సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

9, మార్చి 2022, బుధవారం

శ్రీదక్షిణామూర్తి సంహిత - 28

 

పంచబాణేశ్వరీయజనవిధివివరణం

ఈశ్వరుడు చెబుచున్నాడు - హే మహేశ్వరీ! త్రిపురేశ్వరీ తంత్రములో పంచబాణములను తెలుపబడినవి. ఆ పంచబానములనుండి ఈ పంచాక్షరీ విద్య జనించింది. ఈ మంత్ర ఋషి - మదన| ఛందస్సు - గాయత్రి| బీజము - ఆది కామేశ్వరి| దేవత - ఈశ్వరి| వ్యస్త మరియు సమస్త పంచ కాములతో అంగ దేవతలను పూజించాలి. పంచబాణముల న్యాసము చెయ్యాలి. (ఈ న్యాసము కొరకు తొమ్మిదవ భాగము చూడగలరు).

ఆ తర్వాత ఈ క్రింది విధంగా ధ్యానం చెయ్యాలి.

ఉద్యద్దివాకరాభాసాం నానాలంకారభూషితామ్|

బంధూకకుసుమాకారరక్తవస్త్రాంగరాగిణీం||

ఇక్షుకోదండపుష్పేషువిరాజిత భుజద్వయామ్|

పైవిధంగా ధ్యానం చేసిన తర్వాత మంత్రంలో ఎన్ని వర్ణములు ఉంటాయో అన్ని లక్షలు జపం చెయ్యాలి. జపములో దశాంశము బన్ధూక పుష్పములతో హోమము చెయ్యాలి. మళ్ళీ కామేశ్వరిని పూజించి విశేష బాణ పూజ చెయ్యాలి. త్రిపురేశ్వరీ పూజావిధానంగానే పూజించాలి. ఈ దేవతా సాధకుడు భూమండలాన్ని వశపరచుకోగలడు.

ఇది శ్రీదక్షిణామూర్తి సంహితకు విశాఖ వాస్తవ్యులు, కౌండిన్యస గోత్రికులు, శ్రీఅయలసోమయాజుల పాలబాబు (సుబ్బారావు) గారు మరియు శ్రీమతి సాయిలీల దంపతుల ద్వితీయపుత్రుడు మరియు హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ ప్రకాశానందనాథ (శ్రీశ్రీశ్రీ శ్రీపాద జగన్నాధస్వామి) గారి శిష్యుడు భువనానందనాథ అను దీక్షానామము కలిగిన అయలసోమయాజుల ఉమామహేశ్వరరవి తెలుగులోకి స్వేచ్ఛానువాదము చేసిన పంచబాణేశ్వరీయజనవిధివివరణం అను ఇరవైఎనిమిదవ భాగము సమాప్తము.

కామెంట్‌లు లేవు: