సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

25, మార్చి 2023, శనివారం

శ్రీదక్షిణామూర్తి సంహిత 56

 

యాభైఆరవ భాగము

శ్రీవిద్యావివరణం

ఈశ్వరుడు చెప్పుచున్నాడు –

శివ (హ), చంద్ర (స), మన్మథ (క), ఉరస (య?), శక్తి (స), బిందుమాలినీ (క), క్షమా (ల), బిందు (హ), అర్ధమాత్రా (ఐం) – ఇవి నవవర్ణములు. శివశక్తిమయీ ఈ దేవి వ్యోమాకారములో ఉంటుంది. ఈ చిద్రూపి తనలో విశ్వమంతటినీ ఉంచుకొంటుంది. ఈమె అందరి లయ స్థానము. చంద్రుని ద్వారా ఈమె అందరినీ స్నానం చేయించ్చును. మూలాధారము నుండి బ్రహ్మరంధ్రము వరకు ఈమె స్థానము. ఈమె సంపూర్ణవిశ్వమును ఆప్లావితము చేసి విశ్వమాతలను సృజించును. మన్మథుని ద్వారా ఈమె మనోరూపి. అందువలన ఈమె తేజోమయి. సంపూర్ణ జగత్తును విస్తారము చెయ్యడం వలన ఈమెను విశ్వయోని అని అంటారు. అంతఃకరణ వృత్తిలో ఈమె విశ్వము యొక్క అంతర్మాతృకా అవుతున్నది. ఈమె నాదరూప పరాశక్తి మరియు పరబిందు రూప. ఈమె అంతర్మాయా రూపంలో ప్రసిద్ధము. విశ్వమును ధరించి ఉన్నది. అందువలననే ఈమె క్షమారూపము మరియు జగద్ధాత్రి అయినది. విచారము చేసినచో ఈమె నాదాతీతము, పరా అని తెలుస్తున్నది. ఈ ప్రకారం బ్రహ్మమయ వర్ణములతో త్రిపురామంత్రము జ్ఞాపితమవుచున్నది.

      మంత్రము మూడు ప్రకారములు. 1. శుద్ధ 2. శబల 3. ఉభయాత్మక. సర్వ ఆమ్నాయముల ద్వారా పూజింపబడు శుద్ధమంత్రములను ఇప్పుడు చెప్పబడుచున్నవి.

కామ=క, ఆకాశ=హ, శక్తి=స, తురీయ=ఈ, భూమా=ఆ, వాగ్భవ= ఐంలను పూజించాలి. వాగ్భవమును చివర రాయడం వలన విద్య అవుతున్నది.

కఏఈలహ్రీం, హసకహలహ్రీం, సకలహ్రీం|

కహఏఈలహ్రీం, హకఏఈలహ్రీం, సకఏఈలహ్రీం|

సహకఏలఈలహ్రీం, సహకహఈలహ్రీం, సహకఏఈలహ్రీం|

హసకఏఈలహ్రీం, హసకహఏఈలహ్రీం, హసకఏఈలహ్రీం|

కఏఈలహ్రీం, హసకహలహ్రీం, సహసకలహ్రీం|

కఏఈలహ్రీం, హసకహలహ్రీం, సహసకలహ్రీం|

కహసఏఈలహ్రీం, సహకహలహ్రీం, సకలహ్రీం|

కఏఈలహ్రీం, హసకలహ్రీం, సహసకలహ్రీం, సఏఈలహ్రీం, సహకహలహ్రీం, సకలహ్రీం|

హసకలహ్రీం, కఏఈలహ్రీం, సకసహకహలహ్రీం|

కఏఈలహ్రీం, హసకహలహ్రీం, సకలహ్రీం|

హసకసహ్రీం, ఏహసకఏలహ్రీం|

హకససహ్రీం|

కఏఈలహ్రీం,హసకలహ్రీం,సహకలహ్రీం,కఇహఏకసకకసహసహకసస

పైన చెప్పినవి చంద్రుడు, కుబేరుడు, లోపాముద్రా, నంది, సూర్యుడు, విష్ణువు, అగస్త్యుడు మొదలగు వారు ఉపాసించిన విద్యలు.

ఇప్పుడు విష్ణువు ఉపాసించిన రెండవ విద్యను తెలుపబడుచున్నది. జీవ, ఈశ, పృథివీ, పరా, కామేశ్వరీ మరియు విష్ణు, శక్తి, కామ మరియు అంతిమ – ఇది విష్ణువు ద్వారా పూజింపబడిన రెండవ విద్య. హ స శక్తి క భూ మాయా కూటము వీటిని మూడుసార్లు లిఖించాలి. వాగ్భవ, కామ మరియు శక్తి కూటములతో అది రెండవ స్కందపూజ్య విద్య అవుతోంది. అగస్త్య మంత్రములో పరా, వాగ్భవకూటము, చివర హ ల, మూడు కామ బీజములు, పృథివీ బీజము, జీవము – ఇది త్రికూట పర్వతము మీద శివుని ద్వారా పూజితము. ఈ భేదములు శుద్ధము మరియు సిద్ధిదాయకములు.

ఇప్పుడు శుద్ధ విద్య యొక్క రెండు భేదములు తెలుపబడుచున్నది. ఇవి భోగ-మోక్ష ప్రదాయకములు.

1.         జీవ, ఈశ, కామ, భూ, మాయా వాగ్భవకూట, కామరాజ కూట, శక్తికూటము.

2.         , శక్తి, బిందు మాలా క్ష్మ, ఆరు అక్షరముల శక్తికూటము, వాగ్భవకూటము, కామరాజ కూటము, హక ఆకాశ పృథివీ, అగ్నియుక్త ఆకాశ = హ్రీం శక్తికూటము, హసకల, వహ్నియుక్త ఆకాశము. ఇది ఉన్మనీ విద్య. ఇందులో సంశయము లేదు.

ఇప్పుడు శబల నామక మంత్రములను చెప్పబడుచున్నవి. కామరాజ విద్య మధ్యన వదలి జీవను ఉచ్చరించాలి. చివరలో జీవ మరియు శివాదులను జోడించి ఉచ్చరించాలి. ఈ విద్య వరుణ ద్వారా పూజించబడినది. ఈవిద్యలోనే జీవ=హ ను వదలి బిందువును జోడించి కామరాజకూటమును ఉచ్చరించాలి. అప్పుడు అది ధర్మరాజు పూజించిన విద్య అవుతుంది. క స క క్ష్మా(=ల) హ్రీం హ స ల స్మర హ క్ష్మా(=ల)  హ్రీం క స స క ల హ్రీం| అగ్ని ద్వారా పూజింపబడిన ఈ విద్య మహా విఘ్నములను పోగొట్టును. అగస్త్యుడు పూజించిన విద్యలో రెండు కూతములకు చివర వహ్నిపూజిత విద్యను జోడించితే అది పన్నగరాజు పూజించిన విద్య అవుతుంది. ఈ విద్య భోగ మోక్షములను ఇచ్చునది. క శక్తి ద్వివహ్ని భూ వహ్ని హ క ల అగ్ని హ ల మాయా (=ఈ) స ర క క్ష్మా(=ల) అగ్ని మాయా| ఈ విద్య వాయువు ఉపాసించిన విద్య. ఈ విద్య మహాపాపములను పోగొడుతుంది. క శక్తి బిందు వహ్ని క్ష్మా మాయా హ క హ ద్విపరా మాయా స హ క శక్ర(=ల) అగ్ని మాయా| ఈ విద్యను బుధుడు పూజించాడు. కామ, ఆకాశ, క్షమా, మాయా శివ కామ హ భూచర మాయా ఆకాశ ద్విశక్తికూట స క ల హ్రీం| ఈ విద్య శివుడు అధిష్టితవిద్య. ఈ విద్య సర్వకామప్రపూరిణి.

   రెండు కామరాజముల చివర జీవ క్ష్మా మదన పరా ఉన్నచో అది రవి ఉపాసించిన విద్య. ఈ విద్య సర్వకామప్రదాయకము. కామదేవుని ద్వారా ఉపాసించిన విద్యను విలోమ క్రమంలో ఉపాసించితే అది నారాయణ ద్వారా ఉపాసించిన విద్య అవుతుంది. కామ ద్వివాగ్భవ ద్వికామ హ క క్ష్మా పరా శక్తి అగస్త్యుని వాగ్భవ కూటము – ఈ విద్య బ్రహ్మ ఉపాసిత విద్య. అగస్త్యకూటము వాగ్భవకూటము వాక్ బ్రహ్మవిద్యయొక్క అంతిమ రెండు వర్ణములు – ఈ విద్య బృహస్పతి ద్వారా ఉపాసించబడినది. ఈ విద్య సర్వకామపూరణీ. ఈ పన్నెండు భేదములతో శబల మంత్రము అవుతుంది.

ఇప్పుడు శుద్ధాశుద్ధ మహా భేదములను తెలుపబడుచున్నది –

శుద్ధవిద్యలను లిఖించి తిరిగి వాటిని విపరీతక్రమంలో లిఖించాలి. అన్నింటికీ శుద్ధాశుద్ధ భేదములు అవుతాయి. ఎన్ని శుద్ధభేదములు అవుతాయో అన్ని అశుద్ధ భేదములుంటాయి. ఈ విధంగానే శబల ద్వంద్వ భేదములు కూడా ఉంటాయి. అన్ని భేదములు చివర మాయా బీజముతో యుక్తమవుతాయో అప్పుడు అవి నాల్గవ ప్రకారము అవుతాయి. అవి అత్యంత గంభీర జ్ఞాన బ్రహ్మరూపమవుతాయి. వీటిని గురుముఖంగా తెలుసుకోవాలి. లేదంటే అవి సాధకునికి గంభీర శాపమును ఇచ్చును.

   ఇప్పుడు నాలుగు రకముల ఉత్తమ జ్ఞానమును తెలుపబడుచున్నది. మొదటి జ్ఞానమును ఇంతకు ముందే చెప్పబడినది. రెండవ జ్ఞానమును తెలుసుకున్న జ్ఞాత నూరు వాజపేయ యజ్ఞముల ఫలమును పొందుతాడు. ఈ విద్యలో ఉండు అక్షరములు – పరా, శర, ఇందు, నాగ. దీనికి రెండవ భేదము వేదాదుల ద్వారా తెలుసుకోవాలి. మూడవ ఉత్తమ జ్ఞానమును ఉచ్చారణ చేసిన మాత్రమున బ్రహ్మా వేదజ్ఞుడు అయ్యాడు. నాల్గవ జ్ఞానమును స్మరించిన మాత్రమున మహా ఆపత్తుల నుండి విముక్తుడవుతాడు. సాధకుడు స్వయం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు అవుతాడు. ఈ మంత్రములను ఒక్కసారి స్మరించిన మాత్రముననే వెయ్యి అశ్వమేధములు, కోటి వాజపేయములు, వెయ్యి నరమేధముల ఫలము లభిస్తుంది.

   జపము చేసే సాధకుడకు కాశీ మొదలగు పుణ్యక్షేత్రముల యాత్రా ఫలము, పృథ్వీ ప్రదక్షిణ పుణ్యము, సహస్ర గంగా స్నాన ఫలము కలుగుతుంది. మంత్రము సాక్షాత్ బ్రహ్మ. ఇందులో సంశయము లేదు. ద్వితీయ కూటములో ఉండు మొదటి రెండు వర్ణములనూ విపరీతక్రమంలో లిఖించాలి. క ల లను అంతర్ముఖం చేసి లిఖించాలి. ఆ తర్వాత పై రెండింటినీ సంపుటీకరించి మూడవ కూటము లిఖించాలి. ఈ విద్యా వర్ణన ఎవ్వరూ చేయలేరు.  శివుడు కూడా కోటి జిహ్వలతో గానీ, నూరుకోట్ల ముఖముతో గానీ ఈ విద్యా వర్ణన చేయలేదు. శ్రీవిద్య అన్ని విద్యాలకు రాణివంటిది. ఈ విద్యా స్తుతి చేయలేము. 16 అక్షరములతో సంపన్నమైన పంచదశీ విద్య శ్రీగురు కృపవలన మాత్రమే లభిస్తుంది. ఈ మంత్రమును జపించు సాధకుడు చివరకు నిరామయ బ్రహ్మ అవుతాడు. బ్రహ్మహత్యా, సురాపానము, బంగారము దొంగలించడం వంటి మహాపాపము మరియు ఉపపాతకములు ఈ శ్రీవిద్యా మంత్రముతో నష్టమైపోవును. శ్రీవిద్యా మంత్రములన్నీ కళ్యాణ మంత్రములు. నారాయణ  మరియు విష్ణు మంత్రములు 19 వర్ణముల మంత్రములు. శివ విద్య 17 వర్ణముల మంత్రము. నారాయణీ మరియు వైష్ణవీ విద్యలు 25 వర్ణముల విద్యలు. వీటిని గురుముఖంగా తెలుసుకోవాలి లేనిచో ఫలము లభించాడు. గురువుద్వారా ఉపదేశము పొందకుండా జపము చేసే సాధకుడిని మాతృమండలము మరియు 64 యోగినులు నాశనము చేస్తారు.

[అనువాదకుని మాట: పైన చెప్పబడిన మంత్రాలు కొన్ని సాంకేతిక పదముల ద్వారా చెప్పబడినవి. పాఠకుల సౌకర్యార్థం వివిధ శ్రీవిద్యా మంత్రాలు ఇక్కడ పొందుపరుస్తున్నాను. ఇక్కడ ప్రకటిస్తున్న మంత్రాలు అవగాహనకు మాత్రమే అని మనవి. గురోపదేశం లేకుండా వీటిని సాధన చేయరాదు.

మహాదేవిని ఉపాసించిన వారిలో పన్నెండుమంది ప్రముఖులు. వారు -

మనువు - చంద్రుడు - కుబేరుడు - లోపాముద్ర - కామదేవ -అగస్త్యుడు - నంది - సూర్యుడు - విష్ణువు - స్కందుడు - శివుడు -దూర్వాసుడు.

వీరేకాకుండా ఈ క్రింది పదముగ్గురు కూడా అమ్మవారి ఉపాసకులే

ఇంద్రుడు - ఉన్మనీ - వరుణుడు - యముడు - అగ్ని - నాగరాజు -వాయువు - బుధుడు - ఈశానుడు - రతి - నారాయణుడు - బ్రహ్మ - బృహస్పతి

ఈ ఇరవై అయిదు ఉపాసకులూ ఉపాసించిన మంత్రములను ఇప్పుడు చెప్పబడుచున్నవి.

కామదేవ ఉపాసిత శ్రీవిద్య

భగవాన్ శివుడు శ్రీదేవితో ఇలా పలికెను- (జ్ఞానార్ణవముప్రకారము)

పంచాక్షర వాగ్భవ కూటము - కఏఈలహ్రీం| షడాక్షర కామరాజ కూటము - హసకహలహ్రీం| చతురక్షర శక్తి కూటము - సకలహ్రీం| ఈ మంత్రమును ఉపాసించే కామదేవుడు సర్వాంగ సుందరుడైనాడు.

లోపాముద్ర ఉపాసిత శ్రీవిద్య

కామరాజ విద్యనున్న వాగ్భవకూటమునందున్న ఏకార ఈకార స్థానములందు హకారము, సకారము జోడిస్తే లోపాముద్ర విద్య ఈ క్రింది ప్రకారము అవుతుంది.

హసకలహ్రీం| హసకహలహ్రీం| సకలహ్రీం|

అగస్త్య ఉపాసిత శ్రీవిద్య

ఈ విద్య త్రైలోక్యక్షోభకారిణి. ఈ విద్య కామరాజ పూజితము. ఇందు సంశయము లేదు.

కఏఈలహ్రీం| హసకహలహ్రీం| సకలహ్రీం|

మను ఉపాసిత శ్రీవిద్య

కహఏఈలహ్రీం| హకఏఈలహ్రీం| సకఏఈలహ్రీం|

ఇది పద్దెనిమిది అక్షరముల విద్య

చంద్ర ఉపాసిత శ్రీవిద్య

సహకఏఈలహ్రీం| సహకహఏఈలహ్రీం| సహకఏఈలహ్రీం|

కుబేర ఉపాసిత శ్రీవిద్య

హసకఏఈలహ్రీం| హసకహఏఈలహ్రీం| హసకఏఈలహ్రీం|

అగస్త్య-లోపాముద్ర ఉపాసిత ద్వితీయ శ్రీవిద్య

కఏఈలహ్రీం| హసకహలహ్రీం| హసఏకలహ్రీం|

లోపాముద్ర ప్రభావము చేత ఈ విద్య సాక్షాత్ బ్రహ్మ స్వరూపము అవుతోంది.

నంది ఉపాసిత శ్రీవిద్య

సఏఈలహ్రీం| సహకహలహ్రీం| సకలహ్రీం|

ఇంద్ర ఉపాసిత శ్రీవిద్య

కఏఈలహ్రీం| హసకహలహ్రీం| సలకహ్రీం|

ఈ విద్య భుక్తి-ముక్తి ఫలప్రదము

సూర్య ఉపాసిత శ్రీవిద్య

కఏఈలహ్రీం| హకహలహ్రీం| సహకసకలహ్రీం|

ఇది పదిహేడు అక్షరముల విద్య.

శివ ఉపాసిత శ్రీవిద్య

కఏఈలహ్రీం| హసకహలహ్రీం| సకలహ్రీం|కఏఈలహసకహలసహ సకలహ్రీం|

ఈ విద్య షట్కూట విద్య.

విష్ణు ఉపాసిత శ్రీవిద్య

కఏఈలహ్రీం| హసకహలహ్రీం| సహసకలహ్రీం| సఏఈలహ్రీం సహకహలహ్రీం సకలహ్రీం|

ఈ విద్య షట్కూట విద్య.

దూర్వాస ఉపాసిత శ్రీవిద్య

కఏఈలహ్రీంహ్రీం| హసకహలహ్రీంహ్రీం| సకలహ్రీంహ్రీం|

దూర్వాసుడు ముందు పరానిష్కళా విద్యను ఉపాసించెను.

ఉన్మనీ శ్రీవిద్య

కఏఈలహ్రీం హకహలహ్రీం హసకలహ్రీం|

వరుణోపాసిత శ్రీవిద్య

కఏఈలహ్రీం హకహలహ్రీం సహకలహ్రీం|

ధర్మరాజు ఉపాసిత శ్రీవిద్య

కఏఈలహ్రీం హకహహ్రీం సహకలహ్రీం |

అగ్ని ఉపాసిత శ్రీవిద్య

కసకలహ్రీం హసలకలహ్రీం సకలరలహ్రీం|

నాగరాజు ఉపాసిత శ్రీవిద్య

హసకలహ్రీం హసకహలహ్రీం సకలరలహ్రీం|

వాయు ఉపాసిత శ్రీవిద్య

కఏరలరహ్రీం హకలరహలహ్రీం సరకలరహ్రీం|

బుధ ఉపాసిత శ్రీవిద్య

కఏఈరలహ్రీం హకహలరహ్రీం సకలహ్రీం|

ఈశాన ఉపాసిత శ్రీవిద్య

కహలహ్రీం హకలహలలరహ్రీం సకలహ్రీం|

ఈ విద్య అణిమాది అష్టసిద్ధులను ప్రసాదిస్తుంది.

రతి ఉపాసిత శ్రీవిద్య

కఏఈలహ్రీం హసకహలహ్రీం సకలహ్రీం|

నారాయణ ఉపాసిత శ్రీవిద్య

కఏఈలహ్రీం హసకహలహ్రీం సకలహ్రీం సకలహ్రీం హసకహలహ్రీం కఏఈలహ్రీం| ఈ విద్య దుర్లభము.

బ్రహ్మ ఉపాసిత శ్రీవిద్య

కఏఈలహ్రీం హకహసరహ్రీం హసకలహ్రీం|

బృహస్పతి ఉపాసిత శ్రీవిద్య

హసకలహ్రీం హకహసరహ్రీం హసకలహ్రీం|]

ఇది శ్రీదక్షిణామూర్తి సంహితకు విశాఖ వాస్తవ్యులు, కౌండిన్యస గోత్రికులు, శ్రీఅయలసోమయాజుల పాలబాబు (సుబ్బారావు) గారు మరియు శ్రీమతి సాయిలీల దంపతుల ద్వితీయపుత్రుడు మరియు హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ ప్రకాశానందనాథ (శ్రీశ్రీశ్రీ శ్రీపాద జగన్నాధస్వామి) గారి శిష్యుడు భువనానందనాథ అను దీక్షానామము కలిగిన అయలసోమయాజుల ఉమామహేశ్వరరవి తెలుగులోకి స్వేచ్ఛానువాదము చేసిన శ్రీవిద్యావివరణం అను యాభైఆరవ భాగము సమాప్తము.

కామెంట్‌లు లేవు: