సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

16, ఏప్రిల్ 2021, శుక్రవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - ఆరవశ్వాస - 4

 

కామేశ్వరీ మాతృకా న్యాసము:

కామేశ్వరీ ఉపాసకులు కేవలము మాతృకలతో న్యాసము చెయ్యాలి. ఇతరులు క్లీంయుక్త మాతృకలతో న్యాసము చెయ్యాలి.

ఋషి - సమ్మోహన| ఛందస్సు - గాయత్రి| దేవత - కామేశ్వరీ| క్లీం - బీజం| నమః - శక్తిః| నమః - కీలకం| క్లాం, క్లీం, క్లూం, క్లైం, క్లౌం, క్లః- ఈ బీజములతో షడంగ న్యాసము చెయ్యాలి.

ధ్యానం:

బాలార్కకోటిరుచిరాం స్పటికాక్షమాలామ్ కోదండమిక్షుజనితం స్మరపంచ బాణాన్|

విద్యాంచహస్తకమలైర్దధతీంత్రినేత్రాం ధ్యాయేత్ సమస్తజననీమ్ నవచంద్రచూడామ్||

క్లీం అం నమః| క్లీం ఆం నమః | ఈ విధంగా న్యాసము చెయ్యాలి.

సమ్మోహనీ మాతృకా న్యాసము

త్రిపురా ఉపాసకులు కేవలము మాతృకలతో న్యాసము చెయ్యాలి. ఇతరులు హ్రీం శ్రీం క్లీం బీజయుక్త మాతృకలతో న్యాసము చెయ్యాలి.

ఋషి - సమ్మోహన| ఛందస్సు - గాయత్రి| దేవత - మనఃసమ్మోహనీ| క్లీం - బీజం| హ్రీం - శక్తిః| శ్రీం - కీలకం| హ్రీంశ్రీంక్లీం హ్రీంశ్రీంక్లీం  - హృదయాయనమః| ఈ విధంగా షడంగ న్యాసము చెయ్యాలి.

ధ్యానం:

ధ్యాయే యమక్షవలయేక్షుశరాసపాశాన్ పద్మద్వాయాంకుశశరాన్నవపుస్తకంచ|

ఆబిభ్రతీంనిజకరైరరుణంకూచార్తామ్సమ్మోహనీంత్రినయనామ్తరుణేందుచూడామ్||

హ్రీంశ్రీంక్లీం అం నమః| హ్రీంశ్రీంక్లీం ఆం నమః | ఈ విధంగా న్యాసము చెయ్యాలి.

 

గణేశ, గ్రహ, నక్షత్ర, యోగినీ, రాశి, పీఠ, షష్ఠమాతృకా సహిత బహుకలా, అష్టవాగ్దేవతా, శ్రీకంఠాదియుగ్మ, కేశవాది మరియు ధరాది ముఫైయారు తత్త్వముల రూపములో భగవతిని స్మరించాలి. ఇవన్నీ దశవిధ మాతృకాన్యాసములు. ఈ దశవిధ మాతృకా న్యాసములలో వర్ణమాతృకా, కళామాతృకా, మూర్తిమాతృకా, ప్రపంచమాతృకా కూడా ఉంటాయి. ఈ నాలుగు మాతృకలు సంపత్ప్రదాయకములు.

శుద్ధంబిందుయుతం విసర్గయుతం హృల్లేఖయా సంశ్రితంబాలాసంపుటితం తధాచ పరయాశ్రీవిద్యాలంకృతం|

ఆరోహదవరోహతశ్చకురుతేన్యాసం పునర్హంసయోర్యోజానాతి స ఏవ సర్వజగతాం సృష్టిస్థితిధ్వంసకృత్||

బాలాసంపుటిత మాతృకా న్యాసము

ఋషి - దక్షిణామూర్తి| ఛందస్సు - పంక్తిః| దేవత - వర్ణమయి బాలా| ఐం - బీజం|

సౌః - శక్తిః| క్లీం - కీలకం| శ్రీవిద్యాంగరూప న్యాసే వినియోగః| బాలామంత్ర బీజములతో రెండు ఆవృత్తములతో షడంగ న్యాసము చెయ్యాలి.

ధ్యానం:

ముక్తాశేఖరకుండలాంగదమణిర్గైవేయ హారోర్మికాం విద్యోతద్వలయాది కంకణ కటి సూత్రాం స్ఫురన్నూపురాం|

మాణిక్యోదరబంధురాస్తానభరామిన్దోః కలాంబిభ్రతీం పాశం సాంకుశపుస్తకాక్ష వలయం దక్షోర్ధ్వబాహ్వాదితః||

పూర్ణేందు ప్రతిమ ప్రసన్నవదనాం నేత్రత్రయోద్భాసితా మిన్దుక్షీరవలక్షగాత్ర విలస న్మాల్యానులేపాంబరామ్|

పంచాశల్లిపిర్జుంభితాఖిలజగద్వాగ్దేవతాం మూలాధారసముద్గతాం భగవతీం వర్ణామ్బుజే చింతయేత్||

న్యాసం:

ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః అం సౌః క్లీం ఐం| ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః ఆం సౌః క్లీం ఐం| - ఈవిధంగా న్యాసం చెయ్యాలి.

పరాసంపుటిత మాతృకా న్యాసము

ఋషి - బ్రహ్మ| ఛందస్సు - గాయత్రి| దేవత - పరాసరస్వతీ మాతృక|

షడ్ దీర్ఘ పరా బీజములతో (సాం - సీం - సూం - సైం - సౌం - సః) షడంగ న్యాసము చెయ్యాలి.

ధ్యానం:

అకాలంకశశాంకాభాం త్ర్యక్షాం చంద్రకళావతీం| ముద్రాపుస్తకసద్బాహుం ప్రణమామి పరాంకలాం||

ఓం ఐం హ్రీం శ్రీం సౌః అం సౌః| ఓం ఐం హ్రీం శ్రీం సౌః ఆం సౌః| ఈవిధంగా న్యాసము చెయ్యాలి.

ఇంకాఉంది...

కామెంట్‌లు లేవు: