సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

17, సెప్టెంబర్ 2021, శుక్రవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - ఏడవశ్వాస - 03

 11. కామదేవ ఉపాసిత శ్రీవిద్య

భగవాన్ శివుడు శ్రీదేవితో ఇలా పలికెను- (జ్ఞానార్ణవముప్రకారము)

పంచాక్షర వాగ్భవ కూటము - కఏఈలహ్రీం| షడాక్షర కామరాజ కూటము - హసకహలహ్రీం| చతురక్షర శక్తి కూటము - సకలహ్రీం| శ్రీదేవి సర్వతీర్థమాయీ, సర్వదేవ స్వరూపిణి. సర్వసాక్షిమయి, నిత్యా, సర్వయోనిమయీ, సర్వజ్ఞానమయీ, సర్వప్రజ్ఞానరూపిణీ, సర్వదేవమయీ, సాక్షాత్ సర్వసౌభాగ్యసుందరీ అయిన ఆమె పరా| ఓ దేవీ! ఈ మంత్రమును ఉపాసించే కామదేవుడు సర్వాంగ సుందరుడైనాడు.

12. లోపాముద్ర ఉపాసిత శ్రీవిద్య

కామరాజ విద్యనున్న వాగ్భవకూటమునందున్న ఏకార ఈకార స్థానములందు హకారము, సకారము జోడిస్తే లోపాముద్ర విద్య ఈ క్రింది ప్రకారము అవుతుంది.

హసకలహ్రీం| హసకహలహ్రీం| సకలహ్రీం|

13. అగస్త్య ఉపాసిత శ్రీవిద్య

ఈ విద్య త్రైలోక్యక్షోభకారిణి. ఈ విద్య కామరాజ పూజితము. ఇందు సంశయము లేదు.

కఏఈలహ్రీం| హసకహలహ్రీం| సకలహ్రీం|

14. మను ఉపాసిత శ్రీవిద్య

కహఏఈలహ్రీం| హకఏఈలహ్రీం| సకఏఈలహ్రీం|

ఇది పద్దెనిమిది అక్షరముల విద్య

15. చంద్ర ఉపాసిత శ్రీవిద్య

సహకఏఈలహ్రీం| సహకహఏఈలహ్రీం| సహకఏఈలహ్రీం|

16. కుబేర ఉపాసిత శ్రీవిద్య

హసకఏఈలహ్రీం| హసకహఏఈలహ్రీం| హసకఏఈలహ్రీం|

17. అగస్త్య-లోపాముద్ర ఉపాసిత ద్వితీయ శ్రీవిద్య

కఏఈలహ్రీం| హసకహలహ్రీం| హసఏకలహ్రీం|

లోపాముద్ర ప్రభావము చేత ఈ విద్య సాక్షాత్ బ్రహ్మ స్వరూపము అవుతోంది.

18. నంది ఉపాసిత శ్రీవిద్య

సఏఈలహ్రీం| సహకహలహ్రీం| సకలహ్రీం|

19. ఇంద్ర ఉపాసిత శ్రీవిద్య

కఏఈలహ్రీం| హసకహలహ్రీం| సలకహ్రీం|

ఈ విద్య భుక్తి-ముక్తి ఫలప్రదము

20. సూర్య ఉపాసిత శ్రీవిద్య

కఏఈలహ్రీం| హకహలహ్రీం| సహకసకలహ్రీం|

ఇది పదిహేడు అక్షరముల విద్య.

21. శివ ఉపాసిత శ్రీవిద్య

కఏఈలహ్రీం| హసకహలహ్రీం| సకలహ్రీం|కఏఈలహసకహలసహ సకలహ్రీం|

ఈ విద్య షట్కూట విద్య.

22. విష్ణు ఉపాసిత శ్రీవిద్య

కఏఈలహ్రీం| హసకహలహ్రీం| సహసకలహ్రీం| సఏఈలహ్రీం సహకహలహ్రీం సకలహ్రీం|

ఈ విద్య షట్కూట విద్య.

23. దూర్వాస ఉపాసిత శ్రీవిద్య

కఏఈలహ్రీంహ్రీం| హసకహలహ్రీంహ్రీం| సకలహ్రీంహ్రీం|

దూర్వాసుడు ముందు పరానిష్కళా విద్యను ఉపాసించెను.

24. షోడశవర్ణ విద్యా ఉద్దారక్రమము

జ్ఞానార్ణవము నందు ఈ విధంగా చెప్పబడెను -

హే దేవేశీ! నా చతుర్విధ ప్రకారములను నీకు తెలిపెదెను వినుము. నువ్వు మనోహరిణివి. కనుక జగత్తులో దుర్లభమైన విషయము చెబుతాను వినుము. చంద్రాంత "హ", వారూణాంత "శ", శక్రాది రేఫము, వామాక్షీ - ఈ, బిందు సహితా హ్రీం శ్రీం రెండు బీజములవుతాయి. మంత్రమునకు ముందు హ్రీం గాని శ్రీం గానీ చేర్చినట్టయితే శ్రీవిద్య జాగృతమవుతుంది. కళాచతుష్టయము జాగ్రదావస్థయందు వ్యవస్థితము. జాగ్రదావస్థ సత్త్వగుణ మరియు శక్తిరూపుణి. త్రికూట సకల పంచకూటమవుతుంది. వైష్ణవి అష్టకూటము, శాంకరి షట్కూటము. విద్య హ్రీం తో ఉత్పత్తి అవుతుంది. విద్యకు హ్రీం ను చేర్చడం వలన ఆ విద్య జాగృతమవుతుంది. శ్రీం ను చేర్చితే బోధ రూపమవుతుంది.

స్వచ్ఛందసంగ్రహము నందు ఈ విధంగా చెప్పబడినది -

హ్రీంకఏఈలహ్రీం హసకహలహ్రీం సకలహ్రీం - ఇది షోడశీ విద్య ఉత్పత్తి రూపము. ఈ విద్య ప్రథమ కూటములో మొదట ఉన్న హ్రీం వలన విద్య జాగురూకము అవుతోంది.

శ్రీంకఏఈలహ్రీం హసకహలహ్రీం సకలహ్రీం - ఈ విద్య ప్రథమ కూటములో మొదట ఉన్న శ్రీం వలన బోధవ్యావృత్తి రూపమవుతోంది. జాగ్రత్ స్వరూప శ్రీవిద్య నాలుగు విధములు. ఈ నాలుగు విధములూ చతుష్కూటములు.

వైష్ణవి సప్తకూటము. శాంకరి పంచకూటము. పంచదశీకి ముందు హ్రీంశ్రీం జోడించితే అది మహావిద్యా స్వప్న రూపమవుతుంది. అంతేకాక, అభిలాష స్వరూపము కూడా అవుతుంది. స్మృతిరూపా భేదము వలన ఈ పంచకూటము అష్టకూట వైష్ణవి అవుతుంది. షట్కూటమును శాంకరీ విద్యా అని అంటారు. స్వప్నావస్థయందు ఓంఓం యుక్తము. శివోపాసిత విద్య సుషుప్తి రూపము. అదిమృత, విస్మృత, మూర్ఛ, నిద్రా, తమసావృతము అవుతుంది. సుషుప్తావస్థ కళ ఓంహ్రీం మరియు హ్రీం ఓం. సుషుప్తిలో నాలుగు భేదములు కలవు. అవి ఓంహ్రీంశ్రీం, హ్రీంఓంశ్రీం, ఓంశ్రీంహ్రీం, శ్రీంఓంహ్రీం. ఈ భేదములు పంచదశీ ముందు చేర్చి ఉపాసించాలి. పన్నెండు ముఖ్యవిద్యలలో 144 భేదములు కలవు.

జ్ఞానార్ణవము నందు ఈ క్రింది విధంగా చెప్పబడినది -

ఏ విద్యకు ప్రారంభమున ఓం ఉంటుందో అది శివ-శక్తిమయి అవుతుంది. దీని భేదము కళాసహిత షట్కూటము. వైష్ణవి నవకూటము. శాంకరి సప్తకూటము. వీటి స్మరణ మాత్రముననే సంసారము ఆనందమయమవుతుంది.

ఇప్పుడు మహావిద్య యొక్క మూడు భేదములను వినుము.

దీనిని తెలుసుకున్న మాత్రముననే సాధకుడు సాక్షాత్ బ్రహ్మ స్వరూపుడవుతాడు. సుషుప్తి నుండి జాగ్రదావస్థ వరకు స్ఫురత్తా (=కాంతివంతమైన) మాత్రా లక్షణము. అవస్థాశేషము తుర్యావస్థ అవుతుంది. భావ-అభావ నుండి వినిర్ముక్త గుణాతీతము అవుతుంది. దీని నుండి వైరాగ్య, ముముక్షుత్వ, సమాధి, విమల అనుననవి మనస్సునకు ప్రాప్తమవుతాయి. సద్-అసద్ నిర్ధారణ చేయడము తురీయ కళ. రెండు ఆద్య బీజములను విపరీత క్రమములో రాయడం వలన అన్యము ఉద్దారము అవుతుంది. అది "ఓంఐంక్లీం". ఈ బీజములను ఓంఐంహ్రీంశ్రీంక్లీం షోడశాక్షరి యొక్క షట్కూటమునకు సంపుటీకరించి పూజ చెయ్యాలి. కళాసహిత త్రికూటము షోడశాక్షరి అవుతుంది. పంతొమ్మిది అక్షరముల మంత్రము వైష్ణవి మరియు పదిహేడు అక్షరముల మంత్రము శైవి అవుతాయి. ఆద్య బీజములు హ్రీంశ్రీం. వీటి విపరీత క్రమము శ్రీంహ్రీం. వీటి మధ్యన క్లీం ఉంటే అది కుమారీ విద్య అవుతుంది.

ఓంఐంహ్రీంశ్రీంక్లీం - ఈ అయిదు బీజములను షట్కూట, నవకూట యొక్క అనులోమ, విలోమ క్రమంలో సంపుటీకరణ చేయవలసి ఉంటుంది.

గంధర్వ తంత్రము నందు ఈ విధంగా చెప్పబడినది - రమా బీజము శ్రీం ను మాయా బీజము హ్రీంనకు జోడించాలి. తర్వాత కామ బీజము క్లీంను లిఖించి, వాగ్భవ బీజము ఐంను లిఖించాలి. తర్వాత చంద్ర బిందు యుక్త పద్నాలుగు స్వరములతో బాటు ఓంహ్రీంశ్రీం లను లిఖించాలి. ఆ తర్వాత పంచదశాక్షరి కామరాజ శ్రీవిద్యను లిఖించాలి. అనులోమ క్రమంలో పంచబీజములు శ్రీంహ్రీంక్లీంఐంఓం. విలోమక్రమంలో ఇవి ఓంఐంక్లీంహ్రీంశ్రీం అవుతాయి. రెండు షట్కూటములందు ఈ ప్రకారము సంపుటీకరణము చెయ్యాలి.

యోగినీ తంత్రము నందు ఈ విధంగా చెప్పబడినది -

శ్రీ బీజం శ్రీం, మాయా బీజం హ్రీం, స్మరబీజం క్లీం, యోని ఐం, తార ఓం. అర్థమేమనగా, శ్రీంహ్రీంక్లీంఐంఓం అనులోమ రూపము. దీని విలోమము ఓంఐంక్లీంహ్రీంశ్రీం తో సంపుటితమైన శివ విద్య ప్రదిష్ట షోడశీ విద్య అవుతుంది.

ప్రారంభమున శ్రీంహ్రీంక్లీంఐంఓం మరియు చివరన ఓంఐంక్లీంహ్రీంశ్రీం లను సంపుటీకరించగా త్రికూట శైవి మరియు వైష్ణవి శ్రీవిద్యలు షోడశాక్షరీ విద్యాలుగా అవుతాయని రుద్రయామలమునందు చెప్పబడినది.

పంచదశికి ముందు హ్రీంశ్రీంసౌఃక్లీంఐం, వెనుక ఐంక్లీంసౌఃశ్రీంహ్రీం లను జోడించాలని దక్షిణామూర్తి సంహితయందు చెప్పబడినది.

ఇంకాఉంది...

కామెంట్‌లు లేవు: