సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

25, సెప్టెంబర్ 2020, శుక్రవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - తృతీయశ్వాస - 01

 

షోడశారచక్రము

కులమూలావతారము ప్రకారము, ఒక చతురస్రములో తూర్పు దిక్కునుండి పడమట వరకు మూడు, దక్షిణము నుండి ఉత్తరము వరకు మూడు  సమాంతర రేఖలు గీయాలి. అప్పుడు పదహారు గడుల చక్రము ఏర్పడుతుంది. ఈ పదహారు గడులందు అ నుండి క్ష వరకు వర్ణములను ఈశాన కోణము నుండి మొదలు పెట్టి వాయవ్య కోణము వరకు ప్రదక్షిణ క్రమంలో రాయాలి.


షోడశారచక్రము నందు వర్ణలేఖనా పద్ధతి

లక్ష్మీకులార్ణవముననుసరించి, షోడశారచక్రము నందు వర్ణములను ఈ క్రమములో రాయాలి. 1,3,11,9,2,4,12,10,6,8,14,15,5,7,16,13. సిద్ధజప సంఖ్య పూర్తి అయిన తర్వాత సిద్ధి అవుతుంది. సాధ్య కూడా నిశ్చిత సంఖ్య జపము అయితే సిద్ధి అవుతుంది. సుసిద్ధ తక్షణ సిద్ధ అవుతుంది. అరిమంత్రము మూలమును నాశనము చేస్తుంది.

భైరవీతంత్రము ప్రకారము

దుష్ట నక్షత్ర - రాశి - భూతాది వర్ణప్రచురములు తెలుసుకొని బుద్ధిమంతుడైన మనుష్యుడు ఆ మంత్రమును త్యజించాలి. సిద్ధ-సాధ్యాది యోగమునందు విశేషంగా ప్రసిద్ధ నామమును గ్రహించాలి. ఏ మంత్రము సుప్తకాదో, జాగృతమో, ప్రారంభమున సిద్ధ స్థానము ఉంటుందో ఆ మంత్రము చివరన సిద్ధదాయకమవుతుంది. ముందు-చివర సాధ్య అయితే అది కష్టసాధ్యమవుతుంది. ముందు - చివర సుసిద్ధ అయితే అది శీఘ్ర సిద్ధినిస్తుంది. ముందు సాధ్య మరియు చివరన సుసిద్ధ అయితే అది ఉచిత (విధి ప్రకారంగా) మార్గమున సిద్ధిదాయకమవుతుంది. సుసిద్ధ-సాధ్య మంత్రము అత్యధిక ఉత్సాహ సమయమునందు (తీవ్ర కృషి వలన) సిద్ధినిస్తుంది. సిద్ధ-సిద్ధ మధ్యన సాధ్య అవుతుంది. సాధ్య సాధ్య మధ్యన సిద్ధ అవుతుంది. సాధ్య సిద్ధ అధికజపము చేత సిద్ధినిస్తుంది. సిద్ధ సుసిద్ధ వినినంతనే సిద్ధ అవుతుంది. ఇందు సంశయము లేదు. సిద్ధారి-సుసిద్ధ కూడా సిద్ధినిస్తుంది. అరి మంత్రము కష్టము చేత సిద్ధిస్తుంది. సాధ్య-సిద్ధ సుసిద్ధి అయ్యే చాలా కష్టము చేత సిద్ధిస్తుంది. మరొక విధంగా సిద్ధికలుగదు. అరిమంత్రము ఎప్పటికీ గ్రాహ్యము కాదు. అల్పదోషము మరియు ఎక్కువ గుణములు ఉన్న మంత్రమును విచక్షణ చేత ప్రదానము చెయ్యాలి.

సిద్ధారి కోష్ఠములు జ్ఞానము చేత మంత్రమునిస్తే ఆ మంత్రము సిద్ధిస్తుంది. ఏకాక్షర, కూట, త్రిపురా మంత్రములు నాయక లేదా స్త్రీ దత్తములయినా, స్వప్నములందు లభించినా ఆ మంత్రములకు సిద్ధాది శోధనము చేయనవసరం లేదు.

నృసింహ, సూర్య, వరాహ, ప్రసాద, ప్రణవ, సంపిదాక్షర మంత్రములకు కూడా సిద్ధారి శోధనము అవసరం లేదు.

పాశాఢ్య, త్ర్యక్షర మంత్రము, త్రిపుర, చండనాయక, మృత్యుంజయ, శాక్త, శాంభవ, గరుడ, సౌరమంత్రము, వైష్ణవమంత్రము, మాయా, వ్యోమవ్యాప్య షడక్షర మాలా మంత్రము మొదలగు వాటికి సిద్ధారి శోధనము అవసరం లేదు.

రత్నసాగరము ప్రకారము, హంస, అష్టాక్షర, పంచాక్షర, ఏక, ద్వి, త్రి బీజముల మంత్రములు, నృసింహ, సూర్య, వరాహ, సిద్ధకాళికా, శ్యామ, చండీమంత్రములకు సిద్ధారి శోధనము అవసరం లేదు.

రుద్రయామలము ప్రకారము, అఘోర, మాలామంత్ర, నపుంసక మంత్రములకు సిద్ధారి శోధనము అవసరం లేదు.

కులమూలావతారము ప్రకారము, స్వప్నమునందు లభించిన మంత్రమునకు ఎటువంటి క్రియావిధానములూ ఉండవు. ఆ మంత్ర దేవతను ధ్యానించి జపము చేస్తే శుభము కలుగుతుంది.

అగస్త్యసంహిత ప్రకారము, అన్ని రామ మంత్రములకు సిద్ధారి శోధనము అవసరం లేదు.

సిద్ధాంతశేఖరము ప్రకారము, ఏక, త్రి, పంచ, సప్త, నవ, ఏకాదశ అక్షరములు మరియు ముఫైరెండు అక్షరముల మంత్రములకు సిద్ధారి శోధనము అవసరం లేదు. బౌద్ధ, జైన, గోపాల, విష్ణు మంత్రములకు సిద్ధారి శోధనము అవసరం లేదు. వ్యోమవ్యాపీ, షడక్షర, మాతృకా, హరవల్లభ, బహురూపా - ఈ అయిదు మంత్రాలూ సామాన్యమవుతాయి.

షట్దళచక్ర నిర్ణయము    

కులమూలావతార ప్రకారము -

షట్దలకమలమును లిఖించి, ఋ-రూ-ఌ-ళూ అను నపుంసక వర్ణములను వదలి మిగిలిన అ నుండి హ వరకు గల వర్ణములను తూర్పు దిక్కు దళమునుండి ప్రారంభించి ఒక్కొక్క వర్ణముల చొప్పున ప్రదక్షిణ క్రమంలో రాయాలి. సాధకుని నామ ప్రధమాక్షరము ఉన్న దళము నుండి ప్రారంభించి మంత్ర ప్రధమాక్షరము ఉన్న దళము వరకు లెక్కించాలి. ఒకవేళ రెండు ప్రధమాక్షరాలూ ఒకే దళము నందు ఉంటే సంపద లభిస్తుంది. రెండో దళములో ఉంటే సంపద నాశనమవుతుంది. మూడవ దళములో ఉంటే ధృతి, విద్యా లభిస్తాయి. నాల్గవ దళములో ఉంటే బంధువులతో గొడవలు ఏర్పడుతాయి. అయిదవ దళములో ఉంటే సంశయం కలుగుతుంది. ఆరవ దళములో ఉంటే సర్వవినాశనము అవుతుంది.

ఋణధన శోధన చక్రము

కులమూలవతారము ప్రకారము -

నిలువుగా పదకొండు, అడ్డంగా ఆరు గడులు ఏర్పడునట్లుగా ఒక చక్రము నిర్మించాలి.  (క్రిందన ఇవ్వబడిన విధముగా)


14

27

2

12

15

6

4

3

5

8

9

అం

అః

10

1

7

4

8

3

7

5

4

6

3

 

శోధనవిధానము

మంత్రాక్షరములను స్వర-వ్యంజనములుగా వేరుచెయ్యాలి. ఏ గడినందు అక్షరములు ఉంటాయో ఆ గడినకు పైనవున్న గడిలోని అంకెలను తీసుకోవాలి. ఆ-ఈ-ఊ-రూ-ళూ దీర్ఘ స్వరముల స్థానములో హ్రస్వస్వరముల అంకెలను తీసుకోవాలి. తర్వాత అన్ని స్వర, వ్యంజన అంకెలను కలిపి ఎనిమిది భాగములగా చెయ్యాలి. శేషమును మంత్రరాశిగా భావించాలి.

సాధకుని నామాక్షర స్వర, వ్యంజనములను వేరుచేసి, కిందన ఉన్న కోష్ఠములోని (గడిలోని) అంకెను తీసుకొని వాటిని కలిపి ఎనిమిది చేత భాగించాలి. శేషమును నామరాశిగా భావించాలి. ఏ రాశి అంకె పెద్దదో దానిని ఋణి గాను, ఏ అంకె చిన్నదో దానిని ధని గాను భావించాలి. ఏ మంత్రరాశి ఋణి అవుతుందో ఆ మంత్రమును గ్రహించాలి. అన్యధా గ్రహించరాదు.

ఇంకాఉంది...

కామెంట్‌లు లేవు: