సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

4, ఫిబ్రవరి 2022, శుక్రవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - ఏడవశ్వాస - 13

 ఇ) పంచకోశవిద్యా

 

1.       శ్రీవిద్యా కోశేశ్వరి

ఓం ఐం హ్రీం శ్రీం కఏఈలహ్రీం హసకహలహ్రీం సకలహ్రీం మహా కోశేశ్వరీ బృందమండితాసన సంస్థితా సర్వసౌభాగ్యజననీ పాదుకాం పూజయామి.

2.       పరంజ్యోతి కోశేశ్వరి

ఓం హ్రీం హంసః సోహం స్వాహా|

ఋషి – బ్రహ్మ| ఛందస్సు – గాయత్రి| దేవత – పరంజ్యోతిర్మయి

ఓం – బీజం| హ్రీం – శక్తిః| హంసఃసోహం స్వాహా – కీలకం|

షడంగన్యాసం: స్వాహా, సోహం, హంస, హ్రీం, ఓం, మొత్తం మంత్రము – ఈ ఆరింటితో షడంగన్యాసం చెయ్యాలి.

ధ్యానము ప్రపంచ యాగము నందు వర్ణించిన విధంగా చెయ్యాలి.

3.       పరానిష్కళ

ఓం హంసః| ఋషి – బ్రహ్మ| ఛందస్సు – గాయత్రి| దేవత – బ్రహ్మ| అ – బీజం| ఊం – శక్తిః| య – కీలకం|

షడంగన్యాసం: అంఆం, ఇంఈం, ఉంఊం, ఏంఐం, ఓంఔం, అంఅః| - ఆ ఆరింటితో షడంగన్యాసం చెయ్యాలి.

ధ్యానం:

అనుగ్రహాదిర్దేవేశి బిందునాదకళాత్మికః|

పరనిష్కలదేవీయం పరబ్రహ్మస్వరూపిణీ||

శుక్లాంబరపరీధానా శుక్లమాల్యానులేపనా|

జ్ఞానముద్రాంకితా యోగిపతివృందేన సేవితా||

ఈ మంత్ర స్మర్ణ వలన సాధకుని శరీరము చిదానందమయం అవుతుంది.

4.       అజపా

దీనిని తెలుసుకోవడం చేతనే సాధకుడు పరబ్రహ్మ అవుతాడు. ప్రతిదినము మనుష్యులు హంస జపం చేస్తూనే ఉంటారు. కానీ మోహవశమున వారు దీనిని తెలుసుకొనలేరు. అందువలననే వారికి మోక్షం లభించడం లేదు. శ్రీగురుని కృప పొంది ఈ విద్యను తెలుసుకొని సాధన చెయ్యాలి. ఉచ్ఛ్వాస, నిశ్వాసల వలన బంధమోక్షములు కలుగును. ఉచ్ఛ్వాస, నిశ్వాసములందు హంస అను రెండు అక్షరములు కలవు. వాటియందు ప్రాణహంస ఆత్మరూపంలో ఉంటుంది. అరవైసార్లు శ్వాస చేయగా అది అరవై నాడులందు తిరుగును. ఈ అరవీ నాడుల ద్వారా రాత్రి, పగలు అజపా మంత్రము జపము అవుతూ ఉంటుంది. 21,600సార్లు ప్రాణము అహర్నిశలూ స్పందనమయీ పరాదేవత యొక్క జపము చేస్తుంది. నిశ్చితమైన సమయంలో జపము ప్రారంభించి 24గంటల తర్వాత నివేదించి జపము జరగనిచో అది కూడా జపము క్రిందకే వస్తుంది. దీని వలననే ఈ భవపాశ విమోచనమును అజపా అంటారు. శ్రీగురువుని కృప వలననే ఇది ప్రాప్తమవుతుంది. అన్యథా ప్రాప్తించదు. ఈ జపమును ప్రతిదినమూ గణేశ, బ్రహ్మ, విష్ణు, శివ, జీవాత్మ, గురు మరియు పరమాత్మలకు క్రమంగా సమర్పించాలి. గణేశునకు 600, బ్రహ్మకు 6000, విష్ణువుకు 6000, శివునకు 6000, జీవాత్మకు 1000, గురువునకు 1000, పరమాత్మకు 1000 జపములు సమర్పించాలి. ప్రారంభమున సంకల్పము చేసి చివర సమర్పణ చేయగా అది సహజ జపము అవుతుంది. ఆ తర్వాత న్యాసము చెయ్యాలి.

ఈ మంత్రమునకు ఋషి – అవ్యక్త హంస| ఛందస్సు – గాయత్రి| దేవత – పరమాది హంస| హం – బీజం| సః – శక్తిః| సోహంఓం – కీలకం| నాదస్థానము శ్వేతవర్ణము. మంత్ర స్వరము ఉదాత్తము. మోక్షము గురించి వినియోగము చెయ్యాలి. ఆ తర్వాత దేహశుద్ధి కొరకు షడంగన్యాసము చెయ్యాలి. సూర్యాయనమః, చంద్రాయస్వాహా, నిరంజనాయ వషట్, అనంతాయః, అవ్యక్తాయ, ప్రబోధాత్మాయ| ఈ ఆరింటితో షడంగన్యాసం చెయ్యాలి.

ఓం దేవీ! హంస యొక్క అవయవములు అగ్నిసోమాత్మకములు. ఓం-శిరస్సు| బిందుత్రయము – శిఖా| నాదము – ముఖము| శివశక్తి – పాదములు| కాలాగ్ని – రెండు పార్శ్వములు| ఈ విద్య పరమహంస, సర్వవ్యాపి మరియు ప్రకాశవంతము. కోటిసూర్యుల ప్రకాశముతో భాసించును. అజపా అను పేరుగల ఈ గాయత్రి మూడు లోకములలోనూ దుర్లభము.

5.       మాతృకా కోశేశ్వరి

ఈ విద్యావర్ణన ఇంతకు ముందే చెయ్యబడినది.

ఈ కోశేశ్వరీ విద్యలను తెలుసుకోవడం వలన మాత్రముననే పునర్జన్మ ఉండదు.

ఇంకాఉంది...

1 కామెంట్‌:

PADMAJA చెప్పారు...

శ్రీ గురుభ్యోంనమః నమః
🙏🙏🙏