సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

7, ఫిబ్రవరి 2022, సోమవారం

శ్రీదక్షిణామూర్తి సంహిత - 25

 

సంపత్ప్రదాభైరవీవిధివివరణం

ఈ దేవత పూజాదులు చతుఃసింహాసన దేవీ పూజా క్రమంలో చెయ్యాలి.

మంత్రము: రం భయవిధ్వంసినీ రం

ఈమె 64కోట్ల మహాయోగినిలనూ శాసించగలిగేది.

ధ్యానం:

ఆతామ్రార్కసహస్రాభా త్రినేత్రా చంద్రసమ్ముఖీ|

చంద్రఖండస్ఫురద్రత్నముకుటా క్షామమధ్యమా||

నితంబినీ స్ఫురద్రత్నరశనా చంద్రభూషణా|

ఉన్మత్తయౌవనాప్రౌఢా పీనోన్నతఘనస్తనీ||

అమృతంకామముండస్రంగ్మండితాంగీ సుశోభనామ్|

పుస్తకం చాభయం వామే దక్షిణే త్వక్షమాలికామ్||

వరంచ దధతీం పూజ్యా త్రిపురేశీవ నాన్యథా|

ఇది శ్రీదక్షిణామూర్తి సంహితకు విశాఖ వాస్తవ్యులు, కౌండిన్యస గోత్రికులు, శ్రీఅయలసోమయాజుల పాలబాబు (సుబ్బారావు) గారు మరియు శ్రీమతి సాయిలీల దంపతుల ద్వితీయపుత్రుడు మరియు హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ ప్రకాశానందనాథ (శ్రీశ్రీశ్రీ శ్రీపాద జగన్నాధస్వామి) గారి శిష్యుడు భువనానందనాథ అను దీక్షానామము కలిగిన అయలసోమయాజుల ఉమామహేశ్వరరవి తెలుగులోకి స్వేచ్ఛానువాదము చేసిన సంపత్ప్రదాభైరవీవిధి వివరణం అను ఇరవైఅయిదవ భాగము సమాప్తము.

కామెంట్‌లు లేవు: