సర్వసామ్రాజ్యలక్ష్మి పూజా విధానం
ఈశ్వరుడు
చెప్పుచున్నాడు -
సర్వసామ్రాజ్య దేవతా ఆరాధన వలన సాధకుడు స్వయం విష్ణు లక్ష్మీపతి అవుతాడు. చంద్రబీజము - స, మదన బీజం - క, క్ష్మ - ల, ఈశ - హ, వహ్ని - ర, దీర్ఘశ్రీ - ఈ, బిందు - అం| ఈ బీజములతో కూడిన మంత్ర స్వరూపము సకలహ్రీంహూం హ్రీం. ఈ మంత్రమునకు శ్రీ బీజమును జోడించినచో సర్వసామ్రాజ్యదాయినీ విద్య అవుతుంది (సకలహ్రీంహూంహ్రీంశ్రీం). ఈ మంత్రమునకు
ఋషి - హరి| ఛందస్సు - గాయత్రీ| దేవత - మోహిని|
శ్రీం - బీజం| శ్రూం - కీలకం|
శ్రీం - శక్తిః||
ధ్యానం
షడ్భిరాద్యస్వరైర్విద్వాన్
షడంగాని ప్రవిన్యసేత్|
అతసీపుష్పసంకాశం
రత్నభూషణభూషితాం||
శంఖచక్రగదాపద్మశార్ఙబాణాధరాంకరైః|
షడ్భి కరాఙ్గ దేవేశి
వరదాభయశోభితాం||
ఏవమష్టభుజామ్
ధ్యాత్వా||
ఈ విధంగా అష్టభుజ
దేవిని ధ్యానించి చెప్పబడిన మంత్రమును మూడు లక్షలు జపించాలి. జపంలోని దశాంశము కమల
పుష్పములతో విధిపూర్వకంగా హోమం చెయ్యాలి. అప్పుడు సాధకుడు జితేంద్రియుడు అవుతాడు.
ఇప్పుడు
యంత్రోద్దారము చెప్పబడుచున్నది -
త్రికోణము, అష్టదళ పద్మము, చతుర్ద్వార భూపురము.
ఈ యంత్రములోకి దేవిని
ఆహ్వానించి పంచ, దశ
లేదా షోడశోపచారములతో దేవిని పూజించాలి.
షడంగ ఆవరణ దేవతలు
లక్ష్మి, విష్ణు, పార్వతి, శివ, రతి, కామదేవలను క్రమంగా పూజించాలి. యంత్ర అగ్రభాగమున గాయత్రి, సావిత్రి, సరస్వతీలను పూజించాలి. బ్రహ్మాది దేవతలను
వేరు వేరుగా పూజించాలి. అష్టపత్రము మరియు భూపురములందు ఏకోచ్చారణతో పూజ చెయ్యాలి.
యంత్రం నాలుగు వైపులా "అష్టాదశమహాకోటియోగినీభ్యోనమః" అని లిఖించాలి. ఈ
మంత్రముతో ఇంద్రాదులను పూజించాలి. ఆ తర్వాత గంధ,
పుష్పాక్షతలతో దేవిని పూజించాలి. పూజ తర్వాత వటుక,
క్షేత్రపాల, యోగినీలకు బలిని సమర్పించాలి.
ఇది శ్రీదక్షిణామూర్తి సంహితకు విశాఖ వాస్తవ్యులు, కౌండిన్యస గోత్రికులు, శ్రీఅయలసోమయాజుల పాలబాబు
(సుబ్బారావు) గారు మరియు శ్రీమతి సాయిలీల దంపతుల ద్వితీయపుత్రుడు మరియు హైదరాబాద్
వాస్తవ్యులు శ్రీ ప్రకాశానందనాథ (శ్రీశ్రీశ్రీ శ్రీపాద జగన్నాధస్వామి) గారి
శిష్యుడు భువనానందనాథ అను దీక్షానామము కలిగిన అయలసోమయాజుల ఉమామహేశ్వరరవి
తెలుగులోకి స్వేచ్ఛానువాదము చేసిన సర్వసామ్రాజ్యలక్ష్మీ పూజావిధి అను నాల్గవ భాగము
సమాప్తము.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి