సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

20, అక్టోబర్ 2021, బుధవారం

శ్రీదక్షిణామూర్తి సంహిత - 18

                                     

పద్దెనిమిదవ భాగము

త్రిపురేశీభైరవీవిద్యా విధివివరణం

మంత్ర స్వరూపము:

హసఐంహసఈంఊంహంఆం

ధ్యానము:

పంచముండసమాసీనామ్ ముండమాలావిభూషితామ్|

ఆతామ్రార్కప్రభాభాసాం రక్తభూషణభూషితాం||

పాశాంకుశాభయవరామ్ సాక్షాద్భువనమాతృకామ్|

ఈమె యొక్క మిగతా విధి అంతా త్రిపురేశీ విధికి సమానంగా ఉంటుంది. ఈ విద్యకు సమానమైన విద్య మూడులోకములందూ దుర్లభము.

పంచముండలు (=ఐదు పుర్రెలు): కాకము (=కాకి), శునకము, వానరము, జంబుకము (=నక్క), నరుడు

వీటి/వీరి పుర్రెలను పంచముండలు అని అంటారు.

ఇది శ్రీదక్షిణామూర్తి సంహితకు విశాఖ వాస్తవ్యులు, కౌండిన్యస గోత్రికులు, శ్రీఅయలసోమయాజుల పాలబాబు (సుబ్బారావు) గారు మరియు శ్రీమతి సాయిలీల దంపతుల ద్వితీయపుత్రుడు మరియు హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ ప్రకాశానందనాథ (శ్రీశ్రీశ్రీ శ్రీపాద జగన్నాధస్వామి) గారి శిష్యుడు భువనానందనాథ అను దీక్షానామము కలిగిన అయలసోమయాజుల ఉమామహేశ్వరరవి తెలుగులోకి స్వేచ్ఛానువాదము చేసిన త్రిపురేశీభైరవీవిద్యా విధి వివరణం అను పద్దెనిమిదవ భాగము సమాప్తము.

కామెంట్‌లు లేవు: