సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

19, జులై 2021, సోమవారం

శ్రీదక్షిణామూర్తి సంహిత - 11

 

పదకొండవ భాగము

లలితార్చన విధివివరణం

శివుడు చెప్పుచున్నాడు - హే దేవేశీ! నేను నా దక్షిణ ముఖము నుండి ఇప్పటికీ లలితా పరా రక్త నేత్రా త్రిపురా కామేశ్వరీ జపమును చేస్తున్నాను. శక్తిబీజము, వాగ్భవబీజము, కామబీజములను ఇంతకు ముందు చెప్పిన విధంగా లిఖించవలెను. చివర శివ బీజమును జోడించాలి. అది త్రిపురేశీ మంత్రము అవుతుంది. మంత్ర స్వరూపము ఈ విధంగా ఉండును

హ్రీం ఐం క్లీం హం - ఈ లలితాదేవీ మంత్రము మహా సౌభాగ్యకారిణి. ఈ మంత్ర న్యాసము, పూజనాదులు త్రిపురేశ్వరీ పూజా విధానమునకు సమానంగా ఉండును. వేరే ప్రకారముగా జరగదు.

ధ్యానము ఈ క్రింది విధంగా ఉండును:

ఉద్యత్సూర్యసహస్రాభాం మాణిక్యముకుటోజ్జ్వలాం|

రక్తకుండలముక్తాలిపాదకాం గణభూషితాం||

రత్నమంజీరసుభగాం రక్తవస్త్రానులేపనాం|

పాశాంకుశౌ పుస్తకం చ దధతీమక్షమాలికాం||

సర్వాంగ సుందరీం ధ్యాయేత్సర్వసంపత్తిహేతవే||

ఇది శ్రీదక్షిణామూర్తి సంహితకు విశాఖ వాస్తవ్యులు, కౌండిన్యస గోత్రికులు, శ్రీఅయలసోమయాజుల పాలబాబు (సుబ్బారావు) గారు మరియు శ్రీమతి సాయిలీల దంపతుల ద్వితీయపుత్రుడు మరియు హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ ప్రకాశానందనాథ (శ్రీశ్రీశ్రీ శ్రీపాద జగన్నాధస్వామి) గారి శిష్యుడు భువనానందనాథ అను దీక్షానామము కలిగిన అయలసోమయాజుల ఉమామహేశ్వరరవి తెలుగులోకి స్వేచ్ఛానువాదము చేసిన లలితార్చన విధివివరణం అను పదకొండవ భాగము సమాప్తము.

కామెంట్‌లు లేవు: