దుర్గా మాతృకలు
దుర్గా - కౌశికీ - ఉగ్రా -
చండా - మాహేశ్వరి - శివా - విశ్వేశ్వరి - జగద్ధాత్రి - స్థిసంహారకారిణి - యోగనిద్ర
- భగవతీదేవి - స్వాహా - స్వధా - సుధా - సృష్టి - ఆహుతి| ఇవి స్వర శక్తులు
కళా - మాయా - రమా -
జ్యేష్టా - స్తుతి - పుష్టి - స్థితి - గతి - రతి - ప్రీతి - ధృతి - నీటి - విభూతి
- భృతి - ఉన్నతి - క్షితి - క్షాంతి - క్షతి - కాంతి - శాంతి - క్లాన్తి -
మహాద్యుతి - క్షుత్పిపాసా - స్ఫృహ - లజ్జా - నిద్రా - ముద్రా - చిదాత్మిక - గిరిజ
- భారతి - లక్ష్మి - శచీ - సంజ్ఞా - విభావరి| ఈ వ్యంజన శక్తులు సర్వసిద్ధిప్రదాయినులు
సరస్వతీ మాతృకలు
సరస్వతి - మంత్రశక్తి -
వేదమాత - జగన్మయి - మానసి - హంసగా - హంసి - సరాగా - క్షేమకారిణి - అక్షయ - విజయ - ప్రీతి
- లోమశ - లోమహారిణి - విజ్ఞానదేహ - సమ్మూఢ| ఇవి స్వర శక్తులు
కామదా - కామినీ - కాంతా -
పరమేష్ఠి - నిభోత్తమ - పుణ్యానుబంధా - శ్రేయస్కా - దయాసార - అనుకంపిణీ - చతుఃస్తన
- పంచయజ్ఞా - సురభి - సురపూజిత - విశ్వాసజీవినీ - విశ్వా - కామధేను - స్వకామదా -
అవిద్య - దుహిత - కాంత - కపిలా - మలవర్జిత - సుశీల - జీవవత్సా - శీలవత్సల - సువత్స
- నందిని - జయదా - అజేయ - దుర్జయ - దుఃఖహారిణి - స్వస్తిదా - స్వస్తికృత్ -
స్వస్తిస్వరూప - స్వస్తిదక్షిణ| ఈ వ్యంజన శక్తులు శుభవర్ణులు మరియు శుభదాయినులు
వారాహీ మాతృకలు
వారాహీ - భద్రిణి - భద్రా
- వార్తాళి - కోలవక్త్రక - జృంభిణి - స్తంభిని - విశ్వా - జమ్భిణి - మోహినీ - శుభ
- రుంధిని - వశిని - శక్తి - రమా - ఉమా| ఇవి వ్యంజన శక్తులు
ఖడ్గిని - శూలిని - ఘోర - శంఖిని
- గదిని - చక్రిణి - వజ్రిణి - పాశిని - అంకుశిని - శివ - చాపినీ - భవబంధఘ్ని -
జయదా - జయదాయిని - మహాఘోర - మహాభీమ - భైరవి - చారుహాసిని - పద్మిని - వాణిని -
ఉగ్రా - ముసలిని - అపరాజిత - జయప్రద - జయా - జైత్రి - రిపుహ - భయవర్జిత - అభయ -
మానిని - పోత్రి - కిటిని - దంష్ట్రిని - రమా - అక్షయ| ఈ కాదివర్ణ శక్తులు
సిద్ధిప్రదలు
త్రిమూర్తి మాతృకలు
కేశవ - నారాయణ - మాధవ -
గోవింద - విష్ణు - మధుసూదన - త్రివిక్రమ - వామన - శ్రీధర - హృషీకేశ - పద్మనాభ -
దామోదర - వాసుదేవ - ప్రద్యుమ్న - అనిరుద్ధ | ఇవి స్వర మూర్తులు
అక్షరశక్తి - ఆద్యా -
ఇష్టదా - ఈశాన - ఉగ్ర - ఊర్ధ్వనయన - ఋద్ధిరూపిణి - లుప్తా - లూనదోష - ఏకకపాలికా -
ఐకారిణి - ఒఘవతి - జార్వకన్య - అంజనప్రభ - అస్థితాల - ధరా| ఇవి స్వరశక్తులు
భవ - సర్వ - రుద్ర -
పశుపతి - ఉగ్ర - మహాదేవ - భీమ - ఈశాన - తత్పురుష - అఘోర - సద్యోజాత - వామదేవ| వీరు కామాదిమూర్తులు
కరభద్ర - ఖగబాల -
గరిమాదిఫలప్రద - ఘోరపద - పంక్తిమాస - చంద్రార్ధధారిణి - ఛందోమయి - జగత్సాన -
ఝాంకృతి - జ్ఞానప్రభ - టంకఢక్కధర - ఠకృణితి - డామరీ| కభాది వర్ణశక్తులు
బ్రహ్మ - యజ్ఞపతి - వేద్యా
- పరమేష్ఠి - పితామహా - విధాత - విరంచి - సృష్టా - చతురానన - హిరణ్యగర్భ| ఇవి యాది దశ మూర్తులు
యక్షిణి - రంజిని -
లక్ష్మీ - వజ్రిణి - శశిధారిణి - షడాధారాలయా - సర్వనాయిక - హసితానానా - లలిత -
క్షమా|
ఇవి యకారాది దశ శక్తులు. త్రిమూర్తి మాతృకలు సర్వసిద్ధి ప్రదాయకలు
కామకలా మాతృకలు
శ్రద్ధ - ప్రీతి - రతి -
ధృతి - కాంతి - మనోరమ - మనోహర - మనోరధ - మదన - ఉన్మాదిని - మోహినీ - శంఖిని -
శోషిణి - వశంకారి - శింజిని - సుభగా| ఇవి కామయొక్క పదహారు స్వరములకు పదహారు కళలు.
సోమకలా మాతృకలు
పూషా - సుమనసా - రతి -
ప్రీతి - ధృతి - ఋద్ధి - సౌమ్య - మరీచి - అంశుమాలిని - శశిని - అంగిర - ఛాయా -
సంపూర్ణ - మండల - తుష్టి - అమృత|
అపరాజితా మాతృకలు
ప్రత్యంగిర - సింహముఖీ -
జ్వాలాముఖి - శివా - వైష్ణవి - నారసింహీ - త్రిమాత్రా - శాంకరి - పరా - అర్ధమాత్ర
- భగవతి - శూలిని - శుంభమర్ధిని - శశాంకధారిణి - భీషికా - కపాలిని| ఈ స్వరశక్తుల చేతుల్లో
త్రిశూలము మరియు కపాలము ఉంటాయి.
ఉగ్రా - వీరా - మహాజ్వాల -
హాకినీ - విశ్వరూపిణి - స్తుత్యా - జ్వలిని - లక్ష్మీ - తమిశ్రా - సర్వతోముఖి -
వరేణ్య - తోతల - అతీతా - నృముండల - సింహీ - హంత్రీ - భీమా - ఖండిని - తారిణి -
భయదా - ద్రావిణి - మృత్యురూపిణి - త్యుత్కారి - మృత్యుహరిణి - త్యున్నత - నతిప్రియ
- మాలిని - ప్రాణరూప - హంసిని - శిఖండిని - కుండిని - క్షాంతిరూప| ఇవి వ్యంజన శక్తులు
భవానీ మాతృకలు
భవానీ - అనంత - శరభీ -
చక్రిణి - కరుణాకరా - ఏకమాత్రా - ద్విమాత్రా - త్రిమాత్ర - అపరా - జయా - అర్ధమాత్రా
- పరా - సూక్ష్మా - షట్పద - మనస్విని - నిష్కల| ఈ స్వరశక్తులు ధన, ధర్మ దాయినులు
స్వచ్ఛంద - ఆనందసందోహ -
వ్యోమాకారా - నిరూపితా - గద్యపద్యాత్మిక - సర్వాలంకారసంయుత - సాధుబంధపదన్యాసా -
సర్వోక్తిఘటనావలీ - షట్తర్కకర్కశాకార - సర్వతర్కవివర్జిత - ఆదిత్యవర్ణ - అవర్ణ -
తామసి - పరరూపిణి - బ్రహ్మాణి - బ్రహ్మసంతానా - వేదవాగ్వాదిని - ఈశ్వరీ - పురాణ, న్యాయ, మీమాంస, ధర్మశాస్త్రాంగమిశ్రిత -
వేదా - వేదవతి - సర్వా - హంసవిద్యాధిదేవత - విశ్వేశ్వరి - జగద్ధాత్రి -
విశ్వనిర్మాణకారిణి - వేదిక - వేదరూపా - కాళికా - కాలరూపిణి - నారాయణి - మహాదేవి -
సర్వతత్త్వప్రవర్తిక - హిరణ్యవర్ణరూపా| ఇవి వ్యంజనశక్తులు
ఖేచరీ మాతృకలు
ఖేచరి - శక్తి - తులా -
వ్యోమాంబ - వ్యోమరూపిణి - వ్యోమస్థ - వ్యోమరూప - వ్యోమాతీతా - జగన్మయి - శాంభవి -
శంభువనితా - శరణార్తిప్రభేదిని - జగన్మాత - జగద్ధాత్రి - పరవిద్య - సుమంగళ| ఈ స్వరశక్తులు భవబంధ
విమోచికలు
పరా - పరాయణా - భవ్య -
మాలినీ - మదవిహ్వల - విద్యా - సూక్ష్మ - సంధ్యా - జగన్మాయ - జగత్క్రియ - నిశాచరి -
జయా - మాయ - అమేయ - మోహవివర్ధిని - మోహినీ - రంజని - వశ్యా - అవరా - మాతృస్వరూపిణి
- వేదవిద్య - మహావిద్య - యజ్ఞవిద్య - యమాంతకి - సుఖిని - సుఖదా - భోగ్య - భోగిని -
దండిని - రమా - విశారద - విశాలాక్షి - హ్లాదిని - అక్షయ| ఈ వ్యంజన శక్తులు సాధకుని
అభీష్టప్రదాయినులు
చాముండా మాతృకలు
చాముండా - చండికా - చండా -
చండముండవినాశిని - నారాయణి - భద్రకాళి - విరజా - విశ్వమాతృక - అజితా - భార్గవి -
సౌమ్య - దుర్గా - దుర్గతినాశిని - ఆప్యాయిని - చండఘంటా - మాయా| ఇవి స్వరశక్తులు
కమలా - ఖడ్గిని - గదిని -
ఘంటిక - పర - చరిత్ర - ఛత్రిణి - జంఘా - ఝంకారి - జయదా - టంకహస్త - ఠంకారి - డామరి
- ఢక్కికా - శివా - తమోపహంత్రి - స్థానేశి - దయారూపా - ధనప్రద - భవ్యా - ఫట్కారి -
బంధిని - భయవర్జిత - మహామాయ - యోగీశీ - రంకిణీ - లంబకేశిని - వరద - శాకిని - దండా
- సర్వేశీ - హలిని - లలిత - క్షామోదరి| ఇవి కాది వ్యంజనశక్తులు. చండీ భక్తులు
కానివారు కేవలము మాతృకా న్యాసము చెయ్యాలి. బుద్ధిమానులు చాముండా శక్తి సహిత మాతృకా
న్యాసము చెయ్యాలి.
పరా మాతృకలు
పరా - పరాయణ - సూక్ష్మ -
విశ్వా - దాక్షాయణి - జయా - విజయ - మానద - దక్ష - యోగిని - మానద - రతి - కౌమారి -
పార్వతి - దుర్గా - మానినీ| ఇవి స్వరశక్తులు
కళావతి - కరుణ - కామిని -
కాంతిదాయిని - ఖాతీతా - ఖేచరి - గమ్య - గారుడి - ఘనగర్జిని - చారుహాస - చపల -
జగద్ధాత్రి - జయా - రామా - విశ్వోద్ధారా - విశ్వమయి - విశాలాక్షి - విశోకిని -
వరదా - వాసుకీ - బాలా - పరమేష్ఠినుతా - ధృతి - భాస్వర - భావగమ్యా - ఆర్యా -
భానుమండలవర్తిని - షట్కారి - లాసిని - తారా - హారిణి - హవ్యవాహిని - హ్లాదిని -
క్లేదిని - క్లిన్న| ఇవి వ్యంజనశక్తులు.
కురుకుళ్ళా మాతృకలు
కురుకుళ్ళ - కురంగాక్షి -
విషహంత్రి - విషాపహ - విశ్వేశ్వరి - విశాలాక్షి - గారుడీ - గజగామిని - వినతా -
విశ్వజనని - విశ్వా - విశ్వమాతృక - రాజసీ - తామసీ - సత్త్వా - రణత్కాంచివిభూషణ| ఈ స్వర శక్తులు ధన, ధర్మ, సుఖదాయినులు.
కళ్యాణి - కమలా - కాంతా -
సౌపర్ణ - తార్క్ష్యశక్తిని - నాగహంత్రి - నాగమాత - నాగినీ - నగజా - ప్రియా - నలినీ
- నందిని - భవ్య - సదాపుష్పవతి - శివా - మదద్రవా - మదవతి - మన్యథాలాసా - మోహినీ -
మురజప్రీతా - మునిమానసవాసినీ - పోతస్థా - పురాజీత్కాంతా - పోతశక్తి - దిగంబర -
దితి - సౌమ్య - దినేశీ - దినవల్లభ - దయావతీ - దమప్రీతా - దారుణి - లోకధారిణి| ఈ వ్యంజనశక్తులు సాధకులకు
ఫలదాయినులు
పంచదశి (సుందరీ) మాతృకలు
సుందరీ
- సుభగా - భవ్యా - మహామాయ - మనోన్మని - త్రిపుర - వశిని - బాల - మహాత్రిపురదేవత -
మహాకామకలా - శ్రేష్ఠా - నీలా - నీలసరస్వతీ - విశ్వేశీ - విజయ - సౌమ్యా| ఇవి స్వరశక్తులు
కౌలిని
- కులమార్గస్థ - కులాంతకనివాసిని - సర్వవిద్యేశ్వరి - సర్వమన్త్రేశ్వరి -
సర్వవాగీశ్వరి - సిద్ధా - సర్వసిద్ధేశ్వరి - జయా - సర్వవీరేశ్వరి - శివా - భైరవి -
భావనాతీతా - భావగమ్య - మహేశ్వరి - మహావిద్యా - మహాజైత్రి - మహాత్రిపురసుందరి -
కాళీ - కాత్యాయని - దుర్గా - వైష్ణవి - విష్ణువల్లభ - యోగిని - యోగమార్గస్థ -
షట్చక్రపురవాసిని - విమల - విశ్వనిలయ - విశ్వాఖ్యా - విశ్వవిగ్రహ - శశినీ - శారదా
- చంద్రమండలమధ్యగా| ఈ వ్యంజనశక్తులు సిద్ధిదాయినులు
మాలిన్యాది
మాతృకలు
మాలినీ
- నాదినీ - గ్రసినీ - ప్రియదర్శినీ - నివృత్తి - సుప్రతిష్ఠా - విద్యా - శాంతి -
చాముండా - గుహ్యశక్తి - వజ్రిణి - కరాలిని - కపాలిని - శివా - జ్ఞానశక్తి - క్రియా| ఈ స్వరశక్తులు
జ్ఞానమోక్షఫలదాయినులు
గాయత్రి
- ఇచ్ఛా - సావిత్రీ - దేహినీ - ముండమాలిని - ఫట్కారి - వషట్కారి - స్వధా - స్వాహా
- ఆహుతిప్రియ - వామా - జ్యేష్ఠ - రౌద్రి - బ్రహ్మణి - బ్రహ్మవాహిని - జయా - వేదమయీ
- దుర్గా - జయంతి - రక్తదంతిక - జగజ్జేత్రి - చైత్యమయీ - విశ్వప్రబోధిని - క్షమా -
క్షాంతి - దయా - నిద్రా - రుద్రశక్తిపరాయణ - హుంకారి - ఖేచరి - మాయా - విశ్వయోని -
త్రయీమయి - సంసారభయహంత్రి| ఇవి వ్యంజనశక్తులు. ఊర్ధ్వామ్నాయ సాధక దీక్షితులకు ఈ
మాతృకలతో న్యాసము చేయుటకు అధికారము కలదు.
పంచభూత
మాతృకలు
శారదాతిలకతంత్రము
ప్రకారము వాయు, అగ్ని, పృధ్వీ, జలము, ఆకాశము - యాభై వర్ణముల క్రమము నందు అయిదు హ్రస్వములు, అయిదు దీర్ఘములు
బిందుయుక్తముగా సంధిసంభవములు.
తంత్రరాజప్రకారము
వాయు,
అగ్ని,
పృధ్వీ, జలము, ఆకాశము ఈ అయిదు పంక్తులు. మాయాశక్తి సమన్విత విసర్గ
పంచభూతాత్మాకము. అందువలన వీటిన్యాసము ఇక్కడ శివాత్మ ఏకదీశీయము కాదు.
వాయువర్ణ
వ్యాప్త నామములు: వాత - మరుచ్చర - ప్రాణ - వాయు - నాద - రయ - జవీ
అగ్నివర్ణ
వ్యాప్త నామములు: అగ్ని - వహ్ని - శుచి - తేజ - ప్రభా - దావా - శిఖీ - ద్యుతి -
దాహ - గ్రాస
భూమివర్ణ
వ్యాప్త నామములు: ధరా - క్షమా - భూః - స్థిర - జ్యా - కుః - గోత్ర - భూమి - రసా -
ఇలా
జలవర్ణ
వ్యాప్త నామములు: జల - వారి - వన - వాః - కం - పాథ - తోయ - రస - అంబుహ్యత్
ఆకాశవర్ణ
వ్యాప్త నామములు: విభుఃఖంఖంద్యు - అభ్ర - వ్యోమ - శూన్య - నభ - వియత్ - హంస
భూతలిపి
మాతృకలు
సిద్ధిసారస్వతముననుసరించి, సుకామద సరస్వతీ
మహామంత్రమును చెప్పేముందు భూతలిపి మంత్రమును ఇవ్వవలసిఉంటుంది. ఈ సారస్వత
మహామంత్రము గుప్తము మరియు అతిదుర్లభము. మునులు ఈ మంత్రమును విష్ణువును ప్రార్ధించి
పొంది వారి యొక్క వాంఛితములను నెరవేర్చుకున్నారు. ఎక్కువ చెప్పడము ఎందుకు? ఈ మంత్రముతో అన్ని ఫలములూ
లభిస్తాయి.
వర్గ |
వర్ణ |
దేవత |
మొదటి వర్గము |
అ - ఇ - ఉ - ఋ - ఌ |
బ్రహ్మ |
రెండవ వర్గము |
ఎ - ఐ - ఓ - ఔ |
విష్ణు |
మూడవ వర్గము |
హ - య - ల - వ - ర |
మహేశ |
నాల్గవ వర్గము |
క - ఖ - గ- ఘ - ఙ్గ |
అశ్విని |
అయిదవ వర్గము |
చ - ఛ - జ - ఝ - ఞ |
ప్రజాపతి |
ఆరవ వర్గము |
ట - ఠ - డ - ఢ - ణ |
లోకపాల |
ఏడవ వర్గము |
త - థ - ద - ధ - న |
క్రియాశక్తి |
ఎనిమిదవ వర్గము |
మ - ఫ - ప - భ - బ |
జ్ఞానశక్తి |
తొమ్మిదవ వర్గము |
శ - ష - స |
ఇచ్ఛాశక్తి |
మాతృకావర్ణము ప్రకారము అరవైమూడు మాతృకలు




వివరణ: పైన క ముందు ప ముందు ఉన్న చిహ్నములను అర్ధవిసర్గ అంటారు. క ముందు ఉన్నది జిహ్వామూలీయం, ప ముందు ఉన్నది ఉపధ్మానీయం. ఈ విసర్గలను పూర్తిగా పలకకూడదు. సగమే పలకాలి. అచ్చు ఏదైనా హ్రస్వ, దీర్ఘ, ప్లుత అను భేదాలతో మూడు రకాలు. దీర్ఘాన్ని మరికాస్త పొడిగిస్తే అది ప్లుతము. మూడు మాత్రల కాలం. దానికి లేఖన చిహ్నం లేదు. అందుకని దాని పక్కన మూడు అంకె వేస్తారు. క, ప లముందున్న విసర్గను ఎప్పుడూ సగమే పలకాలి. ఖ, ఫ లకు కూడా ఇదే నియమం వర్తిస్తుంది. - శ్రీ బేతవోలు రామబ్రహ్మం గారు.
శాంభవీ మాతృకలు
ఊర్ధ్వామ్నాయ దీక్షితులు ఈ
న్యాసము చేయుట ఆవశ్యకము.
శాంభవి - తామసీ - మాయా -
మహామాయ - శివోత్తమ - ఊర్ధ్వకేశి - విరూపాక్షి - ఖేచరి - శివవల్లభ - కుండోదరి -
విష్ణుమాయ - మహాదేవి - లంబోష్టి - వ్యోమరూప - బిభ్వీ| ఇవి స్వరశక్తులు
కాంతి
- శ్రద్ధా - రతి - ప్రీతి - అంబరా - ప్రాణరూపిణి - శుచి - క్షితి - భువన - ద్యుతి
- శ్రీః - పరమా - రమా - రాజసీ - గ్రసినీ - చండా - రాక్షసి - విశారదా - వాగ్వాదిని
- జయా - భీమా - శివా - శంకరవల్లభ - సంధ్యా - ప్రజ్ఞ - ప్రభా - జ్యోత్స్న - విమదా -
విశ్వరూపిణి - అస్థిమాలాధర - పంచవక్ర - ఉగ్ర - క్షోభిణి - మతి - వ్యాపిని| ఇవి వ్యంజనశక్తులు. శాంభవ
క్రమములో దీక్షితులైన సాధకులకు ఇవి అభీష్టములను నెరవేర్చును. ఈ న్యాసముల తర్వాత
సాధకులు రశ్మిక్రమంలో న్యాసం చెయ్యాలి.
కాలరాత్రి మాతృకలు
కాలరాత్రి
- మహారాత్రి - కటుక - సుభగా - శివా - మోహినీ - మోహరాత్రి - విద్యా - కటుకపత్రికా -
ఆధర్వణదుహితా - రంజిని - విశ్వమోహిని - మోహనాస్త్ర - మోహరూప - సౌభాగ్య -
మోహవర్ధిని| ఈ స్వరశక్తులు సాధకుల అభీష్టప్రదాయినులు.
కామినీ
- కామనప్రీత - ద్రావిణి - క్షోభిణి - పరా - మదనా - ఉన్మాదిని - మన్మధ - మనోన్మని -
మనోవాసిని - అరుణ - మదనోత్సవ - మాదినీ - మదసంతాన - మంజువాణి - మనోహర - మనోరమ -
ప్రియా - కాంతా - మంజుఘోష - మదప్రియ - కామవర్ధని - దారుణా - దమనప్రియ - దండిని -
విశ్వనటినీ - నళిని - విశ్వమాలిని - హావా - భావా - భావగమ్య - భావాతీతా - వినోదిని
- పంచబాణ - పరోత్సాహ| ఇవి వ్యంజనశక్తులు
ఇది
శ్రీవిద్యారణ్యయతి రచించిన శ్రీవిద్యార్ణవతంత్రమునకు విశాఖ వాస్తవ్యులు, కౌండిన్యస
గోత్రికులు, శ్రీఅయలసోమయాజుల పాలబాబు (సుబ్బారావు) గారు మరియు శ్రీమతి సాయిలీల
దంపతుల ద్వితీయపుత్రుడు మరియు హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ ప్రకాశానందనాథ (శ్రీశ్రీశ్రీ శ్రీపాద జగన్నాధస్వామి) గారి
శిష్యుడు భువనానందనాథ
అను దీక్షానామము కలిగిన అయలసోమయాజుల ఉమామహేశ్వరరవి తెలుగులోకి స్వేచ్ఛానువాదము చేసిన తృతీయశ్వాస సమాప్తము.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి