సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

29, డిసెంబర్ 2020, మంగళవారం

ఆత్మయోగం - శ్రీవిద్యా సాధనాసారం పుస్తకం త్వరలో మోహన్ పబ్లికేషన్స్ ద్వారా విడుదల

 

ఆత్మయోగం

                                  శ్రీవిద్యా సాధనాసారం

చంచలమైన మనస్సు వానరం. గురువు అనుగ్రహం వల్ల గురికుదిరిన మనస్సు అద్వితీయమైన వానర వీరుడు హనుమత్ స్వరూపం. నేడు నిత్య జీవితంలో ఆధ్యాత్మికత గూర్చి ఆలోచించే సమయమే లేక అహరహరమూ ఉరుకులు, పరుగులతో గడుస్తున్న జీవితం చివరకు కదలలేక, కదలచేతకాక ఆసుపత్రి బంధ కంబంధాలలో ముగుస్తుంది. నిజమైన ఆధ్యాత్మిక ఎలా చిగురిస్తే, ఎలా వృద్ధిచెందిచుకోవాలో, జీవితాన్ని ఎలా ఆధ్యాత్మిక ప్రగతిలో పయనింపజేయాలో తేలియజేసేదే ఈ ఆధ్యాత్మిక కథ.

24, డిసెంబర్ 2020, గురువారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - అయిదవవశ్వాస - 03

తాంత్రిక సంధ్యావిధి

ఈ క్రింది మంత్రంతో శిఖాబంధనం చెయ్యాలి -

మణిధారిణివజ్రిణిమహాప్రతిసరే రక్ష-రక్ష హుంఫట్స్వాహా

ఆచమనవిధి

కఏఈలహ్రీం - విద్యాతత్త్వాయస్వాహా| హసకహలహ్రీం - శివతత్త్వాయస్వాహా|

సకలహ్రీం - మాయాతత్త్వాయస్వాహా|

ప్రాణాయామము చేసి సంకల్పము చెప్పాలి.

18, డిసెంబర్ 2020, శుక్రవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - అయిదవవశ్వాస - 02

 కుండలినీ మంత్ర స్తోత్రం

ఐంహ్రీంశ్రీం అనే త్ర్యక్షరి మంత్రము కుండలినీ మంత్రము. ఇది ప్రసిద్ధము మరియు సుసిద్ధిదాయకము. ఈ మంత్రమునకు ఋషి - శక్తి| ఛందస్సు - గాయత్రి| దేవత - కుండలీ శక్తి| ఐం - బీజం| శ్రీం - శక్తిః| హ్రీం - కీలకం| సర్వాగమ విశారదులకు కుండలినీ చింతన ప్రసిద్ధము. ఐం హ్రీం శ్రీం బీజముల రెండు ఆవృత్తములతో షడంగన్యాసం చెయ్యాలి.

12, డిసెంబర్ 2020, శనివారం

మహామనుస్తవం - 11, 12

 

11.   క ఇతి త్రిజగజ్జననీ మాదికలాం భువనశిల్పనిర్మాతుః

       కమలోద్భవస్య కాంతామాదౌవిద్యారతాః ప్రభాషన్తే

ఇక్కడ నుండి పంచదసీ మహా మంత్రమును వివరించబడుచున్నది. ఈ శ్లోకము నుండి ఇరవైఐదవ శ్లోకము వరకు అన్ని శ్లోకములు పంచదసీ మంత్రములోని ఒకొక్క బీజముతో ప్రారంభమవుతాయి.

11, డిసెంబర్ 2020, శుక్రవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - అయిదవవశ్వాస - 01

కాళీమతానుసారము భూతలిపి, మంత్రోద్దారము, అర్చాక్రమము

భూతలిపి అతిగోప్యము మరియు అతి దుర్లభము. అది సారస్వత మహాతంత్రము నందు అతిగోప్యము మరియు అతి సిద్ధిదాయకము అని చెప్పబడెను. మునులు విష్ణువు నుండి దీనిని ప్రాప్తించుకొని వారి వాంఛిత ఫలములను పొందారు. హేదేవీ! అధికముగా చెప్పుటవలన ఏమి లాభము? దీని నుండి మునులు అన్నీ ప్రాప్తించుకున్నారు.

4, డిసెంబర్ 2020, శుక్రవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - నాల్గవశ్వాస - 06

 కాలీమతము - ప్రాణాగ్ని హోమవిధానము

ఇప్పుడు సమస్త భూమండలము కొరకు విశేషంగా మంత్రసాధకుల కొరకు సర్వసిద్ధిదాయక ప్రాణాగ్ని హోమ విధానము చెప్పబడుచున్నది. ముందుగా స్వచ్ఛ శుభాసనము మీద పద్మాసనము వేసి ప్రసన్న అచంచల మనస్సుతో పూర్వాభిముఖుడై కూర్చోవాలి. హ్రీంలో హ సత్త్వగుణముగా, ఈ రజోగుణముగా, ర తమోగుణముగా ఒక త్రికోణమును పూర్వ-నైఋతి-వాయవ్య క్రమముగా మూలాధారమునందు చింతన చెయ్యాలి. ఆ త్రికోణములో మధ్యన, తూర్పున, 

2, డిసెంబర్ 2020, బుధవారం

సనాతన ధర్మం - 2

 

నిజానికి ఉన్నది ఒక్కటే. అది నిత్యము, శాశ్వతము. "అది" ఎటువంటిమార్పులు లేనటువంటిది. దానినుండే అంతా పుట్టి దానియందే అంతా లీనమైపోతుంది. దానికి వేరుగా మరొకటి లేదు. సముద్రములోని జలము అలరూపములో వచ్చి తిరిగి ఆ జలము ఆ సముద్రములోకే ఎలా కలిసిపోతుందో ఈ చరాచర జగత్తుకూడా "అక్కడి" నుండే పుట్టి అక్కడికే వెళ్లిపోతుంది. ఏ విధముగా సముద్ర జలము అల రూపములో కనబడుచున్నదో "" యొక్క రూపమే జగత్తురూపంలో కనబడుచున్నది. ఇక్కడ సూచించబడిన "అది", ""లను బ్రహ్మము అని అంటారు. అనగా ఈ

27, నవంబర్ 2020, శుక్రవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - నాల్గవశ్వాస - 05

వర్ణవిభాగము - సృష్ట్యాది మాతృకా న్యాసములు

ఉత్తరతంత్రము ప్రకారము -

కామ్య కర్మములందు సంహారక్రమములో సానుస్వార మాతృకా న్యాసము చెయ్యాలి. పూర్వము చెప్పిన విధముగా ఋష్యాది షడంగ న్యాసములు చెయ్యాలి. సృష్ట్యాది మాతృకా న్యాసము విసర్గయుక్త మాతృకా న్యాసములతో చెయ్యాలి. బిందు, విసర్గ యుక్త స్థితి మాతృకా న్యాసము డ నుండి ప్రారంభము చేసి ఠ వరకు చెయ్యాలి.

20, నవంబర్ 2020, శుక్రవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - నాల్గవశ్వాస - 04

 

మాతృకా విధానము      

దక్షిణామూర్తి సంహిత ప్రకారము, ఇప్పుడు లోకమాత మాతృకలను చెబుతాను. అ నుండి క్ష వరకు ఉన్న మాతృకలు వర్ణదేవతయొక్క అవయములు.

19, నవంబర్ 2020, గురువారం

మహామనుస్తవం - 10

 

10.   గురుచరణైః సంక్రమితాం వర్ణమయీమంబికామనుధ్యాయన్|

       గురువరసంపదమలభే యదహం సా త్రిపురసుందరీకరుణా||

త్రిపురసుందరిని వర్ణమయీ రూపములో నిత్యమూ ధ్యానించగా నాకు ఆమె నిజమైన కరుణ వలన మహాగురురువులు అనే సంపద లభ్యమయినది.

17, నవంబర్ 2020, మంగళవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - నాల్గవశ్వాస - 03

 

(శివుడు చెప్పుచున్నాడు) - హే దేవీ! వీటి వైభవ వర్ణమును చెప్పెదను సావధానముగా వినుము. ఇవి తిర్యక్-పైన-క్రింద స్థానములందు ఆరోహణ, అవరోహణ క్రమములో ఉంటాయి. సమస్త-వ్యస్త, ప్రతిలోమ-అనులోమ, అవస్థాత్రయరూపములో వ్యాప్య-వ్యాప్యభేదములో ఉంటాయి. వర్ణగుంఫిత యోగమువలన ఇవి తైజసమూర్తులవుతున్నాయి. ఇది సూత్రప్రాయముగా కుండలినీ రూపములో ఉంటుంది. 16 స్వరములూ 16 చంద్రునికలలు. మకారమును వదలి మిగిలిన 24 స్పర్శవర్ణములూ సూర్యకలలు. దశవ్యాపకములు దశ కళలు. ఆరోహణ క్రమములో వీటి సంఖ్య సగము అవుతాయి మరియు అవరోహణమునందు కూడా అంతే అవుతాయి. ప్రకృతిస్థ సూర్యకలలు వాటి రెండింటికీ సమానమవుతాయి. సోమ-వహ్ని కళలు అప్రాకృతములు. రెండింటియందు మకారము యొక్క కళలు 76. ఆరోహణ-అవరోహణ క్రమమునందు 28 కళలు. వీటి నిజకళలను పూర్ణమండలము అని అంటారు.

13, నవంబర్ 2020, శుక్రవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - నాల్గవశ్వాస - 02

 

అవరోహణ క్రమము

లోపాముద్ర పదిహేనువర్ణముల మంత్రమునందు మిధునము ఉన్నది. నవవర్ణములందు 16 స్వరముల యోగము వలన 9x16 = 144 యుగ్మములు అవుతాయి. పంచబ్రహ్మత్రిమూర్తి రశ్ములకు తారోత్థ కళలు రెండేసి ఉంటాయి. నవాత్మేశ్వర వర్ణముల కలలనుండి అన్యకలలు వేరు.

6, నవంబర్ 2020, శుక్రవారం

శ్రీవిద్య చర్చా వేదికకు ఆహ్వానం

 శ్రీవిద్య చర్చా వేదిక శ్రీవిద్య సాధక మార్గపు అనుభవైక సుమమాలిక

శ్రీవిద్య బ్రహ్మ విద్య, శ్రీ విద్యోపాసన ఒక తంత్ర శాస్త్రము. తంత్రములు వేదానుకూల విషములనే బోధించుచున్నాయి, కావున వేదములు, తంత్రములు కలిపి ఆగమములందురు.

శ్రీవిద్యను గూర్చి త్రిపురోపనిషత్తు, భావనోపనిషత్తు - అధర్వణ వేదీయ సౌభాగ్య ఖండమునఅరుణోపనిషత్తును - యజుర్వేదములోజీవ బ్రహ్మైక్యమునకును గూర్చి మహావాక్యములను - ఋగ్వేదమునకు చెందిన బహ్వృచోపనిషత్తులో శ్రీవిద్యా వేదప్రమణాన్ని రూఢీ చేస్తున్నాయి.

ఇట్టి అనంతమైన అనుభవేద్యమైన శ్రీవిద్య ఉపాసన ఫలితాలను అనుభవంలోకి రావడానికి ప్రయత్నిస్తున్న సాధక లోకానికి తమ అనుభవాలను అందరికీ పంచడానికి, ఉపాసనా మార్గంలో ముందుకు సాగడానికి, వివిధ అనుమానముల నివృత్తికి ఈ చర్చా వేదిక సాదరంగా అహ్వానిస్తోంది.    

శ్రీవిద్యార్ణవ తంత్రము - నాల్గవశ్వాస - 01

 

రశ్ముల లక్షణము - వాటి ప్రమాణము

అన్నిమంత్రములలో గోప్యమైన మాతృకా వైభవము యొక్క వర్ణన ఇక్కడ చెయ్యబడుచున్నది. వీటిని తెలుసుకోవడం వలన సంప్రదాయానుసార సాధకుల సంశయము నాశనము అవుతుంది. మాతృకారశ్మి బోధన ద్వారా మంత్రోద్ధారము స్వయంగా చెయ్యాలి. మొదట మాతృకా రశ్ముల క్రమము తెలుసుకోదగినది.

5, నవంబర్ 2020, గురువారం

మహామనుస్తవం - 9

 

9.    పారితోమాంవిసరన్తీ మూర్ధ్వమూర్ధ్నోవతీర్య విలసంతీమ్|

       నిధ్యాయన్నధ్యాత్మం భాసం పదయోః స్మరామిసుందర్యాః||

ఆధ్యాత్మిక ద్యుతి సహస్రారమునుండి ప్రసరించి మొత్తం శరీరమంతా ప్రసరిల్లుచూ తడుపుచూ ఉన్నప్పుడు ఆ ద్యుతి శ్రీమహాత్రిపురసుందరీ పాద ద్యుతియే అని స్మరించుచున్నాను.

2, నవంబర్ 2020, సోమవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - నాల్గవశ్వాస - విషయసూచిక

 

విన్నపము: ఈ శ్వాసనుండి క్రియావిధానములు తెలుపబడును. అర్ధం చేసుకోవడానికి కొన్ని సులభతరంగాను, కొన్ని క్లిష్ఠంగాను ఉండును. ఈ శ్వాసలలో చెప్పబడు సమయ, దక్షిణ, వామ, కౌళ క్రియా విధానములు, మంత్రములు పాఠకుల అవగాహనకొరకు మాత్రమే ఇవ్వబడుచున్నవి. నేటి సామాజిక పరిస్థితుల దృష్ట్యా కొన్ని సాధనలు ఆచరణయోగ్యము కావు. కానీ వీటిని ఆచరించదలచినచో సరైన గురువు యొక్క మార్గదర్శకత్వంలో మాత్రమే వీటిని సాధనచెయ్యగలరు. అన్యథా చేసినచో కొన్ని చిక్కులు కలగవచ్చును. ఇందు సాధనా రహస్యములు మూలగ్రంథమును అనువదించి ఇవ్వబడుచున్నవి. ఆయా రహస్యములను అనువాదకుని అభిప్రాయముగా, సాధనాక్రమములుగా భావింపరాదు.

 

30, అక్టోబర్ 2020, శుక్రవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - తృతీయశ్వాస - 06

 

దుర్గా మాతృకలు

దుర్గా - కౌశికీ - ఉగ్రా - చండా - మాహేశ్వరి - శివా - విశ్వేశ్వరి - జగద్ధాత్రి - స్థిసంహారకారిణి - యోగనిద్ర - భగవతీదేవి - స్వాహా - స్వధా - సుధా - సృష్టి - ఆహుతి| ఇవి స్వర శక్తులు

27, అక్టోబర్ 2020, మంగళవారం

 శ్రీచండీ ఆవరణ పూజ విధి

చండీ ఆవరణ పూజ విధి పాత్రా సాధన పూర్వకంగా విపులంగా వివరించబడిన గ్రంధం అస్మత్ శ్రీగురువుల అనుఙ్ఞతో సాధక లోకానికి అందించబడింది.
ప్రతులు

మోహన్ పబ్లికేషన్సు వారి దేవుళ్ళు.కామ్  లో లభించును23, అక్టోబర్ 2020, శుక్రవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - తృతీయశ్వాస - 05

 

బగలామాతృకలు

బగళా - స్తంభిని - జంభిని - మోహినీ - వశ్యా - చలా - అచల - దుర్ధ్వర - కల్మశ - ధీరా - కల్పనా - కాకాకర్షిణి - భ్రామక - మందగమన - భోగినీ - యోగినీ| ఇవి స్వరమూర్తులు

17, అక్టోబర్ 2020, శనివారం

మహామనుస్తవం - 8

 

8.    అద్భుతగగనశరీరామేకాక్షరనాదసంయతశమీరామ్|

       సకలాంతరనిర్ణిమిషామ్ నిస్తిమిరామంతరే పరాం వందే||

ఆకాశమే శరీరముగా, చెదరిని నాదమే శ్వాసగా కలిగి సకల జీవుల హృదయాలలో ఉండి ఎంతమాత్రము రెప్పవేయక రవ్వంత చీకటినైనా దరిచేయనీయక వారిని రక్షించుచూ ఉండే సర్వశ్రేష్ఠమైన పరదేవతకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.

16, అక్టోబర్ 2020, శుక్రవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - తృతీయశ్వాస - 04

 

కామాకర్షిణ్యాది మాతృకలు

కామాకర్షిణీ - బుద్ధ్యాకర్షిణీ - అహంకారాకర్షిణీ - శబ్దాకర్షిణీ - స్పర్శాకర్షిణీ - రూపాకర్షిణీ - రసాకర్షిణీ - గంధాకర్షిణీ - చిత్తాకర్షిణీ - ధైర్యాకర్షిణీ - స్మృత్యాకర్షిణీ - నామాకర్షిణీ - బీజాకర్షిణీ - ఆత్మాకర్షిణీ - అమృతాకర్షిణీ - శరీరాకర్షిణీ| ఇవి స్వరమాతృకలు

9, అక్టోబర్ 2020, శుక్రవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - తృతీయశ్వాస - 03

 

కామ మాతృకలు

కామేశ - కామద - కాంత - కాంతిమాన - కామగ - కామాచారా - కామీ - కాముక - కామవర్ధన - వామ - రామ - రమణ - రతినాథ - రతిప్రియ - రాత్రినాథ - రమాకాంత - రమమాణ - నిశాచర - నందక - నందన - నందీ - నందయితా - పంచబాణ - రతిసఖా - పుష్పధన్వ - భ్రామణ - భ్రమణ - భ్రమమాణ - భ్రమ - భ్రాత - భ్రామక - భృంగ - భ్రాంతచారీ - భ్రమావహ - మోహన - మోహక - మోహ - మోహవర్ధన - మదన - మన్మధ - మాతంగ - భృంగనాయక - గాయక - గీతీ - నర్తక - ఖేలక - ఉన్మత్త - మత్తక - విలాసీ - లోభవర్ధన| ఇవి కామమూర్తులు

5, అక్టోబర్ 2020, సోమవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - తృతీయశ్వాస - 02

 

శ్రీవిద్యా మాతృకా నిరూపణ

ఇప్పుడు మాతృకా మంత్రరూప జగద్ధాత్రి వర్ణన చేయబడుచున్నది. దీని వలన మంత్రము యొక్క న్యాస-పూజ-జపములు సౌకర్యవంతమవుతాయి. విశేషంగా కాలీమత సాధకుల గురించి అయిదు రకముల కళలను యాభైవర్ణములనుండి ఉద్దరించబడినవి.

1, అక్టోబర్ 2020, గురువారం

సనాతన ధర్మం - 1

                శ్రీమాత్రేనమః

శ్రీమహాగణపతయే నమః

శ్రీగురుభ్యోనమః

ఓం శ్రీగురుస్సర్వకారణభూతాశక్తిః

ఓం సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్ధ సాధకే|

శరణ్యే త్ర్యంబకేదేవీ నారాయణీ నమోస్తుతే||


పరిచయం:

సనాతన ధర్మమనగా శాశ్వతమతము, పురాతన శాస్త్రము. ఇది వేదములనుండి పుట్టినది. ఈ ధర్మమును, మొదటి జాతిగా చెప్పబడు ఆర్యులకు తెలియపరచినట్లుగా ఒక అభిప్రాయము కలదు. అందువలననే ఈ సనాతన ధర్మమును ఆర్యమతముగా చెప్పుట కలదు. ఆర్య అను శబ్దమునకు ఘనమైన, ప్రసిద్ధమైన, దివ్యమైన, ఉత్తమమైన, సదాచారమైన అను మొదలగు అర్ధములు కలవు. వీరి గొప్పదైన జీవనశైలి మరి ఏ ఇతర మతములందు కనబడకపోవుట వలన ఈ మొదటి జాతికి ఆర్య అని పేరు వచ్చిఉండవచ్చును. ఆర్యులు మొదటిగా భూమికి ఉత్తర దిక్కున నివాసము ఏర్పరచుకున్నారు. ఈ భూభాగమునే నేడు భారతదేశము అని పిలుచుచున్నారు. ఈ భూభాగము తూర్పు సముద్రము నుండి పశ్చిమ సముద్రమువరకు, హిమాలయములు మరియు వింధ్యాచలముల మధ్యభూభాగమున విస్తరించుకొని ఉండెను. ఆర్యులు నివసించెను కనుక ఈ భూభాగమును ఆర్యావర్తనము అని పిలిచెడి వారు.

28, సెప్టెంబర్ 2020, సోమవారం

మహామనుస్తవం - 7

 

    దుర్గమమంతర్ధ్వాంత ప్రాకారం విహసితేన భిందంతీ|

    ముఖమండలభా యస్యాః కురుతే స్వచ్ఛాంతరానిమానస్మాన్||

శ్రీమాత యొక్క అత్యద్భుతమైన చిరునగవు భేదింపశక్యము కాని గట్టి కోటవంటి మన అంతర అంధకారమును ధ్వంసం చేసి, ప్రకాశవంతమైన ఆమె ముఖ బింబము మన హృదయమును పరిశుద్ధము గావించుచున్నది.

25, సెప్టెంబర్ 2020, శుక్రవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - తృతీయశ్వాస - 01

 

షోడశారచక్రము

కులమూలావతారము ప్రకారము, ఒక చతురస్రములో తూర్పు దిక్కునుండి పడమట వరకు మూడు, దక్షిణము నుండి ఉత్తరము వరకు మూడు  సమాంతర రేఖలు గీయాలి. అప్పుడు పదహారు గడుల చక్రము ఏర్పడుతుంది. ఈ పదహారు గడులందు అ నుండి క్ష వరకు వర్ణములను ఈశాన కోణము నుండి మొదలు పెట్టి వాయవ్య కోణము వరకు ప్రదక్షిణ క్రమంలో రాయాలి.

17, సెప్టెంబర్ 2020, గురువారం

మహామనుస్తవం - 6

 

        అవిచిన్వన్ దేవపథం యదయం నీతో యదుఛ్చయేత్ యయా|

        జనమిమమజ్ఞమవంతి విజ్ఞా సా త్రిపురసుందరీ విద్యా||

ప్రజ్ఞానఘన రూపిణి అయిన అమ్మ ఏమీ తెలియని అజ్ఞానిని, అతడు ఏమీ అడగపోయినా అకస్మాత్తుగా, దైవికముగా అతడిని రక్షిస్తూ ఆధ్యాత్మిక సాధనా మార్గంలోకి నడిపించింది.

11, సెప్టెంబర్ 2020, శుక్రవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - ద్వితీయశ్వాస - 16

 కాలీమతము ప్రకారము మంత్ర మేలనము

రుద్రయామలము నందు ఈ విషయము చెప్పబడినది -

రుద్రయామల అనుసారము నక్షత్రచక్ర రచనా విధానము ఈ క్రింది విధముగా ఉంటుంది. దక్షిణం నుండి ఉత్తరము వరకు నాలుగు రేఖలు, 

4, సెప్టెంబర్ 2020, శుక్రవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - ద్వితీయశ్వాస - 15

 సిద్ధారిచక్ర నిర్ణయము

సిద్ధారిచక్రమును ఈ క్రిందివిధముగా నిర్మించాలి.


1 అకథహ 

2 ఉఙప    

3 ఆకథ

4 ఊచఫ

5 ఓడవ

6 లృఘమ 

7 ఔఢశ

8 ల్హూఞయ

9 ఈఘన

10 ర్హుజభ

11 ఇగధ

12 ఋచభ

13 అఃతస

14 ఐఠల

15 అంణష 

16 ఎటర

 

ఈ చక్రమందు నామప్రధమాక్షరమునుండి మంత్ర ప్రధమాక్షరము వరకు క్రమంగా 1. సిద్ధ 2. సాధ్య 3. సుసిద్ధ 4. శత్రు అవుతాయి.

28, ఆగస్టు 2020, శుక్రవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - ద్వితీయశ్వాస - 14

 

మంత్రమేలన ప్రకారము

మంత్రరాజమునందు ఈ విధంగా చెప్పబడినది - త్రిపురా మరియు నిత్యాదేవీల మంత్రములందు అంశకాదులు దర్శనీయము కాదు. కానీ అభిచారాది సిద్ధి గురించి ఇక్కడ ఒక విశేషం చెప్పవలసినది ఉంది. మంత్రము యొక్క మొదటి అక్షరమును నామము యొక్క మొదటి  అక్షరముతో గణించాలి. ఆరు, ఎనిమిది, పన్నెండు సంఖ్యవస్తే ఆ మంత్రము యొక్క మొదటి వర్ణము శత్రువు అవుతుంది. దీనితో హితము కలగదు. రాశినామము నుండి నక్షత్రము సప్తమ, పంచమ, తృతీయ అయితే సాధ్య నామము యొక్క అంశమును తెలుసుకొని అనుగ్రహ కర్మ చెయ్యాలి. 

26, ఆగస్టు 2020, బుధవారం

మహామనుస్తవం - 5

 

జీవగ్రాహముదగ్రా నిజపదజాలే నిధాయ మాం యస్యాః|

       జాగర్తి స్వీకర్తుం దృష్టి: కాలేత్ర తంతునాభనిభా||

సాలెపురుగు తదేక దృష్టితో తన ఆహారమును చూచి తన సాలెగూటిలోనికి తీసుకొని అందు ఉంచి, తనకు అవసరమైనప్పుడు ఆ ఆహారమును మ్రింగివేయును. ఆ విధంగానే శ్రీమాత తన ప్రియ భక్తుడిని తదేక దృష్టితో చూసి (=అనగా పరీక్షించి) ముందుగా తన సామీప్యమునకు తీసుకొనును. ఆ తర్వాత ఆ భక్తుని సాధన, భక్తి, పూర్వజన్మ ఫలం మొదలగు వాని అనుగుణంగా శ్రీమాత ఆ భకునికి సాయుజ్య ముక్తినొసగును.

20, ఆగస్టు 2020, గురువారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - ద్వితీయశ్వాస - 13

 

త్రైలోక్యడామర తంత్రము

ఇందు ఈవిధముగా చెప్పబడినది -

మంత్రములకు న్యాసము - పల్లవము మరియు ప్రణవము - శిరస్సు. ఈ రెండింటిచేత సంయుక్తమైన మంత్రము కామధేను సమానముగా ఫలప్రదము. న్యాసరహిత మంత్రము మూగతో సమానము. ఆసన రహిత సుప్త (నిద్ర), పల్లవ రహిత నగ్న,

18, ఆగస్టు 2020, మంగళవారం

మహామనుస్తవం - 4

 

 అచ్ఛలజీవనవిధయే తుచ్ఛమనోవాసకచ్ఛతో హృత్వా|

 విచ్ఛందకనిజపదభూసేవినమేనం వ్యధత్త యా సదయా||


హీనమైన, అల్పమైన, బురదమయమైన మానసిక జీవనవిధానం నుండి తన భక్త సాధకుడిని ప్రేమతో అతని సంకల్పం లేకుండానే తన పాదసేవకునిగా చేసుకుంటుంది.

3, ఆగస్టు 2020, సోమవారం

భక్తిపద్యములు2

సాత్వికసపర్యలకువేదసంస్తుతులకు
నామసంకీర్తనలకర్చనలకునీవు
పల్కవేల?మరివడిగాపల్కెదవుశ
వవరివస్యముకేలశివప్రియసఖి

మహామనుస్తవం 3మూర్తిమపశ్యమమూర్తేరపి యద్ దేవ్యాఃపురా శిలాశిల్పే|
చేతంత్యథ చేతయన్తీకృపాహి సేతిస్మరామి సుందర్యాః||

పాతరోజుల్లో త్రిపురసుందరీ అమ్మవారి విగ్రహాన్ని చూసినప్పుడు అది విగ్రహంలా కాక, ఒక చైతన్యరూపంగా కనపడి నాయందు ఆ చైతన్యమును ప్రవేశపెట్టినట్టుగా భావన కలిగేది.

31, జులై 2020, శుక్రవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - ద్వితీయశ్వాస - 12


మంత్రదోషముల శమన ఉపాయము

మంత్రదోషములను తెలుసుకొని ఆ దోషములను గురువు క్రమముగా పరిహారము చెయ్యాలి. అలా చేయకపోతే గురుశిష్యులిద్దరూ అల్పకాలంలోనే నాశనమవుతారని తంత్రరాజమునందు చెప్పబడినది. శివుడు చెప్పుచున్నాడు - కనుక, హేదేవీ! ఆ దోషములను నాశనము చేయు ఉపాయమును ధ్యానపూర్వకముగా వినుము. 

24, జులై 2020, శుక్రవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - ద్వితీయశ్వాస - 11


ఇపుడు ఈ సంస్కారములను విస్తారముగా వివరించబడుచున్నవి.

1. జనన: మారేడు లేదా చందనాదిపీఠము మీద కుంకుమాదులతో పాంచభౌతిక చక్రమును లిఖించి దానిమీద అ నుండి క్ష వరకు మాతృకలను లిఖించి వాటిలో మాతృకా సరస్వతిని ఆహ్వానించి, పూజించి, మాతృకలను 108 సార్లు జపము చేసి, వాటి మధ్యన సాధకుని అభీష్టమంత్రము యొక్క స్వర-వ్యంజన-బిందు-విసర్గ సంయుక్తాక్షరములను వేరువేరుగా ఉద్ధారము చేసి గురువు ఉపదేశించిన మంత్రమును జపము చేయుట జననము.

21, జులై 2020, మంగళవారం

మహామనుస్తవం 22.    యా శైశవాత్ ప్రభృతి నఃసంకటబహులేషు సంశయపదేషు|
       అవిదితమథవా విదితం పాతాత్ పాతి స్మ గంతుమిహ గమ్యమ్||

మనకు తెలిసినా, తెలియకున్నా మన చిన్నతనము నుండి మనకు కలిగే కష్ట, నష్ట, దుఃఖాలనుండి ఆమె మనలను క్రిందపడకుండా కాపాడుతూనే ఉండి మన గమ్యమునకు చేరుటకు సహకరిస్తూనే ఉన్నది.

17, జులై 2020, శుక్రవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - ద్వితీయశ్వాస - 10మంత్రములను దోషరహితము చేయు విధానము

శారదాతిలకతంత్రము ప్రకారము, మంత్రముల దోషములను, మంత్రమును ఆత్మతో జోడించి కుంభకంలో యోనిముద్రను బంధించి శుద్ధము చెయ్యాలి.

యోనిముద్రాలక్షణం
రుద్రయామల భైరవీపటలమునందు ఈ విధంగా చెప్పబడినది-

10, జులై 2020, శుక్రవారం

మహామనుస్తవం 1              ఆర్యా మాతరమాద్యాం త్రిభువనసంతానయోగసౌభాగ్యాం|
              ఆదిపురేశ్వరమాహిషీం లలితాం శ్రీత్రిపురసుందరీం వందే||

పార్వతి, మొట్టమొదటి తల్లి, మూడుపురముల వాస్తవ్యులు తన సంతానముగా సౌభాగ్యం గల ఆదిపురీశ్వర పట్టపురాణి అయిన శ్రీ లలితామహాత్రిపురసుందరికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.

ఇక్కడ ఆర్యా శబ్దంతో ఈ సూత్రాలను సాధకోత్తముడు ప్రారంభించెను. ఆర్యా అనగా పార్వతి, పదునారేండ్లప్రాయము కలది, పూజ్యస్త్రీ అని అర్ధము. అమ్మ నిత్య షోడశప్రాయయే కదా. అందుకే ఆమె మంత్రము కూడా షోడశివర్ణములు గలది.

ఆర్య అనునది వేద వాక్యము. ఈ పదమునకు, తీవ్రముగా, నిరంతరముగా పట్టుదలతో జ్ఞానమనే మార్గములో పయనిస్తూ అజ్ఞానమనే చీకట్లను నిర్దాక్షిణ్యంగా పాలద్రోలే శక్తియని అంతరార్ధము. శ్రీమహాత్రిపురసుందరియే ఆర్యా రూపంలో తన సాధకులను ప్రతికూలమైన సాధనా వ్యతిరేకతలనుండి రక్షించి అజ్ఞాన చీకట్లనుండి బయటకు తీసుకు వచ్చి జ్ఞానమనే కిరణములను ప్రసాదించును.

సంతానం అనగా విస్తరించడము, వ్యాపించడము మరియు సంతతి. శ్రీమాత మూడులోకములందునూ వ్యాపించిఉన్నది. ఆయా లోకములందున్న అన్ని జీవరాశులను ఆమె తన సంతానముగా కాపాడుచుండును. సంతానము లేకపోతే తల్లే ఉండదు. కనుక మూడులోకములందున్న జీవరాశులు ఆమె సంతానముగా ఉండడం ఆమె సౌభాగ్యం. ఇక్కడ మనం గమనించవలసిన విశేషం ఏమనగా, తల్లి తన సంతానాన్ని ఎల్లప్పుడూ కాపాడుతూనే ఉంటుంది. క్రమశిక్షణా మార్గంలో ప్రవర్తించడం సంతానం బాధ్యత. కనుక, అజ్ఞానంధకారంలో మునిగిపోయిన సంతానం, తన తల్లిని చేరుకోవడానికి ప్రయత్నించడమే సౌభాగ్యము. ఆ ప్రయత్నా సాధననే సౌభాగ్య విద్య అంటారు.

ఆదిపురము అనునది నేటి చెన్నై మహానగరమునకు దగ్గరలో ఉన్న తిరువొత్తియూర్ అను నగరమునకు పేరు. శ్రీకపిలశాస్త్రిగారు ఈ నగర వాస్తవ్యులు. ఈనగరములో ఉన్న దేవీ దేవతలు శ్రీ లలితా మహాత్రిపురసుందరి మరియు ఆమె విభుడు ఆదిపురేశ్వరుడు.

ఇక్కడ విశేష రహస్యము చూద్దాము. ఆది అనగా మూలము అని అర్ధము. అదియే మూలాధారము. అందు ఉండు శక్తి కుండలిని. ఈ కుండలినీ శక్తియే శ్రీ మహాత్రిపురసుందరి. మూలాధారమున హస్తిమీద స్వయంభూ శివలింగము, దానిని మూడున్నర చుట్లు చుట్టుకొని కుండలినీ శక్తి ఉంటుంది. ఆ పురమునకు ఆ లింగమే ఈశ్వరుడు. త్రిపురసుందరి పట్టపురాణి. ఇక్కడ ఈశ్వర శబ్దమును బ్రహ్మ సంకేతంగా అర్ధంచేసుకోవాలి. కనుకనే ఆదిపురేశ్వరమాహిషీం అని స్తుంతించారు. ఇక్కడ మూలాధార సాధన రహస్యమును ఉటంకించబడినది.