సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

9, డిసెంబర్ 2023, శనివారం

భస్మధారణ విధి

 

భస్మధారణ విధి

(అగ్నిహోత్రము లేదా వివాహాగ్ని నుండి ఉత్నన్నమైన భస్మము లేదా ఆవు పిడకలను కాల్చగా వచ్చిన భస్మమును తీసుకొని శుభ్రమైన వస్త్రముతో జల్లెడపట్టించి కర్పూరాది సువాసితములు కలిపి ఆ భస్మముతో త్రిపుండ్రములను ధరించాలి. ఆ విధి ఈ క్రింది విధముగా ఉండును.)

మూలమంత్రముతో మూడు మార్లు ప్రాణాయామము చేసి ఈ క్రింది విధంగా ఋష్యాది న్యాసములు చెయ్యాలి.

పిప్పలాది ఋషయే నమః – శిరశి। గాయత్రి ఛందసే నమః – ముఖే। రుద్రాయ నమః – హృది। అగ్నిబీజాయ నమః – గుహ్యే। భస్మశక్తయే నమః – పాదయోః। మమ మోక్షార్ధే భస్మధారణే వినియోగః॥

కరన్యాసము:

కాలాయ నమః – అంగుష్ఠయోః। కలవికరణాయ నమః – తర్జన్యోః। బలవికరణాయ నమః – మధ్యమయోః। బలప్రమథనాయ నమః – అనామికయోః। సర్వభూతదమనాయ నమః – కనిష్ఠకయోః। మనోన్మనాయ నమః – కరతలకరపృష్ఠయోః।

అంగన్యాసము:

కాలాయ నమః – హృదయాయ నమః। కలవికరణాయ నమః – శిరసే స్వాహా। బలవికరణాయ నమః – శిఖాయై వషట్। బలప్రమథనాయ నమః – కవచాయహుం। సర్వభూతదమనాయ నమః – నేత్రత్రయాయ వౌషట్। మనోన్మనాయ నమః – అస్త్రాయఫట్।

“ఓ౦ హ్రః అస్త్రాయ ఫట్” అను మంత్రంతో మూడుమార్లు చప్పట్లు కొట్టి దశదిశలను దిగ్బంధనము చెయ్యాలి.

ఈ క్రింది మంత్రంతో భస్మమునకు నమస్కారము చెయ్యాలి –

విభూతే భూతిమానాసీద్వామదేవః సదాశివః। రక్షాబంధస్తయా దేవి రక్షమామనఘేసదా॥

ఆ తర్వాత ఈ క్రింది మంత్రములను పఠిస్తూ భస్మమును ఎడమ చేతిలోకి తీసుకోవాలి

ఓం సద్యోజాతం  ప్రపద్యామి  సద్యోజాతాయ వై  నమో నమఃభవే భవే నాతిభవే  భవస్వ మామ్  భవోద్భవాయ నమః||
ఓం వామదేవాయ నమో,  జ్యేష్ఠాయ నమః  శ్రేష్ఠాయ నమో  రుద్రాయ నమః కాలాయ నమః  కలవికరణాయ నమో  బలవికరణాయ నమోబలాయ నమో  బలప్రమథనాయ నమః  స్సర్వభూతదమనాయ నమో
మనోన్మనాయ నమః ||

ఓం అఘోరేభ్యోథఘోరేభ్యోఘోరఘోరతరేభ్యఃసర్వేభ్యస్సర్వశర్వేభ్యో  నమస్తే అస్తు రుద్రరూపేభ్యః||

ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయధీమహితన్నోరుద్రః ప్రచోదయాత్||

ఓం ఈశానఃసర్వవిద్యానామీశ్వరస్సర్వభూతానాంబ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతి ర్బ్రహ్మా శివో మే అస్తు సదాశివోమ్||

ఆ తర్వాత భస్మాభిమంత్రణ మంత్రము యొక్క ఋష్యాది న్యాసములు ఈ క్రింది విధంగా చెయ్యాలి.

అథర్వశిరసే ఋషయే నమః – శిరసి। గాయత్రి ఛందసే నమః – ముఖే। శ్రీరుద్రదేవతాయై నమః – హృదయే।

భస్మమును ఈ క్రింది మంత్రంతో అభిమంత్రించాలి.

“అగ్నిరితి భస్మ, వాయురితి భస్మ, జలమితి భస్మ, స్థలమితి భస్మ, వ్యోమేతి భస్మ, సర్వంహవా ఇదం భస్మ, మన ఇత్యేతాని చక్షూంషిభస్మాని।

ఆ తర్వాత ఈ క్రింది మంత్రంతో భస్మములో కొంచెం నీళ్ళు కలపాలి.

ఓం అపోవా ఇదగ్‌౦ సర్వం విశ్వాభూతాన్యాపః ప్రాణావా అపః పశవ ఆపోన్న మా పోమృతమాపః సమ్రాడాపోవిరాడాపః  స్వరాడాపశ్చందాగ్‌ష్యాపో జ్యోతీగ్‌ష్యాపో యజూగుష్యాపః సత్యమాపః సర్వాదేవతా ఆపోభూర్భువస్సువరాప ఓం||

ఈ క్రింది మంత్రముతో ఋష్యాదులను స్మరించి, భస్మమును రుద్దాలి.

మానస్తోకే తనయే మాన ఆయుషి మా నో గోషు మా నో అశ్వేషు రీరిషః | వీరాన్మానో రుద్రభామితో వధీర్‌హవిష్మంతో నమసా విధేమ తే || (రెండుసార్లు)

ఆ తర్వాత ఈ క్రింది మంత్రంతో భస్మమును 12 మార్లు మంత్రించాలి.

“తస్మాత్ బ్రహ్మముదేతత్యాశుపతం పశుపాశవిమోక్షాయ”

ఇప్పుడు భస్మమును రెండు భాగములు చేసి, మొదటి భాగముతో ఈ క్రింది విధంగా చెప్పబడిన ఆయా స్థానములలో భస్మమును అద్దుకోవాలి.

1.            ఈశానఃసర్వవిద్యానా మంత్రంతో శిరస్సున

2.            తత్పురుషాయ మంత్రంతో ముఖమున

3.            అఘోరేభ్యః మంత్రంతో బాహువులందు

4.            వామదేవ మంత్రంతో కంఠము నుండి నాభి వరకు

5.            సద్యోజాత మంత్రంతో ఊరుమూలల నుండి రెండు పాదములవరకు (అన్ని అంగములందు)

ఆ తర్వాత చేతులు కడుక్కొని రెండవభాగముతో ఈ క్రింది విధంగా త్రిపుండ్రధారణ చెయ్యాలి.

ఓ౦ హ్రీంహరహర ఓ౦నమః శివాయ – శిరసే। బ్రహ్మణే నమః – లలాటే। హవ్యవాహనాయ నమః – హృదయే। స్కందాయ నమః – నాభే। పూష్ణే నమః – కంఠే। రుద్రాయ నమః – దక్షబాహు మూలే। ఆదిత్యాయ నమః – దక్షబాహు మధ్యే। చంద్రాయ నమః – దక్షమణి బంధే। వామదేవాయ నమః – వామబాహుమూలే। ప్రభంజనాయ నమః – వామబాహుమధ్యే। వసుభ్యో నమః – వామమణిబంధే। శంభవే నమః – కకుది। హరాయ నమః – పీఠభాగే। పరమాత్మనే నమః – బ్రహ్మరంధ్రే।

(ఆ తర్వాత వైదిక సంధ్యావందనం మొదలగు వైదిక కార్యములు చెయ్యాలి. ఈ భస్మధారణ విధి మూడు వర్ణములవారికి మాత్రమే. తర్వాతివారు పంచాక్షరి మంత్రంతోగాని, మూలమంత్రంతో గాని త్రిపుండ్రధారణ చెయ్యాలి. శాక్తేయులు కుంకుమయుక్త చందనాదులతో, మూలమంత్రంతో త్రిపుండ్రధారణ చెయ్యాలి.)


కామెంట్‌లు లేవు: