సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

28, ఫిబ్రవరి 2022, సోమవారం

శ్రీదక్షిణామూర్తి సంహిత - 27

 

పారిజాతేశ్వరీవాణీవిద్యావిధివివరణం

ఈశ్వరుడు చెప్పుచున్నాడు - హే దేవీ! ఇప్పుడు కల్పలతా విద్యా వర్ణన చెబుతాను. దీనిని తెలుసుకున్నంతనే ఆపత్తులు పారిపోవును. శ్రీవిద్యా, పారిజాతేశ్వరీ, పంచకామేశ్వరీ, పంచబాణేశ్వరీ, కుమారి దేవి - ఈ పంచవిద్యలను కల్పలతా విద్యలని అంటారు.

మంత్రము: ఓం హ్రీం ఐం హ్రీం ఓం సరస్వత్యై నమః|

ఋషి - దక్షిణామూర్తి| ఛందస్సు - గాయత్రీ| దేవత - పారిజాతేశ్వరి రాజ్ఞీ| ఐం - బీజం| హ్రీం - శక్తిః| ఓం - కీలకం|

హే దేవీ! ఈ విద్య మహాసారస్వత్ అనగా మహాజ్ఞానమును ఇచ్చును.

సా, సీ, సూ, సై, సౌ, సః - (స ను సంభిన్న బీజమని అంటారు) షడంగన్యాసం చెయ్యాలి.

బ్రహ్మరంధ్రము, భ్రూమధ్యము, నేత్రము, శ్రోత్రము, నాసారంధ్రము, జిహ్వా, లింగము, జానువులు మరియు ఊరువులందు న్యాసము చెయ్యాలి.

తర్వాత యాభై వర్ణముల న్యాసము చేసి సారస్వతప్రదా దేవి ధ్యానము చెయ్యాలి.

ధ్యానం:

హంసారూఢాం లసన్ముక్తాధవలాం శుభ్రవాససమ్|

శుచిస్మితాం చంద్రమౌలిం వజ్రముక్తావిభూషితామ్||

విద్యాం వీణాం సుధాకుంభం అక్షమాలాం చ బిభ్రతీం|

పైవిధంగా జపము చేసిన తర్వాత మంత్రమును 12 లక్షలు జపించాలి. ఆ తర్వాత ప్రసన్న మనస్సుతో శ్వేతకమలములు లేదా సంపెంగ పువ్వులతో పదివేలు (?12వేలు) హోమం చెయ్యాలి.

మాతృకలను యంత్రము మీద లిఖించి పీఠ పూజ చెయ్యాలి. ఆ పీఠ యంత్రములోకి వాణీ ని ఆహ్వానించి ఉపచారములతో పూజించాలి. ముందు సరస్వతీ అంగ దేవతలను పూజించాలి. తర్వాత పరివార దేవతలను పూజించాలి. ఆ తర్వాత సంస్కృత మరియు ప్రాకృతల పూజ చెయ్యాలి.

అష్టదలములలో ప్రజ్ఞా, మేధా, శ్రుతి, శక్తి, స్మృతి, వాగీశ్వరీ, సుమతి, స్వస్తి లను పూజించాలి.

మాతలను దళముల అగ్రభాగమున పూజించాలి. ఇంద్రాది దిక్పాలకులను భూబింబమున పూజించాలి. ఆ తర్వాత సరస్వతీ దేవిని పూజించాలి. (ప్రత్యేకముగా యంత్రమును వివరించలేదు) ఈ స్వరస్వతీ విద్య త్రిభువనములందునూ దుర్లభము.

ఇది శ్రీదక్షిణామూర్తి సంహితకు విశాఖ వాస్తవ్యులు, కౌండిన్యస గోత్రికులు, శ్రీఅయలసోమయాజుల పాలబాబు (సుబ్బారావు) గారు మరియు శ్రీమతి సాయిలీల దంపతుల ద్వితీయపుత్రుడు మరియు హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ ప్రకాశానందనాథ (శ్రీశ్రీశ్రీ శ్రీపాద జగన్నాధస్వామి) గారి శిష్యుడు భువనానందనాథ అను దీక్షానామము కలిగిన అయలసోమయాజుల ఉమామహేశ్వరరవి తెలుగులోకి స్వేచ్ఛానువాదము చేసిన పారిజాతేశ్వరీవాణీవిద్యావిధివివరణం అను ఇరవైఏడవ భాగము సమాప్తము.

కామెంట్‌లు లేవు: