సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

29, జనవరి 2021, శుక్రవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - అయిదవవశ్వాస - 07

 

యాగపూజారంభం

మండలం మధ్యన - ఓం బ్రహ్మణే నమః| గృహేశాయ నమః|

నైరుతిదిక్కున - వాస్తుపురుషాయ నమః| అని పూజించాలి

ఓం రక్షరక్ష హుంఫట్ స్వాహా| ఇతి భూమి మభ్యుక్ష (భూమి మీద నీళ్ళు జల్లాలి)

ఓం పవిత్రవజ్రభూమే రక్షరక్షహుం ఫట్ స్వాహా| - ఇతి భూమిం అభిమన్త్ర్య

ఆఃసురేఖే వజ్రరేఖేహుంఫట్ స్వాహా| - ఇతి భూమౌ విలిఖ్య (ఈ మంత్రమును భూమి మీద లిఖించాలి)

దానిమీద ఆసనము పరచాలి. పూర్వాది నాలుగు దిక్కులందు బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర మరియు మధ్యన సదాశివుని పూజించాలి.

తర్వాత, ఆసనము మీద త్రికోణమును భావించాలి. మూడుకోణములు మరియు మధ్యన కామరూప, పూర్ణగిరి, జాలంధర, ఉడ్యాన పీఠముల పూజ చెయ్యాలి. ఆసనమును "ఓం ఐం హ్రీం శ్రీం హ్రీం ఆధారశక్తి కమలాసనాయనమః" అని పూజించాలి. దాని మీద పూర్వ ముఖముగా గానీ, ఉత్తరముఖముగా గానీ కూర్చొని మాతృకా మండలమును ధ్యానించాలి. ఆ తర్వాత భూమిని ఈ క్రింది మంత్రంతో ప్రార్థించాలి.

ఓం పృధ్వీత్వయాధృతాలోకాదేవిత్వంవిష్ణునాధృతా| త్వంచధారయమాందేవి పవిత్రం కురుచాసనం||  మాంచపూతం కురుధరేనతోస్మిత్త్వామ్ సురేశ్వరి||

వినియోగః|

ఓం పృధివ్యామేరుపృష్ఠ ఋషిః| సుతలం ఛన్దః| కూర్మోదేవతా| ఆసనేవినియోగః|

ఓం ప్రణవస్యబ్రహ్మఋషిః| గాయత్రీ ఛన్దః| పరమాత్మా దేవతా| ప్రాణాయామే వినియోగః|

మూడుసార్లు ప్రాణాయమము చేసి న్యాసము చెయ్యాలి.

దీపనాథాయ నమః - శిరసి| గం గణపతయే నమః, గణానాంత్వా... దక్షభుజే| దుం దుర్గాయై నమః| ఓం జాతవేదసేసున... - వామభుజే| క్షం క్షేత్రపాలాయనమః, ఓం క్షేత్రస్యపతినా... దక్షజానునే| సం సరస్వత్యై నమః, ప్రణోదేవీసరస్వతీ... - వామజానునే|

శ్రీగురుభ్యోనమః| పరమగురుభ్యోనమః| పరమేష్ఠిగురుభ్యోనమః| అని గురువులకు నమస్కారం చెయ్యాలి.

తర్వాత ఎడమకాలి మడమతో భూమిని చరుచుచూ చిటికెలు వేస్తూ క్రూరదృష్టి మరియు క్రోధ ముఖముతో పాతాళ, భూమి, ఆకాశ లోకములలో ఉన్న విఘ్నములను ఉత్సారణ (తొలగించాలి) చేయాలి.

కరశుద్ధి:

ఉక్తపాశుపతాస్త్రేణ వామహస్తాతలంద్విధా| మణిబంధంసమారంభ్యసంస్పృష్టం దక్షపాణినా| ప్రమృజ్యదక్షిణంపాణింసకృదేవోక్తమార్గతః||

దిగ్బంధం

లం ఇన్ద్రాయ నమః| ఇంద్రదిశం చక్రేణబద్నామి నమశ్చక్రాయ స్వాహా|

ఓం సుదర్శనాయ విద్మహే మహాజ్వాలాయధీమహి తన్నశ్చక్రం ప్రచోదయాత్||

(3 సార్లు)

ఉగ్రంవీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం| నృసింహం భీషణంభద్రం మృత్యుమృత్యుం నమామ్యహం||

ఈ మంత్రంతో దశదిశలను బంధించి ప్రాకారత్రయమును నిర్మించాలి.

రం అగ్నిప్రాకారాయ నమః| సహస్రార హుంఫట్ సుదర్శనాగ్నిప్రాకారాయ నమః|

ఓం హ్రీం స్ఫురస్ఫురప్రస్ఫురప్రస్ఫురఘోరఘోరతర తనురూప చటచట ప్రచటప్రచట కహకహ వమవమ బంధయబంధయ ఘాతయఘాతయ హుంఫట్ అఘోరాగ్ని ప్రాకారాయ నమః|

పై మూడు మంత్రములను జపిస్తూ జలముతో ప్రాకారత్రయమును నిర్మించాలి.

మూడు అగ్నిప్రాకారములను భావించి గణేశ, దుర్గా, విఘ్న, శరభ, అఘోర, సుదర్శన మంత్రముల జపము చెయ్యాలి. దీనితో ప్రత్యూహ (=విఘ్న) శాంతి కలుగుతుంది.

ఈ విధముగా రక్షణ కలిగిన తర్వాత భూతశుద్ధి చెయ్యాలి.

తంత్రాంతరము ప్రకారము, సాధకుని కుడివైపున పూజా ద్రవ్యములను ఉంచుకోవాలి. ఎడమవైపున సుగంధిత జలముతో పూరించబడిన సుందర కలశమును ఉంచుకోవాలి. వెనకవైపు చేతులు కడుక్కోవడానికి ఒక పాత్రను ఉంచాలి. సమీపమున నేతి దీపామును, దర్పణము, చామరము, ఛత్రము, తాళవృంతము (= విసనకర్ర) ఉంచాలి.

పూజాద్రవ్యముల స్థాపనము

కులచూడామణి ప్రకారము:

అన్ని పూజాద్రవ్యములను మూలమంత్రముతో సంశోధన చేసి అన్నింటిని కుడివైపున ఉంచాలి. ఎడమవైపున అర్ఘ్యపాత్రను ఉంచాలి. దేవతా కులద్రవ్యములను వెనక భాగమున ఉంచాలి.

పుష్పాది శోధన మంత్రము:

ఓం పుష్పకేతురాజార్హతే సర్వగతాయ సమ్యక్ సంబద్ధాయ ఓం పుష్పేపుష్పే మహాపుష్పే సుపుష్పే పుష్పసంభవే పుష్పావచాయ సంకీర్ణం హుంఫట్ స్వాహా||

హృదయము మీద చేతిని ఉంచి ఈ క్రింది మంత్రంతో ఆత్మరక్ష చెయ్యాలి -

ఓం రక్షరక్షహుంఫట్ స్వాహా|

తర్వాత ప్రణవంతో మూడుసార్లు ప్రాణాయామము చేసి భూతశుద్ధి చెయ్యాలి.

ఇంకావుంది...

కామెంట్‌లు లేవు: