సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

11, ఫిబ్రవరి 2022, శుక్రవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - ఏడవశ్వాస - 14

 

ఈ) పంచకల్పలతా

ఈ విద్యలను తెలుసుకోవడం వలన పెద్దపెద్ద ఆపదలు పలాయనమవుతాయి.

1.       శ్రీవిద్యా కల్పలతా:

ఓం ఐం హ్రీం శ్రీం కఏఈలహ్రీం హసకహలహ్రీం సకలహ్రీం మహాకల్పలతేశ్వరీ బృందమండితాసన సంస్థితా సర్వసౌభాగ్యజననీ శ్రీవిద్యాకల్పలతాంబా శ్రీపాదుకాం పూజయామి.

2.       పారిజాతేశ్వరీ కల్పలతా

ఓం హ్రీం హ్స్రైం హ్రీం ఓం సరస్వత్యై నమః| ఋషి – దక్షిణామూర్తి| ఛందస్సు – గాయత్రి| దేవత – పారిజాతేశ్వరీ వాణి| హ్స్రైం – బీజం| హ్రీం – శక్తిః| ఓం – కీలకం| ఈ విద్యా మాహాసారస్వత ప్రదము. హ్స్రాం, హ్స్రీం, హ్స్రూం, హ్స్రైం, హ్స్రౌం, హ్స్రః – ఈ బీజములతో షడంగన్యాసం చెయ్యాలి.

ధ్యానం:

హంసారూఢాంలసన్ముక్తాధవళాం శుభ్రవాససం|

సుచిస్మితాంచంద్రమౌళిం వజ్రముక్తావిభూషణాం|

విద్యాం వీణాం సుధాకుంభమక్షమాలాంచ బిభ్రతీం||

3.       పంచబాణేశ్వరి:

ద్రాం ద్రీం క్లీం బ్లూం సః| ఋషి – మదన| ఛందస్సు – గాయత్రి| దేవత – ఈశ్వరి| బీజం-శక్తి-కీలకం: కామేశ్వరి| మంత్రములోని అయిదు బీజములతోనూ మరియు పూర్తి మంత్రముతోనూ షడంగన్యాసం చెయ్యాలి.

ధ్యానం:

ఉద్యద్దివాకరాభాసాం నానాలంకార భూషితాం|

బన్ధూకకుసుమాకారరక్తవస్త్రాఙ్గరాగిణీం|

ఇక్షుకోదండ పుష్పేషు విరాజిత భుజద్వయాం||

4.       పంచకామేశ్వరి

హ్రీం క్లీం ఐం బ్లూం సౌః|

ఋషి – సమ్మోహన| ఛందస్సు – గాయత్రి| దేవత – కామదా| బీజం-శక్తి-కీలకం: కామదా| మంత్ర బీజములతోనూ, మొత్తం మంత్రముతోనూ షండంగన్యాసం చెయ్యాలి.

ధ్యానం:

రక్తాం రంగదుగూలాంగ లేపనాం రక్తభూషణాం|

పాశాంకుశౌ ధనుర్బాణాన్ పుస్తకంచాక్షమాలికాం|

వరాభీతిచదధతీం త్రైలోక్యవశకారిణీం||

5.       కుమారి: క్లీం ఐం సౌః

విశ్వమాత కుమారీ కామేశ్వరి మూడులోకములను ఆకర్షణ చేయుటలో సమర్థురాలు. త్రిపురేశీ విద్యలాగే ఋష్యాదులు. ఐం-బీజం| సౌః-శక్తిః| క్లీం – కీలకం| ఈ బీజముల రెండు ఆవృత్తములతో షడంగన్యాసం చెయ్యాలి.

ధ్యానం:

ఉద్యత్సూర్య సహస్రాభాం మాణిక్య వరభూషణాం|

స్ఫురద్రత్నదుకూలాఢ్యాం నానాలంకార భూషితాం||

ఇక్షుకోదండబాణాంశ్చ పుస్తకంచాక్షమాలికాం|

దధతీం చింతయేన్నిత్యం సర్వరాజవశంకరీం||

     ఉ) పంచకామధుఘా

1. శ్రీవిద్యాకామదుఘ:

ఓం ఐం హ్రీం శ్రీం కఏఈలహ్రీం హసకహలహ్రీం సకలహ్రీం మహాకామదుఘేశ్వరీ బృందమండితాసన సంస్థితా సర్వసౌభాగ్య జననీ శ్రీవిద్యాకామదుఘాంబా శ్రీ పాదుకాం పూజయామి|

2. అమృతపీఠేశ్వరీ

హ్రీంహంసః జంజీవనీ జూం జీవం ప్రాణగ్రంథిస్థం కురు కురు స్వాహా|

3. అమృతేశ్వరీ కామదుఘా

ఓం ఐం బ్లూం ఓం జూం సః అమృతే అమృతోద్భవే అమృతేశ్వరి అమృతవర్షిణి అమృతం స్రావయ స్రావయ స్వాహా|

4. సుధాసు కామదుఘా

ఐం వదవదవాగ్వాదినీ ఐం క్లీం క్లిన్నే క్లేదినిక్లేదయక్లేదయమహాక్షోభం కురుకురుక్లీంసౌః మోక్షం కురుకురు హ్సౌః స్హౌః|

హే దేవీ! నీయొక్క అమృత సమానమైన రశ్ముల చేత ఈ చరాచర జగత్తు సంతృప్తమవుచున్నది. భవదుఃఖములనుండి విముక్తి చెంది శాంతి కలగడానికి నేను నీ భావన చేస్తున్నాను.

5. అన్నపూర్ణ కామదుఘా

ఓం హ్రీం శ్రీం క్లీం నమో భగవతి మహేశ్వరి అన్నపూర్ణే స్వాహా|

ఋషి-బ్రహ్మ| ఛందస్సు – ఉష్ణిక్| దేవత – అన్నపూర్ణేశ్వరి| హ్రీం- బీజం| శ్రీం – శక్తిః| క్లీం – కీలకం| హ్రాం, హ్రీం, హ్రూం, హ్రైం, హ్రౌం, హ్రః – ఈ బీజములతో షడంగన్యాసం చెయ్యాలి.

ధ్యానం:

ఉద్యత్సూర్యసమాభాసాం విచిత్రవసనోజ్జ్వలామ్|

చంద్రచూడామన్నదాననిరతాం రత్నభూషితాం|

సువర్ణకళశాకార స్తనభారనతామ్ పరాం|

రుద్రతాండవసానన్దాం ద్విభుజామ్ పరమేశ్వరీం|

వరదాభయశోభాఢ్యామన్నదానరతాం సదా||


ఊ) పంచరత్నేశ్వరీ

1. శ్రీవిద్యా రత్నేశ్వరి

ఓం ఐం హ్రీం శ్రీం కఏఈలహ్రీం హసకహలహ్రీం సకలహ్రీం శ్రీమహారత్నేశ్వరీ బృందమండితాసన సంస్థితా సర్వసౌభాగ్య జననీ శ్రీవిద్యారత్నేశ్వరీ శ్రీ పాదుకాం పూజయామి|

2. సిద్ధలక్ష్మీ రత్నేశ్వరి

ఓం ఐం హ్రీం శ్రీం ఫ్రేం ఫ్రేం ఖ్ఫ్రేం ఐం క్షమరీం మహా చండ తేజః సంకర్షిణీ కాలిమంథానేహః హ్రీం సః స్వాహా! ఖ ఫ్రేం హ్రీం శ్రీం సర్వసిద్ధయోగినీ హసఖఫ్రేంహ్రీం శ్రీం నిత్యోదితాయై సకలకుల చక్రనాయికాయై భగవత్యై చండికపాలిన్యై హ్రీం శ్రీం హూం ఖ్ఫ్రేం హ్రీం హ్రూం హం క్ష్రైం క్ష్రౌం క్రోం క్లీం సః ఖఫవయరేం పరమహంసినివార్ణమార్గదే దేవి విషమోపప్లవ ప్రశమని సకలదురితారిష్టక్లేశ శమని సర్వాపదం భోధితారిణి సకలశత్రు ప్రమథిని దేవి ఆగచ్ఛ ఆగచ్ఛ హసహసవలవల నరరుధిరాంత్రవసా భక్షిణి మమశత్రూన్ మర్దయమర్దయ ఖాహిఖాహి త్రిశూలేన భింది భింది ఛిందిఛింది ఖడ్గేన తాడయతాడయ ఛేదయఛేదయ వదకవలహ్రీం హసక్షమలవరయూం హసక్షమలవరయీం సహక్షమలవరయీం మమసకల మనోరథాన్ సాధయ సాధయ పరమకారుణికే దేవి భగవతి మహాభైరవరూప ధారిణి త్రిదశవర నమితే మహామంత్రమాతః ప్రాణతజనవత్సలే దేవి మహాతికాలనాశినీ హ్రీం ప్రసీద మదనాతురాం కురుకురు సురాసుర కన్యకాం హ్రీం శ్రీం క్రోం ఫట్ ఠఃఠః సహఖఫ్రేం ఫ్రేం ఫ్రేం మహారత్నేశ్వరీ బృందమండితాసన సంస్థితా సర్వసౌభాగ్య జననీ శ్రీసిద్ధ మహాలక్ష్మీ శ్రీపాదుకాం పూజయామి.

3. మాతంగీ రత్నేశ్వరి

క్లీంసౌఃఐంహ్రీంశ్రీం ఓం నమో భగవతి మాతంగీశ్వరి సర్వజనమనోహరి సర్వరాజవశంకరి సర్వముఖరంజనీ సర్వస్త్రీపురుషవశంకరి సర్వదుష్టమృగవశంకరి సర్వలోకవశంకరి హ్రీంశ్రీంక్లీంఐం|| 

ఈ విద్య మోక్షార్థులకు సిద్ధిదాయకము. ఋషి-మాతంగి| ఛందస్సు – గాయత్రి| దేవత-నాదమూర్తి మాతంగీ పరమేశ్వరి| క్లీం-బీజం| ఐం-శక్తిః| సౌః-కీలకం| సాం, సీం, సూం, సైం, సౌం, సః – ఈ బీజములతో షడంగన్యాసం చెయ్యాలి.

మరొక విధంగా ఐంక్లీంసౌః బీజములను రెండు ఆవృత్తులతో కూడా షడంగన్యాసం చెయ్యవచ్చును. సర్వార్థ సిద్ధి గురించి శ్యామవర్ణ, శంఖవలయ మాతంగీ రత్నేశ్వరిని ఈ విధంగా ధ్యానించాలి.

ధ్యానం:

అంభోజార్పిత దక్షాఙ్ఘ్రి క్షౌమాం ధ్యాయేన్మతంగినీం|

లసద్వీణాలసన్నాదశ్లాఘాందోలిత కుండలాం|

దంతపంక్తిప్రభారమ్యాం శివాం సర్వాంగసుందరీం|

కదంబపుష్పదామాఢ్యాం వీణావాదనతాత్పరాం||

4. భువనేశ్వరీ వర్ణన ఇంతకు ముందే చెయ్యడం జరిగింది.

5. వారాహీ రత్నేశ్వరి

ఐంగ్లౌంఐం నమోభగవతి వార్తాళివార్తాళి వారాహివారాహి వరాహముఖివరాహముఖి అంధే అంధిని నమః రుంధే రుంధిని నమః జంభే జంభిని నమః మోహే మోహిని నమః స్తంభే స్తంభిని నమః సర్వదుష్టప్రదుష్టానాం సర్వేషాం సర్వవాక్చిత్త చక్షుర్ముఖ గతి జిహ్వాం స్తంభనం కురుకురు శీఘ్రం వశ్యం కురుకురు ఐంగ్లౌం ఠఃఠఃఠఃఠః హుంఫట్ స్వాహా||

ఈ విద్యను స్మరించిన మాత్రముననే వాయువు కూడా స్థిరపడును.

ఈ మంత్రము యొక్క 44 పదములతో న్యాసము చెయ్యాలి. పది పదముల న్యాసము మాతృకా న్యాసమునకు సమానము. సంధుల అగ్రభాగమున 20 పదముల న్యాసము చెయ్యాలి. అన్యపద వర్ణములతో పార్శ్వములందు న్యాసము చెయ్యాలి. ఈ విధముగా మాతృకా న్యాసము కూడా చెయ్యాలి. ఆ తర్వాత దేహశుద్ధి కొరకు షడంగన్యాసము చెయ్యాలి. రెండు వార్తాళీలతో హృదయము నందు, రెండు వారాహీలతో శిరస్సునందు, రెండు వరాహముఖములతో శిఖయందు, అంధేఅంధిని నమః అని కవచము, రుంధే రుంధిని నమః అని నేత్రములందు న్యాసము చెయ్యాలి. (అస్త్రన్యాసము చెప్పబడలేదు)

ధ్యానం:

ప్రత్యగ్రారుణసంకాశపద్మాంతర్గతవాసినీం|

ఇంద్రనీలమహాతేజః ప్రకాశాం విశ్వమాతరం||

రుండంచముండమాలాఢ్య నవరత్న విభూషితాం|

అనర్ఘ్యరత్నఘటితముకుటశ్రీవిరాజితాం||

కౌశేయార్ధోరుకాంచారుప్రవాలమణిభూషణాం|

హలేన ముసలేనాపి వరదేనాభాయేనచ||

విరాజిత చతుర్బాహుం కపిలాక్షీం సుమధ్యమాం|

నితంబినీముత్పలాభాం కఠోరఘనసత్కుచాం||

ఇంకాఉంది...

కామెంట్‌లు లేవు: