సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

14, సెప్టెంబర్ 2021, మంగళవారం

శ్రీదక్షిణామూర్తి సంహిత - 15

 సంజీవనీవిద్యా వివరణం

ఈశ్వరుడు చెప్పుచున్నాడు - హే దేవీ! నేను ఇప్పటికీ నా పశ్చిమ ముఖము నుండి సాక్షాత్ అమృతానంద విగ్రహ విద్యాచతుష్టయమును జపిస్తాను. దీనినుండి మహాసింహాసనగత సంజీవనీ విద్యను వినుము.

మంత్ర స్వరూపము: సంహంసః సంజీవని జూం జీవం ప్రాణగ్రంథిస్తం కురు స్వాహా|

ఈ మంత్ర ఋషి - త్రిశిరా శుక్ర| ఛందస్సు - గాయత్రీ| దేవత - సంజీవనీ| క్షం - శక్తి| అం - బీజం|

షండంగ న్యాసం- చతుర్థ, త్రితయ, పంచ, పంచక, చతుః, త్రికములతో (= ?) క్రమంగా షండంగ న్యాసం చెయ్యాలి.

సాధకుడు భూర్జపత్రము మీద పాలతో షట్కోణమును నిర్మించాలి.

ధ్యానం:

కర్పూరాభాం స్ఫురన్ముక్తాభూషణైర్భూషితాం పరాం|

జ్ఞానముద్రామక్షమాలాం దధతీం చితయేత్పరాం||

 

పై విధంగా ధ్యానము తర్వాత ప్రాణవాయువు మధ్యన ఉపచారములతో పూజ చెయ్యాలి. ముందు షడంగ పూజ చేసి ఆ తర్వాత షట్కోణములో క్రమంగా 1. సంజీవనీ 2. వృద్ధసంజీవనీ 3. అహంకారసంజీవనీ 4. సత్త్వసంజీవనీ 5. రజఃసంజీవనీ 6. తమః సంజీవనీలను పూజించాలి.

ఆ తర్వాత శక్తి బీజము సం కు నమః (సం నమః) జోడించి పూజించాలి.

మంత్రములో ఎన్ని వర్ణములు ఉండునో అన్ని లక్షల జపము చెయ్యాలి. జప సంఖ్యలో దశాంశము హోమము దూర్వా మరియు త్రిమధురములతో చెయ్యాలి. ఇది సాధారణ పూజ.

హే పార్వతీ! ఇప్పుడు విశేష పూజ గురించి వినుము.

ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానములను షట్కోణ అగ్రకోణములో పూజించాలి. తత్, వితత్, ఘన, సుచిర, ఈశ్వరీలను ద్వితీయ కోణములో పూజించాలి. పృథ్వీ, జల, అగ్ని, వాయు, ఆకాశములను తృతీయకోణములో పూజించాలి. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలను చతుర్థకోణములో పూజించాలి. ఇచ్ఛా, జ్ఞాన, క్రియా, పరా, మాయాలను పంచమ కోణములో పూజించాలి. భూః, భువః, స్వః, తపః, సత్యలను ఆరవకోణములో పూజించాలి.

హే దేవీ! సంపూర్ణ పూజ తర్వాత రెండు ఠలను (=స్వాహా స్వాహా) మరియు సంజీవనీ అని పలకాలి.

ఈ విద్య మృత్యువును జయించును.

ఇది శ్రీదక్షిణామూర్తి సంహితకు విశాఖ వాస్తవ్యులు, కౌండిన్యస గోత్రికులు, శ్రీఅయలసోమయాజుల పాలబాబు (సుబ్బారావు) గారు మరియు శ్రీమతి సాయిలీల దంపతుల ద్వితీయపుత్రుడు మరియు హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ ప్రకాశానందనాథ (శ్రీశ్రీశ్రీ శ్రీపాద జగన్నాధస్వామి) గారి శిష్యుడు భువనానందనాథ అను దీక్షానామము కలిగిన అయలసోమయాజుల ఉమామహేశ్వరరవి తెలుగులోకి స్వేచ్ఛానువాదము చేసిన సంజీవనీవిద్యా వివరణం అను పదిహేనవ భాగము సమాప్తము.

కామెంట్‌లు లేవు: