సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

10, ఏప్రిల్ 2021, శనివారం

మహామనుస్తవం - 17, 18

 17. సంకరమక్షమమాణా ధర్మాణాం సర్వలోకహితకామా|

 సారాంశముద్దరంతీ సర్వస్మాజ్జయతి సర్వభూతసమా||

శ్రీమాత అందరికీ తల్లి. దేవతలకు, అసురులకు, సకల జీవరాశులకు అందరికీ అమెయే తల్లి. ఒక్కో జీవ జాతికి ఒక్కో ధర్మమున్ననూ ఆమె ఆయా ధర్మములందు ఎటువంటి గందరగోళము, భ్రమలు కలుగనీయకుండా ఆయా జీవులను వారి వారి ధర్మానుసారమే నడిపించును.

అమ్మవారి విద్య అయిన శ్రీవిద్యను ఆకాంక్షించు వారి అందరికీ ఎటువంటి కుల భేదములు లేకుండా ఆయా జీవుల ధర్మానుసారము విద్యను పాటించడానికి అనుమతనిచ్చుచున్నది. ఇదియే తల్లి యొక్క విశాల హృదయమునకు నిదర్శనము.


18. కమలభువో భవకార్యే కమలాక్షస్యాపి రక్షణే జగతాం|

      విలయేప్యుభయోర్ధాత్రీ కామకలా జయతి సర్వదేవకలా||


కమలోద్భవుడైన బ్రహ్మను సృష్టి కార్యములో, కమలాక్షుడైన విష్ణువును స్థితి కార్యములో కొనసాగింపచేసి వారిద్దరినీ లయ సమయంలో కామకలా రూపంలో రక్షించునది.

       శ్రీమాత కామకలా రూపంలో బ్రహ్మ ద్వారా సృష్టిని, విష్ణువు ద్వారా స్థితిని నిర్వర్తించుచున్నది. లయ సమయంలో శ్రీమాత దేవతలందరినీ రక్షించును.
ఇంకాఉంది...

కామెంట్‌లు లేవు: