సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

29, ఫిబ్రవరి 2024, గురువారం

శ్రీచక్రయాగ అంతరార్థము PDF Download


శ్రీచక్రయాగ అంతరార్థము

 

సృష్టిలో నవావరణను మించిన అర్చనలేదు, శ్రీచక్ర నవావరణపూజను శ్రీచక్రయాగమందురు,  ఆవరణ అర్చణ సర్వదేవతలను పూజించిన ఫలితంలో పాటు భోగ మోక్షాలను ప్రసాదిస్తుంది. శ్రీయాగ క్రమం గురుపరంపరాగతంగా ఇవ్వబడుతుంది. ఇందులో సూక్ష్మాలను గురుముఖతగా తెలుసుకోవాలి.

 మా గురువుల అనుజ్ఞతో శ్రీచక్రయాగ అంతరార్థాన్ని వివరంగా   శ్రీచక్రయాగ అంతరార్థము  అను పుస్తక రూపంలో విడుదల చేయడమైనది. ముద్రించిన  కాపీలు అన్నీ నిండుకున్న కారణంగా ఔత్సాహికుల కోరికమేర ఈ పుస్తక ప్రతిని అంతర్జాలంలో ఉచితంగా అందిచాలని ఇక్కడ పొందుపరుస్తున్నాము.   

పిడిఫ్ కోరకు చిత్రం పై నొక్కండి

 





ఆమ్నాయ మంత్ర పారాయణ క్రమః - 5

 

ఉత్తరామ్నాయః

తురీయాంబా మహార్ధాచ అశ్వారూఢా తథైవచ

మిశ్రాంబాచ మహాదేవి శ్రీమద్వాగ్వాదినీ తథా॥

దుర్గా కాళీచ చండీ చ నకులీ చ పుళిందినీ।

రేణుకా శ్రిశ్చవాగీశీ మాతృకాద్యా స్వయంవరా॥

ముఖాత్తత్పురుషాజ్జాతా ద్వికోట్యోమంత్రనాయికాః।

ఏకాశ్చోడ్యాణపీఠస్థాః శాక్తాగమ సముద్భవాః

ద్విసహస్రం తు దేవ్యస్తాః పరివారయుతాః ప్రియే॥

పంచామ్నాయ సమోపేతం శ్రీవిద్యాఖ్యంమదంశకం।

ముద్రాదిదశకం చైవ సిద్ధానాం మిధునం తథా॥

వీరావళీపంచకం చ భజేదామ్నాయ ముత్తరం

ఉత్తరామ్నాయస్య మనూన్ హృదిస్థానే విభావయేత్॥

22, ఫిబ్రవరి 2024, గురువారం

ఆమ్నాయ మంత్ర పారాయణ క్రమః - 4

  

పశ్చిమామ్నాయః

లోపాముద్రా మహాదేశీహ్యంబా చ భువనేశ్వరీ।

అన్నపూర్ణా కామకళా సర్వసిద్ధిప్రదాయినీ

సుదర్శనం వైనతేయం కార్తవీర్యం నృసింహకం।

నామత్రయం రామమంత్రం గోపాలం సౌరమేవచ॥

ధన్వంతరించేంద్రజాలమింద్రాదిసురమంత్రకం।

దత్తాత్రేయం ద్వాదశాష్టౌ వైష్ణవాగమచోదితాః॥

అఘోరముఖ సంభూతా మదంశాః కోటి సంఖ్యకాః।

ఏతా జాలంధరపీఠస్థాః పశ్చిమామ్నాయ దేవతాః॥

దూతీనాంచ చతుషష్టిః సిద్ధానాం త్రిసహస్రకం

ఆమ్నాయం పశ్చిమం వందే సర్వదా సర్వకామదం

భావయేన్మణిపూరే తు పశ్చిమామ్నాయజాన్మనూన్

13, ఫిబ్రవరి 2024, మంగళవారం

ఆమ్నాయ మంత్ర పారాయణ క్రమః - 3

 

దక్షిణామ్నాయః

సౌభాగ్యవిద్యా బగళా వారాహి వటుకస్తథా

శ్రీతిరస్కరిణీ ప్రోక్తా మహామాయా ప్రకీర్తితా॥

అఘోరం శరభం ఖడ్గ రావణం వీరభద్రం।

రౌద్రం శాస్తా పాశుపతాద్యస్తశస్త్రాదిభైరవం॥

దక్షిణామూర్తి మంత్రాద్యాః శైవాగమసముద్భవా।

వామదేవముఖోద్భూతాః కోటి మంత్రా వరాననే॥

పూర్ణపీఠస్థితా దేవి దక్షిణామ్నాయ దేవతాః।

ద్విసహస్రం తు దేవ్యస్తాం పరివారసమన్వితాః॥

భైరవాదిపదద్వంద్వం భజే దక్షిణముత్తమం।

స్వాధిష్టానే స్మరేద్దేవీ దక్షిణామ్నాయముత్తమం॥

2, ఫిబ్రవరి 2024, శుక్రవారం

ఆమ్నాయ మంత్ర పారాయణ క్రమః - 2

 

పూర్వామ్నాయః

శ్రీనాథాది గురుత్రయం గణపతిం పీఠత్రయం భైరవం సిద్ధౌఘం వటుకత్రయం పదయుగం దూతీక్రమం మండలంవీరాన్ద్వ్యష్ట చతుష్కషష్టినవకం వీరావళీ పంచకంశ్రీమన్మాలిని మంత్రరాజసహితం వందే గురోర్మండలం