సర్వఖేచర, సర్వబీజా - సర్వబీజ, సర్వయోనీ - సర్వయోన, త్రిఖండా - త్రిఖండ, త్రైలోక్యచక్రస్వామినీ - త్రైలోక్యచక్రస్వామి, ప్రకటయోగినీ - ప్రకటయోగ, కామాకర్షిణి - కామాకర్షణ, బుద్ధ్యాకర్షిణీ - బుద్ధ్యాకర్షణ, అహంకారాకర్షిణీ - అహంకారాకర్షణ, శబ్దాకర్షిణీ - శబ్దాకర్షణ, స్పర్శాకర్షిణీ - స్పర్శాకర్షణ, రూపాకర్షిణీ - రూపాకర్షణ, రసాకర్షిణీ - రసాకర్షణ, గంధాకర్షిణీ - గంధాకర్షణ, చిత్తాకర్షిణీ - చిత్తాకర్షణ, ధైర్యాకర్షిణీ - ధైర్యాకర్షణ, స్మృత్యాకర్షిణీ - స్మృత్యాకర్షణ, నామాకర్షిణీ - నామాకర్షణ, బీజాకర్షిణీ - బీజాకర్షణ| (పూర్వాది దళములలో క్రమముగా)

వాయవ్య రశ్ములు  

ద్వాదశదళ అనాహత యందు 54 రశ్ములు పూర్వాది క్రమములో-

ఆత్మాకర్షిణీ - ఆత్మాకర్షణ, అమృతాకర్షిణీ - అమృతాకర్షణ, శరీరాకర్షిణీ - శరీరాకర్షణ, సర్వాశాపరిపూరకచక్రస్వామినీ - సర్వాశాపరిపూరకచక్రస్వామీ, గుప్తయోగినీ - గుప్తయోగి, అనంగకుసుమా - అనంగకుసుమ,  అనంగమేఖలా - అనంగమేఖల, అనంగమదనా - అనంగమదన, అనంగమదనాతురా - అనంగమదనాతుర, అనంగారేఖా - అనంగరేఖ, అనంగవేగినీ - అనంగవేగ, అనంగాంకుశా - అనంగాంకుశ, అనంగమాలినీ - అనంగమాలిన్, సర్వసంక్షోభణచక్రస్వామినీ - సర్వసంక్షోభణచక్రస్వామీ, గుప్తతరయోగినీ - గుప్తతరయోగి, సర్వసంక్షోభిణీ - సర్వసంక్షోభణ, సర్వవిద్రావిణీ - సర్వవిద్రావణ, సర్వాకర్షిణీ - సర్వాకర్షణ, సర్వాహ్లాదినీ - సర్వాహ్లాదన, సర్వసమ్మోహినీ - సర్వసమ్మోహన, సర్వస్తంభినీ - సర్వస్తంభన, సర్వజృంభిణీ - సర్వజృంభణ, సర్వావశంకరీ - సర్వవశంకర, సర్వరంజనీ - సర్వరంజన,  సర్వోన్మాదినీ - సర్వోన్మాదన, సర్వార్ధసాధినీ - సర్వార్ధసాధన, సర్వసంపత్తిపూరణీ - సర్వసంపత్తిపూరణ|

ఆకాశ రశ్ములు

విశుద్ధి చక్రమునందు ఉండు 72 రశ్ములు పూర్వాది దళమునుండి క్రమముగా -

సర్వమంత్రమయీ - సర్వమంత్రమయా, సర్వద్వంద్వక్షయంకరీ - సర్వద్వంద్వక్షయంకర, సర్వసౌభాగ్యదాయకచక్రస్వామినీ - సర్వసౌభాగ్యదాయకచక్రస్వామీ, సంప్రదాయయోగినీ - సంప్రదాయయోగి, సర్వసిద్ధిప్రదా - సర్వసిద్ధిప్రద, సర్వసంపత్ప్రదా -  సర్వసంపత్ప్రద, సర్వప్రియంకరీ - సర్వప్రియంకర, సర్వమంగళకారిణీ - సర్వమంగళకారీ, సర్వకామప్రదా - సర్వకామప్రద, సర్వదుఃఖవిమోచీనీ - సర్వదుఃఖవిమోచన, సర్వమృత్యుప్రశమనీ - సర్వమృత్యుప్రశమన, సర్వవిఘ్ననివారిణీ - సర్వవిఘ్ననివారణ, సర్వాంగసుందరీ - సర్వాంగసుందర, సర్వసౌభాగ్యదాయినీ - సర్వసౌభాగ్యదాయక, సర్వార్ధసాధకచక్రస్వామినీ - సర్వార్ధసాధకచక్రస్వామీ, కుళోత్తీర్ణయోగినీ - కుళోత్తీర్ణయోగి, సర్వజ్ఞా - సర్వజ్ఞ, సర్వశక్తిప్రదా - సర్వశక్తిప్రద, సర్వైశ్వర్యప్రదా - సర్వైశ్వర్యప్రద, సర్వజ్ఞానమయీ - సర్వజ్ఞానమయ, సర్వవ్యాధివినాశినీ - సర్వవ్యాధివినాశక, సర్వాధారస్వరూపిణీ - సర్వాధారస్వరూప, సర్వపాపహరా - సర్వపాపహర, సర్వానందమయీ - సర్వానందమయ, సర్వరక్షాస్వరూపిణీ -  సర్వరక్షాస్వరూప, సర్వేప్సితఫలప్రదా - సర్వేప్సితఫలప్రద, సర్వరక్షాకరచక్రస్వామినీ - సర్వరక్షాకరచక్రస్వామీ, నిగర్భయోగినీ - నిగర్భయోగి, వశినీ - వశీ, కామేశ్వరీ - కామేశ్వర, మోదినీ - మోదీ, విమలా - విమల, అరుణా - అరుణ, జయనీ - జయీ, సర్వేశ్వరీ - సర్వేశ, కౌలినీ - కౌలిక|

మానస రశ్ములు

ఆజ్ఞాచక్రమునందు ఉండు 64 రశ్ములు -

సర్వరోగహరచక్రస్వామినీ - సర్వరోగహరచక్రస్వామి, రహస్యయోగినీ - రహస్యయోగి, బాణినీ - బాణీ, చాపినీ - చాపీ, పాశినీ - పాశి, అంకుశినీ - అంకుశ, మహాకామేశ్వరీ - మహాకామేశ్వరా, మహావజ్రేశ్వరీ - మహావజ్రేశ్వర, భగమాలినీ - భగమాలీ, మహాత్రిపురసుందరీ - మహాత్రిపురసుందర, సర్వసిద్ధిప్రదచక్రస్వామినీ - సర్వసిద్ధిప్రదచక్రస్వామి, అతిరహస్యయోగినీ - అతిరహస్యయోగి, శ్రీభట్టారికసంజ్ఞా - శ్రీభట్టారికసంజ్ఞక, సర్వానందమయచక్రస్వామినీ - సర్వానందమయచక్రస్వామి, పరాపరారహస్యయోగినీ - పరాపరారహస్యయోగి, త్రిపురా - త్రిపుర, త్రిపురేశ్వరీ - త్రిపురేశ్వర, త్రిపురసుందరీ - త్రిపురసుందర, త్రిపురవాసినీ - త్రిపురవాసీ, త్రిపురాశ్రీ - త్రిపురశ్రీ, త్రిపురమాలినీ - త్రిపురమాలీ, త్రిపురాసిద్ధా - త్రిపురసిద్ధ, త్రిపురాంబా - త్రిపురాంబ, మహాత్రిపురసుందరీ - మహాత్రిపురసుందర, మహాకామేశ్వరీ - మహాకామేశ్వర, మహారాజ్ఞీ - మహారాజ, మహాశక్తి - మహాశక్త, మహాగుప్తా - మహాగుప్త, మహాజ్ఞప్తా - మహాజ్ఞప్త, మహానందా - మహానంద, మహాస్పందా - మహాస్పంద, మహాశయా - మహాశయ|

ఇవి ఆరోహణ క్రమమునందు చెప్పబడినవి. ఇప్పుడు అవరోహణక్రమము నందు చెప్పబడుచున్నవి.

ఇంకాఉంది...

కామెంట్‌లు లేవు: