కాళీమతానుసారము భూతలిపి,
మంత్రోద్దారము, అర్చాక్రమము
భూతలిపి అతిగోప్యము
మరియు అతి దుర్లభము. అది సారస్వత మహాతంత్రము నందు అతిగోప్యము మరియు అతి
సిద్ధిదాయకము అని చెప్పబడెను. మునులు విష్ణువు నుండి దీనిని ప్రాప్తించుకొని వారి
వాంఛిత ఫలములను పొందారు. హేదేవీ! అధికముగా చెప్పుటవలన ఏమి లాభము? దీని
నుండి మునులు అన్నీ ప్రాప్తించుకున్నారు.
భూతలిపి నవ వర్ణాత్మకము -
1. అ - ఇ
- ఉ - ఋ - ఌ (హ్రస్వవర్ణములు)
2. ఏ - ఐ
- ఓ - ఔ (శివాద్య చరక్షరములు)
3. హ - య
- ర - ల - వ (ఆకాశము - వాయువు - భూమి - అగ్ని - జలము)
4. ఙ -
కం - ఖం - ఘం - గం
5. ఞ -
చం - ఛం - ఝం - జం
6. ణం -
టం - ఠం - ఢం - డం
7. నం -
తం - థం - ధం - దం
8. మం -
పం - ఫం - భం - బం
9. శ - ష
- స (వాంత, శాంత, భృగు)
నవవర్ణాత్మక
భూతలిపి మంత్రమునందు నలభైరెండు అక్షరములుంటాయి. ఈ నవ వర్ణముల దేవతలు క్రమముగా
బ్రహ్మ, విష్ణు, రుద్ర, అశ్వినీకుమార, ప్రజాపిత, లోకపాల, క్రియా, ఇచ్చా మరియు జ్ఞాన.
ఈ
మంత్రమునకు ఋషి దక్షిణామూర్తి, ఛందస్సు గాయత్రి, దేవతా సరస్వతి. వ్యోమాది షడ్వర్గము మరియు జాతియుక్త షడంగ
న్యాసము చెయ్యాలి.
హం యం రం
వం లం - హృదయాయనమః
ఙo కం ఖం ఘం గం - శిరసే స్వాహా
ఞo చం ఛం ఝం జం - శిఖాయై వషట్
ణం టం ఠం
ఢం డం - కవచాయ హుం
నం తం థం
ధం దం - నేత్రత్రయాయ వౌషట్
మం పం ఫం
భం బం - అస్త్రాయ ఫట్
భూతలిపి
వర్ణములతో న్యాసము ఈ క్రింది ప్రకారంగా ఉంటుంది -
ఓం ఊం నమః - ముఖే| ఓం ఇం నమః లింగే| ఓం ఉం నమః నాభౌ| ఓం ఋo నమః హృది| ఓం ఌo నమః కంఠే| ఓం ఏం నమః భ్రూమధ్యే| ఓం ఐం నమః లలాటే| ఓం ఓం నమః శిరసి| ఓం ఔం నమః బ్రహ్మరంధ్రే| ఓం హం నమః ఊర్ధ్వముఖే| ఓం యం నమః పూర్వముఖే| ఓం రo
నమః దక్షిణముఖే| ఓం వo నమః ఉత్తరముఖే| ఓం లo నమః పశ్చిమముఖే| ఓం ఙo నమః దక్షహస్తాగ్రే| ఓం కo నమః
దక్షకరమూలే| ఓం ఖం నమః దక్షకూర్పరే| ఓం
ఘం నమః దక్షకరాంగులిసంధౌ| ఓం గం నమః దక్షమణిబంధే| ఓం ఞo నమః
వామకరాగ్రే| ఓం చం నమః వామకరమూలే| ఓం
ఛం నమః వామకూర్పరే| ఓం ఝం నమః వామకరాంగుళిసంధౌ| ఓం జం నమః వామమణిబంధే| ఓం ణం నమః దక్షపాదాగ్రే| ఓం టం నమః దక్షపాదమూలే| ఓం ఠం నమః దక్షజానౌ| ఓం ఢం నమః దక్షపాదాంగుళిమూలే| ఓం డం నమః దక్షగుల్ఫే| ఓం నం నమః వామపాదాగ్రే| ఓం తం నమః వామపాదమూలే| ఓం థo నమః వామజానుని| ఓం ధం
నమః వామపాదాంగుళిమూలే| ఓం దం నమః వామగుల్ఫే| ఓం మం నమః ఉదరే| ఓం పం నమః దక్షపార్శ్వే| ఓం ఫం నమః వామపార్శ్వే| ఓం భం నమః నాభౌ| ఓం వం నమః పృష్ఠే| ఓం శం నమః గుహ్యే| ఓం షం నమః హృది| ఓం సం నమః భ్రూమధ్యే| ఇది సంహారన్యాస క్రమము.
సృష్టిన్యాసము విసర్గాంత వర్ణములతోనూ, స్థితిన్యాసము బిందు
విసర్గ రెండిటితోనూ అవుతాయి.
ధ్యానము
ఇప్పుడు
పూజిత ధ్యానము చెప్పబడుచున్నది. మనుష్యుడు దేనినైతే శాశ్వతమని చెబుతాడో అది
బిందు-నాదయుక్త విశ్వంభరాక్షరల శాఖాసమూహంతో అన్నీ దిశలయందు వ్యాప్తి చెందిన
"చిద్బీజము". అది మూడులోకములను జలవర్ణముతో ఆచ్ఛాదన చేసినది.
అగ్నివర్ణాంకురంతో అన్నింటినీ ప్రజ్వరిల్లుచేస్తుంది. వాయువర్ణములతో రత్నాంకురములాగా
శోభిల్లుచేస్తుంది. కుసుమముల శోబిల్లత దాని తనుశ్రీ. నాభస అక్షరముల చేత అది
వినమ్రము అవుతుంది. అన్ని భూతములూ దానినే ఆశ్రయించి ఉంటాయి. దేవీ వాగీశ్వరీ
పరమేశ్వరి ఎల్లప్పుడూ పరామృత మధుద్రవ్యములతో మునిగి ఉంటుంది. అది నిగమాగమ సంక్లుప్త
సమున్నత సుశోభిత మరియు శివశక్త్యాత్మకము. దీనిని ఆశ్రయించే మునీంద్రులు వారి
వాంఛితములను పొందుతున్నారు. ఈవిధంగా ఎవరు దేవీ వాగీశ్వరిని స్మరిస్తారో వారి అన్ని
కోరికలూ తీరుతాయి. ఆ దేవి ధ్యానము ఈ క్రింది విధంగా ఉంటుంది.
కుందాభాసామురుకుచఘటాం
శోభిచంద్రార్ధమౌలిమ్ హస్తాంభోజైర్వజపవటీపుస్తకం పుంస్కపాలాం|
బిభ్రాణాం
తాం మధుమదలసద్విహ్వలాం యుగ్మనేత్రాం దేవీం ధ్యాయేల్లిపి మయతతుం యౌవనప్రాప్తశోభాం||
హే దేవీ!
ప్రసన్నచిత్తంతో
హృదయమునందు దేవీ ధ్యానము ప్రతి దినమూ చేసి మాతృకా పీఠమునందు పూజ చెయ్యాలి.
వర్ణపద్మమునందు మూలముతో మూర్తి కల్పన చేయాలి. అందు వాగీశ్వరీ దేవిని ఆవరణ సహితంగా
ఆవాహన చెయ్యాలి. దళములందు షడంగపూజ చెయ్యాలి. ముందుగా దుర్గాంబికా పూజ చెయ్యాలి.
తర్వాత నాలుగు దళములందు అంబికా, వాగ్భవ, దుర్గా, శ్రీ -
వీరిని పూజించాలి.
వీటికి
బయట అష్టదళము మరియు షోడశదళమునందు ముందు చెప్పబోవు పదహారు శక్తుల పూజ చెయ్యాలి. ఆ
పదహారు శక్తులు - కరాళీ,
వికరాళీ, ఉమా, సరస్వతీ, శ్రీ, దుర్గా, ఈశా, లక్ష్మీ, శృతి, స్మృతి, ధృతి, శ్రద్ధా, మేధా, మతి, కాంతి, ఆర్యాషోడశీ.
వీరందరి చేతులందు డాలు, కత్తి ఉంటాయి. వీరివర్ణము
శ్యామల వర్ణము. వీరు చిరునవ్వులు చిందిస్తూ ఉంటారు. వీరు సుందరమైన ఆభరణములు ధరించి
ఉంటారు.
ముఫైరెండు
పూజనీయ శక్తుల నామములు:
విద్యా, హ్రీం, పుష్టి, ప్రజ్ఞ, సినీవాలి, కుహూ, రుద్రవీర్య, ప్రభా, నందా, పూషా, ఋద్ధిదా, శుభా, కాలరాత్రి, మహారాత్రి,
భద్రకాళీ, కపాలినీ, వికృతి, దండీ, ముండినీ, ఇందుఖండా, శిఖణ్డినీ, నిశుంభ-శుంభమధని, మహిషాసురమర్ధిని, ఇంద్రాణీ,
శంకరార్ధశరీరిణీ, నారీ, నారాయణీ, త్రిశూలినీ, పాలినీ, అంబికా, హారిణీ, రుద్రాణీ|
వీరందరూ
శ్వేతవర్ణంలో ఉంటారు. వీరిచేతుల్లో పిశాచము మరియు చక్రము కలిగి ఉంది సుందరమైన
భూషణములతో శోభిల్లుతూ ఉంటారు.
పూజనీయ
అరవైనాలుగు శక్తులనామములు:
పింగలాక్షీ, విశాలాక్షి, సమృద్ధి, వృద్ధి, శ్రద్ధ, స్వాహా, స్వధా, భిక్ష, మాయ, సంజ్ఞా, వసుంధర,
త్రిలోకధాత్రి, సావిత్రి, గాయత్రి, త్రిదశేశ్వరి, సురూపా,
బహురూపా, స్కందమాత, స్కందప్రియ, విమల, విపులా, అరుణి, ఆరుణి, ప్రకృతి, సృష్టి, స్థితి, సంహృతి, సంధ్య, మతి, సతీ, హంసీ, మార్ధ్విక, పరదేవత, దేవమాత, భగవతీ, దేవకీ, కమలాసనా, త్రిముఖి, సప్తముఖి,
సురాసురమర్ధిని, లంబోష్ఠి, ఊర్ధ్వకేశీ, బహుశీర్షా, వృకోదరీ, రథరేఖ, శశిరేఖా, పరా, గగనరేఖ, పవనవేగ, భువనపాలా, మదనాతురా, అనంగా, అనంగమదన, అనంగమేఖల, అనంగకుసుమ, విశ్వరూపా,
అసురభయంకరీ, అక్షోభ్యా, సత్యవాదినీ, వజ్రరూపా, శుచివ్రతా, వరదా, వాగీశా|
వీరి
చేతుల్లో ధనస్సు, బాణము ఉంటాయి. నాలుక ఎర్రగా
ఉంటుంది (జ్వాలాజిహ్వా). పెద్దదంతములు, ఊర్ధ్వ కేశములు, యుద్ధోపక్రాంత మనస్సు కలిగి ఉంటారు. వీరు సర్వాభరణములతో శోభిల్లుతూ
ఉంటారు. యత్నపూర్వకంగానైనా వీరి పూజ చెయ్యాలి. వీరి పూజ తర్వాత ఇంద్రాది దశ
లోకపాలకుల మరియు వారి దశాయుధముల పూజ చెయ్యాలి.
ఈ
ప్రకారముగా సాధకులు భూతలిపి ద్వారా జగద్ధాత్రి పూజను పూర్తిగా, చక్కగా చెయ్యాలి. ఈ విధంగా చెయ్యడం వలన
సాధకునికి వాగైశ్వర్యము లభించి స్తుతియింపబడువాడు అవుతాడు. సద్గురువు ద్వారా
దీక్షను తీసుకొని న్యాసము చేసి ఒక లక్షజపము చెయ్యాలి. జపములో దశాంశము
త్రిమధురములతో తిలలను కలిపి హోమము చెయ్యాలి. హోమములో దశాంశము తర్పణములు వదలాలి.
సిద్ధి లభించిన తర్వాత గురువు చెప్పిన విధానమున కామ్య కర్మలు చెయ్యాలి. కమలములతో
పదివేలు హోమము చెయ్యడం వలన రాజవశమవుతుంది. కలువలతో హోమము చెయ్యడం వలన కొన్ని
దినములలోనే మహాలక్ష్మి ప్రాప్తిస్తుంది. మోదుగచెట్టు పువ్వులతో హోమము వలన ఒక
సంవత్సరములోనే పెద్ద పెద్ద కవీన్దృల్లో అగ్రగణ్యుడు అవుతాడు. నల్ల ఆవాలు మరియు
ఉప్పుతో హోమము చేస్తే రాత్రి వశమవుతుంది.
ఈ
భూతిలిపి మంత్రములతో ఏ మంత్రమునైనా సంపుటీకరించి ఒక సహస్రం జపం చేస్తే ఆ మంత్రం
సిద్ధిస్తుంది. ఆ సాధకుని సుప్తకుండలినీ సుషుమ్నా మార్గం ద్వారా పయనించి సహస్రారము
చేరి మూలాధారము వరకు పరమామృతము చేత తడుపుతుంది. యోగులకు అన్ని యోగములు సిద్ధి
దాయకములవుతాయి. వారి శరీర తేజము సూర్యునితో సమానముగా ఉంటుంది. యంత్ర విశేషము
తెలుసుకొని కామ్యకర్మముల సాధన చెయ్యాలి.
భూతపంచక యంత్రము
సానుస్వార
హ (హం), శివయుక్త హాం, నమః లను యంత్రకర్ణికందు లిఖించాలి. దళములందు వ్యోమవర్ణములను ( ఆకాశ - జల
వర్ణములు) లిఖించాలి. సాధ్యనామ వర్ణములను హతో సంపుటీకరించి దళముల చివరన లిఖించాలి.
యంత్రమును శ్వేతచందనముతో లిఖించి పూజ చేస్తే దుష్టుల నాశనము అవుతుంది.
యంత్రమును
శత్రువుల గృహద్వారమునందు స్థాపించితే అది శత్రువులకు మృత్యువవుతుంది. వహ్ని, శ్రుతి, ఇందుయుక్త
స్వకాంత "రో", "రౌం" లను మంత్ర మధ్యన, దళములందు అగ్ని వర్ణములను, దళముల చివర సాధ్య సుపోష
(=?) వర్ణములను లిఖించాలి. లక్క మరియు కుంకుమ మిశ్రముతో యంత్రమును
లిఖించి పూజచేస్తే రక్షకలుగుతుంది.
కాలీమతమునందు శ్రీవిద్యాప్రకరణము
దేవతాభావ
సిద్ధి పొందడానికి పంచసింహాసన, పంచపంచిక, షడాయతనవిద్యా,
పంచామ్నాయ, చతుఃసమయవిద్యా, శ్రీవిద్యా
వృంద జ్ఞానము కలిగి ఉండాలి. అన్ని రకాల సిద్ధికి సంపత్ప్రదా భైరవి, చైతన్యభైరవి, ద్వితీయాచైతన్యభైరవి, సర్వసిద్ధిదా, కామేశ్వరీభైరవి, బాలాది పంచపూర్వ సింహాసనస్థ దేవతల స్మరణ చెయ్యాలి. న్యాసము, పూజ మరియు హవనమునందు వీరు స్మరణీయులు. దక్షసింహాసనము మీద ఉండు అఘోరభైరవి, మహాభైరవి, లలితాభైరవి,
కామేశీభైరవి మరియు రక్తనేత్రభైరవి స్మరణ కూడా అవశ్యము.
పశ్చిమసింహాసనము
మీద ఉండు షట్ కూట భైరవి,
నిత్యభైరవి, మృతసంజీవనీ భైరవి,
మృత్యుంజయపరా, వజ్రప్రస్తారిణి - వీరిని పూజించాలి.
ఉత్తరసింహాసనము
మీద ఉండు భువనేశ్వరీ భైరవి, కమలేశీ భైరవి, కౌలేశీ భైరవి,
డామరభైరవి, కామినీభైరవిలను పూజించాలి.
ఊర్ధ్వసింహాసనము
మీద ఉండు ప్రధమాసుందరి,
ద్వితీయాసుందరి, తృతీయాసుందరీ,
చతుర్ధీసుందరి, పశ్చిమసుందరిలను పూజించాలి.
పంచలక్ష్ములు: శ్రీవిద్యాలక్ష్మి, లక్ష్మీలక్ష్మీ,
మహాలక్ష్మి, త్రిశక్తిలక్ష్మి,
సర్వసామ్రాజ్యలక్ష్మి
పంచకోశాంబలు:
శ్రీవిద్యాకోశాంబ, పరంజ్యోతికోశాంబ, పరానిష్కలాకోశాంబ, శాంభవీకోశాంబ, అజపాకోశాంబ
[అ.మా:
కొన్ని సంప్రదాయాల్లో శాంభవీ కోశామ్బ బదులుగా మాతృకా కోశామ్బ ఉండును.]
పంచకల్పలతలు:
శ్రీవిద్యాకల్పలతాంబ,
త్వరితాకల్పలతాంబ, పారిజాతేశ్వరీ
కల్పలతాంబ, పంచబాణేశ్వరీకల్పలతాంబ, త్రికూటకల్పలతాంబ
పంచకామధుఘలు:
శ్రీవిద్యా కామధుఘాంబ,
అమృతపీఠేశీ కామధుఘాంబ, సుధాంసు కామధుఘాంబ, అమృతేశ్వరీ కామధుఘాంబ, అన్నపూర్ణా కామధుఘాంబ
పంచరత్నాంబలు:
శ్రీవిద్యారత్నాంబ, సిద్ధలక్ష్మీరత్నాంబ, మాతంగీరత్నాంబ, భువనేశ్వరీరత్నాంబ, వారాహీ రత్నాంబ
గురుపాదుకామంత్రము
స్థూలగురుపాదుకా:
ఓంఐంహ్రీంశ్రీంహసఖఫ్రేంహ్సౌఃహస్రూంహసక్షమలవయరాం
హసక్షమలవయరూం హసక్షమలవయరీం శ్రీపరపావకసర్వారాధ్య సర్వగురునాథ సర్వగురు
గురుశ్రీగురు నాథరంహసక్షమలవయరూం| హ్స్రూం హసక్షమలవయరాం హసక్షమలవయరూం హసక్షమలవయరీం శ్రీ శంభుగురు హ్స్రూం
హ్స్రూం హసక్షమలవయరాం హసక్షమలవయరూం హసక్షమలవయరీం హ్స్రూం హసక్షమలవయరూం||
మధ్యపాదుకా:
ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంసహక్షమలవయరాం
సహక్షమలవయరూం హ్స్రౌం సహక్షమలవయరీం హ్స్రౌః శ్రీపరపావక సర్వారాధ్య సర్వగురునాథ
సర్వగురు స్వయంగురు శ్రీగురునాథరం హసక్షమలవయరూం హ్సౌం సహక్షమలవయరీం సహక్షమలవయరూం
సహక్షమలవయరాం శ్రీశంభుగురు హ్స్రౌం సహక్షమలవయ రూం శ్రీఅముకానందనాథ అముకశక్తి
దేవ్యమ్బా శ్రీపాదుకాం పూజయామి.
లఘుపాదుకా:
ఓంఐంహ్రీంశ్రీం
హ స ఖ ఫ్రేం హ్సౌః హసక్షమలవరయూం శ్రీఅముకానందనాథ ఓంఐంహ్రీంశ్రీం సహఖఫ్రేంస్సౌః
సహక్షమలవరయీం అముకదేవ్యంబా శ్రీపాదుకాం పూజయామి
లఘుతరపాదుకా:
ఓంఐంహ్రీంశ్రీం
శ్రీఅముకానందనాథ అముకశక్త్యాంబా శ్రీపాదుకాం పూజయామి
సామాన్యపాదుకా:
ఓంఐంహ్రీంశ్రీం
శ్రీఅముకానందనాథ శ్రీపాదుకాం పూజయామి
గురుధ్యానం:
బ్రహ్మ ముహూర్తముననే
నిద్రలేచి స్వస్థ చిత్తముతో, స్థిర తనువుతో గురుపాదుకను స్మరించాలి. ఈ మంత్రమునకు ఋషి - బ్రహ్మ, ఛందస్సు - నిచృద్గాయత్రి, బీజము - ఐం, శక్తి - హ్రీం, కీలకం - శ్రీం| వినియోగము - మోక్ష హేతువు.
ప్రాతఃకాలమున
సహస్రారమునందు శ్వేతకమలములో కూర్చొని అభయముద్రను చూపిస్తూ శాంతముగా ఉన్న ద్విభుజ
గురువర్యుని నామముతోసహా స్మరించాలి. వెయ్యిచంద్రుల ప్రభతో సమానమైనటువంటి, కోటిసూర్యుల తేజస్సు కలిగినటువంటి, శ్వేతవస్త్రములను ధరించినటువంటి, శ్వేతమాలా మరియు
చందనాదులపూత కలిగినటువంటి, వామాంకమున శక్తిని కలిగినటువంటి
గురుదేవుని ధ్యానించాలి. శక్తివర్ణము ఎరుపు. ఆమె చేతిలో కమలము ఉంటుంది. గురువు
మరియు గురుశక్తి పరస్పరము కౌగిలించుకొని ఆనందంగా ఉంటారు.
ఓఘత్రయ గురుధ్యానము
చేతులందు
చిన్ముద్ర మరియు కపాలము కలిగి, శరీరము నందు స్వర్ణాభరణములు, అరుణ కుసుమ లేపనములు మరియు
వస్త్రములు కలిగి ఉంటారు. కృపాయుక్తమైన అతని నేత్రములు అరుణ వర్ణంలో ఉంటాయి. ఆయన
జటాజూటము వివిధరంగుల్లో ఉంటుంది. ఈ రూపంలో సిద్దౌఘ గురువులను ధ్యానము చెయ్యాలి.
గురునమస్కారము
గురువుకు
నమస్కారము చేసే మంత్రములు ఈ క్రింది విధంగా ఉంటాయి -
అజ్ఞానతిమిరాన్ధస్య
జ్ఞానాంజనశలాకయా| చక్షురున్మీలితం యేన
తస్మైశ్రీగురవే నమః||
అఖండమండలాకారం
వ్యాప్తం యేన చరాచారం|
తత్పదం దర్శనం యేన తస్మైశ్రీగురవే నమః||
గురుర్బ్రహ్మా గురుర్విష్ణుగురుర్దేవో మహేశ్వర| గురుఃకర్తాచ హర్తాచ గురువేవై నమో నమః||
ఇంకాఉంది...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి