(ఈ శ్వాసనందు వివిధ గురుక్రమములు, ఆమ్నాయదేవతలు, గురుమండల పూజ, గురు-శిష్య
లక్షణములు మొదలగునవి చెప్పబడుచున్నవి)
ముందుగా మంగళాచరణముతో గ్రంథమును
ప్రారంభిస్తున్నారు.
1) ఉద్యత్సూర్య
సహస్రభాస్వరతనుః సూక్ష్మాతి సూక్ష్మపరా|
విద్యుత్పుంజనిభేందు
కోటి సదృశీ ధామత్రయాధ్యాసినీ|
తత్తేజ
స్త్రితయాత్మకై కమునిభిర్వాక్కామ శక్త్యాఖ్యయుక్కుటై|
స్త్రయద్భి
శరతృభిః పరిణతా నిత్యాత్మికా పాతువః||
కాది కాళీ మతకధనం:
2) యా
శ్రీమధుమతీ శక్తిర్జగాచ్చైతన్య రూపిణీ|
సా
శ్యామే పురతో నిత్యం మాలినీ విశ్వ విగ్రహా||
3) మతద్వయం
సమాలోఢ్య తత్సంకీర్ణాభియా పృథక్|
ప్రకాశ్యతే
పరతంత్రమయా విద్యార్ణవాభిథమ్||
4) మధుమత్యా
మహాదేవ్యాస్తాదాత్మమ్ లాదో సంజ్ఞకమ్|
కాళీమతంతు
మాలిన్యాస్తాదాత్మమ్ తాంత్రికా విదుః||
5) షట్రింశద్వ్యమ్జనైర్మూల
భూతైః శివమయైః పృథక్|
షోడశ
స్వరాసంభిన్నైః పూర్ణమండల సంజ్ఞకైః||
6) షట్రింశదృణితైః
సిద్ధ కాల నిత్యా స్వరూపకైః|
నవ్వ్త్మాకైవర్యాప్తి
భేదాద్ ద్విగుణీకృత విగ్రహైః||
7) తద్వైగుణ్యమయై
ప్రత్వైర్యంత్రైస్తద్విగుణీకృతైః|
తత్తద్భేదైర్భిన్న
మూర్తిః ప్రోక్త వేద ప్రకారికా||
8) షట్రింశ
తత్త్వ సంపూర్ణా సర్వమంత్ర ఫలప్రదా|
దేవీ
మధుమతీ యా తత్తాదాత్మమ్ కాది సంజ్ఞకమ్||
9) ఆమ్నాయ
సమయా పంచ పంచికా పీఠ దర్శనైః|
ఉత్పత్తి
స్థితి సంహార భేదైర్వరుందమయైః స్తుతా|
10) మాలినీ
కధ్యతే యా తట్టాదాంయమ్ కాలికామకం|
మతద్వయ
పరిజ్ఞానాచ్చివతుల్యో భవేన్నరః||
11) కాల
తత్త్వ మత వ్యాప్తి సంప్రదాయంగ భావనాః|
స్థూల
సూక్ష్మ పరోపాంగ బీజ శక్త్యార్న పల్లవాన్|
12) తత్తక్రమం
తదాచారం తదుత్పత్తింతదర్చనం|
గురుతః
శాస్త్రతో జ్ఞాత్వ తత్తత్కర్మణ్య తనింద్రతః||
13) ఆద్యంత
మధ్య రహిత ఆది మధ్యాంత సంయుతః|
అనాది
తత్త్వ సంశోధి పరతంత్ర స్వతంత్ర విత్||
14) విదధ్యాధ్యజనమ్
దేవ్యాః ఫలం సాదన్య ధాన్యతా|
గురుక్రమమ
విజ్ఞాయ పూజయేద్యః పరాంశివామ్||
15) సా
పూజా నిష్ఫలాజ్ణేయా భస్మన్నార్పిత హవ్యవత్|
తస్మాంధ్యంతేన
విజ్నేయ మూలాద్గురు పరంపరాం||
16) జ్ఞాత్వా
గురు ముఖాన్నిత్యమ్ సంప్రదాయ మతంద్రితః|
ప్రత్యహంస్మరణం
కుర్య్యాన్మంత్ర వీర్యస్య సిద్ధయే||
ఊర్ధ్వామ్నాయ మంత్రాః
ఉర్ధ్వామ్నాయ, కామరాజ, లోపాముద్రా
మరియు సామాన్య క్రమముల నుండి విద్యావతారం, విద్యాప్తి, కులాగురువుల సంతతి, పంచామ్నాయ దీక్షా మరియు
పంచామ్నాయ మంత్రములు - వీటన్నిటి యొక్క విధివిధానములు తెలుసుకొని ఏ సాధకుడు
అమ్మవారి పూజ/భజన చేస్తాడో అతడి యొక్క అభీష్ఠము తప్పక
నెరవేరుతుంది. ఎవరైతే ఇలా కాకుండా దేవీ పూజ చేస్తారో వారి పూజను " అభిచారము " అని అంటారు.
ఉర్ధ్వామ్నాయము నందు
అరవై నాలుగు మహా మంత్రములు ఉన్నాయి. వీటిలో పరాప్రాసాద మంత్రం, శ్రీవిద్యా షోడశాక్షరీ, ఆధారషటక్ విద్యా మరియు సంవిదదేవీ విద్యలు వస్తాయి. వీటన్నింటినీ
స్మరించిన మాత్రమునే ఆ సాధకుడు శివునితో సమానుడవుతాడు. మంత్ర సిద్ధి పొందటానికి
గురుక్రమము తెలుసుకొనుట అత్యంత ఆవశ్యము.
ఇంకా ఉంది...