సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

16, ఫిబ్రవరి 2023, గురువారం

శ్రీదక్షిణామూర్తి సంహిత 50-51

 

యాభైవ భాగము

విజయానిత్యావిధివివరణం

మంత్ర స్వరూపము: హ్స్ఖ్ఫ్రేం విజయాయై నమః

ఋషి – ఈశ్వర| ఛందస్సు – గాయత్రి| దేవత – విజయా| హ్రీం – బీజం| నమః – శక్తిః| క్లీం – కీలకం| హ్రాం, హ్రీం, హ్రూం, హ్రైం, హ్రౌం, హ్రః – షడంగన్యాసం|

ధ్యానం:

ఏకవక్త్రాం దశభుజాం సర్పయజ్నోపవీతినీం|

దంష్ట్రాకరాలవదనాం నరమాలావిభూషితాం||

అస్థిచర్మావశేషాం తాం వహ్నికూటసమప్రభాం|

వ్యాఘ్రాసనాం మహాప్రౌఢశవాసనవిరాజితాం||

రణే స్మరణమాత్రేణ భక్తేభ్యో విజయప్రదాం|

శూలం సర్పంచ టంకాసిసృణిఘంటాశనిద్వయం||

పాశమగ్నిమభీతిం చ దధతీం జయదాం సదా||

మూలమంత్రమును మూడు లక్షలు జపించాలి. అందులో దశాంశము త్రిమధువులతో కలిపిన కమలములతో హోమము చెయ్యాలి. దీనితో విద్యా సిద్ధి కలుగుతుంది.

యంత్రము: త్రికోణము, షట్కోణం, అష్టదళము, భూపురము

త్రికోణ మధ్యన, మూడు కోణములందు బీజమును (హ్రీం?) లిఖించాలి. షట్కోణములలో ఆరు అక్షరములను, నాలుగు కోనములలో రెండేసి స్వరములను లిఖించాలి. పత్రముల అగ్రభాగమున నృసింహ బీజము క్ష్రౌం ను లిఖించాలి. యంత్రము చుట్టూ మాతృకలను లిఖించాలి. యంత్రములోకి దేవిని ఆహ్వానించి ఉపచారములతో పూజించాలి. షడంగ పూజచేసి, త్రికోణములో బ్రహ్మ, విష్ణు, మహేశాలను, షట్కోణములో యోగినిలను, అష్టపత్రములలో అష్టమాతృకలను, భూపురములో లోకపాలకులను పూజించాలి.

ఇది శ్రీదక్షిణామూర్తి సంహితకు విశాఖ వాస్తవ్యులు, కౌండిన్యస గోత్రికులు, శ్రీఅయలసోమయాజుల పాలబాబు (సుబ్బారావు) గారు మరియు శ్రీమతి సాయిలీల దంపతుల ద్వితీయపుత్రుడు మరియు హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ ప్రకాశానందనాథ (శ్రీశ్రీశ్రీ శ్రీపాద జగన్నాధస్వామి) గారి శిష్యుడు భువనానందనాథ అను దీక్షానామము కలిగిన అయలసోమయాజుల ఉమామహేశ్వరరవి తెలుగులోకి స్వేచ్ఛానువాదము చేసిన విజయానిత్యావిధివివరణం అను యాభైవ భాగము సమాప్తము.

యాభైఒకటవ భాగము

సర్వమంగళానిత్యావిధివివరణం

మంత్ర స్వరూపం: హ్సౌం సర్వమంగళాయై నమః

ఋషి – చంద్ర| ఛందస్సు – గాయత్రి| దేవి – సర్వమంగళ| నమఃనమః – బీజం| నమఃనమః – శక్తిః| హ్సౌం, సర్వమంగళాయై, నమః – రెండు ఆవృత్తములతో షడంగన్యాసం చెయ్యాలి.

ధ్యానం:

శుభ్రపద్మాసనే రమ్యాం చంద్రకుందసమద్యుతిమ్|

సుప్రసన్నాం శశిముఖీం నానరత్నవిభూషితామ్||

అనంతముక్తాభరణాం స్రవంతీమమృతద్రవమ్|

వరదాభయశోభాఢ్యాం స్మరేత్సౌభాగ్యవర్ధినీం||

జితేంద్రుడై మంత్రములో ఎన్ని అక్షరములు ఉన్నాయో అన్ని లక్షలు జపించాలి. జపములో దశాంశము శ్వేతకమలములను మధువులో ముంచి హోమము చెయ్యాలి.

యంత్రము: అష్టపత్రము, భూపురము

యంత్ర మధ్యలోకి సురేశ్వరిని ఆహ్వానించి ఉపచారములతో పూజించి షడంగపూజ చెయ్యాలి. అష్టపత్రములో పూర్వాది క్రమంలో రాకా, కుముద్వతీ, నందా, శుద్ధా, సంజీవనీ, క్షమా, ఆప్యాయనీ, చంద్రకాంతా హ్లాదినీలను పూజించాలి. భూపురంలో దిక్పాలకులను పూజించాలి. ఆ తర్వాత మళ్ళీ సర్వమంగళను పూజించాలి.

ఇది శ్రీదక్షిణామూర్తి సంహితకు విశాఖ వాస్తవ్యులు, కౌండిన్యస గోత్రికులు, శ్రీఅయలసోమయాజుల పాలబాబు (సుబ్బారావు) గారు మరియు శ్రీమతి సాయిలీల దంపతుల ద్వితీయపుత్రుడు మరియు హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ ప్రకాశానందనాథ (శ్రీశ్రీశ్రీ శ్రీపాద జగన్నాధస్వామి) గారి శిష్యుడు భువనానందనాథ అను దీక్షానామము కలిగిన అయలసోమయాజుల ఉమామహేశ్వరరవి తెలుగులోకి స్వేచ్ఛానువాదము చేసిన సర్వమంగళానిత్యావిధివివరణం అను యాభైఒకటవ భాగము సమాప్తము.

కామెంట్‌లు లేవు: