సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

30, సెప్టెంబర్ 2021, గురువారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - ఏడవశ్వాస - 05

 31. కామరాజలోపాముద్రయోర్విశేషః

కుళోఙ్గీశము నందు కామరాజ లోపాముద్ర విషయము గురించి విశేష కథనము చెప్పబడినది. కామరాజ లోపాముద్రకు ముందు క్లీంహ్రీంశ్రీం, హ్రీంశ్రీంక్లీం, శ్రీంహ్రీంక్లీం జోడించగా మూడు ప్రకారముల అష్టదశాక్షరి విద్య అవుతుంది. క్లీంఐంశ్రీం బీజములు శ్రీభగవదాచార్య ద్వారా ప్రతిపాదించబడినవి.

32. సుందరీ భేదములు

శ్రీక్రమము నందు ఈ విధముగా చెప్పబడినది -

హ్రీంఐంక్లీంలంహంరంఅం బీజములకు వాగ్భవ, కామరాజ, శక్తికూటములను చేర్చగా అది సుందరీ విద్య అవుతుంది. ఈ విద్య సిద్ధిదాయినీ మరియు మూడు లోకములను వశపరుచునది. మూడుకూటములలో మొదట కూటమున ఓం ను జోడిస్తే ప్రథమసుందరీ అని, ద్వితీయ కూటములో జోడిస్తే బ్రహ్మసుందరీ అని, శక్తికూటములో జోడిస్తే అనంతసుందరీ అని అంటారు. ఈ విధంగా సుందరీ భేదములు చెప్పబడినవి.

అంతేగాక, త్రికూటముల తర్వాత హంస జోడిస్తే ఆ విద్య దారిద్ర్య దుఃఖనాశనీ అవుతుంది.

33. శక్తిలోపాముద్ర

సకలహ్రీం కఏఈలహ్రీం హసకహలహ్రీం| ఈ శక్తి మహావిద్య

పశ్చిమామ్నాయము నందు యోజితము.

హససకలహ్రీం ఓంకఏఈలహ్రీం హసకహలహ్రీం సకలహ్రీం| ఈ విద్యను వర్ణించశక్యము కాదు.

34. రుద్రశక్తి

హసహ్రీం ఐంక్లీంహంహ్రీంసహ్రీం| ఇది నవార్ణ విద్య.

35. ఏకాదశాక్షరీ విద్య

కలహ్రీం కహలహ్రీం సకలహ్రీం| ఈ విద్య శతృనాశనీ మరియు సిద్ధిదాయిని. దేవత మహాత్రిపురసుందరి.

కహక్షమలహ్రీంఐం నకు కామరాజవిద్యాశక్తి కూటమును జోడిస్తే సుందరీ విద్య అవుతుంది.

రెండవ విద్య: సహక్షమలకఈరంఐంహ్రీంక్లీంసకలహ్రీం|

మూడవ విద్య: హక్షమలహ్రీం కఏఈలహ్రీం హసకహలహ్రీం సకలహ్రీం|

36. సౌభాగ్యవిద్య

సౌఃకఏఈలహ్రీం హకఏలహ్రీం కహమలహ్రీం| ఇది పరమమైన విద్య. ఇది భక్తులకు సౌభాగ్యమును ఇచ్చును. మూడు కూటముల తర్వాత హంస జోడిస్తే సప్తదశి అవుతుంది.

37. అష్టాదశ మహాత్రిపురసుందరి

ఐంహ్స్రౌఃఈకలహ్రీం క్లీంహ్సౌం కహలహ్రీం సౌఐంహకలహ్రీం|

ఈ మంత్రము చివర హంస జోడిస్తే అది వింశాక్షరీ విద్య అవుతుంది.

దేవ్యువాచ:

శ్రీదేవి మహేశ్వరుడిని ఈ విధంగా అడిగెను -

హే దేవా! ఇష్టమైతే భాష, సృష్టి, స్థితి, సంహార, నిరాఖ్య అను పంచసుందరీ విద్యను తెలుపగలరు.

ఈశ్వర ఉవాచ: అప్పుడు భగవాన్ ఈశ్వరుడు ఈవిధంగా బదులిచ్చెను.

భాషా: హకలసహ్రీం కహలసహ్రీం కలసహహ్రీం|

సృష్టి: హసకలహ్రీం హలకహసహ్రీం సకలహ్రీం|

స్థితి: హలకసహ్రీం కసహలసహ్రీం కహసలహ్రీం|

సంహార: హలకసహ్రీం హసకలహ్రీం హహకలహ్రీం|

నిరాఖ్యా: లకసహ్రీం సహకలహ్రీం హససహకహ్రీం|

38. స్వప్నావతీ విద్య

కలాపంచదశీ స్వప్నావతి: హకలసహ్రీం హకహలహ్రీం హసకలహ్రీం|

మధుమతీ విద్య: కహలసహ్రీం కహయలహ్రీం కససలహ్రీం|

అన్ని శాస్త్రములందు ఈ విద్యలను గోప్యముగా ఉంచబడినవి.

39. పంచమీ విద్య

కరఏఈహ్రీం కఏఈలహ్రీం| ఇది పంచమీ విద్య.

హసఈహరహ్రీం హరకసలహ్రీం| ఇది స్వప్నావతీ విద్య

కహయలహ్రీం| ఇది మధుమతీ విద్య

హకలసహ్రీం సకలహ్రీం కఏఈలహ్రీం హసకహలహ్రీం|

ఈ పంచమీ విద్య త్రైలోక్య సుభగోదాయకము.

ఈశ్వరుడు దేవితో దుర్లభమైన శక్తి కూటమును ఈ విధంగా చెప్పెను -

కఏఈలహ్రీం హసకహలహ్రీం సహకలహ్రీం| రెండవ మంత్రము. సౌభాగ్యము గురించి వాగ్భవ, కామకూట, శక్తికూటము లను పంచమీ విద్యను చెబుతారు.

ఈకఏలహ్రీం హసకహలహ్రీం సకలహ్రీం| ఈ మంత్రము సర్వదోష వివర్జితము. శతృనాశిని మరియు సిద్ధిదాయిని.

40. విద్యాజప ప్రాణము

ఇప్పుడు చెప్పబడిన అన్ని విద్యలకు ప్రాణము చెప్పబడుచున్నది. వాగ్భవ కూటమునకు ముందు శ్రీంహ్రీంహం, శక్తి కూటమునకు చివర హంహ్రీంశ్రీం జోడించి జపము చెయ్యాలి. ఈ విధంగా ఏడుసార్లు జపము చేసేసరికి ఆ మంత్రము దీపనమవుతుంది.

ఇంకాఉంది...

కామెంట్‌లు లేవు: