సూక్తి

భోగములయందు విముక్తి, ఆత్మ విచారమందు ఆసక్తి అనునవి ఈశ్వరానుగ్రహమునకు సూచకములు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

25, జులై 2022, సోమవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - ఎనిమిదవశ్వాస - 8

 

25. మహాషోఢాన్యాసఫలము

కులార్ణవమునందు భగవాన్ శంకరుడు మహాషోఢాన్యాసమును తెలిపెను. ఎవరైతే ఈ న్యాసములు చేస్తారో వారు సాక్షాత్ పరమశివుడవుతారు. ఎవరు ఈ న్యాసములను ప్రతిరోజూ చేస్తారో వారికి నిగ్రహానుగ్రహ సమర్థత కలుగుతుంది. ఇందు సందేహము లేదు. దేవతలందరూ అతడికి నమస్కారము చేస్తారు. ఏ స్థలములో ఈ న్యాసములు చేయబడునో ఆ స్థలము నాలుగు దిక్కులందునూ, పదియోజనముల వరకు దివ్యక్షేత్రము అవుతుంది. ఈ న్యాస సాధకుడు ఎక్కడకు వెళ్ళినా అతనికి విజయ లాభము, సన్మానము, గౌరవము లభించును. ఈ న్యాస సాధకుడు ఎవరికైనా వందనము చేస్తే అతడు ఆరు మాసములలో మృతిచెందుతాడు. ఈ న్యాసముకు వజ్ర పంజరన్యాసమని పేరు. ఈ న్యాస సాధకుడిని చూసిన, దివ్యలోకములు, అంతరిక్షము, భూమి, పర్వతము, జలము, వనములందు జీవించువారలకు, ప్రచండ భూత, భేతాళ, దేవ, రాక్షస, గ్రహాదులకు భయము కలుగును. ఈ న్యాస సాధకునకు బ్రహ్మ, విష్ణు, శివాది దేవతలు, ఋష్యాది మునులు నమస్కారము చేయుదురు. ఈ న్యాసమును అనధికారులకు చెప్పరాదు. ఈ న్యాసము వలన ఆజ్ఞాసిద్ధి లాభిస్తుంది. దేవతాభావ ప్రాప్తి కొరకు ఈ న్యాసమును మించిన మరియొక సాధనము లేదు. ఇది సత్యము. ఊర్ధ్వామ్నాయ ప్రవేశము, పరాప్రాసాదధ్యానము, మహాషోఢా న్యాసము/జ్ఞాన ఫలము దేనికీ సాటిరావు.

26.       తురీయవిద్య

పరాషోడశీని తురీయ విద్య అని అంటారు.

సౌః శ్రీం హ్రీం క్లీం ఐం సౌః ఓం హ్రీం శ్రీం కఏఈలహసకహలసకలహ్రీం  సౌః ఐం క్లీం హ్రీం శ్రీం సౌః

27.       చరణత్రయవిద్య

1.        ఓం ఐం హ్రీం శ్రీం హంసః శివః హ్సౌః సోహం సౌః శ్రీం హ్రీం క్లీం ఐం సౌః ఓం హ్రీం శ్రీం కఏఈలహసకహలసకలహ్రీం  సౌః ఐం క్లీం హ్రీం శ్రీం సౌః చిదానంద జ్యోతిరహం|

2.        ఓం ఐం హ్రీం శ్రీం హంసః శివః హ్సౌః సోహం సౌః శ్రీం హ్రీం క్లీం ఐం సౌః ఓం హ్రీం శ్రీం కఏఈలహసకహలసకలహ్రీం  సౌః ఐం క్లీం హ్రీం శ్రీం సౌః సచ్చిదానంద జ్యోతిరహం|

3.        ఓం ఐం హ్రీం శ్రీం హంసః శివః హ్సౌః సోహం సౌః శ్రీం హ్రీం క్లీం ఐం సౌః ఓం హ్రీం శ్రీం కఏఈలహసకహలసకలహ్రీం  సౌః ఐం క్లీం హ్రీం శ్రీం సౌః అహమేవారాస్మి|

సంఘట్టముద్రతో వీటిన్యాసములను మూర్ద్నియందు చెయ్యాలి.

28.       శంభుచరణం

పంచాంబా వర్ణన ఇంతకు ముందు చెయ్యబడినది. ఉన్మానాకాశాదినవనాథులు మరియు ఆత్మానందాది నవనాథుల వర్ణన కూడా ఇంతకు ముందు చెయ్యబడినది.

29.       షోడశమూల విద్య

1.       ఓం ఐం హ్రీం శ్రీం స్వచ్ఛప్రకాశ పరిపూర్ణ పరాపర మహాసిద్ధ విద్యా కులయోగి హ్రీం కులయోగినీ కఏఈలహ్రీం హసకహలహ్రీం సకలహ్రీం శ్రీవిద్యాపాదుకాం పూజయామి.|

2.       హ్సౌః ఆత్మానం బోధయ బోధయ సౌఃహ్ హ్సౌః అంబా కఏఈలహ్రీం హసకహలహ్రీం సకలహ్రీం శ్రీవిద్యాపాదుకాం పూజయామి.|

3.       ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం క్లిన్నే క్లేదిని మహామదద్రవే క్లీం క్లీం మోహయ క్లీం ఐం స్వాహా| (ఇది అతిరహస్య యోగినీ విద్య)

4.       ఓం ఐం హ్రీం శ్రీం హంసః స్వచ్ఛ ఆనంద పరమం హంసః పరమాత్మనే స్వాహా హ్సౌ హ్సౌ| (ఈ విద్య మూలశాంభవీ పూర్విక విద్య)

5.       ఓం ఐం హ్రీం శ్రీం హ్రీం నిత్యస్ఫురత్తాత్మ చైతన్యమయీ మహా బిందు వ్యాపకంతి మాతృస్వరూపిణీ ఓం ఐం హ్రీం శ్రీం| (ఈ విద్య హృల్లేఖ మూల విద్య)

6.       ఓం ఐం హ్రీం శ్రీం స్వచ్ఛప్రకాశాత్మికే హ్రీం కుల మహామాలినీ వాక్కులగర్భ మాతృకే భువనేశ్వరీ సౌ విమలే శ్రీం|

7.       ఓం ఐం హ్రీం శ్రీం హంసః నిత్యప్రకాశాత్మికే కులకుండలినీ ఆజ్ఞాసిద్ధే మహాభైరవి ఆత్మానం బోధయ బోధయ అంబే భగవతీ హ్రీం|

8.       ఓం ఐం హ్రీం శ్రీం ఓం మోక్షం కులపంచాక్షరీ కఏఈలహ్రీం హసకహలహ్రీం సకలహ్రీం|

9.       ఓం ఐం హ్రీం శ్రీం హసకహలహ్రీం హసకహలహ్రీం సకలహ్రీం|

10.    ఓం ఐం హ్రీం శ్రీం ఐం శుద్ధసూక్ష్మ నిరాకార నిర్వికల్ప పరబ్రహ్మ స్వరూపిణీ క్లీం పరానంద హ్రీం ఐం క్లీం సౌః| ఈ విద్య శాంభవానందనాథ అనుత్తర కౌలినీ విద్య. ఈ విద్యను సర్వాగమ విశారద అని అంటారు.

11.    ఓం ఐం హ్రీం శ్రీం హంసః సోహం స్వచ్ఛానందపరమహంస పరమాత్మనే స్వాహా| (ఈ విద్య గురూత్తమ విమర్శినీ మూలవిద్య)

12.    ఓం ఐం హ్రీం శ్రీం నామాఖ్యవ్యోమాతీతనాథ పరాపరవ్యోమాతీత వ్యోమేశ్వర్యంబా అనామాఖ్యా|

13.    ఓం ఐం హ్రీం శ్రీం ఐం ఇంఈంఉం| ఈ విద్యను సంకేతికసారాఖ్య మూలవిద్య అని అంటారు.

14.    ఓం ఐం హ్రీం శ్రీం హ్రీం భగవతి విచ్చే వాగ్వాదిని క్లీం హ్రీం మహామాతంగినీ ఐం క్లిన్నే బ్లూం స్త్రీం| ఈ విద్య అనుత్తరాది వాగ్వాదినీ విద్య.

15.    ఓం ఐం హ్రీం శ్రీం హ్సౌః హ్స్ఖ్ఫ్రేం సంపత్ప్రదా హ్సౌః| ఈ విద్య అనుత్తర శాంకరీ విద్య.

16.    సౌః శ్రీం హ్రీం క్లీం ఐం సౌః ఓం హ్రీం శ్రీం కఏఈల హసకహల సకలహ్రీం సౌః ఐం క్లీం హ్రీం శ్రీం సౌః సర్వానందమయపరమేశాని మహాత్రిపురసుందరీ| ఈ మూల విద్య అభీష్టఫల ప్రదాయకము.

కామెంట్‌లు లేవు: