సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

2, ఆగస్టు 2021, సోమవారం

శ్రీదక్షిణామూర్తి సంహిత - 13

 

పదమూడవ భాగము

రక్తనేత్రాపూజా విధివివరణం

ఈశ్వరుడు చెప్పుచున్నాడు - ఈ మంత్రము సమస్త కోరికలనూ తీరుస్తుంది.

మంత్ర స్వరూపము: ఆం ఐం సం రం కం

త్రిపురా పరమేశ్వరీనే రక్తనేత్రా అంటారు. ఈమె ధ్యానము లలితా ధ్యానమునకు సమానంగా ఉంటుంది. ఇక్కడ విషయము ఏమనగా, లలిత కుమారి. రక్తనేత్ర ప్రౌఢ. ఈమె ఎత్తైన మరియు దట్టమైన ప్రదేశమునందు ఉండును. ఈమె నితంబ విశాలంగా ఉంటుంది. సన్నని నడుము, శాంతమైన ముఖము మరియు సుందరమైన నేత్రములు కలిగి ఉంటుంది. ఈమె పూజ, న్యాసము మొదలగునవి త్రిపురేశ్వరీ దేవి సమానంగానే చెయ్యాలి.

ఇది శ్రీదక్షిణామూర్తి సంహితకు విశాఖ వాస్తవ్యులు, కౌండిన్యస గోత్రికులు, శ్రీఅయలసోమయాజుల పాలబాబు (సుబ్బారావు) గారు మరియు శ్రీమతి సాయిలీల దంపతుల ద్వితీయపుత్రుడు మరియు హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ ప్రకాశానందనాథ (శ్రీశ్రీశ్రీ శ్రీపాద జగన్నాధస్వామి) గారి శిష్యుడు భువనానందనాథ అను దీక్షానామము కలిగిన అయలసోమయాజుల ఉమామహేశ్వరరవి తెలుగులోకి స్వేచ్ఛానువాదము చేసిన రక్తనేత్రాపూజా విధివివరణం అను పదమూడవ భాగము సమాప్తము.

కామెంట్‌లు లేవు: