సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

5, నవంబర్ 2020, గురువారం

మహామనుస్తవం - 9

 

9.    పారితోమాంవిసరన్తీ మూర్ధ్వమూర్ధ్నోవతీర్య విలసంతీమ్|

       నిధ్యాయన్నధ్యాత్మం భాసం పదయోః స్మరామిసుందర్యాః||

ఆధ్యాత్మిక ద్యుతి సహస్రారమునుండి ప్రసరించి మొత్తం శరీరమంతా ప్రసరిల్లుచూ తడుపుచూ ఉన్నప్పుడు ఆ ద్యుతి శ్రీమహాత్రిపురసుందరీ పాద ద్యుతియే అని స్మరించుచున్నాను.


ఇది శాస్త్రిగారి ఆధ్యాత్మిక అనుభవం. నిరాకార బ్రహ్మమును ఒక వెలుగుగా భావించి సాధన చెయ్యడం సాధకులకు విదితమే. ఆ విధంగానే శాస్త్రిగారు ధ్యానం చెయ్యుచుండగా ఆ వెలుగు ఆయన సహస్రారచక్రమునుండి ప్రసరించి ఆయన శరీరమొత్తము ఆ వెలుగులో మునిగినట్టుగా అనుభూతి చెందారు. అయితే, ఆ వెలుగులు అమ్మవారి పాదముల వెలుగులు అని కూడా ఆయనకు దర్శనమయ్యింది.

శాస్త్రిగారి ఈ అద్భుత అనుభూతి శాస్త్రవిరుద్ధము కాదు అనడానికి "పదద్వయప్రభాజాలపరాకృతసరోరుహా" అను శ్రీలలితా రహస్యనామము నిదర్శనము. అమ్మవారు, అయ్యవారు సహస్రదలపద్మము నందు ఉంటారనుటలో ఎటువంటి సందేహము లేదు కదా. అమ్మవారి పాదముల నుండియే అగ్ని, సూర్య, చంద్రుల 360 కళలూ ప్రసిస్తూ ఉంటాయి. శాస్త్రిగారికి దర్శనమైన కిరణములే ఈ 360 కళలు. దీని ద్వారా సహస్రదలపద్మమున మనసు కేంద్రీకరించి ధ్యానము చేయాలని మనకు అవగతమవుతున్నది. తన నిర్మలమైన సాధన ద్వారా ఈ వెలుగులను దర్శించిన శాస్త్రిగారు ఎంత ధన్యులో కదా. ఈ 360 రశ్ములకు సంబంధించిన విస్తృత సమాచారము శ్రీవిద్యార్ణవ తంత్రములోని నాల్గవశ్వాసలో ప్రథమ భాగములో చూడగలరు.

కామెంట్‌లు లేవు: