సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

16, డిసెంబర్ 2022, శుక్రవారం

శ్రీదక్షిణామూర్తి సంహిత - 44 - 45

 

నలభైనాల్గవ భాగము

వహ్నివాసినీనిత్యావిధివివరణం

మంత్ర స్వరూపం: హ్రీం వహ్నివాసిన్యై నమః|

ఎనిమిది అక్షరముల ఈ మంత్రము పురుషార్థప్రదాయిని. ఈ మంత్ర ఋషి – వశిష్ఠ| ఛందస్సు – గాయత్రి| దేవత – వహ్నివాసిని| హ్రీం – బీజం| నమః – శక్తిః| వహ్నివాసిని – కీలకం| దేవీ మంత్రముతో షడంగన్యాసం చెయ్యాలి.

6, డిసెంబర్ 2022, మంగళవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - ఎనిమిదవశ్వాస - 13

 శ్రీచక్రనిర్మాణ ప్రకారము

శ్రీచక్రము మూడు ప్రకారములుగా ఉంటుంది. అవి భూప్రస్తారము, మేరుప్రస్తారము, కైలాసప్రస్తారము. మేరు ప్రస్తారము నిత్యాతాదాత్మికము. కైలాసప్రస్తారము మాతృకాత్మకము. భూప్రస్తారము వశిన్యాత్మకము. మేరుప్రస్తారము నందు పూజ సృష్టిక్రమము నందు, కైలాసప్రస్తారము నందు సంహారక్రమములోను, భూప్రస్తారము నందు స్థితిక్రమములో, కైలాసప్రస్తారము నందు అర్ధమేరుక్రమములో పూజ చెయ్యాలి. ప్రత్యేక చక్రము నందు పూజ మూడు భేదములుగా ఉండును. కౌళమతములో సృష్టి మరియు సంహారక్రములలో రెండింటిలోనూ పూజ జరుగుతుంది. సమయమతము నందు సృష్టి మరియు స్థితి క్రమములలో పూజ జరుగుతుంది. శుద్ధ పూజ అతిరహస్యము. మేరు చక్రము నందు సంహారక్రమములో పూజ జరగదు. అందువలన మేరుప్రస్తారములో జాగ్రత్తగా పూజ చెయ్యాలి. కైలాసప్రస్తారమునందు సంహారక్రమములో పూజ చెయ్యాలి. భూప్రస్తారము నందు స్థితిక్రమంలో పూజ ఉత్తమం అవుతుంది. గృహస్థులు స్థితి క్రమములోను, వానప్రస్థులు మరియు యతులు సంహారక్రమంలోను పూజ చెయ్యాలి. బ్రహ్మచారులు సృష్టి క్రమంలో పూజ చెయ్యాలి.