25. సంపుట లక్షణము
నవరత్నేశ్వర ప్రకారము మంత్రమునకు ముందు బీజములను మంత్రమునకు తర్వాత విపరీత క్రమములో జోడించగా మంత్రము సంపుటితమవుతుంది. ఈ సంపుటిత లక్షణము సమస్త శాస్త్రములందు వేరువేరుగా ఉన్నది.
త్రికూటమునకు ముందు శ్రీం హ్రీం క్లీం
ఐం సౌః, తర్వాత ఓం హ్రీం శ్రీం జోడిస్తే షట్కూటము
సంపుటితమవుతుందని శ్రీక్రమములో చెప్పబడినది.
శ్రీం హ్రీం క్లీం ఐం సౌః ఓం హ్రీం
శ్రీం బీజములను మూలవిద్యకు ముందున, తర్వాత
విపరీత క్రమములో జోడిస్తే సంపుటీకరణము అవుతుంది. ఆ మంత్రము పరదేవత యొక్క
శ్రీమంత్రరాజమవుతుందని మాయా తంత్రమునందు చెప్పబడినది. పంచబీజములను అనులోమ క్రమములో
సంపుటీకరణం చెయ్యడం హేయము. శ్రీంహ్రీంఓంసౌఃశ్రీంక్లీం విద్యాన్యాసము విపరీతము.
శ్రీంసౌఃక్లీంఐం ఐంక్లీంసౌః
ఓంహ్రీంశ్రీం - ఈ బీజములను లోపాముద్ర శ్రీవిద్య లేదా కామరాజ త్రికూటము లేదా
పరామంత్రములకు ముందున జోడించి వెనుకన పంచబీజములను జోడించడం వలన షోడశీ పరా విద్య
అవుతుందని కులామృతమునందు చెప్పబడినది.
శ్రీంహ్రీంక్లీంఐంసౌఃఓంహ్రీంశ్రీం
తర్వాత పంచదశీ మంత్రమును ఆ తర్వత బీజములను విపరీత క్రమములో ఉంచితే ఆగమ ప్రసిద్ధ
షోడశాక్షరీ విద్య అవుతుందని యామలమునందు చెప్పబడినది.
క్లీంసౌఃఐంశ్రీంహ్రీం - ఈ పంచ బీజములు
సర్వార్థ సిద్ధి ప్రదాయకములు. ఓంశ్రీంక్లీం యుక్త లోపావిద్య తర్వాత క్లీంశ్రీంఓం
చేర్చగా శ్రీవిద్యా మంత్రమవుతుంది. ఆ విద్య పరమ,
పరాత్పరతమ, సర్వార్థసిద్ధిప్రద,
సారాత్సారతర, సకలజగత్తు ఉత్పత్తి కారణ భూతమైన శివుడు. ఆ
విద్య బ్రహ్మరూప, సకలగుణమయి, నిర్గుణ,
నిష్ప్రపంచ, సాక్షాత్ కామదుఘ,
సుర- మునివందిత ఆనందరూపమని నిబంధ తంత్రమునందు
చెప్పబడినది.
జ్ఞానార్ణవమునందు ఈ విధంగా చెప్పబడినది
-
వెయ్యి ముఖములు,
నూరుకోట్ల జిహ్వా కలవారు కూడా శ్రీవిద్యా షోడశాక్షరీ యొక్క గుణములను వర్ణించలేరు.
వైఖరీ, వాచ్యము, భావము
ద్వారా ఈ విద్యా యొక్క గుణవర్ణన చేయలేరు. నిరక్షర వస్తువు ఏదైతే ఉందో దానికి
కారణము పరా. మూకీభూత పరా పశ్యన్తి మరియు మధ్యమ అవుతుంది. ఈ బ్రహ్మవిద్యా స్వరూపము
భోగ మోక్ష ఫలదాయకము. ఈ విద్యను ఒక్కసారి ఉచ్చరించినా ఆ ఫలము కోటి వాజపేయ,
వెయ్యి అశ్వమేధ, లోకముల ప్రదక్షిణ,
కాశీ మొదలగు మూడున్నర కోట్ల తీర్థయాత్రల వలన వచ్చిన ఫలము కన్నా ఎక్కువ. ఈ కార్యముల
వలన వచ్చిన ఫలము శ్రీవిద్యాషోడశాక్షరీ విద్య వలన వచ్చు ఫలమునకు సరితూగలేదు. ఈ
విద్యను ఒక్కసారి ఉచ్చరించిన మాత్రముననే ఆ సాధకుడు బ్రహ్మ అయిపోతాడు. ఇందువలననే
షోడశాక్షరీవిద్యను ఎన్నటికీ బహిరంగంగా ప్రకటించకూడదు. ఈ విద్యను "యోని"
సమానంగా గుప్తంగా ఉంచాలి. తన పుత్రులను, స్త్రీను,
ధనమును, ప్రియమైన వస్తువులను ఎవరికైనా ఇవ్వవచ్చును.
రాజ్యమును, తలనైనా ఇవ్వవచ్చును. కానీ
శ్రీషోడశాక్షరీవిద్యను మాత్రము ఇవ్వరాదు.
సిద్దయామళము యొక్క ప్రకారాంతరములో
షోడశీవిద్యను నిరూపించబడెను - "ఓంక్లీంహ్రీంశ్రీంఐంక్లీంసౌః కఏఈలహ్రీం
హసకహలహ్రీం సకలహ్రీం స్త్రీంఐంక్రీంక్రీంక్లీంహూం" ఈ మహాషోడశీ మూడు లోకములందూ విఖ్యాతము. ఇది
జ్ఞానము ద్వారా మృత్యువును నాశనము చేస్తుంది. అన్నీ ఆమ్నాయములతోనూ
నమస్కరించబడునది. తంత్రములందు ఏడు లక్షల మహావిద్యలను వర్ణించబడెను. వాటిలో
సారభూతమైన ఈ విద్యా అత్యంత గుప్తం. ఎక్కువ చెప్పుట ఎందుకు? ఈ
విద్యాసారము కూడా షోడశీ.
లోపాముద్రవిద్యలోని శక్తికూటము తర్వాత
"హంస" జోడిస్తే అది పదిహేడు అక్షరముల జ్ఞాన స్వరూపిణీ విద్య అవుతుంది. ఆ
మంత్రము "హసకలహ్రీం హసకహలహ్రీం సకలహ్రీంహంసః "
లోపాముద్ర వాగ్భవకూటములోని
"ల" తర్వాత "హ" మరియు కామరాజకూటముకు ముందు "స"
చేర్చగా రెండు విద్యలు అవుతాయి. అవి -
అ) హసకలహహ్రీం హసకలహ్రీం సకలహ్రీం
ఆ) హసకలహ్రీం సహసకలహ్రీం సకలహ్రీం
విద్యార్ణవమునందు వీటికి సమానమైన విద్య
ఏదీ లేదు.
26. లోపాషోడశాక్షరి
హసకఆంలహ్రీం హసకహలహ్రీం సకలహ్రీం
ఇది చిద్బ్రహ్మ ఐక్యమయీ మంత్రము (స్వరూపము)
26అ) లోపాసప్తదశాక్షరి
హసకలహహ్రీం హసకహలహ్రీం సకలహహ్రీం
ఈ మంత్ర స్మరణమాత్రము చేత సాధకుడు శివ
స్వరూపుడు అవుతాడు. అణిమాది సిద్ధులు అతడి వశమయి పృధ్వీయందు అతడు సాక్షాత్
ఇంద్రస్వరూపుడవుతాడు.
27. లోపా అష్టాదశాక్షరి
ఐంహసకలహ్రీం క్లీంహసకహలహ్రీం సౌఃసకలహ్రీం
ఈ మంత్రము భూమి యందు దుర్లభము. శ్రీగురువుచేత
ఇది నిత్య సిద్ధిప్రదాయకము అవుతుంది. ఈ మంత్రమును తొమ్మిది లక్షల జపము చేసి
అసాధ్యమైన యజనము చెయ్యాలి. లేనిచో శాపము తగిలి సాధకుని కులము నాశనము అవుతుంది. ఇది
ఉత్తమ సాధకులకు ఇవ్వవలసిన విద్య. ఈ విద్య అన్ని విఘ్నములనూ నాశనము చేయును. ఈ విద్య
సర్వసౌభాగ్యదాయినీ మరియు సర్వమంగళకారిణీ. దీనికి సమానమైన విద్య త్రిలోకములందు
దుర్లభము.
29. పరమావిద్య
ఓంఐంక్లీంసౌః కఏలహహ్రీం సౌఃక్లీంఐంఓంఐంక్లీంసౌఃహసకల
హ్రీంసౌః క్లీంఐంఓంఐంక్లీంసౌఃసకలహ్రీంసౌఃక్లీంఐంఓం|
ఈ విద్య మోక్షదాయిని. ఈ మాత్రమును ఒక
లక్ష జపము చేయగా జగత్తునందు లభ్యమవని సిద్ధి ఏదీ ఉండదు. దీని స్మరణమాత్రమున
సాధకుడు శివస్వరూపుడు అవుతాడు.
30. బ్రహ్మ విద్య
శ్రీకమము ప్రకారము పరమావిద్యయే బ్రహ్మవిద్య. మహాశ్రీసుందరీ విద్యయే మహాత్రిపురసుందరి విద్య. కకారము నుండి సమస్తమూ ఉత్పన్నమయినవి. క్లీం (కామ) వలన కైవల్యము ప్రాప్తమవుతుంది. ల కారముతో అన్ని ఐశ్వర్యములూ, ఈ కారముతో సమస్త సుఖములూ ప్రాప్తిస్తాయి. ఈ మూడు బీజములు సమస్తవిద్యల సారభూతములు. వాగ్భవ, కామరాజ, శక్తికూటములందు వీటిని నియోగించాలి (ఉంచాలి). ఈ విద్యయొక్క ఒకొక్క అక్షరము బ్రహ్మవిద్య అవుతుంది.
ఇంకాఉంది...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి