యాగమండప నిర్మాణ విధానము
జ్ఞానార్ణవమునందు
ఈ విధంగా చెప్పబడినది -
బాగుగా
అలంకరించుకొని కర్పూర, కేసర
(కుంకుమ పువ్వు), కుంకుమ శరీరమునకు లేపనము చేసి నవరత్నములను, ఎర్రని వస్త్రములను ధరించి తాంబూలపూరిత ముఖముతో (= నోటితో), ప్రసన్నవదనముతో సాధకుడు యాగమందిర ప్రవేశము చెయ్యాలి. యాగమండపమును
గోమయముచేత లేపనము చేసి లాక్షారసమును (పారాణి) చిత్రించి,
ధూపములు వెలిగించి అనేక పుష్పములతో అలంకరించాలి.
దక్షిణామూర్తిసంహితయందు
ఈవిధంగా చెప్పబడినది -
అలంకారములతో
విభూషితుడై సాధకుడు యాగమండప ప్రవేశము చెయ్యాలి. యాగమండపమును గోమయముతో శుభ్రపరచి
దానిమీద రంగుల రంగవల్లి దిద్దాలి. మండపముపైన పూలమాలను అలంకరించాలి. ధూపము వేసి
దీపమాలతోనూ సుందరమైన పూలతోనూ అలంకరించాలి.
యాగమండప
ప్రవేశ విధి
ఓం
వజ్రోదకే హుంఫట్ స్వాహా| అను
మంత్రంతో జలమును జల్లి దానిపైన ఆసమును పరచి కూర్చోవాలి.
ఓం హ్రీం
విశుద్ధ సర్వపాపాని శమయాశేషు హుం - అను మంత్రంతో కాళ్ళు చేతులు శుభ్రపర్చుకోవాలి.
ఓం హ్రీం
స్వాహా అను మంత్రంతో మూడుసార్లు ఆచమనము చెయ్యాలి.
ఆ తర్వాత
సూర్య పూజ యధావిధి చెయ్యాలి.
సౌరపూజా
విధానము
శంభునిర్ణయ
ప్రకారము -
చతుర్విధ
పురుషార్ధములకొరకు సుఖాసనమున కూర్చొని పూజించాలి. తూర్పు ముఖంగా కూర్చొని
పూజాసామాగ్రిని సమతల భూమి మీద ఉంచుకొని వామ భాగమున సామాన్యార్ఘ్యపాత్రను ఉంచి
అయిదుసార్లు ఓం ఉచ్ఛరించాలి. సాధారణ మంత్రముతో మండలము నిర్మించాలి. ఆ మండలము
నలుప్రక్కలా అయిదు అంగుళముల దూరముండాలి. అందు షట్కోణము నిర్మించాలి. పాత్రను ఫట్
మంత్రముతో శోధన చేసి ఆధారము మీద స్థాపించాలి. పాత్రను జలముతో పూరించాలి. అగ్ని, సూర్య, సోమ బీజములతో
ఆ జలమును అభిమంత్రించాలి. హ్రాం, హ్రీం, హ్రూం ఇత్యాదులతో అంగపూజ చేసి శంఖస్థాపన చెయ్యాలి. తర్వాత ఏ నాసాపుట
నుండి శ్వాస చలిస్తున్నదో ఆ హస్తము ద్వారా కస్తూరి,
చందనాదులతో ఈ క్రింది మంత్రముతో సౌరమండల పూజ చెయ్యాలి.
ఐంహ్రీంశ్రీం
హ్స్ఖ్ప్రేం హ్సౌః చంద్ర సూర్యాగ్ని గర్భం స్ఫురస్ఫురధర్మార్ధకామమోక్ష లాభం కురుకురు
మహాఖేచరిముద్రాం ప్రకటయప్రకటయశాంభవాజ్ఞయాచతురన్వయానాం సిద్ధి సామర్ధ్యాది దద దద
కిచ కిచ కిల కిల ఫ్రేం మండలబ్రహ్మాండ మండల హ్స్రూం మహాచండశివే సహఫ్రేం||
వృత్త, అష్టదళ, చతురస్ర
మండలములు రెండు నిర్మించాలి. ఒకటి సామాన్యార్ఘమునకు, మరొకటి
విశేషార్ఘ్యమునకు ఉపయోగించాలి. దక్షభాగమున సౌరార్ఘ్య మండలము చతురస్రమును
నిర్మించాలి. దానిమీద ఆధారసహితంగా ఒక పాత్రను ఉంచి "ఐం పాత్రాసాదనాయ నమః
ఐం" అని అర్చించాలి. తర్వాత ఫట్ మంత్రంతో ధూపపాత్రను ప్రక్షాళన చేసి
స్థాపించాలి. అయిదుసార్లు క్లీంక్లీం అని ఉచ్చరించాలి. ఈ మంత్రంతో అర్ఘ్య యంత్రమును
శుద్ధ జలముతో పూజించాలి. హాం, హీం, హూం, హైం, హౌం, హః అను షడ్
బీజములతో ఆ అర్ఘ్యజలమునందు గంధాదులను వెయ్యాలి. ఎర్రని పువ్వులతో పూజించాలి. ఫట్
అని రక్ష చేసి సంకల్పము చెప్పాలి.
ఎనిమిది
దళములందు ప్రేతస్వరూపిణీ ధ్యానము చెయ్యాలి. మంత్రముతో అనంతుని అర్చించాలి. అనంతుని
మంత్రము - అం అనంతాయ నమః అం. శరీరమును ఆసనముగా భావించి అందు మూడు ఫణములు కలిగిన
ఛత్రములో తన పరివారముతో ఉన్న శ్వేతవర్ణ ఈశ్వరుని ధ్యానించాలి. ఆగ్నేయ, ఈశాన, వాయవ్య
క్రమములో మూడు ఫణములను కూడా పూజించాలి. పూజా మంత్రము -
హూం
హ్రూం ఫ్రేం పబంధనాయహూం హూం హూం యంరంలంత్రిమూర్తయే యం అర్ధాయ యం హం పరమసుఖాయ నమః|
దహరాకాశములో
ఉండు ఎర్రని హ్రీం బీజము నాసిక నుండి బయటకు వచ్చి ప్రేతాత్మ ఆసనముమీదకు ఆవాహనము
చేసి మార్తాండ భైరవుని ఈ క్రింది ప్రకారముగా ధ్యానించాలి.
రక్తవర్ణం
స్థూలదేహం షడ్వక్త్రమూర్ధ్వకేశికం| భుజద్వాదశసంయుక్తం సర్పాస్థిరంత చర్చితం||
క్రోధినంచోర్ధ్వలింగంచ
జ్వలద్రస్మిసమూలకం| వ్యాఘ్రచర్మపరీధానం ముండమాలా
విభూషితం||
హుంహుంకారం
ప్రముంచంతం సంహరంతం మహాశివాం| త్రిశూలాసిచక్రఖడ్గ సృణి వరదపాణికం||
తర్జాశోకగదాచాపపాశాభయకరాలినం||
సాధన, ఆవాహన మొదలగు ముద్రలను ప్రదర్శించాలి.
హ్రాం, హ్రీం, హ్రూం, హ్రైం, హ్రౌం బీజములతో పంచాంగ పూజ చేసి
విధివిధానముగా మార్తాండ భైరవుని పూజించి పుష్పాంజలి సమర్పించాలి. మంత్ర సహితంగా
అర్ఘ్యమును ఇచ్చి నివేదన చెయ్యాలి. అర్ఘ్యమంత్రము -
హ్రౌం
హ్స్రౌం శ్రీం కులమార్తాండభైరవాయ హ్రౌం హ్స్రౌం
ఆ తర్వాత
సాధకుడు తన శరీరమున జలమును మార్జనము చేసుకొని ఈ క్రింది మంత్రమును జపించి
సర్వసాక్షి సవితా దేవికి శ్రద్ధగా పుష్పాంజలి సమర్పించాలి.
హ్స్రౌః
క్ష్రౌం హ్స్రౌః ఫట్ ఖఫ్రేంభాంఫట్ హ్స్రౌః క్ష్రౌం హ్స్రౌః ఫట్ ఖఫ్రేంభాం
తర్జనీతో
శూలముద్రను, మిగిలిన వ్రేళ్లతో
మృగీముద్రను పూర్వాది అష్టదళములందు చూపించాలి. మధ్యన తర్జనీతో శూలముద్రను
చూపించాలి. ఆ తర్వాత నవశక్తులు మరియు అష్టభైరవుల పూజ ఈ క్రింది మంత్రంతో చెయ్యాలి.
శక్తి
మంత్రములు:
జూం
జ్వాలాయై నమః జూం| క్షాం మిత్రీశాయై నమః క్షాం| హుంఫట్ చండాలిన్యైనమః హుంఫట్| సౌః భీషణాయైనమః సౌః| ఐం నారసింహాయై నమః ఐం| హ్రీం కమలాదేవ్యై నమః హ్రీం| ఫ్రేం మార్తాండాయై నమః ఫ్రేం| ఫ్రేం కపాలిన్యై నమః
ఫ్రేం| సౌః కాలిన్యై నమః సౌః|
భైరవ
మంత్రములు:
ఫ్రేం
చండాయ నమః ఫ్రేం| ఫ్రేం మహాదేవయ నమః ఫ్రేం| ఫ్రేంమహాకాలయ నమః ఫ్రేం| ఫ్రేం గభస్తీశాయ నమః ఫ్రేం| ఫ్రేం చండీశాయ నమః ఫ్రేం| ఫ్రేం తైజసాయ నమః ఫ్రేం| ఫ్రేం మార్తాండాయ నమః ఫ్రేం| ఫ్రేం విశ్వేశాయ నమః
ఫ్రేం|
ఖేచరీ
ముద్రతో హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రః బీజములతో షడంగ పూజ చెయ్యాలి. దూర్వాలు
మరియు ఎర్రని పుష్పాలు సమర్పించాలి. మంత్ర సహితంగా ధూప, దీప, నైవేద్యములు
సమర్పించాలి. అర్ఘ్యమంత్రమును యథాశక్తి జపము చేసి తర్పణములు వదలాలి.
అర్ఘ్యమంత్రము:
చిదాదిత్యహ్రదంబుజే
దహదహ కహకహ ఆత్మానం నిధాయార్ఘ్యంచ నైవేద్యం నివేదయామి|
ఈ
మంత్రముతో తేజోర్ఘ్యమును సమర్పించాలి. సాధకుని ఎడమవైపున చతురస్ర మండలమును
నిర్మించి అందు ఆధారమును ఉంచాలి. ఆధారము పైన పాత్రను ఉంచాలి. అందు పశుమార్తాండ
భైరవుడిని విధివిధానముగా మంత్రసహితంగా అర్చించాలి.
పశుమార్తాండభైరవ
మంత్రము: హ్రాంహ్రీం సః పశుమార్తాండభైరవాయ|
- ఇది
సూర్య పూజనం
ఇంకాఉంది...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి